For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిక్ పేషంట్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన 12 ఫూట్ కేర్ టిప్స్

|

డయాబెటీస్ వ్యాధి వున్న వారు వారి పాదాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దెబ్బ తగిలితే త్వరగా తగ్గదు. ఒక్కొకపుడు చివరకు అది కాలు తీసేయటం వరకు కూడా వస్తుంది. వీరికి కాళ్ళకే ఎందుకు సమస్య? రక్తంలోని అధిక గ్లూకోజ్ బాక్టీరియా బాగా పెరిగేలా చేస్తుంది. సాధారణంగా పాదాలు మనం శుభ్రంగా పెట్టుకోము. వాటికి దెబ్బ తగలటం కూడా తేలికే. దెబ్బ తాకినప్పటికి అది వారికి త్వరగా తెలియని పరిస్ధితి కూడా వుంటుంది. మరి డయాబెటిక్ రోగులు పాదాల పట్ల శ్రద్ధ ఎలా పెట్టాలి?

చాలా వరకూ చాలా మంది పాదాలకు చిన్న చిన్న గాయాలలవుతుంటాయి. కొన్ని సందర్బాల్లో చిన్న గాయాలే కదా అని నిర్లక్ష్యం చేస్తుంటాము. అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ పెరగడంతో గాయాలు మరింత పెద్దవిగా మారుతాయి. గాయలను మాన్పుకోవడం కష్టమవుతుంది. డయాబెటిక్ పేషంట్స్ లో కాళ్ళలో రక్తప్రసరణ పూర్ గా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ మరియు గాయాలు అంత త్వరగా మానవు . హీలింగ్ కెపాజిటి డయాబెటిక్ వారిలో తక్కువగా ఉండటం వల్ల రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది.

డయాబెటిక్ పేషంట్స్ పాదాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే , ఇన్ఫెక్షన్స్ మరియు గాయాలు ఎక్కువగా పెరుగుతాయి. అది గ్యాంగ్రిన్ వరకూ దారితీసి, చివరకు కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. గ్యాంగ్రిన్ అనేది మరో ప్రాణాంతకమైన వ్యాధి. కాబట్టి డయాబెటిక్ పేషంట్స్ పాదాల కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

టిప్ # 1

టిప్ # 1

డయాబెటిక్ పేషంట్స్ రాత్రి నిద్రించడానికి ముందు ప్రతి రోజూ పాదాలను ఒక సారి గమనిస్తుండాలి. ఏవైనా చిన్న గాయాలు, కట్స్ ఏవైనా అయినాయోమో అన్న విషయం గుర్తించండి.

టిప్ # 2

టిప్ # 2

ప్రతిరోజూ పాదాలు పరీక్షించాలి, మీరు వంగలేకపోతే, మీకు కష్టం అనిపిస్తే మీ కుటుంబ సభ్యులను పరీక్షించమనండి.

టిప్ # 3

టిప్ # 3

డయాబెటిక్ పేషంట్స్ పాదాలను పరీక్షించుకోవడానికి, పాదాల అడుగున అద్దం పెట్టి పరీక్షించండి. వేళ్ళ మధ్య కూడా పరీక్షించండి. ఇలా చేయడం వల్ల ఏలాంటి గాయాలైనా, ఇన్ఫెక్షన్స్ అయినా గుర్తించవచ్చు.

టిప్ # 4

టిప్ # 4

పాదాల్లో ఏదైనా కట్స్, లేదా దురద, ఇన్ఫెక్షన్స్, రెడ్ నెస్, గమనిస్తే వెంటనే డాక్టర్ ను కలిసి చికిత్స తీసుకోవాలి.

టిప్ # 5

టిప్ # 5

పాదాల మీద కట్స్ లేదా కాలిన గాయలైతే వెంటనే శుభ్రం చేసి, యాంటీ సెప్టిక్ జెల్స్ లేదా ఆయిట్ మెంట్స్ అప్లై చేయాలి. చర్మం పగిలిన ప్రదేశాలు సోప్, నీరు తో కడిగి యాంటీ బాక్టీరియల్ క్రీము రాసి అవసరమనుకుంటే చిన్న బేండేజ్ వేయండి.

టిప్ # 6

టిప్ # 6

డయాబెటిక్ పేషంట్స్ ఫాలో అవ్వాల్సిన ఫూట్ కేర్ టిప్స్ లో మాయిశ్చరైజింగ్ ఒకటి. పాదాలకు రెగ్యులర్ గా మాయిశ్చరైజర్ ను అప్లై చేస్తుంటే పాదాలు డ్రైనెస్, పగుళ్ళు తగ్గుతాయి. ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి.

టిప్ # 7

టిప్ # 7

డయాబెటిక్ పేషంట్స్ గోళ్ళు కత్తిరించేటపుడు జాగ్రత్తగా వుండాలి. అవసరమనుకుంటే క్లినిక్ లలో వాటిని కత్తిరించమనండి. లేదా ఇంట్లో వారి సహాయం తీసుకోవాలి.

టిప్ # 8

టిప్ # 8

డయాబెటిక్ పేషంట్స్ కోసం మరో చిట్కా నెయిల్ క్లిప్పరన్స్ టాయ్ నెయిల్స్ కోసం డిజైన్ చేసిన వాటిని ఉపయోగించాలి . ఇలా చేయడం వల్ల గాయాలు కాకుండా నివారించుకోవచ్చు.

టిప్ # 9

టిప్ # 9

టాయ్ నెయిల్స్ కు క్లిప్పింగ్ వేసిన తర్వాత క్లిప్ వేసిన నెయిల్స్ షార్ప్ గా ఉంటాయి. దాంతో గాయాలయ్యే ప్రమాదం ఉంది కాబట్టి, వీటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి.

టిప్ # 10

టిప్ # 10

పాదాలకు హీట్ పాడ్స్ వాడటం నివారించాలి. ఈ అలవాటు వల్ల పాదాల్లో తిమ్మెర్లు పెరుగుతాయి. గాయం అయినా తెలియకుండా చేస్తుంది.

టిప్ # 11

టిప్ # 11

డయాబెటిక్ పేషంట్స్ కోసం మరో ఎఫెక్టివ్ టిప్ చెప్పులు లేకుండా సురక్షితం కాదు. ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే తిరగాలి.

టిప్ # 12

టిప్ # 12

కాటన్ సాక్స్, బూట్లు వంటివి పాదాలకు ఒత్తిడి కలిగించకుండా చూసుకోండి. కొత్త చెప్పులు, బూట్లకు మెల్లగా అలవాటు పడండి. అలాగే షూలు వేసుకునే ముందు వాటిలో చిన్న చిన్న రాళ్ళు , పిన్నులు ఏవైనా ఉన్నాయోమో గమనించాలి. ఇవి పాదాలకు మరింత ప్రమాదం కలిగిస్తాయి.

English summary

12 Ways To Take Care Of Your Feet If You Have Diabetes

12 Ways To Take Care Of Your Feet If You Have Diabetes,If you or someone you know is suffering from diabetes, then it is crucial to ensure that you maintain the health of your feet. Yes, here are a few tips to care for your feet if you are a diabetic individual.
Story first published: Thursday, September 22, 2016, 16:48 [IST]
Desktop Bottom Promotion