డయాబెటిక్ పేషంట్స్ డాక్టర్ ని ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాల్సినవి..!

Posted By:
Subscribe to Boldsky

ఒకవేళ మీరు డయాబెటిస్ తో బాధపడుతుంటే.. మీకు ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలను డాక్టర్ ని సంప్రదించినప్పుడు అడగాలి. అప్పుడు మీరు డయాబెటిస్ పై పూర్తి అవగాహనకు వచ్చి, కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.

తీవ్రంగా ఇబ్బందిపెట్టే డయాబెటిస్ తో బాధపడేవాళ్లు.. మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా అవసరం. అలాగే డాక్టర్ ని కొన్ని ప్రశ్నలు అడిగి.. తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. బ్లడ్ షుగర్ లెవెల్ లేదా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చాలా ఎక్కువ అవడం వల్ల చాలా మార్పులు జరిగి.. మీ ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతాయి.

శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు.. డయాబెటిక్స్ కి కారణమవుతుంది. కొన్ని మందులు, ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావడం వల్ల.. డయాబెటిస్ ని కంట్రోల్ చేయవచ్చు. డయాబెటిస్ తో బాధపడేవాళ్లలో ఎక్కువ ఆకలి, దప్పిక, అలసట, తరచుగా యూరినేషన్, గాయాలు త్వరగా మాట్లాకపోవడం వంటివి లక్షణాలు.

మరి డయాబెటిక్ పేషంట్స్ డాక్టర్స్ ని సంప్రదించాల్సిన ప్రశ్నలేంటో తెలుసుకుందాం..

ఎంత తరచుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి ?


బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఎంత తరచుగా చెక్ చేయించుకోవాలి అనేది డాక్టర్ ని అడిగి తెలుసుకోవాలి. దీనివల్ల తీవ్ర సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

మెడిసిన్స్ ఎప్పుడు తీసుకోవాలి ?


స్వంతంగా మెడిసిన్స్ తీసుకోవడం డయాబెటిక్ పేషంట్స్ కి మంచిది కాదు. కాబట్టి ఎలాంటి మందులు మంచిది, ఎప్పుడు తీసుకోవాలి అనేది అడిగి తెలుసుకోవాలి.

కాస్ట్ ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయేమో తెలుసుకోవాలి ?


చాలా సందర్భాల్లో మందులు రకరకాలు అందుబాటులో ఉంటాయి. తక్కువ కాస్ట్ లో కూడా ఉంటాయి. కాబట్టి డాక్టర్ ని అడిగి తెలుసుకోవాలి.

సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోవాలి ?


డయాబెటిక్ పేషంట్స్ కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందో తెలుసుకోవాలి. అలాగే డయాబెటిక్ పేషంట్స్ ఉపయోగించే మందుల వల్ల కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ జరుగుతాయామో తెలుసుకోవాలి. దీనివల్ల మీరు మానసికంగా సిద్ధంగా ఉంటారు.

ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి ?

డయాబెటిక్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్, కాబట్టి ఈ లక్షణాలను నివారించుకోవడానికి హెల్తీ డైట్ ఫాలో అవడం చాలా ముఖ్యం. కాబట్టి డాక్టర్ ని అడిగి.. ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలో తెలుసుకోవాలి.

ఏ ఆహారాలు తీసుకోకూడదు ?

డయాబెటిక్ పేషంట్స్ డాక్టర్ ని అడిగి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వాటిలో తినకూడని ఆహారాల గురించి. ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో తెలుసుకోవాలి.

డోస్ తగ్గించవచ్చా ?

ఒకవేళ మీ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గినట్టు మీరు గమనించినట్టైతే.. మీరు తీసుకుంటున్న మందుల డోస్ తగ్గించవచ్చేమో డాక్టర్ ని అడిగి తెలుసుకోవాలి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

7 Important Questions Diabetes Patients Must Ask Their Doctors

7 Important Questions Diabetes Patients Must Ask Their Doctors. Listed below are a set of important questions that you must ask your doctor if you are a diabetic. Have a look and do ask these questions during your next visit!
Please Wait while comments are loading...
Subscribe Newsletter