అధిక బరువు నుండి అంగ ప్రదర్శనకు!

Posted By:
Subscribe to Boldsky

వాస్తవ జీవితంలో భారీ ఊబకాయాల నుండి నాజూకైన శరీరాలకు మారటం ఎంతో తేలిక కాదు. కాని మీరు వేరే వారినుండి ఈ రకమైన ఫిట్ నెస్ చర్యలకు ప్రోత్సాహం పొందాలంటే ఇటీవలి కాలంలో, అనేక ఫిట్ నెస్ వ్యాయామాలు, ఆహార ప్రణాళికలు ఆచరించి అందాలతో విందు చేస్తున్న కొంతమంది బాలీవుడ్ నటీ నటులను పరిశీలించండి. వీరంతా ఒకప్పుడు అధిక బరువు, ఊబకాయాలతో బాధ పడినవారే. కాని ఎన్నో కష్టాలకు ఓర్చి నేడు వీరు తమ శారీరక సౌష్టవాలను కాపాడుకుని మరోసారి సినీ ప్రపంచంలో వెలిగిపోతున్నారు. మరి ఒకసారి వీరి అలవాట్లు, వ్యాయామాలు పరిశీలిస్తే మీరు సైతం వాటిని ఆచరించి, మీరు కలలు కనే అంగ సౌష్టవాన్ని పొంది ఆనందించగలరు.

1. కరీనా కపూర్ : కరీనా డాన్ సినిమాలో ఒక ఐటం సాంగ్ లో చేసినపుడు ఆమె పొట్ట చూసి ఎందరో వ్యాఖ్యానించారు. అంతే ఆమె ఎంతో పట్టుదలతో అనేక వ్యాయామాలు, ఆహారాల అలవాట్లు ఆచరించి తషాన్ సినిమా షూటింగ్ నాటికి ప్రేక్షకులకు ఆమె అంగాంగ లావణ్యంతో కను విందు చేసింది.

Celebs Who Went From Fat To Fit!

2. కటే విన్ స్లెట్: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన టైటానిక్ సినిమాలో ఈ 18 ఏళ్ళ యువతి నటించింది. కెరీర్ మొదట్లో ఎంతో లావుగా ఉండి అసహ్యంగా ఉండేది. విమర్శలకు గురైన ఈమె పట్టుదలతో సినిమా షూటింగ్ నాటికి ఎంతో స్లిమ్ గా అయిపోయింది. ఆమె మరోమారు సన్నబడే నాటికి ఆమె వయసు 40 సంవత్సరాలు.

3. రాణి ముఖర్జీ - రాణి ముఖర్జీ ఎంత వయసు పైబడుతున్నప్పటికి నాటికి నేటికి ఒకే తీరు అంగ సౌష్టవం కలిగి ఉంది. ఆమె 34 వ ఏట కూడా మంచి సినిమా ఆఫర్లు పొందుతోంది. అందగత్తెల సరసన కొత్త సినిమాలలో ఆహ్వానాలు పొంది అందరిని అలరిస్తోంది. ఈమె విజయానికి కారణం...ఆహారాలు, వ్యాయామమేనంటుంది.

4. రస్సెల్ క్రోవే - ఈ హీరో ప్రపంచ ప్రసిద్ధి కెక్కిన గ్లాడియేటర్ లో నటించాడు. తర్వాత బరువెక్కి గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. కాని తర్వాత పట్టుదలతో కండలు తిరిగిన శరీరాన్ని పెంచి ఎన్నో సినిమా ఆఫర్లు అందుకున్నాడు.

5. సిద్ధార్ధ మల్య - ఇతడు వేసేది టైట్ జీన్స్, లేదా జోద్ పురి కుర్తా. ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో. కాని కింగ్ ఫిషర్ సామ్రాజ్యానికి అధిపతి అయిన ఇతను ఒకప్పుడు ఎంతో లావుగా ఊబకాయంతో ఉండేవాడు. కాని నేడు అందరికి అందాల విందు చేస్తున్నాడు.

6. రిని జెల్ వెజర్ - ప్రపంచ ఖ్యాతిగాంచిన ఈ సుందరి ఒకప్పుడు ఎంతో లావుగా వుండి ఆపై సన్నపడింది. ఆ సన్న పడటం కూడా ఎంతో తక్కువ కాలంలో అందరిని ఆశ్చర్య పరుస్తూ ఆకర్షణీయంగా తయారైంది. ఆమె సన్నపడిన వెంటనే అనేక ఆఫర్లు ఆమెను చుట్టుముట్టాయి.

7. షారూఖ్ ఖాన్ - బాలీవుడ్ రంగ షారూఖ్ ఖాన్ ని దేశంలో తెలియనివారుండరు. పొట్టకు ఆరు ప్యాక్ ల సౌష్టవం ఇతని సొంతం. అందరూ ఆశ్చర్య పడే రీతిలో తన అంగ సౌష్టవాన్ని అతి తక్కువ సమయంలో పొందాడు. అతను పట్టిందల్లా బంగారమే. నేటికి అతని శారీరక రూపం దేశంలోని అతివలను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఇంతకీ నేటికి అతని వయసు ఎంతో తెలుసా? అంతేనండి...46 సంవత్సరాలు మాత్రమే.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Celebs Who Went From Fat To Fit! | బాలీవుడ్ భామలు...భలే భలే కిక్కులు...!

Shah Rukh Khan: When this super celebrity went for a makeover with his brand new six packs, many fans were aghast. But whatever Shah Rukh touches turns to gold, and so did his new fit image. Now we can all agree on the fact that he is still hot at 46.
Story first published: Saturday, July 14, 2012, 10:32 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter