For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొవ్వు కరిగించి, అదనపు బరువు తగ్గించే 15 బెస్ట్ ఫ్రూట్స్!

|

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ప్రజలు వారి ఆరోగ్యం గురించి చాలా ఎక్కువగా జాగ్రత్త తీసుకుంటున్నారు. ముఖ్యంగా బరువు విషయంలో. బరువు తగ్గడం అనేది దినచర్యలో ఒక భాగం అయిపోయింది. అయితే బరువు తగ్గాలనే భావన మనస్సులో ఉండటంతో ప్రతి రోజూ క్రాస్ డైటింగ్, వ్యాయామాలు చేయకపోవడం వంటివి మరిన్ని అదనపు కిలోల బరువును పెంచుకుంటారు. కానీ బరువు తగ్గాలనే పట్టుదల మీలో ఉన్నట్లైతే అందుకు చాలా కఠినమైన డైట్ మరియు హెల్తీ డైట్ ను ఫాలో చేయడం వల్ల హెల్తీగా బరువు తగ్గవచ్చు . అందులోనూ ఫ్రూట్ డైట్ కంటే మరొకటి బరువు తగ్గించడం పనిచేయదంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.

మన రోజూ అవసరమైన పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి జరగడంతో పాటు, బరువు కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫ్యాట్ కు బదులు వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అన్ని పండ్లలోనూ విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి, జబ్బుల బారీన పడకుండా మనల్ని కాపాడటానికి ప్రధాన పాత్రపోషిస్తాయి.

బరువు తగ్గడం కోసం మనం తీసుకొనే ఆహారం సరైన క్వాంటిటీ ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా మనం ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో లోక్యాలరీ ఫుడ్ తీసుకోవడం ముఖ్యం. కాబట్టి, ఈ విషయంలో(లోక్యాలరీ విషయంలో)పండ్లు చాలా ముఖ్యమైన, ప్రభావవంతమైన పాత్రను పోషిస్తుంది. చాలా వరకూ పండ్లు అన్ని లోక్యాలరీలను కలిగి ఉండి బరువును పెరగనియ్యకుండా మనకు సహాయపడుతాయి. మరి బరువు తగ్గించేందుకు ప్రభావంతంగా పనిచేసే లోక్యాలరీ పండ్లు 10 రకాలు మీకోసం...

 పైనాపిల్:

పైనాపిల్:

పైనాపిల్ లో కొలెస్ట్రాల్ మరియు ఫ్యాట్ నిల్. ఇందులో పుష్కలమైన న్యూట్రీషియన్స్, విటమిన్స్, ఫైబర్స్, యాంటీఆక్సిడెంట్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి . బరువు తగ్గించడంలో ఇది చాలా అద్భుతమైన పండు. ఇందులో ఉండే 85శాతం నీరు, ఎక్కువ సమయం కడుపు ఫుల్ గా ఉండేలా చేస్తుంది. ఆహారాన్ని తీసుకోవాలనే కోరికను తగ్గిస్తుంది.

పుచ్చకాయ:

పుచ్చకాయ:

వాటర్ మెలోన్, ఇది పూర్తిగా ఫ్యాట్ ఫ్రీ ఫ్రూట్. వాటర్ మెలోన్ లో విటిమిన్ ఎ మరియు సి పుష్కలంగా ఉంటుంది . ఇది బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడానికి మరియు శరీరానికి తగినంత శక్తిని అంధించడానికి బాగా సహాయపడుతుంది. ఇందులో అధిక శాతంలో నీరు ఉండటం వల్ల ఆహారాన్ని తీసుకోవాలనే కోరికను తగ్గిస్తుంది.

బనానా:

బనానా:

నీటి శాతం అధికం. పీచు ఉంటుంది. కడుపు నింపుతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. మూడ్ మంచిగా ఉండేలా చేస్తాయి. గ్రీన్ గా ఉండే బనానాలో స్ట్రాంచ్ అధికంగా ఉండే ఫ్యాట్ బర్నింగ్ ప్రొసెస్ ను వేగవంతం చేస్తుంది. అరటిపండ్లు కడుపు నిండుగా ఉండేట్లు చేస్తుంది. బనానా తిని అప్పుడప్పుడూ నీళ్ళు తాగడం వల్ల రోజంతా కడుపు నిండుగా ఉండేట్లు చేస్తుంది.

ఆపిల్:

ఆపిల్:

ఆపిల్స్ లో కేలరీలు తక్కువ. పీచు అధికం. తిన్నది బాగా జీర్ణం చేస్తుంది. దీనిలోని పెక్టిన్ మీకు కడుపు నిండినట్లు భావించేలా చేస్తుంది. ప్రతిరోజు ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఆ పండులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి. శరీరానికి ఇది ఒక గొప్ప సహజ యాంటీఆక్సిడెంట్‌ (వ్యాధినిరోధక కారకం)గా పని చేస్తుంది. 100 గ్రాముల ఆపిల్ తింటే దాదాపు 1,500 మిల్లీగ్రాముల "విటమిన్ సి" ద్వారా పొందే యాంటీఆక్సిడెంట్‌ ప్రభావంతో సమానం. యాపిల్స్ లో లోఫాట్ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల శరీరాన్ని నాజూగ్గా ఉండేలా చేస్తుంది. ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

ఆరెంజ్:

ఆరెంజ్:

విటమిన్ సి బాగా ఉంటుంది. వింటర్ జలుబులు అరికడతాయి. తక్కువ కేలరీలు. తీపి కోరిక తగ్గిస్తాయి. ఆరెంజ్ ఇది ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరం. ఉదయం నిద్ర లేచిన వెంటనే,ఆరెంజ్ జ్యూస్ తాగడం కానీ, ఆరెంజ్ ను తినడం కానీ చేస్తే శరీరం బరువు పెరగదు. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్, పీచు జీర్ణక్రియకు చాలా సహాయకారిగా పనిచేస్తుంది. సిట్రస్ పండ్లు అంటే ద్రాక్ష, ఆరెంజ్, బత్తాయి వంటివి వీటిలో ఎక్కుగా విటమిన్ సి. శరీరంలోని జీర్ణక్రియ బాగా పనిచేయాలంటే సిట్రస్ పండ్లు తీసుకోవడం తప్పనిసరి. సి విటమిన్ కొవ్వును కరిగించడమే కాకుండా, బాడ్ కొలెస్ట్రాల్ లెవల్ ను తగ్గిస్తుంది. మరో అద్భుతమైన ఉపయోగం క్యాన్సర్ కు దారితీసే లిమినాయిడ్స్ మరియు లైకోపినె పై దాడి చేస్తాయి.

కివి పండ్లు:

కివి పండ్లు:

కడుపు నింపుతాయి. పీచు అధికం. కేలరీలు తక్కువ, గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ. విటమిన్ సి - కివి పండులో విటమిన్ సి అధికం. ఆరెంజస్ లో కంటే కివి పండులో విటమిన్ సి రెండు రెట్లు వుంటుంది. రోజులో తినవలసిన పోషకాలకు ఒక కివి పండు తింటే చాలని స్టడీ తెలుపుతోంది. రీసెర్చి మేరకు ఈ పండులో పీచు కూడా అధికంగా వుండి, జీర్ణ వ్యవస్ధను శుభ్ర పరచి మలబద్ధకం లేకుండా చేస్తుంది. కొల్లెస్టరాల్ తగ్గిస్తుంది గుండె జబ్బులు, కొన్ని రకాల కేన్సర్ రాకుండా రక్షిస్తుంది. రక్తంలో షుగర్ స్ధాయిలను తగ్గించి డయాబెటీస్ రాకుండా చేస్తుంది. కివిపండు కడుపు నింపుతుంది. బరువు కూడా తగ్గిస్తుంది.

నిమ్మ:

నిమ్మ:

దీనిలో విటమిన్ సి అధికం. మీ జీవప్రక్రియ పెంచుతుంది. స్లిమ్ గా ఉంచుతుంది. ఎసిడిటీ తగ్గించి మొండి రోగాలను దూరం చేస్తుంది. భోజనం చేసిన తర్వాత నిమ్మరసం, నిమ్మజ్యూస్ తాగడం వల్ల శరీరానికి చాలా మంచిది. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులోని సిట్రస్ ఆమ్లం బరువు పెరగనీయకుండా అడ్డుకుంటుంది. నిమ్మ మరియు తేనె మిశ్రమం మహిళల బరువు తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. నిమ్మరసంలో కొవ్వు కణాలతో పోరాడగలిగే శక్తిని కలిగి ఉన్నాయి. ఆకలిని తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది.

స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీ:

బెర్రీస్ ఎల్లప్పుడూ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ అనే చెప్పొచ్చు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ మరియు ఇతర బెర్రీ పండ్లన్నీ ఎక్కువ యాంటిఆక్సిడెంట్స్, ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించి స్వేచ్చా రాశులుగా పోరాడుతుంది. స్ట్రాబెర్రీ శరీర బరువును తగ్గిస్తుంది. శరీరానికి కావల్సిన శక్తిని ఇచ్చి, ఎక్కువ సేపు ఆకలికాకుండా సహాయపడుతుంది. కొవ్వును కరిస్తుంది.

పీచెస్:

పీచెస్:

పీచెస్ జీర్ణశక్తికి కావల్సిన ఎనర్జీని అందిస్తుంది. మరియు కావల్సిన షుగర్ కంటెంట్ ను అంధిస్తుంది. బరువు తగ్గాలనుకొనే వారు వీటిని మీ డైట్ లో చేర్చుకోవడం చాలా ముఖ్యం.

ఎండు ద్రాక్ష:

ఎండు ద్రాక్ష:

కొన్ని డ్రై ఫ్రూట్స్ అంటే, ఖర్జూరం, ఎండుద్రాక్షవంటి పండ్లు మీ రెగ్యులర్ డైట్లో ఒక చిన్న మెత్తంలో తీసుకోవడం చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్, తాజాగా ఉండే పండ్లు కొవ్వు కరిగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. దాంతో బరువు తగ్గవచ్చు.

రాస్ బెర్రీ:

రాస్ బెర్రీ:

రాస్ బెర్రీ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవడం వల్ల, ఆహారంతో పాటు రాస్ బెర్రీని తినడం వల్ల జీర్ణక్రియ నిధానంగా జరగడం వల్ల త్వరగా ఆకలి అనిపించదు. అలాగే ఇందులో ఉండే పీచు శరీరంలో పేరుకొన్న కొవ్వును కరిగిస్తుంది.

ద్రాక్ష:

ద్రాక్ష:

ప్రతి రోజూ ఉదయాన్నే ఒక కప్పు ద్రాక్ష జ్యూస్ ను తాగడం వల్ల లేదా ద్రాక్ష పండ్లను తినడం వల్ల అధిక శరీర బరువును తగ్గించుకోవచ్చు.

అవొకాడో

అవొకాడో

అవొకాడో తింటుంటే వయసు మీద పడుతున్నా యవ్వనంగానే కనిపిస్తారు. ఇందులో ఫ్యాట్‌ ఎక్కువని చాలా మంది అపోహపడుతుంటారు కాని, అవొకాడోలో ఉండే ఫ్యాట్‌లో ఎక్కువ భాగం మోనో అన్‌సాచురేటెడ్‌ ఫ్యాట్‌. దీనిని ఆరోగ్యకరమైన ఫ్యాట్‌గా పరిగణిస్తారు. కాబట్టి నిరభ్యంతరంగా తినవచ్చు. ఇందులోని ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్లు చర్మం పొడిబారడాన్ని నివారించి నిత్యయవ్వనంగా ఉంచుతాయి. అవొకాడోలో ఉండే 'సి', 'ఇ' విటమిన్లు యాంటి ఏజింగ్‌ ఎలిమెంట్స్‌గా పనిచేసి వార్ధక్యాన్ని దూరం చేస్తాయి.

బేరికాయ:

బేరికాయ:

సంవత్సరంలో ఒక్క సీజన్ లో మాత్రమే కనిపించే ఈ బేరికాయ లోక్యాలరీస్ కలిగి, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆ సీజన్ లో ప్రతి రోజూ భోజనానికి ముందు ఒకటి తీసుకోవడం వల్ల బరువును అతి సులభంగా తగ్గించుకోవచ్చు.

మామిడి పండు:

మామిడి పండు:

మామిడి పండ్ల ఆరోగ్య ప్రయోజనం ప్రధానంగా దాని విత్తనాలనుండి వస్తుంది. అంటే టెంకనుండి వస్తుంది. దీని టెంకలో కావలసినంత పీచు, కొవ్వులు వుండి అవి అధిక బరువు కరిగించేస్తుంది. ఆకలిని లెప్టిన్ అనే పదార్ధం ఎప్పటికపుడు నియంత్రిస్తుంది. అది దీనిలో వుండటం చేత, ఆకలి మందగించి, కేలరీలు అధికంగా ఖర్చయ్యేలా చేస్తుంది. కొల్లెస్టరాల్ దీనిలో చాలా తక్కువ. దీనిలో వుండే అడిపోనెక్టిన్ అనే పదార్ధం ఇన్సులిన్ ఉత్పత్తి అధికం చేస్తుంది. అది కొవ్వును శక్తిగా తక్షణమే మారుస్తుంది. బరువును తగ్గించటమేకాక, వ్యాధులు రాకుండా చేస్తుంది. మనలోని జీవక్రియ వేగవంతం చేస్తుంది. కఠిన ఆహారం పాటించకుండా వర్కవుట్లు చేయకుండా బరువు తగ్గాలనే వారికి ఆఫ్రికా మామిడిపండ్లు తినటం మంచి మార్గం. ఏ మందులు వాడకుండా బరువు సహజంగా తగ్గాలంటే,ఆఫ్రికా మామిడిపండు ఎంతో ప్రయోజనం.

English summary

10 Best Fruits For Weight Loss

become an order of the day. Some resort to crash dieting while others opt for vigorous exercising in order to shed those extra kilos.
Story first published: Monday, July 29, 2013, 11:59 [IST]
Desktop Bottom Promotion