For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీగా తింటూనే బరువు తగ్గించే 10 సులభ చిట్కాలు

|

చాలా మంది మహిళలు ఆహారం తినటం తగ్గిస్తే బరువు తగ్గుతామని అనుకుంటారు.కానీ బరువు కోల్పోవడం వెనుక ఉన్న నిజమైన రహస్యం ఏమిటంటే మీరు మీ శరీర అవసరాలకు మాత్రమే అనేక కేలరీలను ఖర్చు చేసి మరియు మీరు బరువు కోల్పోవటానికి సహాయపడే మీ జీవక్రియ రేటు సరైన పద్ధతిలో ఉండేలా చూసుకోవాలి. ఇది చాలా సులభం కాదు ?

కాబట్టి దీని సారంశం ఏమిటంటే మీరు బరువు చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోని బరువు తగ్గటానికి 10 సులువైన మార్గాలు గురించి తెలుసుకుందాము. మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే దీనిని క్రమ పద్దతిలో చేయాలి. లేకపోతె అనారోగ్యం బారిన పడే అవకాశము ఉంటుంది.

హెల్తీగా తింటూ, సులభంగా బరువు తగ్గించే 10 టిప్స్

అధిక ఫైబర్ కుకీలను తీసుకోవాలి:

మీరు దాదాపు ప్రతిరోజూ రుచికరమైన చాకో-కుకీలను తిని మీ శరీర బరువును పెంచుతున్నారు. దీని వల్ల మీ శరీరం మీద కలిగే ప్రభావం తెలియదు. అందువల్ల అధిక ఫైబర్ కుకీలను తీసుకోవాలి. కేవలం మీరు ఆరోగ్యం అనే విషయాన్ని మనస్సులో పెట్టుకొని రుచిని విస్మరించండి.

హెల్తీగా తింటూ, సులభంగా బరువు తగ్గించే 10 టిప్స్

కొవ్వు పదార్ధాలు కంటే ధాన్యపు ఆహారాలను ఎంచుకోండి:

కొవ్వు పదార్ధాలు ఎక్కువగా తీసుకొంటే అధికంగా ఉన్న కొవ్వు మీ శరీరంనకు శక్తిగా ఎప్పటికి మారదు . ఒక విధంగా చెప్పాలంటే నిజానికి మీకు ఉన్న అదనపు బరువును తగ్గించటానికి కొవ్వు పదార్ధాలకు బదులుగా పండ్లు మరియు గోధుమ బియ్యం,గోధుమ బ్రెడ్ వంటి ధాన్యపు ఆహారాలను తినడం అలవాటు చేసుకోవాలి.

హెల్తీగా తింటూ, సులభంగా బరువు తగ్గించే 10 టిప్స్

డ్రింక్స్ బదులు నీరు త్రాగాలి:

బుడగలు వచ్చునట్లు చేసే కోలా డ్రింక్స్ మరియు డిన్నర్ తర్వాత తీసుకొనే వాయుపూరిత పానీయాలు వల్ల మీ శరీరంలో అదనపు కొవ్వు చేరుతుంది. అందువల్ల డ్రింక్స్ బదులుగా నీటిని త్రాగటం అలవాటు చేసుకోవాలి. ఒక పరిశోధన ప్రకారం నీటిని త్రాగటం వల్ల బరువు వేగంగా తగ్గటానికి సహయం చేస్తుంది. ఇది ఒక ఆరోగ్యకరమైన ఎంపిక మరియు దీర్ఘ కాలం మిమ్మల్ని యవ్వనంలో ఉంచుతుంది.

హెల్తీగా తింటూ, సులభంగా బరువు తగ్గించే 10 టిప్స్

రోజు మొత్తంలో తక్కువగా ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి:

సాధారణంగా చాలా మంది ప్రజలు ఒక రోజులో లంచ్ మరియు డిన్నర్ గా మాత్రమే 2-3 సార్లు ఆహారం తీసుకుంటారు. రోజులో మిగతా సమయంలో ఆకలి, అలసట మరియు చిరాకు వస్తాయి. అందువల్ల ప్రజలు డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాక చాలా ఎక్కువ ఆహారం తీసుకుంటాము. అందువల్ల వారి బరువు ఏవిధంగా ఉంటుందో చెప్పండి. అందుకే దీనిని నివారించటానికి మీరు రోజు మొత్తంలో కొంచెం కొంచెంగా 6 సార్లు ఆహారం తీసుకోండి. అప్పుడు సాధారణంగా మీరు జీర్ణ ప్రక్రియ మరియు బరువులో తేడాను గమనించవచ్చు.

హెల్తీగా తింటూ, సులభంగా బరువు తగ్గించే 10 టిప్స్

ఆరోగ్యవంతమైన అల్పాహారం ఎప్పుడూ మిస్ కావద్దు :

మేము చిన్న భోజనము గురించి మాట్లాడినప్పుడు తక్కువ అల్పాహారం తినే ఉద్దేశ్యం చేయకండి. దానికి బదులుగా అధిక అల్పాహారం తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి రోజు ప్రారంభంలో మీ శరీరంలో జరిగే వివిధ రకాల పనులు మరియు జీవక్రియలను ఎదుర్కొనటానికి ఎక్కువ శక్తిని అవసరం. ప్రతి రోజు జరిగే ఈ తరలింపుల వల్ల శక్తి తగ్గి మీ జీర్ణశక్తి కూడా తగ్గుతుంది. అందువల్ల ఆరోగ్యవంతమైన అల్పాహారంను తప్పకుండా తీసుకోవాలి. సాదారణంగా అల్పాహారంను రాజుగా, డిన్నర్ ను బిచ్చగాడుగా చెప్పుతారు.

హెల్తీగా తింటూ, సులభంగా బరువు తగ్గించే 10 టిప్స్

మీ ఆహారం నుండి జంక్ ఫుడ్ మరియు చక్కెరను తీసివేయాలి:

టీ మరియు కాఫీ లో వేసుకొనే చక్కర, మిఠాయిలు మరియు జంక్ ఫుడ్ మొదలైనవి నేటి తరంలో బరువు పెరుగుటకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అందువల్ల ఆరోగ్యకరమైన బరువు మరియు అధిక కొవ్వు తొలగించడానికి మీ ఆహారం నుండి వాటిని తొలగించటం ఎంతైనా అవసరము ఉంది.

హెల్తీగా తింటూ, సులభంగా బరువు తగ్గించే 10 టిప్స్

వెన్న తీసిన పాలను వాడాలి :

వెన్న తీసిన పాలలో తక్కువ కొవ్వు ఉండుట వల్ల అనేక ప్రయోజనాలు మరియు మీ శరీరంలో అదనపు కొవ్వు చేరదు. మీరు బరువు తగ్గాలని అనుకుంటే మాములు పాలుకి బదులుగా వెన్న తీసిన పాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

హెల్తీగా తింటూ, సులభంగా బరువు తగ్గించే 10 టిప్స్

ఎక్కువ పండ్లు తీసుకోవాలి :

పండ్లు మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. శరీరంనకు అవసరమైన విటమిన్లు మరియు పోషకాలను అందిస్తాయి. అంతేకాక మీరు ఒక బౌల్ నిండా తాజా పండ్లు నింపి క్రమం తప్పకుండా తినటం మొదలు పెడితే మీకు ఎక్కువ తిన్నా అనుభూతి కలుగుతుంది.

హెల్తీగా తింటూ, సులభంగా బరువు తగ్గించే 10 టిప్స్

వేయించిన ఆహారాలు బదులుగా కాల్చిన మరియు ఉడికించిన ఆహారాలు తీసుకోవాలి:

వేయించిన ఆహారాలలో మీకు తెలిసినంత వరకు మీ శరీరం నుండి తొలగించడానికి కష్టంగా ఉండే కొవ్వు నూనెలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఆహారంలో పోషక విలువలు కలిగి ఉండుట మరియు ఆకలి తీరుటకు ఉడికించిన మరియు కాల్చిన ఆహారాలు తీసుకోవటం మంచిది.

హెల్తీగా తింటూ, సులభంగా బరువు తగ్గించే 10 టిప్స్

మీరు కడుపు నిండా తినాలి కానీ దానికి మించి ఎక్కువ తినకూడదు

మీరు భోజనం చేస్తున్నప్పుడు మీకు ఎంత అవసరమో అంతే తినాలి. తినే సమయంలో మీరు ఒక విరామం తీసుకుంటే మీ శరీరానికి ఆహారం సరిపోయిందని అర్ధం. మీరు కనుక దీనికన్నా ఎక్కువ తింటే మీ శరీరంలో అదనపు ఆహారం మరియు అదనపు కొవ్వు చేరతాయి. రెండవసారి వడ్డించుకోవటం మానుకోండి. మీరు బరువు కోల్పోయిన భావన కలుగుతుంది.

English summary

10 Easy Ways to Eat Healthy and Lose Weight

When you’re trying to lose weight, it’s important to come up with ways to eat less. Obviously you don’t want to reduce your caloric intake too low because you’ll only slow down your metabolism, but you definitely want to avoid overeating too.
Story first published: Tuesday, June 25, 2013, 18:22 [IST]
Desktop Bottom Promotion