For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాయామం తర్వాత ఖచ్చితంగా తీనాల్సిన బెస్ట్ ఫుడ్స్

By Super
|

ఉదయం వ్యాయామం మీ శరీరంలోని ప్రోటీనులు, ద్రవాలు మరియు కార్బోహైడ్రేట్లనుతగ్గిస్తుంది. ఈ వ్యాయామం శరీరంలో నిల్వఉన్న పోషకాలు బలవంతంగా లాగేసుకుంటుంది.దాంతో మిగిలిన రోజంతా అలసిపోవల్సి వస్తుంది.

కాబట్టి వ్యాయామాలు చేసిన అరగంటలోపు ఆహారాలను తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ శరీరం వ్యాయామం చేస్తున్నప్పుడు పోషకాలను నష్టపోవడం జరుగుతుంది కాబట్టి తిరిగి వేగంగా పోషకాలు గ్రహించాలంటే వ్యాయామాలు చేసిన అరగంటలోపు, ఆహారాలను తీసుకోవాలి. రెగ్యులర్ వ్యాయామం వల్ల వ్యాయామం తర్వాత అలసట నిరోధిస్తుందా?ఆందోళన అవసరం లేదు! కోల్పోయిన పోషకాలు తిరిగి పొందడానకి కొన్ని పోస్ట్ వ్యాయమ ఆహారాలున్నాయి. వాటిని పరిశీలించి, మీరు వ్యాయామం తర్వతా ఇటువంటి ఆహారాలను తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో అవసరం.

ఆమ్లెట్:

ఆమ్లెట్:

శరీర కండర నిర్మాణం కోసం వ్యాయామం తర్వాత శరీరానికి హైప్రోటీన్ ఆహారం చాలా అవసరం. కాబట్టి, ఎగ్ వైట్ లో అధిక ప్రోటీనులు మరియు ముఖ్యమైన అమైనో ఆమ్లాలు మంచి పరిమాణంలో కలిగి ఉంది. తీవ్రమైన వ్యాయామం తర్వాత దెబ్బతిన్న కణజాలాల పునర్నిర్మాణానికి అమైనో యాసిడ్స్ సహాయపడుతుంది.

అవెకాడో :

అవెకాడో :

అవొకాడోలో సంతృప్త కొవ్వులు, ఫోలిక్ యాసిడ్, విటమిన్ K, విటమిన్ సి, విటమిన్ E మరియు పాంతోతేనిక్ పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇది ఇంకా పొటాషియంతో నిండి ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. ఇది శక్తి స్థాయిలు సౌలభ్యం మరియు మీరు చురుకుగా మరియు రోజు మొత్తం శక్తివంతంగా ఉంచుతుంది.

సాల్మన్ చేప:

సాల్మన్ చేప:

సాల్మన్ చేపల్లో ప్రోటీన్ మరియు వ్యాయామం తర్వాత వేగవంతంగా కోలుకోవడానికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగి ఉంటుంది. దీనిలో ఇంకా, విటమిన్ డి, విటమిన్ బి6 మరియు మరియు శక్తి కోసం విటమిన్ బి 12 కలిగి ఉంటుంది. సాల్మన్ చేపలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. మరియు ఎనర్జీని మరియు శక్తి పెంచడానికి సహాయపడుతుంది.

సెరీల్ (ఒక రకమైనటువంటి ధాన్యం)

సెరీల్ (ఒక రకమైనటువంటి ధాన్యం)

ఒక గిన్నె సెరీల్ (ధాన్యం)ను తీసుకోవడం వల్ల కండరాల శక్తి పునరుద్ధరణకు ఒక మంచి మూలం. వీటిలో పుష్కలమైన ప్రోటీనులు మరియు కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా కలిగి ఉండి, ఇవి సెల్యులార్ శక్తిని పొందడానికి దోహదపడతాయి . ఈ ద్యానంను పాలు లేదా చాక్లెట్ మిల్క్ తో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల కండరాలను రివకర్ చేసి , మరమ్మత్తులు చేస్తుంది.

చిలగడ దుంప(స్వీట్ పొటాటో):

చిలగడ దుంప(స్వీట్ పొటాటో):

స్వీట్ పొటాటోలో కాప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, బీటా కెరోటిన్, విటమిన్ సి, మ్యాంగనీస్ మరియు పొటాషియం సమృద్ధిగా కలిగి ఉంటాయి. వ్యాయామం తరువాత, శరీరం యొక్క గ్లైకోజెన్ లెవల్స్ పడిపోయినపుడు, స్వీట్ పొటాటోలో ఉన్న కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ గ్లైకోజెన్ స్థాయి పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.

వైట్ రైస్:

వైట్ రైస్:

గోధుమ బియ్యం వైట్ రైస్ కంటే ఆరోగ్యకరమైన ఎంపిక. కానీ వ్యాయామం తర్వాత మీలో అధిక గ్లైసెమిక్ సూచిక (GI) తో గ్లైకోజెన్ స్థాయి పునరుద్ధరించడానికి ఇది సహాయపడుతుంది. తద్వారా శరీరంలోని ఎనర్జీలెవల్స్ పెంచుతుంది.

డ్రై ఫ్రూట్స్(ఎండిన ఫలాలు):

డ్రై ఫ్రూట్స్(ఎండిన ఫలాలు):

నట్స్ మరియు ఎండు ఫలాలు అధిక ప్రోటీన్, కార్బోహైడ్రేట్, విటమిన్ ఎ, విటమిన్ K మరియు కాల్షియం సమృద్ధిగా కలిగి ఉంటాయి. సాధారణ పిండి పదార్థాలు నిల్వ ఉండటం వల్ల, ఇవి సులభంగా జీర్ణం అవ్వడానికి మరియు గ్లైకోజెన్ స్థాయి తిరిగి పొందడానికి, తద్వారా శరీర శక్తి స్థాయి పెంచుకోవడం కోసం సహాయ పడుతాయి.

Hummus:

Hummus:

Hummus వీటిలో ఐరన్ మరియు విటమిన్ సి పుష్కలం. వీటిలో ఇంకా ప్రోటీనులు మరియు పిండి పదార్థాలు కలిగి ఉండటం వల్ల ఇది ఒక అద్భుతమైన, మంచి పోస్ట్ వ్యాయామం ఆహారంగా ఉన్నాయి.

చికెన్:

చికెన్:

చికెన్ ప్రోటీన్, ఒమేగా 3S మరియు సెల్యులార్ శక్తికి దోహదం చేసే అమైనో ఆమ్లం అందిస్తుంది.

పండ్లు:

పండ్లు:

పండ్లలో ఫైబర్, నీరు, విటమిన్ సి మరియు కార్బోహైడ్రేట్ల అధికం. ఇవి పోషకాలు విచ్ఛిన్నం మరియు మీ అలసటతో కూడిన కండరములు తిరిగి పునర్నిమానంకు సహాయం చేసే ఎంజైమ్లను కలిగి ఉంటాయి. వ్యాయామం తర్వాత , పండ్లు, పండ్ల రసాలు లేదా స్మూతీలను తీసుకోవడం ఆరోగ్యకరం. ఇవన్నీ కండరాలకు కావల్సినంత ప్రోటీనులను అందిస్తుంది.

English summary

10 Foods To Eat After Workout

Morning workout depletes your body of protein, fluids and carbohydrates. It robs storage nutrients of your body, which leaves you dead tired for the rest of the day.
Desktop Bottom Promotion