For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల జిమ్ కిట్ లో ఉండాల్సిన వస్తువులు.!

By Super
|

ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ద, మంచి ఆరోగ్యం పొందడానికి చాలా మంది తమ జీవన శైలిలో మార్పలు చేసుకుంటున్నారు. ఆహారపు అలవాట్ల, వ్యాయామం, యోగా వంటివాటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే వ్యాయామాల కొరకు జిమ్ సెంటర్లకు వెళుతుంటారు. నిపుణులు సమక్షంలో కఠినతర వ్యాయామాలు చేస్తూ శ్రమ పడి , చెమటలు పట్టిస్తుంటారు. వ్యాయామం తర్వాత మీరు సౌకర్యవంతంగా ఉండాలన్నా, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలన్నా, వ్యాయం చేసి అలసిన చర్మం శుభ్రంగా ఉండాలన్నా మీరు జిమ్ కు తీసువెళ్ళే బ్యాగ్ లో కొన్ని నిత్యవసర వస్తువులు ఉండేలా జాగ్రత్తతీసుకోవాలి. వ్యాయామం తర్వాత మీరు ఫర్ ఫెక్ట్ లుక్ పొందాలంటే మీ జిమ్ బ్యాగ్ లో ఉండాల్సిన కొన్ని అవసరమైన వస్తువులేంటో ఒకసారి పరిశీలించండి:

జిమ్ కు వెళ్ళే వారు మీ వెంట తీసుకెళ్ళాల్సిన కొన్ని వస్తువులు!

జిమ్ టవల్స్:

మీకు ఖచ్చితంగా రెండు జిమ్ టవల్స్ అవసరం అవుతాయి. ఎందుకంటే?ఒకటి టవల్ మీరు వ్యాయామ శాలలో మీరు ఉపయోగించే పరికరాలు తుడవడానికి. మీరు వ్యాయామం మొదలు పెట్టడానికి ముందు, వ్యాయం పూర్తి చేసిన తర్వాత పరికరాలను శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. మరొకటి షవర్ కోసం. వ్యాయామం చేసిన తర్వాత శరీరం మీద పట్టే చెమటలను తుడుచుకోవడానికి మరోటవల్ చాలా అవసరం. ఈ రెండు టవల్స్ ను శుభ్రం చేసి ఎండబెట్టడం కూడా ముఖ్యమే.

దుర్గంధనాశని(డియోడరెంట్):

ఇది ఖచ్చితంగా అవసరమైన వస్తువు. కొంత మంది పురుషులకు వ్యాయామం ముగించిన తర్వాత వీటిని ఉపయోగించడం తెలిసిండకపోవచ్చు, వారు వ్యాయామం తర్వాత ఖచ్చితంగా షవర్ బాత్ చేసుకోవడం చాలా ముఖ్యం. అంతే కాదు, వ్యాయామం వల్ల పట్టే చెమట వాసను నివారించడంలో డియోరెంట్ సహాయపడుతుంది.

న్యూట్రిషన్ బార్లు:

మీరు ఆఫీస్ నుండి నేరుగా వ్యాయామాల శాలకు వెళ్ళేవారైతే, కఠినమైన వ్యాయామాలు చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఎక్కువ ఆకలిగి కలిగిస్తుంది. అటువంటి సమయంలో మీకు తిరిగి ఎనర్జీని నింపడానికి కొన్ని న్యూట్రీషియన్ బార్లను మీ జిమ్ బ్యాగ్ లో తీసుకెళ్లడం వల్ల మీకు తక్షణ శక్తిని అంధించడంలో సహాయం చేస్తుంది. అంతే కాదు మీకు స్వీట్ తినాలనే కోరికను దూరంగా ఉంచడానికి సాధ్యమవుతుంది.

అదనపు షేవింగ్ కిట్:

వ్యాయామ శాలనుండి మీరు నేరుగా ఇంటికి రానట్లైతే, మీ వ్యాయామ శాలలో మీకోసం ఒక ప్రత్యేక లాకర్ సౌకర్యాన్ని కల్పించినట్లైతే అందులో మీకుఅత్యవసరంగా ఉపయోగపడే షేవింగ్ కిట్ ను ఉంచుకోవడం మంచిది. దాంతో మీరు ట్రెడ్మిల్ పొందవచ్చు, వ్యాయామ శాలలోని షవర్ చేసి, స్మార్ట్ గా తయారైస్ ఆఫీసులకు వెళ్ళవచ్చు.

నొప్పి నివారణ క్రీమ్(Pain relieving cream)

వ్యాయామానికి వెళ్ళే వారి బ్యాగ్ లో ఉండాల్సిన అత్యవసర వస్తువు, పెయిన్ రిలీవింగ్ క్రీములు. వ్యాయంలో ఎదైన ప్రమాదం, కండరాలు, లేదా నరాలు పట్టివేతకు గురైనప్పుడు తక్షణ ఉపశమం కోసం కొన్ని నొప్పి నివారణ(మెంథోల్ లేదా మూవ్) క్రీముల తీసుకెళ్ళడం మంచిది. కండరాలు, కీళ్ళు వంటివి అలసటకు గురైనప్పుడు వీటిని ఉపయోగించడం వల్ల మీకు తక్షణ ఉపశమనం కలిగించడంతో పాటు తిరిగి మీరు వ్యాయామాన్ని మొదలు పెట్టడానికి సౌకర్యంగా ఉంటుంది.

మ్యూజిక్ ప్లేయర్ :

వ్యాయామం చేసే సమయంలో మిమ్మల్ని ఉత్తేజపిరచేందుకు మరియు వ్యాయమ సెషన్ పూర్తి చేయడానికి మ్యూజిక్ బాగా సహాయపడుతుంది. ఫాస్ట్ బీట్ ఉన్న పాటలతో లోడ్ చేసిన MP3ప్లేయర్ ను మీ జిమ్ బ్యాగ్ లో ఉంచుకోండి. ఇవి మిమ్మల్ని మరింత ఉత్సాహంగా వ్యాయామం చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. తర్వాత ఇతరులు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి అవకాశం లేకుండా చేస్తుంది.

హ్యాండ్ సానిటిజర్:

మీరు ఇన్ఫెక్షన్లకు గురి అవ్వడానికి వ్యాయామా శాలలు కూడా ఒక కారణం కావచ్చు. ఇతరులు ఉపయోగించిన పరికారాలు మీరు తిరిగి ఉపయోగించడం,అపరిశుభ్రవల్ల అంటువ్యాధులు త్వరగా వ్యాప్తిచెందే అవకాశం ఉంది. కాబట్టి మీ జిమ్ బ్యాగ్ లో ఖచ్చితంగా హ్యాండ్ సానిటిజర్ ను తీసుకెళ్ళడం మర్చిపోకండి. మరియు దాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించడానికి నిర్ధారించుకోండి.

ఆయిల్-ఫ్రీ ఫేష్ వాష్:

చెమట వల్ల breakouts చాలా సర్వసాధారణం. కాబట్టి మీరు వ్యాయామం చేసిన తర్వాత చెమట వల్ల మీరు మొటిమలకు గురికాకుడదనుకుంటే సాలిసిలిక్ యాసిడ్ తో తయారుచేసినటువంటి ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ ను ఉపయోగించి ముఖం శుభ్రంపరచుకోవడం వల్ల ముఖంలో చర్మంలో మురికి, ధూళి తొలగించడంతో పాటు మొటిమల రంధ్రాలు ఏర్పడకుండా నివారిస్తుంది.

వాటర్ బాటిల్:

వివిధ రకాల కఠినమైన వ్యాయామాలు చేస్తున్నప్పుడు హైడ్రేషన్ కలిగి ఉండటం చాలా అవసరం. జిమ్ బ్యాగ్ లో వాటర్ బాటిల్ కలిగి ఉండటం వల్ల మీకు అవసరం అయినప్పుడు నీరు తాగడం వల్ల మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవచ్చు.

అధనంగా మరో జత దుస్తులు( స్పేర్ క్లోత్స్):

మీరు వ్యాయామ శాలలో, ఇతరలు వ్యాయామ సభ్యుల కంటే తక్కువగా కనిపించకూడదనుకుంటే, వారితోపాటు సరిసమానంగా కనిపించాలనుకుంటే, అప్పడు మీరు ఒక డ్రెస్ ను తీసుకెళ్ళడం మంచిది. వ్యాయామం తర్వాత మీరు ఇంటికి వెళ్ళడానికి, చెమట పట్టిన దుస్తులతో కాకుండా, పొడి దుస్తులతో వెళ్ళవచ్చు.

English summary

10 Gym Bag Essentials For Men

If you are used to hitting the gym with nothing but your gym clothes, then odds are that you’d end looking not as great as you feel after a workout session.
Desktop Bottom Promotion