For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్లిమ్ బాడీ కోసం సమతూకపు బరువును మెయింటైన్ చేయడం ఎలా...

|

సమతూకంగా అంటే ఎత్తుకు తగ్గ బరువు ఉండటానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. అయితే ఆ సమతూకం బరువును మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయడం కూడా చాలా అవసరం. అందుకు ఆరోగ్యకరమైన డైయట్, వ్యాయామం, సన్నగా మరడానికి ఉపయోగకరమైన ప్లాన్ ఇవన్నీ ఉంటేనే, పాటించగలిగితేనే సమతూకంగా ఉండటానికి సాధ్యంమవుతుంది.

ప్రస్తుత జనరేషన్ లో చాలా మంది యువత తమ శరీర సౌష్టం కోసమని జిమ్ లు, ఫిట్ నెస్ సెంటర్లు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సుందరమైన శరీర సౌష్టం పొందడానికి, ఆకర్షణీయంగా కనబడటానికి వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఫలితం కనిపించినా, తర్వాత తర్వాత తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటారు. దాంతో ఒక్కోక్కో సారి విసిగు చెంది, అసలు డైయట్ చేయడమే మానేస్తారు. కాబట్టి కృత్రిమంగా కాకుండా సహజంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే తప్పకుండా శాశ్వత పరిష్కారం ఉంటుంది. దాంతో అధిక బరువును తగ్గించుకోవడం ద్వారా సౌందర్యం మాత్రమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు.

అధిక బరువు పెరిగితే ఒబేసిటి, కొలెస్ట్రాల్, అధిక బ్లడ్ ప్రెజర్ వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి అధిక బరువును తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు మీకు సహాయం చేసేవి కొన్ని మీకోసం...

ఆరోగ్యకరంగా బరువు తగ్గించే 14 సీక్రెట్స్

డైయట్ ప్లాన్: ఏ కార్యం తలపెట్టినా అందుకు ప్లానింగ్ అనేది చాలా అవసరం. అదే ఆరోగ్య విషయంలో కూడా వర్దిస్తుంది. ప్లాన్ లేకుండా ఏ పనిచేసిన నిర్విగ్నంగా సాగవు. అనేక అడ్డంకులు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకొనే వారి ఒక ప్లాన్ అవసరం. ఆ ప్లాన్ లో డయట్ కు సంబంధించి ఏఏ అంశాలు ఉండాలో రాసుకోవాలి. దాని ప్రకారం ఆచరించాలి.

ఆరోగ్యకరంగా బరువు తగ్గించే 14 సీక్రెట్స్

నిద్ర: ఆరోగ్యకరమైన జీవితానికి తగినంత నిద్ర అవసరం. మనిషికి కనీసం 7-8గంటల నిద్రఅవసరం. నిద్రలో వ్యత్యాసం లేకుండా ప్రతి రోజూ ఒకే సమయానికి క్రమంగా నిద్రపోవాలి. నిద్రలో వ్యత్యాసం వల్లే బరువు పెరగడంలో హెచ్చుతగ్గులు ఏర్పడుతాయి. కాబట్టి సరైన నిద్ర, టైమ్ మెయింటెనెన్స్ అవసరం.

ఆరోగ్యకరంగా బరువు తగ్గించే 14 సీక్రెట్స్

స్నాక్స్: స్నాక్స్ తినాలనుకొనే వారు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది. డ్రై ఫ్రూట్స్, నట్స్, వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ ను తినవచ్చు.

ఆరోగ్యకరంగా బరువు తగ్గించే 14 సీక్రెట్స్

ఎంత తింటారు?: మనకు ఇష్టమైన ఆహారాన్ని కొంచెం ఎక్కువే లాగించేస్తుంటాం. అయితే బరువు తగ్గాలనుకొనేవారు ఎంత ఇష్టమైన ఆహారాన్నైనా మితంగా తీసుకోవాలి. అందులోనూ కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొలెస్ట్రాల్ ఉన్న ఆహారం ఏదో ఒక సందర్భంలో తినడం వల్ల అధిక బరువును పొందరు. అయితే ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఆరోగ్యకరంగా బరువు తగ్గించే 14 సీక్రెట్స్

వ్యాయామం: ప్రతి రోజూ 20-30నిముషాలు వ్యాయామం క్రమం తప్పకుండా చేయలి. ఆఫీస్ దగ్గరలో ఉంటే సైకిల్ మీద వెళ్ళడానికి ప్రయత్నించండి. నడక, జాయింగ్, బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలు అధిక బరువు తగ్గడానికి బాగా సహాయపడుతాయి.

ఆరోగ్యకరంగా బరువు తగ్గించే 14 సీక్రెట్స్

రెడ్ డ్రింక్స్: రెడ్ డ్రింక్స్ ను కృత్రిమంగా తయారు చేయడం వల్ల క్యాలరీలు అధికంగా ఉంటాయి. రెడ్ డ్రింక్స్ ను వారంలో ఒకటి రెండు సార్లైతే పర్వాలేదు. బరువు పెరగరు.

ఆరోగ్యకరంగా బరువు తగ్గించే 14 సీక్రెట్స్

భోజనం తప్పనిసరి: ప్రస్తుతకాలంలో చాలా మంది సన్నగా మారడానికి భోజనం మానేస్తుంటారు. సరైన డైయట్ పాటిస్తూ మితహారం తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. అయితే భోజనం మానేయడం వల్ల శరీరంలో విటమిన్ల, హార్మోనుల అసమతుల్యత వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు గురికావల్సి ఉంటుంది. ఆరోగ్యానికి క్రాస్ డైయట్ మంచిది కాదు.

ఆరోగ్యకరంగా బరువు తగ్గించే 14 సీక్రెట్స్

సంతోషం: ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలిగితే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అందుకు ఫ్రెండ్స్ తో కలసి ట్రెక్కింగ్, పిక్నిక్, ఒక రోజు విహార యాత్ర వంటివి అప్పుడప్పుడు ప్లాన్ చేస్తూ వెళుతుండాలి. దాంతో మానసికోళ్ళాసం దొరుకుతుంది. ఆరోగ్యంగాను ఉండగలుగుతారు.

ఆరోగ్యకరంగా బరువు తగ్గించే 14 సీక్రెట్స్

ఆహారం: సన్నబడ్డానికి ప్రయత్నించే వారు ఆహారాన్ని పూర్తిగా తినడం మానడానికి బదులు. ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తినవచ్చు. అందుకు సూపులు, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు ఇతర ఆహారాలు తినాల్సి ఉంటుంది.

ఆరోగ్యకరంగా బరువు తగ్గించే 14 సీక్రెట్స్

అతి సాధారణ లేదా సులవైన వస్తువులతో వ్యాయామం: వ్యాయామం అంటే జిమ్ కు మాత్రమే వెళ్ళి చేసిది కాదు. జిమ్ కు పోవడానికి ఇష్టం లేని వారు, ఇంట్లోనే స్కిప్పింగ్, బ్యాటింగ్, నడక వంటి అతి సులవైన వ్యాయామాల వల్ల క్రమమైన బరువును కలిగి ఉండవచ్చు.

ఆరోగ్యకరంగా బరువు తగ్గించే 14 సీక్రెట్స్

వ్యాయామ సమయంలో విశ్రాంతి తీసుకోకూడదు: అరగంట పాటు వ్యాయమం చేసే వారు మద్యలో విశ్రాంతి తీసుకోకూడదు. శరీరంలో చెమటలు పట్టేలా వ్యాయామం చేయాలి.

ఆరోగ్యకరంగా బరువు తగ్గించే 14 సీక్రెట్స్

ప్రోటీన్: వ్యాయామం తర్వాత ప్రోటినులు అధికంగా ఉండే పదార్థాలు సేవించాలి.

ఆరోగ్యకరంగా బరువు తగ్గించే 14 సీక్రెట్స్

ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ పదార్థాలు: చిన్న పండు, భూమిలో పండే ఆహారాల్లో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒమేగా 3 అధికంగా ఉండే ఆహారాలు ఆరోగ్యానికి మంచిది.

ఆరోగ్యకరంగా బరువు తగ్గించే 14 సీక్రెట్స్

నీరు: భోజనం తర్వాత కొంచె వేడి నీరు త్రాగడం మంచిది. ఒక రోజుకు 8-10గ్లాసుల నీళ్ళు త్రాగాలి. అలాగే జ్యూసులు కూడా త్రాగాలి.

ఈ అంశాలను క్రమం తప్పకుండా పాటించినట్లైతే ఆరోగ్యకరంగా శరీర బరువును తగ్గించుకొని ఎత్తుకు తగ్గ బరువును పొందగలుగుతారు.

English summary

14 Fat Loss Secrets.. Weight loss Tips | బరువు తగ్గించే 14 సీక్రెట్స్..ఎవరికీ చెప్పకండీ...!

Try these 14 Health tips—including several surprises—to fire up your metabolism speed up your lean body transformation.
Desktop Bottom Promotion