For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా బరువు తగ్గించే 15 రాఫుడ్స్ (పచ్చి కూరలు)

|

కొన్ని పరిశోధనలు, అధ్యయనాల ప్రకారం ఉడికించిన ఆహారాల కంటే పచ్చికూరలు సురక్షితం అని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాల వలనే అనే పౌండ్ల బరువును తగ్గించుకోవచ్చు. ఒక వేళ మీరు బరువు తగ్గించుకొనే ప్లాన్ లో ఉన్నప్పుడు, పచ్చికూరలను మీ డైలీ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. ఎప్పుడైతే మీరు ఈ రాఫుడ్స్(పచ్చి ఆహారాల)ను తీసుకుంటారు అప్పుడు మీరు మీ బరువు తగ్గించే వేయింగ్ స్కేల్లో మీ బరువును క్రమంగా తగ్గడానికి గమనించవచ్చు.

పచ్చికూరల్లో అధికంగా ప్రోటీనులు మరియు మినిరల్స్ కలిగి ఉంటాయి . అందువల్లనే ఈ రాఫుడ్స్(పచ్చికూరలు)తిని మీ శరీరానికి అవసరం అయ్యే అదనపు ఎనర్జీని మీరు పొందవచ్చు . మరియు వర్కౌట్స్ చేయడానికి కూడా మంచిది . మీరు మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవల్సిన రాఫుడ్స్ కొన్ని ఉన్నాయి . వీటిని క్రమంగా తీసుకొన్నట్లైతే మీరు క్రమంగా బరువు తగ్గివచ్చు మరియు ఫిట్ గా ఉండవచ్చు.

ఈ రాఫుడ్స్ ను క్రమంగా తీసుకొన్నట్లైతే, తర్వాత మీరు చూసి ఫలితాలకు ఆశ్చర్య పడుతారు. ముఖ్యంగా ప్రముఖ సెలబ్రెటీలు ఫర్ ఫెక్ట్ షేప్ తో ఎలా మెయింటైన్ చేస్తున్నారని మీరు రియలైజ్ అవుతారు. మరి మీరు కూడా వారిలా ఫర్ ఫెక్ట్ ఫిగర్, షేప్ తో ఉండాలని కోరుకుంటున్నట్లైతే, అప్పుడు ఈ రాఫుడ్స్ ను మీ రోజువారి ఆహారపు లిస్ట్ చేర్చుకోవాలని నిర్ధారించుకోవల్సిన అవసరం ఉంది. అంతే కాదు, ఈ రాఫుడ్స్ తినే ముందు వీటిని బాగా శుభ్రం చేసిన తర్వాత తినాలని నిర్ధారించుకోండి.

బరువు తగ్గించి..ఆరోగ్యంగా ఉంచే 15 రాఫుడ్స్:

ఆకుకూరలు:

ఆకుకూరలు:

బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడే ఒక రాఫుడ్ (పచ్చికూరల్లో ఒకటి)ఆకురూరలు. వీటిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. మరియు ఇది ఐరన్ ను అంధిస్తుంది.

బీట్ రూట్:

బీట్ రూట్:

రక్తహీనతతో బాధపడేవారికి కొన్ని రకాల వెజిటేబుల్స్ బాగా సహాయపడుతాయి అంటువంటి వాటిలో బీట్ రూట్ ఒకటి. కాబట్టి తాజాగా ఉండే బీట్ రూట్ బాగా శుభ్రం చేసి కట్ చేసి తిని ఫిట్ గా మరియు హెల్తీగా ఉండండి.

క్యారెట్:

క్యారెట్:

ఈ రాఫుడ్ (పచ్చికూర)క్యారెట్ మీ కంటి ఆరోగ్యానికి మాత్రమే కాదు, మీ మొత్తం శరీరానికి గొప్ప శక్తిని అందివ్వగలిగిన ఒక ఎనర్జిటిక్ ఫుడ్ ఇది. మీరు ఎప్పటికీ బద్దకంగా ఉండకూదనుకుంటే, పచ్చిక్యారెట్ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

కీరదోసకాయ:

కీరదోసకాయ:

ఈ రాఫుడ్ ను దాదాపు అన్ని సలాడ్లులో కనబడుతుంది. బరువు తగ్గించే ప్లాన్ లో ఉన్నప్పుడు, ఈ కీరదోసను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఒక ఉత్తమ పరిష్కార మార్గం. ఇందులో అధిక మొత్తంలో నీరు కలిగి ఉండి, మీ కడుపు నింపడానికి సహాయపడుతుంది.

ముల్లంగి:

ముల్లంగి:

పచ్చి ఆహారాలో తీసుకోవల్సిన మరో ఆహారం, ముల్లంగి. కానీ, దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు. ఇది ఎక్కువ గ్యాస్ ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మితంగా తీసుకోండి.

టమోటో:

టమోటో:

పచ్చికూరల్లో తీసుకోవల్సి ఒ క అద్భుత ఆహారం టమోటోలు. మీ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది . మరియు అన్ని రకాల జబ్బులను మరియు క్యాన్సర్లను నివారోధిస్తుంది.

మొలకలు:

మొలకలు:

మొలకలు వివిధ ధాన్యాలతో మొలకెత్తించిన మొలకలు, ముఖ్యంగా మీరు బరువు తగ్గించుకోవాలనుకుంటే వీటని ప్రతి రోజు తీసుకోవడం ఆరోగ్యానికి మరియు బరవు తగ్గడానికి ఇంకా చర్మం ప్రకాశవంతంగా మార్చడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

కాలే:

కాలే:

కాలేలో మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్ కె అధిక శాతంలో ఉంటుంది. వారానికి ఒకసారి కాలేను మీరు తీసుకుంటే, మీకు మలబద్దక సమస్య అనేది ఎప్పటికీ ఉండదు.

పచ్చికొబ్బరి:

పచ్చికొబ్బరి:

పచ్చికొబ్బరి తినడం వల్ల మీ శరీరంలోని హానికరమైన క్రిములను నాశనం చేయడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, మీకు ఎదైన స్టొమక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లైతే , సమస్యను నివారించడానికి పచ్చికొబ్బరి అద్భుతంగా సహాయపడుతుంది.

కార్న్:

కార్న్:

త్వరగా బరువు తగ్గాలనుకొనే వారికి ఒక అద్భుత ఆహారం కార్న్స్ . కార్న్స్ లో అద్భుతమైన ప్రోటీనులు ఉండి డైటర్స్ కు మేలు చేస్తాయి.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

మీ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడానికి ఉల్లిపాయ అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గించుకోవాలనుకునే వారు పచ్చి ఉల్లిపాయలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

యామ్స్ :

యామ్స్ :

భూమిలో కాచే దుంప. వీటినే చేమ దుంపలు అని కూడా అంటారు. వీటిని రుచి బంగాళదుంప రుచిని పోలి ఉంటుంది . కాబట్టి, పచ్చి చేమదుంపలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలోని షగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది . డయాబెటిక్స్ కూడా ఇది మంచిది అయితే మితంగా తీసుకోవాలి.

సెలరీ:

సెలరీ:

స్టొమక్ ఇన్ఫెక్షన్ ఉన్న వారు మీ రెగ్యులర్ ఆహారంలో చేర్చుకోవల్సి మరో రాఫుడ్ సెలరీ. మీ శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది ఈ సెలరీ.

టర్నిప్స్:

టర్నిప్స్:

టర్నిప్స్ అంటే చాలా మంది ఇష్ట లేదు. కానీ, ఈ రాఫుడ్ ను వారానికి ఒక సారి తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

నిమ్మ:

నిమ్మ:

మీ శరీరంలో కొవ్వు కరిగించడానికి మరో అద్భుతమైన రాఫుడ్ నిమ్మ. ఒక చిన్న నిమ్మ ముక్కను తినడం లేదా గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి తాగడం వల్ల అద్భుత ఫలితాలను పొందవచ్చు.

English summary

15 Raw Healthy Foods For You

They say that more than boiled food, raw food is one of the most safest and best ways for you to shed those pounds. If you are on a weight loss diet program, raw foods should be added to your daily diet. When you consume these raw foods you will notice the numbers on the weighing scale to drop drastically.
Story first published: Saturday, November 16, 2013, 13:11 [IST]
Desktop Bottom Promotion