For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా చేస్తే పొట్టతో సహా చిరుబొజ్జ కూడా ఇట్టే కరిగిపోతుంది....!

|

సాధారణంగా చాలా మంది డైటీషియన్స్ లోఫ్యాట్ మరియు ఫ్యాటీ ఫ్రీ ఫుడ్స్ తీసుకోమని డైయటేరియన్స్ కు సలహాలిస్తుంటారు. క్రొవ్వును కరిగించుకోవడానికి అత్యధికంగా కష్టపడి చేసే వ్యాయామాలు మరియు ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవల్సిన పనిలేదు. ఎందుకంటే క్రొవ్వులు అనేవి మనిషి ఆరోగ్యానికి చాలా అవసరం. ఎందుకంటే శరీరంలో జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలన్నా, మరియు బోన్ లూబ్రికేషన్ కొరకు. అందువల్ల బాడీ స్లిమ్ గా ఉండి ఎక్సెస్ ఫ్యాట్ ను కరిగించుకొనేందుకు కొన్ని పద్దతులను పాటించాలి.

అధిక పొట్ట లేకపోతే లావుగా ఉన్నవారు కూడా ఆకర్షణీయంగా కబడుతారు. ఉబ్బెత్తుగా ఉండే పొట్ట, చిరు బొజ్జలాగా అసహ్యంగా కనబడుతుంది. శరీరంలో అధిక బరువు, పొట్ట అందానికి ఆరోగ్యానికి సమస్యాత్మకంగా మారుతాయి. ఇవి ఆత్మ న్యూనతకి గురిచేసి అత్యంత నష్టాన్ని కలిగిస్తాయి. ఈ అధిక బరువు లావు పొట్ట వల్ల గురక నుంచి గుండె జబ్బుల వరకు బీపీ నుంచి షుగర్ వరకు కారణం అయ్యే ప్రమాదం ఉంది. ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. బరువు తగ్గించుకోవడం కష్టం, కొవ్వు తగ్గించుకోవడం మరింత కష్టం.

కారణాలు: అధిక బరువు పెరగటానికి అనేక కారణాలు ఉండవచ్చు. వీటిలో కొన్ని శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, భోజనానికి సమయపాలన లేకపోవడం, శారీరక శ్రమ అస్సలు లేకపోవడం, కొన్ని సార్లు వంశపారంపర్యంగా కూడా అధిక బరువు నమోదు కావచ్చు. మరి ఇటువంటి సమస్యల భారీన పడకుండా పొట్ట, చిరు బొజ్జ కరిగించుకోవడానికి కొన్ని నియమాలు పాటిస్తే సరి:

పొట్టతో సహా..చిరుబొజ్జను కరిగించే కొన్ని నియమాలు!

పొట్టకు సరిపోయే ఆహారం తినాలి: కొందరు డైటీషియన్స్ ప్రకారం ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాలను సాయంత్రం 3-4 గంటలలో లోపు తీసుకోవాలి. ఈ సమయంలో ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని చెక్కర శాతంను నియంత్రించడానికి సహాయపడుతుంది. దేహంలో చక్కెర శాతం సమతుల్యంగా ఉంచుకోవడం వల్ల శరీరం ఎల్లప్పుడు ఫిట్ గా ఉంటుంది. ఇష్ట వచ్చినట్లు, వేలా పాలా లేని టైమ్ లో తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.

పొట్టతో సహా..చిరుబొజ్జను కరిగించే కొన్ని నియమాలు!

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: ఆకుకూరలు: ఆకు కూరలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాల్సినటువంటి హెల్తీ ఫుడ్. ముఖ్యంగా మహిళల డైయట్ లిస్ట్ లో గ్రీన్ లీఫ్స్ కు, గ్రీన్ వెజిటేబుల్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. బ్రొకోలి, ఆస్పరాగస్ వంటి వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉండి లో కాలరీలను కలిగి ఉంటుంది. ఇది బాడీ ఫ్యాట్ ను తగ్గిస్తుంది.

పొట్టతో సహా..చిరుబొజ్జను కరిగించే కొన్ని నియమాలు!

.ఓట్స్: ఓట్స్‌ లో ఎక్కువగా ఫైబర్(పీచు పదార్ధాం) ఉన్నందున ఎక్కువ సేపు కడుపులో నిలువుంటుంది. దీనివల్ల ఎక్కువగా ఆకలి ఉండదు. ఓట్స్‌తో పాటు చక్కెరను కాకుండా ప్రకృతి సిద్ధమైన తేనెను ఉపయోగించడం ఎంతో మంచిది. ఉదయం చేసే బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశె, పూరీ, చపాతీలాటి వాటికన్నా ఓట్స్ ను తీసుకుంటే మంచిది. ఇది గుండె జబ్బులతో సమర్థవంతంగా పోరాడడమే కాకుండా, అధికబరువును తగ్గిస్తుంది. దీనిలో ఫ్యాటీ ఫైబర్ జీర్ణప్రక్రియను ఎక్కువ చేస్తుంది.

పొట్టతో సహా..చిరుబొజ్జను కరిగించే కొన్ని నియమాలు!

పెరుగు: బరువును కంట్రోల్ చేయడంలో, తగ్గించడంలో పెరుగు అద్భుతంగా సహాయం చేస్తుంది. లోఫ్యాట్ పెరుగు కంటే గ్రీక్ పెరుగు చాలా ఉపయోగకరం. గ్రీక్ పెరుగులో లోక్యాలరీలు కలిగి, విటమిన్స్, మరియు న్యూట్రిషియన్స్ అధికంగా ఉంటాయి. అంతే కాదు పెరుగు రెగ్యులర్ గా తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. పెరుగును చిలికి వెన్న తీసిన మజ్జిగను త్రాగడం వల్ల గ్యాస్ సమస్య, మలబద్దకం సమస్యలను నివారించుకోవచ్చు.

పొట్టతో సహా..చిరుబొజ్జను కరిగించే కొన్ని నియమాలు!

నీరు: నీళ్ళు బాగా తాగాలి. రోజుకు నాలుగు లీటర్లకు తక్కువ కాకుండా తాగితే మంచిది. ఎక్కువ నీళ్ళు తాగి, తరచుగా యూరిన్ పాస్ చేయడంవల్ల శరీరంలో చోటు చేసుకున్న మలినాలు చాలావరకూ వెళ్ళిపోతాయి.

పొట్టతో సహా..చిరుబొజ్జను కరిగించే కొన్ని నియమాలు!

మెంతులు: ఒక చెంచా మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆ నీటిని వేడి చేసి లేదా వేడినీళ్ళలో కలుపుకొని పరగడుపున త్రాగాలి. ఈ గింజల్ని తినడం వల్ల పొట్ట శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియ నిదానంగా పనిచేస్తుంది. అందువల్ల శరీరంలో నిల్వ ఉన్న అధిక క్రొవ్వును కరిగిస్తుంది.

పొట్టతో సహా..చిరుబొజ్జను కరిగించే కొన్ని నియమాలు!

వీట్ గ్రాస్/గోధుమ గడ్డి: బరువు తగ్గించడానికి: గోధుమ గడ్డి పెంపకం ఖర్చుతో కూడిన పని కాదు. కొవ్వు శాతాన్ని కరిగించి అధిక బరు వును, పొట్టను తగ్గిస్తుంది. ఇది శరీరంలోని మెటబాలిజంను సరిచేస్తుంది.

పొట్టతో సహా..చిరుబొజ్జను కరిగించే కొన్ని నియమాలు!

గ్రీన్ టీ: గ్రీన్ టీ ఆరోగ్యానికే కాకుండా అందంగా ఉంచడానికి దోహదం చేస్తుందని నిపుణలు అంటున్నారు. ముఖ్యంగా స్త్రీలు గ్రీన్ టీ తాగడం వలన బోలెడు లాభాలు పొందవచ్చు. రోజుకు రెండు లేదా మూడు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణప్రక్రియ వేగవంతం అవుతుంది. నేటి రోజుల్లో బరువు తగ్గటానికి చాలామంది గ్రీన్ టీ తాగుతూనే వున్నారు. గ్రీన్ టీలో యాంటి ఆక్సిడెంట్లు బాగా వుంటాయి. ప్రతిరోజూ రెండు కప్పుల గ్రీన్‌ టీ తాగితే శరీరంలో అదనపు కేలరీలు ఖర్చయి ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది.

పొట్టతో సహా..చిరుబొజ్జను కరిగించే కొన్ని నియమాలు!

సొరకాయ: సొరకాయలో అతి తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల ఈ వెజిటేబుల్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈ సొరకాయలో ఫైబర్ మరియు నీరు శాతం అధికంగా ఉన్నది. ఈ సొరకాయ జ్యూసును ఉదాయాన్నే పరకడుపు త్రాగడం వల్ల అధిక ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ పొట్టదగ్గర పేరుకొన్న క్రొవ్వును కరిగించడానికి బాగా సహాయపడుతుంది.

పొట్టతో సహా..చిరుబొజ్జను కరిగించే కొన్ని నియమాలు!

బూడిద గుమ్మడి కాయ: బూడిద గుమ్మడి కాయ అధిక బరువు కలిగి ఉంటుంది. అయితే ఇందులో బరువుకు తగ్గ అనేక పోషకాంశాలు మరియు ఔషధ గుణాలు ఉన్నాయి. గుమ్మడిగింజల్లో మరి గుమ్మడి గుజ్జలో ఆరోగ్యానికి అవసరం అయ్యే అనే లక్షణాలున్నాయి. బూడిద గుమ్మడికాయను తినడం వల్ల కడుపు నిండునట్లు అనిపించడమే కాదు, శరీరంలోని నీటి శాతం సమతుల్యంగా ఉంచడానికి సహాపడుతుంది.

పొట్టతో సహా..చిరుబొజ్జను కరిగించే కొన్ని నియమాలు!

ఆపిల్ సైడర్ వెనిగర్: ఒకటి లేదా రెండు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ ను 15 రోజుల పాటు త్రాగడం వల్ల, శరీర బరువు తగ్గముఖం పడుతుంది. ఇందులో ఉండే ఎసిటిక్ యాసిడ్ శరీరంలోని క్రొవ్వును తగ్గించడానికి సహాయపుడుతుంది.

పొట్టతో సహా..చిరుబొజ్జను కరిగించే కొన్ని నియమాలు!

వ్యాయామం: ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తే దాన్ని మించిన ఆరోగ్య రహస్యం ఇంకొకటి లేదు. సైకిల్ తొక్కడం చాలా మంచి వ్యాయామం. దీన్ని నుండి అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ప్రతి రోజూ అరగంట పాటు సైకిల్ తొక్కడం లేదా వ్యాయం చేయడం వల్ల శరీర బరువు తగ్గడమే కాదు, శరీరంలోని కండరాలు బలపడుతాయి. అతి త్వరగా పొట్టతగ్గించదలకు కుంటే సిట్ అప్స్ చేయడం ఆరోగ్యకరం.

పొట్టతో సహా..చిరుబొజ్జను కరిగించే కొన్ని నియమాలు!

కూర్చొనే పొజిషన్ : ఇప్పుడంతా కంప్యూటర్ ముందు కూర్చొని చేసే పనులు చాలా ఎక్కువ. ఒకే చోట అలా కూర్చొని చేయడం వల్ల పొట్ట ముందుకు పొడుచుకొని వస్తుంది. అందువల్ల కూర్చొన పొజిషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి. సమయం దొరికినప్పుడు పెద్దగా శ్వాసతీసి వదలడం వంటి చిన్న చిన్న వ్యాయామాలు ఆఫీసులో చేయవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరం ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.

పొట్టతో సహా..చిరుబొజ్జను కరిగించే కొన్ని నియమాలు!

అల్లం: అల్లం: చిన్న ముక్క వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అల్లం వల్ల తగ్గే జలుబు, దగ్గు, పక్కన పెడితే అల్లం ట్రైగ్టిజరైడ్ మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ నిర్ధిష్టంగా ఉంచి గుండెకు, శరీర ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్తను మెరుగుపరుస్తుంది. కాబట్టి బరువు తగ్గించే సూపర్ ఫుడ్స్ లో ఒకటిగా దీన్ని తీసుకోవచ్చు.

పొట్టతో సహా..చిరుబొజ్జను కరిగించే కొన్ని నియమాలు!

ఆరెంజ్: ఇది అద్భుతమైన ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్. ఈ సీజన్ లో ఎక్కువగా దొరికే ఈ పండ్లతో మీ బరువును సాద్యమైనంత వరకూ తగ్గించుకోవండి. వీటిలో లోక్యాలరీస్ తో పాటు సిట్రస్ యాసిడ్స్ కొవ్వును కరిగించడానికి బాగా సహాపడుతాయి.

English summary

15 Rules to Reduce Belly Fat | పొట్టతో సహా..చిరుబొజ్జను కరిగించే కొన్ని నియమాలు!

Fat is essential for the body functioning and bone lubrication, so the best ways to maintain slim and get rid of the excess fat is by including a certain herbs in the diet that can actually aid weight loss.
Story first published: Wednesday, March 13, 2013, 15:59 [IST]
Desktop Bottom Promotion