For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్లిమ్ అండ్ ఫిట్ బాడీ కోసం క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ..

|

సాధారణంగా మనశరీరంలో జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలంటే అందుకు వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు ఎంతో అవసరంస అందులో మన శరీరానికి అవసరమైన అతిముఖ్యమైన ఖనిజం కాల్షియం. ఎముకల పటిష్టత, దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి కాల్షియంపై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా కండర సంకోచవ్యాకోచాలకి కాల్షియం అవసరం. ఎండుకంటే కండరాల కదలికలపైనే మిగిలిన అవయవ కదలికలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి. సాధారణంగా మహిళల రుతుస్రావం(మెన్సస్‌) సమయంలో వచ్చే అనేక రుగ్మతలను కాల్షియం తగ్గించగలదు. ఎముకలలో కాల్షియం పరిమాణం తగ్గితే ఎముకల బలం తగ్గుతుంది. అనేక రకాల నొప్పులకు ఇది దారితీస్తుంది. ఆస్టియో పోరోసిస్‌ కు దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి. కాల్షియం తక్కువైతే హైబి.పి కి దారితీస్తుంది. పెద్దవారిలో మాదిరే పిల్లల ఎదుగుదల సక్రమంగా జరగాలంటే కాల్షియం తగినంత పరిమాణంలో తీసుకోవాలి. గర్భవతులకు కాల్షియం టాబ్లెట్స్‌ రూపంలో ఇస్తుంటారు. అందువల్ల మనం తినే ఆహారంలో కాల్షియం బాగా లభించే పదార్థాలు సమకూర్చుకోవాలి.

కాల్షియం లోపం కారణంగా వచ్చే సమస్యలు: మానవ లేదా జీవుల శరీరంలో కాల్షియం లోపం వల్ల సమస్యలు ఎదుర్కొనే వారిని, మన పరిసర ప్రాంతాల్లోనే చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎముకుల బలహీనత, ఆస్టియోఫొరోసిస్ ముఖ్యమైంది . చిన్నపిల్లల్లో కనిపించే జాయింట్ పెయిన్స్, మహిళల్లో కనిపించే కీళ్లనొప్పులు, 40 ఏళ్ళు దాటిన వారిలో తరచు కనిపించే ఎముకలు, కండరాల నొప్పులకు కాల్షియం లోపమే కారణం అంటున్నారు వైద్య నిపుణులు కూడా. ఎముకలు క్షీణించడానికి కూడా ప్రధాన కారణం కాల్షియం లోపమే. అందుకే 40 ఏళ్లు దాటిన మహిళలు నిపుణుల సూచన మేరకు కాల్షియం మాత్రలు తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ దరిచేరవు. నిజానికి మనం నిత్య జీవితంతో తీసుకొనే ఆహార పదార్థాల్లో కాల్షియం పుష్కలంగా ఉండే పదార్థాలు అనేకం. చిన్నతనం నుంచీ మనం తీసుకొనే ఆహారంలో ఆ ఆహారపదార్థాలను తగినంతగా తీసుకోగలిగితే ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవచ్చు.

కాల్సియం వంటబట్టాలంటే: రోజుకు కనీసం 1000 నుండి 1300 mg కాల్షియం తీసుకున్నప్పుడే ఆరోగ్యం గా ఉంటారు. కాల్షియం ఎముకల బలానికి, ఎముకల ఆరోగ్యానికి, దంతాల ఆరోగ్యానికీ అవసరము. అయితే కాల్షియం తీసుకుంటున్నంతమాత్రాన ఎముకల బలహీనత రాకుండా ఉండదు. తీసుకునే కాల్షియం వంటబట్టాలంటే సాయంత్రపు ఎండలో వ్యాయామము చేయాలి. కాల్షియం శరీరము గ్రహింఛేందుకు విటమిన్‌ 'D' అవసరము ఇది ఎండలో వ్యాయమము చేయడం ద్వారా వస్తుంది. విటమిన్‌ 'D' లేకుండా కాల్సియం మాత్రలు అదనముగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. కాబట్టి

దీన్ని బట్టి కాల్షియం పురుషుల కంటే కూడా మహిళలకే ఎక్కువగా అవసరం. అ్ందుకు చాలా మంది పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి పాలను, ఇతర డైరీ ప్రొడక్ట్స్ ను ఎక్కుగా తీసుకుంటుంటారు. అయితే శరీరానికి కావల్సినంత కాల్షియం అందాలంటే పాలు ఒక్కటే సరిపోవు. దానికి తోడు కాల్షియం ఉన్నమరొకిన్ని ఆహారాలను కూడా మీ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవాలి. మరి క్యాల్షియం ఎందులో దొరుకుతుందో తెలుసుకొని వాటి ప్రతి రోజూ మన డైయట్ లిస్ట్ లో చేర్చుకొని ఆనందంగా.. ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిస్తాం....

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

పాలు: పాలలో అత్యధికంగా కాల్షియం కలిగి ఉంటుంది. కాబట్టి మహిళలలు ప్రతి రోజూ వారికి కావల్సిన కాల్షియంను గ్రహించాలంటే ఒక రోజుకి కనీసం ఒక గ్లాసు పాలను ఏదైనా ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది.

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

పెరుగు: ఎవరైతే పాలు తాగడానికి ఇష్టం ఉండదో, అటువంటి వారు మజ్జిగ, పెరుగు తీసుకోవచ్చు. పాలలో లాగే పెరుగు, మజ్జిగలో కూడా అంతే మోతాదులో కాల్షియం నిల్వలు ఉంటాయి. పాలలో పంచదార వేయకుండా తీసుకోవాలి.

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

సార్డిన్స్: సీ ఫిష్ లో చాలా ప్రసిద్ది చెందినవి, ఆరోగ్యానికి చాలా మంచివి సార్డిన్స్. ఒక రోజులో మీకు కావల్సిన 33% కాల్షియంను వీటిలో పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వారంలో ఒకసారైనా ఈ సార్డిన్స్ ఫిష్ ను తినడానికి ప్రయత్నించండి..

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

చీజ్: చీజ్ కూడా డైరీ ప్రొడక్టే. ఇది మహిళలకు చాలా మంచిది. పర్మెసెన్ చీజ్ లో అత్యధిక శాతంలో కాల్షియం నిల్వలు ఉంటాయి.

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

డ్రై ఫిగ్(ఎండిన అంజీర): ఫిగ్ (ఎండిన అంజీర) పండ్లును మహిళలు తినడం వల్ల వారికి కావల్సినంత నూట్రీషియన్స్, కాల్షియం, ఐరన్ ను అందిస్తుంది. సాధారణంగా మహిళలు ఈ రెండు రకాల మినిరల్స్ లోపంతో బాధపడుతుంటారు. అంతే కాదు ఇందులో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది.

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

గ్రీన్ లీఫీ వెజిటెబుల్స్: పాలు, పెరుగు పక్కన పెడితే గ్రీన్ లీఫ్ వెజిటెబుల్స్ లో కూడా అధిక శాతంలో కాల్షియం నిల్వ ఉంటుంది, ముఖ్యంగా ఆకుకూరలు, బ్రొకోలీ ఎక్కువ.

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

ఓస్ట్రయిస్: చాల వరకూ అన్ని రకాల సీఫుడ్స్ లోనూ కాల్షియం అధికంగానే ఉంటుంది. అయితే ఓస్ట్రయిస్ ఉన్న కాల్షియం అధికంగా తీసుకొంటే ముఖ్యంగా పురుషులకు (కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతాయి)హాని. అయితే మహిళలు మాత్రం ఈ ఎక్ట్రా కాల్షియంతో ఎంజాయ్ చేయవచ్చు.

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

బాదాం: బాదం ‘విటమిన్ ఇ' చాలా ఫేమస్. ప్రతి యొక్క బాదాం గింజ నుండి 70-80mg కాల్షియం లభిస్తుంది. కాబట్టి ఒక గుప్పెడు బాదాం పప్పులను తినడం వల్ల మీకు కావల్సిన కాల్షియం అందినట్లే.

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

ప్రాన్స్: ప్రాన్స్ లో అధిక శాతంలో కాల్షియం ఉంటుంది. అయితే వీటిని ఎక్కువగా ఉడికించకూడదు. ప్రాన్స్ ను కాల్షియం పొందాలంటే అతి తక్కువ మంట మీద ప్రాన్స్ ఉడికించుకోవాలి.

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

నువ్వులు: సాధారణంగా నువ్వులను మనం వంటల్లో తప్ప విడిగా మనం తినలేం. తినము కూడా. అయితే ఒక చెంచా నువ్వులు తినడం వల్ల మీరు ఒక గ్లాసు పాలు తాగితే లభించేటంత కాల్షియం ఇందులో లభిస్తుంది.

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

బ్రాజిల్ నట్స్: 6బ్రాజిల్ నట్స్ తింటే చాలు అది మీకు 45MGకాల్షియంను అంధిస్తుంది. ఈ ఆరోగ్యకరమైన నట్స్ లో ప్రోటీనులు కూడా అధికంగా ఉంటాయి.

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

హెరింగ్: హెరింగ్స్ అనేవి సీ ఫిష్ శరీరానికి కావల్సిన కాల్షియాన్ని అధించడంలో జరగాల్సిన జీవక్రియలను వీటి ద్వారానే జరుగుతాయి. శరీరానికి డి విటమిన్ అందించాలన్నా కూడా ఈ హెరింగ్ తీసుకుంటే సరిపోతుంది.

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

డ్రైడ్ హెర్బ్స్: వివిధ రకాల మూలికలు, థైమ్, రోస్ మెర్రీ, మరియు డిల్ వంటి వాటిలో అధికంగా కాల్షియం కలిగి ఉంటుంది. మనకు మూలికలు ఫ్రెష్ గా దొరకవు. ఎండువు తీసుకొని నిల్వ చేసుకొని సూపులు, కర్రీస్ లో వాడుకోవచ్చు.

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

టోఫు: కాటేజ్ చీజ్ కు బదులుగా ఈ సోయాబీన్స్ తో తయారు చేసే చీజ్ లాంటి పదార్థాన్ని టోఫు అంటారు. ఇందులో కూడా కాల్షియం శాతం ఎక్కువే.

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

ఆరెంజ్: ఆరెంజ్ లో అత్యధిక విటమిన్ సి తో పాటు శరీరానికి కావల్సిన కాల్షియం కూడా ఇందులో లభిస్తుంది.

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

సాల్మన్: సాల్మన్ కూడా సీ ఫిషే. ఇందులో ఉండే మినిరల్స్ సెలైన్ వాటర్ లో కరిగి, కలిసిపోతాయి. కాబట్టి సాల్మన్ ఫిష్ ను తరచూ మీ ఆహారంతో పాటు తీసుకోండి.

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

సోయా పాలు: సాధారణ ఆవు పాలతో పోల్చితే సోయా మిల్క్ లో కాల్షియం అధికంగా లేకున్నా, కానీ 300mg కాల్షియాన్ని ఇది అంధిస్తుంది.

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

ఓట్ మీల్: ఓట్ మీల్ గుండె ఆరోగ్యాని, మరియు శరీరానికి కావల్సిన ఫైబర్ ను ఎక్కువగా అంధించడానికి ఇది చాలా సహయాపడుతుంది. అంతే కాదు ఇది కొంత వరకూ కాల్షియాన్ని కూడా శరీరానికి అందిస్తుంది. ఇది మహిళలకు ఫర్ ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పవచ్చు.

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

అరుగుల(Arugula): అరుగుల గ్రీన్ వెజిటేబుల్స్ సంబంధించిన ఒక స్పెషల్ ఆకుకూర. దీన్ని సాధారణంగా సలాడ్స్ లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇది మీకు కావల్సిన కాల్షియం అంధిస్తుంది కాబట్టి దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవచ్చ.

మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

వైట్ బీన్స్: ఇది కాల్షియం ఉన్న ఆహారాల్లో అంతే ప్రత్యేకమైనది కాకపోయినా, ఒక కప్పు వైట్ బీన్స్ తినడం వల్ల 100mg కాల్షియం శరీరానికి అందుతుంది.

English summary

20 Calcium Rich Foods For Women | మహిళల శరీర-సౌందర్య పటిష్టతకు కాల్షియం..

It is very important for us to have a certain amount of calcium in our diet. Calcium is required to keep bones healthy and also formation of blood cells. Have you noticed that many people have joint pain and brittle bones these days. That is because we do not make a conscious effort to include calcium rich foods in your meals. We mostly eat whatever is available and thus, the calcium in our diet gets depleted.
Desktop Bottom Promotion