For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్కింగ్ ఉమెన్స్ కు తక్షణ శక్తినిచ్చే 20 ఎనర్జిటిక్ ఫుడ్స్

|

పనిచేసే ఉద్యోగస్తులు తగినంత శక్తి, సామర్థ్యాలు కలిగి ఉండాలి. లేదంటే చేసే పనిలో శ్రద్ధ చూపలేరు. నిస్సత్తువ, అలసటతో మనస్సు మారుతుంది. దాంతే చేసే పనిలో ఏకాగ్రత లోపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలకు మద్యహ్నాం మూడు గంటలైయ్యే సరికి ఎనర్జీ లెవల్స్ తగ్గిపోవడం గమనించవచ్చు. మహిళలు, ఇంటి పనులు పిల్లలు, వంటచేయడం, బిల్స్ కట్టడం, వర్కౌట్స్ తో పాటు ఆఫీస్ పనులు, డెడ్ లైన్స్ అన్నింటితో సతమతమౌతుంటారు. ఆఫీ ముగిసిన తర్వాతన్నా విశ్రాంతి తీసుకుందామంటే అప్పుడు కూడా కుదరదు. అదే వారిలో పూర్తి ఎనర్జీ లెవల్స్ తగ్గిపోవడానికి ప్రధానకారణంగా గుర్తించవచ్చు.

అటువంటి మహిళల యొక్క ఎనర్జీ లెవల్స్ పెంచడానికి కొన్ని సీక్రెట్ ఫుడ్స్ ఉన్నాయి. అయితే ఎనర్జీకోసం తినాలనుకొన్నప్పుడు, మీరు తీసుకొనే ప్రక్రియ గురించి చాలా జాగ్రత్తగా మరియు స్మార్ట్ గా ఉండాలి. మీరు తినే ఆహఆరంలో మీరు కనుక సరైన స్ట్రాటజీని పాటించినట్లైతే, మీరు తప్పకుండా అలసట నుండి బయటపడవచ్చు. అయితే చాలా మంది మహిళలు ఏది త్వరగా సులభంగా తయారవుతాయో ఉదా: దోసె, చాక్లెట్ మరియు ఇతర షుగర్ కంటెంట్ ఉన్న ఆహారాలమీద ఎక్కు ఆసక్తి కనబరుస్తారు. అయితే ఇది చాలా చెడు అలవాటు. ఎందుకంటే, ఇవి తాత్కాలిక శక్తిని మాత్రమే అందించగలవు. దాంతో కొంత సమయం తర్వాత తిరిగా అదే ఫీలింగ్ ను, అలసటను పొందుతారు.

ఇలా జరగడానికి కారణం,శక్తి కోసం తీసుకొన్న ఆహారాలు శరీరంలో బ్లడ్ షుగర్ లేదా గ్లూకోజ్ గా మారుస్తాయి. త్వరగా అత్యంత సులభంగా ఎనర్జీగా మారే కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం ఉత్తమ ఎంపిక అనిపించవచ్చు. అయితే, షుగర్ వంటి సాధారణ కారబోహైడ్రేట్లు మాత్రమే వేగంగా శక్తిగా మారుస్తుంది. అయితే ఇది మీ రక్తంలోని చక్కెర స్థాయిలను క్రాష్ చేస్తుంది. కాబట్టి, మహిళలు రోజంతా ఎనర్జీని పొందాలంటే కొన్ని ఇక్కడ కొన్ని ఎనర్జీ ఫుడ్స్ ను అంధిస్తున్నాం..వాటిని తిని రోజంత తగినంత ఎనర్జీతో సంతోషంగా, ఉత్సాహం గడపండి..

గుడ్లు:

గుడ్లు:

గుడ్లలో ప్రోటీనులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వెజిటేరియన్స్ కు అవసరం అయ్యే ప్రోటీను ఇందులో పుష్కలం. మాంసాహారంలో ఉండే ప్రోటీనులు, బి విటమిన్స్ మరియు ఐరన్ కంటే గుడ్లలో అధికంగా ఉంటుంది. మహిళలు గుడ్డును బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల ఆ రోజంతా వారికి కావల్సిన ఎనర్జీని పొందగలరు.

గ్రీన్ లీఫ్:

గ్రీన్ లీఫ్:

ఆకుకూరలు కాలె, పాలకూర, మెంతి కూర వంటి వాటిలో విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి . మహిళల ఎనర్జీకి చాలా అవసరం అయ్యే విటమిన్ ఎ మరియు విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా మహిళల్లో డిప్రెషన్ ను దూరం చేసే ఫ్లొల్లెట్ అనే కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది.

అరటి పండ్లు:

అరటి పండ్లు:

అరటి పండ్లలో అధిక శాతంలో పొటాషియం మరియు బి విటమిన్స్ కలిగి ఉండటం వల్ల అరటిపండ్లు జీర్ణవ్యవస్థను నిదానం చేస్తుంది మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతుంది.

సాల్మన్:

సాల్మన్:

సాల్మన్ చేపలు రెండు గ్రాములు తీసుకోవడం వల్ల వాటి వల్ల ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా అందుతాయి. ఈ ప్యాటీ యాసిడ్స్ ఇన్సులిన్ ను నియంత్రిస్తుంది మరియు హెల్తీ బ్రెయిన్ ఫంక్షన్స్ కు సహాయపడుతుంది. మరియు ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, కీళ్ళనొప్పులు, కండరాల బలహీనతను తగ్గించడానికి బాగా సహాయపడుతాయి.

అల్లం టీ:

అల్లం టీ:

అల్లం టీలో యాంటీయాక్సిడెంట్స్ మరియు న్యూట్రీషియన్స్ పుష్కలం ఉండటం వల్ల మద్యహ్నా ఎనర్జీని పుష్కలంగా అంధిస్తుంది.

కర్రీ:

కర్రీ:

స్పైసీ కర్రీస్. కూరల్లో మసాలాలు అంటే పసును, చెక్క మరియు జీలకర్ర వంటి వాటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎనర్జీలెవల్స్ ను పెరుగుతాయి. కూరల్లోని యాంటీయాక్సిడెంట్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను సాధారణం చేస్తాయి మరియు రక్త ప్రసరణను ప్రోత్సహితస్తాయి. దాంతో ఎనర్జీ స్థాయి పెరుగుతుంది.

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది మరియు మనల్ని శక్తివంతంగా ఉంచుతుంది.

నట్స్:

నట్స్:

మన శరీరంలోని కణజాలాలకు అవసరం అయ్యే శక్తిని అంధించడానికి నట్స్ లో అనేక ఎంజైములు ఉన్నాయి. కాబట్టి, రోజులో కాస్త అలసట అనిపించినప్పుడు ఈ నట్స్ ను స్నాక్స్ గా తీసుకోవడం చాలా ఉపయోగకరం. తక్షణ శక్తిని అంధిస్తాయి. అలసటను దూరం చేస్తాయి. మనస్సును ఉత్తేజపరుస్తాయి.

బ్రాన్ ఫ్లేక్స్:

బ్రాన్ ఫ్లేక్స్:

బ్రాన్ ఫ్లేక్స్ బ్రేక్ ఫాస్ట్ కొరుకు చాలా అద్భుతమైన ఎంపిక. వీటిలో ఎనర్జీని ఉత్పత్తి చేసే విటమిన్ బి , ఐరన్ మరియు మెగ్నీషియంతో నిండి ఉంటుంది . బ్రాన్ ఫ్లేక్స్ లో ఇంకా ఫైబర్ ఫుష్కలంగా ఉండటం వల్ల ఇది కడుపు ఫుల్ గా ఉండేలా చేస్తుంది. మరియు త్వరగా ఆకలి అనిపించదు. దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి.

నీళ్ళు:

నీళ్ళు:

రోజూ తగినన్ని నీళ్ళు తీసుకోవడం వల్ల శరీరంలో కణజాలాలన్నీ ఉత్తేజింపబడి, జీవక్రియలు సక్రమంగా పనిచేయడంతో శరీరం హైడ్రేషన్ చెందు పనిచేసే స్థాయిని పెంచుతుంది . కాబట్టి మీ దినచర్యను ఒక గ్లాసు నీటితో ప్రారంభించి, రోజుకు కనీసం 8గ్లాసుల నీళ్ళు తాగేలా నిర్ధారించుకోండి. తగినన్ని నీళ్ళు తాగడం వల్ల అలసటకు కారణం అయ్యే డీహైడ్రేషన్ నుండి ఉపశమనం పొందవచ్చు.

క్వీనా:

క్వీనా:

క్వీనౌ తినడం వల్ల వర్కింగ్ ఉమెన్స్ శక్తివంతంగా ఉండగలరు. అంతే కాదు కడుపు నిండుగా కూడా అనిపిస్తుంది. క్వీనౌ కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్ మరియు ప్రోటీనులు వంటి అధిక పోషకాంశాలుండే చిరు ధాన్యం.

డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్ లో ఐరన్ మరియు మెగ్నీషయం అద్భుతంగా నిల్వ ఉంది. ఎనర్జీ స్థాయిలను పెంచడానికి ఇది గొప్పగా సహాయపడుతుంది.

కొబ్బరి:

కొబ్బరి:

మీ వంటకాల్లో కుకింగ్ ఆయిల్ కు బదులు కొబ్బరి నూనెను వాడటం ప్రారంభించండి. కొబ్బరి నూనెలో ఉండే మంచి కొవ్వులు ఎనర్జీగా మార్చబడుతాయి మరియు ఎక్కువ ప్రభావన్ని చూపెడుతాయి. మరియు రోజంతా ఎనర్జీతో ఉండటానికి, ఆకలి కలిగనియ్యకుండా ఎండటానికి బాగా సహాయపడుతుంది.

పప్పులు:

పప్పులు:

పప్పులు అంటే శెనగపప్పు, కిడ్నీ బీన్స్ వంటివి తీసుకోవడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతాయి. వీటని భోజనంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధ్యహ్నాన ఆకలిని నిరోధిస్తుంది.

బ్రౌన్ రైస్:

బ్రౌన్ రైస్:

బ్రౌన్ రైస్ లో ఫైబర్, బి విటమిన్స్ మరియు ఐరన్ వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఎనర్జీగా ఉండేందకు బాగా సహాయపడుతాయి.

పెరుగు:

పెరుగు:

పెరుగు ఎనర్జీ బూస్టింగ్ స్నాక్ గా చెబుతారు. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణిక్రియకు అద్భుతంగా సహాయపడుతాయి. ఇవి నిస్సత్తువు కలిగి వ్యాధినిరోధక క్రియతో పోరాడి ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది.

లీన్ మీట్:

లీన్ మీట్:

లీన్ మీట్ అలసటను తగ్గించడంలో బాగా సహాయపడుతాయి. ఎందుకంటే వీటిలో ఐరన్, బివిటమిన్స్ మరియు ప్రోటీన్స్ పుష్కలంగా ఉండి కండర శక్తిని పెంపొందిస్థాయి.

ఆపిల్స్:

ఆపిల్స్:

ఆపిల్స్ లో ఫైబర్, విటమిన్ సి మరియు యాంటీయాక్సిడెంట్స్ తో పుష్కలంగా ఉండటం వల్ల ఎక్కువ ఎనర్జీని అంధిస్తాయి. వీటిలో ఇంకా ఫ్రక్టోస్ అనే అంశం ఉండే అతి త్వరగా శక్తిగా మార్పు చెందుతుంది.

గుమ్మడి:

గుమ్మడి:

గుమ్మడి గింజల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉండి కండర నిర్మాణం, కండర శక్తికి బాగా సహాయపడుతాయి. విటమిన్స్ మరియు హెల్తీ ఫ్యాట్, మెగ్నీషియం వంటివి ఎనర్జీని పెంపొందిస్థాయి.

పుచ్చకాయ:

పుచ్చకాయ:

పచ్చకాయ తినడం వల్ల మన శరీరానికి హైడ్రేషన్ మాత్రమే కలిగించడం కాదు. పుచ్చకాయలో ఉండే అధిక శాతం నీరు, తగినంత హైడ్రేషన్ తో పాటు ఎనర్జీని అంధించే బి విటమిన్స్, పొటాషియం మరియు ఫ్రక్టోస్ పుష్కలంగా ఉంటుంది.

English summary

20 Energy Foods For Working Women

Most women usually find their energy levels slowing down around 3'o clock in the afternoon. They usually have to juggle work with picking up the kids, cooking, walk the dog, pay the bills, getting a workout and meeting the deadlines.
Desktop Bottom Promotion