For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్లిమ్ బాడీ మెయింటైన్ చేయడానికి 25 టాప్ పుడ్స్

|

ప్రస్తుత జనరేషన్ లో చాలా మంది యువత తమ శరీర సౌష్టం కోసమని జిమ్ లు, ఫిట్ నెస్ సెంటర్లు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సుందరమైన శరీర సౌష్టం పొందడానికి, ఆకర్షణీయంగా కనబడటానికి వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఫలితం కనిపించినా, తర్వాత తర్వాత తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటారు. దాంతో ఒక్కోక్కో సారి విసిగు చెంది, అసలు డైయట్ చేయడమే మానేస్తారు. కాబట్టి కృత్రిమంగా కాకుండా సహజంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే తప్పకుండా శాశ్వత పరిష్కారం ఉంటుంది. దాంతో అధిక బరువును తగ్గించుకోవడం ద్వారా సౌందర్యం మాత్రమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు.

బరువు తగ్గడానికి బేసిక్ అండ్ క్విక్ వెయిట్ లాస్ టిప్స్: క్లిక్ చేయండి

బరువు తగ్గాలంటూ ఆహారం తినకుండా పస్తులుంటున్నారా? అసలు ఆహారం మానేయటం కన్నా... సరైన ఆహారం తీసుకునేందుకు ప్రయత్నించండి. మరి మీ కొరకు మేము 25 రకాల ఆహారాలను ఎంపిక చేశాము. వీటిని మీ జాబితాలో పై వరుసలో పెట్టండి. ఈ ఆహారాలు మీకు తగిన పోషకాలను అందించటమే కాదు, మీ పొట్ట కొవ్వు గణనీయంగా తగ్గేలా చేస్తాయి.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

ఆలివ్ నూనె - ఈ నూనెతో చేసే వంటకాలు ఎంతో ఆరోగ్యం. మంచి కొలెస్టరాల్ పెంచుతాయి. కడుపు నింపి అధిక ఆకలి కాకుండా చేస్తాయి.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

ఆపిల్స్ - ఆపిల్స్ లో కేలరీలు తక్కువ. పీచు అధికం. తిన్నది బాగా జీర్ణం చేస్తుంది. దీనిలోని పెక్టిన్ మీకు కడుపు నిండినట్లు భావించేలా చేస్తుంది.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

టమాటాలు - విటమిన్ సి టమాటాలలో అధికం. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కేలరీలు తక్కువ. సూప్, సలాడ్, పప్పు లేదా పండుగా కూడా తినేయవచ్చు. కేన్సర్, గుండెజబ్బులను నివారిస్తాయి. చర్మం మెరిసేలా చేస్తాయి.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

కొబ్బరి - కొబ్బరి కడుపు నింపుతుంది. ఆరోగ్యకర కొవ్వును ఇస్తుంది. పోషకాలు అధికం.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

నిమ్మకాయ - దీనిలో విటమిన్ సి అధికం. మీ జీవప్రక్రియ పెంచుతుంది. స్లిమ్ గా ఉంచుతుంది. ఎసిడిటీ తగ్గించి మొండి రోగాలను దూరం చేస్తుంది.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

వాల్ నట్స్ - దీనిని బ్రెయిన్ ఫుడ్ అంటారు. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఆరోగ్యకరమైన చిరుతిండి. కడుపు నింపుతుంది.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

మొలకెత్తిన విత్తనాలు - పెసలు, శనగలు, వేరు శనగ పప్పులు, అలచందలవంటివి నానపోసి మొలకలు వచ్చిన తర్వాత తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని శక్తి గుళికలు అంటారు. కడుపు నింపుతాయి. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు, విటమిన్లు సమకూరుతాయి.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

ద్రాక్ష - ప్రతిరోజు కొద్దిగా తింటే చాలు వీటిలో కావలసినంత ఫైబర్, నీరు ఉండి కడుపు నింపేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికం వయసు కనపడనీయకుండా చేస్తాయి.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

పెరుగు - పెరుగులో మంచి కాల్షియం, ప్రొటీన్లు ఉంటాయి. కొవ్వు కరిగిస్తుంది. మేలు చేసే బాక్టీరియా మీ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

కేరెట్లు - కార్బో హైడ్రేట్లు అధికంగా ఉండి త్వరగా ఆకలినిస్తాయి. పీచు, విటమిన్ ఎ మరియు బి కాంప్లెక్స్ అధికం. ఇవి సాఫీగా విరోచనం చేస్తాయి.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

అరటి పండ్లు - నీటి శాతం అధికం. పీచు ఉంటుంది. కడుపు నింపుతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. మూడ్ మంచిగా ఉండేలా చేస్తాయి.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

కివి పండ్లు - కడుపు నింపుతాయి. పీచు అధికం. కేలరీలు తక్కువ, గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

ఓట్స్ - ఆరోగ్యకర చిరుతిండి. పీచు అధికం, కడుపు నింపుతాయి. పోషకాలు వంటికి పట్టేలా చేస్తాయి.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

చిలకడ దుంప - గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ కనుక డయాబెటిక్ రోగులు కూడా తినవచ్చు. పీచు బాగా ఉండి ఆకలి తీరుస్తుంది.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

బీట్ రూట్ - పీచు అధికం, ఆరోగ్యకర షుగర్ వుండి ఆకలి తీరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

అవిసె గింజలు - వీటిని సలాడ్లపై చల్లుకు తినవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. కొల్లెస్టరాల్ అదుపులో ఉంచి జీర్ణక్రియ పెంచుతాయి.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

చేపలు - చేపలను గుండె ఆహారంగా చెపుతారు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండి ఎంతో మేలు చేస్తాయి. కొవ్వు కరిగిస్తాయి.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

ఆరెంజస్ - విటమిన్ సి బాగా ఉంటుంది. వింటర్ జలుబులు అరికడతాయి. తక్కువ కేలరీలు. తీపి కోరిక తగ్గిస్తాయి.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

గుడ్లు - ప్రొటీన్లు అధికం. ఎమినో యాసిడ్లు బరువు తగ్గించేస్తాయి. బ్లడ్ షుగర్ స్ధిరీకరించబడుతుంది. ఊబకాయం ఏర్పడకుండా చేస్తాయి.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

గ్రీన్ టీ - గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. కొవ్వును కరిగించి మెటబాలిజం అధికం చేస్తుంది. రోజూ ఒకటి లేదా రెండు కప్పులు తాగితే చెడు కొల్లెస్టరాల్ స్ధాయిలు తగ్గిస్తుంది.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

ఆకు కూరలు - కేలరీలు తక్కువ, పీచు ఎక్కువ, గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ కనుక డయాబెటిక్ రోగులు కూడా తినవచ్చు. కడుపు నింపుతాయి. రక్తాన్ని శుభ్ర పరుస్తాయి.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

రేగుపండు - వీటిలో పెక్టిన్ ఫైబర్ ఉంటుంది బ్లడ్ షుగర్ తగ్గిస్తాయి. బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. కొవ్వు కణాలను లిమిట్ చేస్తాయి.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

గోంగూర - గోంగూరలో పీచు, ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు గోంగూర లో 35 కేలరీలు ఉంటాయి. పప్పులు, పులుసు, సలాడ్ అన్ని చేసుకోవచ్చు.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

బ్రక్కోలి - బ్రక్కోలిలో విటమిన్ ఎ మరియు సి మరియు కాల్షియం కూడా ఉంటాయి. వీటితో సూప్ సలాడ్ వంటివి చేసుకోవచ్చు. కేలరీలు తక్కువ.

25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

కాటేజ్ ఛీజ్ - ప్రొటీన్లు అధికం. కాల్షియం బాగా ఉంటుంది. ఈ కాల్షియం కొవ్వును కరిగించి మీరు స్లిమ్ గా ఉండేలా చేస్తుంది. ఈ రకమైన ఆహారాలు తింటూ ప్రతిరోజూ ఒక గంట వ్యాయామం చేస్తూంటే, మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది అంటారు ఎంతో అనుభవంకల పోషకాహార నిపుణులు.

English summary

25 Foods for a Slimmer Body | 25 ఫ్యాట్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ ఫర్ స్లిమ్ బాడీ

Yes, the hours you spend in the gym are important: they're directly proportionate to the inches on your waist. But on their own, they're not enough to get you that washboard stomach. You also need to change your diet.
Desktop Bottom Promotion