For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డైటింగ్ చేయకుండానే బరువు తగ్గించే సులభ చిట్కాలు

By Lekhaka
|

బరువు తగ్గాలనుకొనే వారికి డైట్ పాటించకుండానే, బరువు తగ్గించే అద్భుత చిట్కాలు ఇక్కడున్నాయి. బరువు తగ్గడానికి అనేక మార్గాలున్నాయి. అనేక డైట్ టిప్స్ ఉన్నాయి. వీటి వల్ల కొన్ని పౌండ్ల బరువు తగ్గవచ్చు . బరువు తగ్గడానికి అనేక వ్యాయామాలు, ఆహార నియమాలు పాటించి ఉంటారు. కానీ, మీరు చేసే వ్యాయామం కానీ, తీసుకొనే ఆహారం కానీ , మీరు బరువు తగ్గడానికి ఏవి సరిగా పనిచేస్తాయి?అని తెలుసుకోవడం చలా అవసరం. బరువును శాశ్వతంగా తగ్గించుకోవడం కోసం మీ డైట్ లో ఎటువంటి మార్పలు లేకుండానే కొన్ని వారాల పాటు మీ జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల కొన్ని పౌండ్ల బరువు తగ్గవచ్చని సూచిస్తున్నారు.

ఒక పౌండ్ ఫ్యాట్ , 3500క్యాలరీలకు సమానం. 500 క్యాలరీలను కరిగించుకోవడం కోసం డైట్ మరియు వ్యాయామంలో మార్పులు చేసుకుంటే ఒక వారంలో ఒక పౌండ్ బరువు తగ్గవచచు. మీరు ప్రస్తుతం ఉన్న బరువును అలాగే మెయింటైన్ చేస్తూ క100క్యాలరీలను తగ్గించుకోవడం, పెద్దవారిలో ప్రతి సవంత్సరం అధనపు 1 లేదా రెండు పౌండ్లు పెరగకుండా చూసుకోవచ్చు.

మరి డైట్ ఫాలో కాకుండా బరువు తగ్గించే చిట్కాలేంటో ఒకసారి చూద్దాం...

ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ తినాలి:

ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ తినాలి:

దినచర్యను బ్రేక్ ఫాస్ట్ తో మొదలు పెట్టాలి. చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల క్యాలరీలను తగ్గించుకోవచ్చని అనుకుంటారు. కానీ ఇలా చేస్తే అధనపు క్యాలరీలు చేరుతాయి. ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ ఆ రోజంతా శరీరానికి కావల్సిన ఎనర్జీని అందిస్తుంది. కాబట్టి ధాన్యంతో తయారుచేసిన సిరిల్స్, పండ్లతో గార్నిష్ చేసి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. శక్తి అందుతుంది.

బాగా నమిలి తినాలి:

బాగా నమిలి తినాలి:

తినడానికి టైం పెట్టుకొని మరీ తినాలి. 20నిముషాలు తినడానికి టైం కేటాయించాలి. తినేటప్పుడు నిదానంగా, బాగా నమిలి తినడం వల్ల శరీరానికి పోషకాలు అందడంతో ఎనర్జీ లభిస్తుంది. ఇది ఎటువంటి డైటరీప్లాన్ లేకుండా బరువుతగ్గడంలో ఒక అద్భుతమైన మార్గం.

ఎక్కువ నిద్ర, బరువు తగ్గడం:

ఎక్కువ నిద్ర, బరువు తగ్గడం:

రాత్రుల్లో లేటుగా కాకుండా, ప్రతి రోజూ ఒక నియమిత సమయానికి పడుకొని రాత్రుల్లో ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల సంవత్సరంలో 14పౌండ్ల బరువుతగ్గవచ్చని మిచిగన్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది . నిద్ర పనిలేకుండా కార్యకలాపాలు, సాధారణ బుద్దిహీన అల్పాహారం, వల్ల మీరు అప్రయత్నంగా 6% కేలరీలను తగ్గించగలదు అని నిరూపించారు.

వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోలి:

వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోలి:

ఒక్క కూరగాయను వండే బదులు, మూడు కూరగాయలు వేసి వండటం మరీ మంచిది. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. విటమిన్లు, పోషకాంశాలతో కూడిన పండ్లు, కూరగాయాలు రెగ్యులర్ గా తినడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు.

సూప్స్:

సూప్స్:

భోజనానికి ముందు సూపులను తాగడం వల్ల మీరు భోజనం చేయడం ఎక్కువగా తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. ఆకలిని కూడా తగ్గిస్తుంది. అయితే, అధిక కొవ్వు, మరియు అధిక క్యాలరీలున్న క్రీమీ సూపులను తీసుకోకూడదు.

మీకు ఇష్టమైన స్కిన్నీ క్లోత్స్:

మీకు ఇష్టమైన స్కిన్నీ క్లోత్స్:

మీకు ఇష్టమైన దుస్తులు, స్కర్ట్స్, లేదా స్మోకిన్ ఒక జత జీన్స్ ను హ్యాంగ్ చేసి ప్రతి రోజూ చూస్తుండేలా ఉంచాలి. దాంతో ప్రతి రోజూ మీరు బరువు తగ్గాలనే లక్ష్యంతో జాగ్రత్తలు తీసుకోవడం బరుతగ్గే అవకాశాలు ఉన్నాయి.

పిజ్జా :

పిజ్జా :

బరువు తగ్గడానికి పిజ్జా తినకూడదని ఎవరూ చెప్పలేదు. అయితే మాంసంతో తయారుచేసిన పిజ్జా కాకుండా వెజిటేబుల్ తో తయారుచేసి పిజ్జా ను ఎంపిక చేసుకోవడం వల్ల అధనపు క్యాలరీలు శరీరానికి చేరకుండా జాగ్రత్త తీసుకోవచ్చు.

షుగర్:

షుగర్:

పంచదారతో తయారుచేసి సోడా లేదా జ్యూస్ బదులు నీళ్ళు లేదా జీరో క్యాలరీ జ్యూసులను ఎక్కువగా తీసుకోవాలి.

పెద్దగా ఉండే, పల్చటి గ్లాస్ ఉపయోగించాలి:

పెద్దగా ఉండే, పల్చటి గ్లాస్ ఉపయోగించాలి:

చిన్న గ్లాస్ బదులు, పెద్ద, పల్చటి గ్లాస్ ను ఉపయోగించాలా డైటింగ్ చేయకుండానే బరువు తగ్గించేందుకు పెద్దగ్లాస్ ఎంపిక చేసుకోవడం వల్ల 25%-30% జ్యూసులు, సోడా, వైన్ లేదా ఇతర పానీయాలు తీసుకోవాలి.

మద్యం మితంగా తీసుకోవాలి:

మద్యం మితంగా తీసుకోవాలి:

ఆల్కహాల్లో అధిక క్యాలరీలున్నాయి. మీరు తీసుకొనే నట్స్, చిప్స్, ఇతర ఫ్యాట్ ఫుడ్స్ ను తగ్గించాలి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

రెగ్యులర్ గా గ్రీన్ టీ తాగడం, బరువు తగ్గించుకోవడంలో ఒక స్ట్రాటజీ ఉంది.

యోగా:

యోగా:

యోగా వల్ల బరువు తగ్గించుకోవచ్చు. యోగా చేయడం వల్ల ఇతరుల కంటే తక్కువ బరువును కలిగి ఉంటారు. యోగా చేసేవారు తప్పని సరిగా గుర్తుంచుకోవల్సినవి తినే ఆహారం. ఉదా: రెస్టారెంట్లో కానీ, లేదా ఇంట్లో కానీ, చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. తక్కువ ఆహారం కడుపు నింపే ఆహారాన్ని తీసుకోవాలి. యోగా వల్ల ఎక్కువ ఆహారం తీసుకోవాలనిపించదు.

ఇంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి:

ఇంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి:

వారంలో కనీసం 5రోజులు ఇంటి ఫుడ్ తప్పనిసరి. ఒక కన్స్యూమర్ రిపోర్ట్ ప్రకారం ఇంటి ఫుడ్ ను తినడం అలవాటు చేసుకోవడం వల్ల బరువు తగ్గించుకోగలిగారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఆలోచించడం కంటే వంటచేయడం చాలా సులభం.

ఈటింగ్ పౌజ్ :

ఈటింగ్ పౌజ్ :

నిరంతరం తినడం కంటే, గ్యాప్ తీసుకొని తినడం అలవాటు చేసుకోవాలి. ఒక్కేసారి మెద్ద మొత్తంలో తినడం కంటే, మూడు నాలుగుసార్లు కొద్దికొద్దిగా తీసుకోవడం వల్ల శరీరానికి తగినన్ని క్యాలరీలు అందుతాయి. ఎక్కువ ఆకలి కలిగించదు. ముఖ్యంగా ఎవరితోనైనా తినేటప్పుడు, టీవీ చూడ్డం, మాట్లాడం వల్ల ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు కాబట్టి, వాటిని తగ్గించాలి.దాంతో మీరు ఎక్కువ తిన్న అనుభూతిని కలుగుతుంది.

. పుదీనా గమ్ ను నమలాలి:

. పుదీనా గమ్ ను నమలాలి:

ఘాటైన వాసన ఉండే షుగర్ లెస్ పుదీనా గమ్ ను నమలడం మంచిది. డిన్నర్ తర్వాత, లేదా సోషియల్ పార్టీ తర్వాత, టీవీ చూసేటప్పుడు లేదా ఇంటర్నెట్ తో పనిచేసేటప్పుడు వీటిని నమలడం వల్ల ఆకలి అనిపించదు. దాంతో మీరు ఎక్కువ స్నాక్స్ తీసుకొనే అవకాశం ఉండదు. ఈ విధంగా బరువు కారణం అయ్యే జంక్ ఫుడ్ ను నివారించవచ్చు.

చిన్న సైజ్ ప్లేటును తీసుకోవాలి:

చిన్న సైజ్ ప్లేటును తీసుకోవాలి:

బరువు తగ్గించాలని, తక్కువగా తినాలనుకొనే వారు 10ఇన్చెస్ ప్లేట్ ను ఎంపిక చేసుకోవడం వల్ల అటోమేటిక్ గా తక్కువ తింటారు.

ట్రిమ్ పోర్షన్:

ట్రిమ్ పోర్షన్:

మీరు ఏమీ చేయకుండానే మీ శరీరం 10-20్ర బరువు తగ్గించుకోవాలని కోరుకునే వారు, తీసుకొనే ఆహారం మొత్తంలో కొంత భాగాన్ని తగ్గించాలి. మరియు చిన్న చిన్న ప్లేట్స్, కప్ప్స్ ను ఉపయోగించాలి. దాంతో ఆహార పదార్థాలను తక్కువ పరిమానంలో తీసుకుంటారు.

తినే ఆహారాలను ఓవర్ గా ఉడికించకూడదు:

తినే ఆహారాలను ఓవర్ గా ఉడికించకూడదు:

తినే ఆహారాలను అధికంగా ఉడికించడంలో వాటిలో ఉండే న్యూట్రీషియన్స్ మరియు ఇతర పోషకాంశాలు కోల్పోవడం జరుగుతుంది. దాంతో మీకు పూర్తి పోషకాంశాలు అందవు. దాంతో మీరు సంత్రుప్తి చెందక జంక్ ఫుడ్ మీద కోరిక కలుగుతుంది. మరియు మీరు తీసుకొనే ఆహారం చాలా వరకూ పచ్చికూరలను సుషి, సలాడ్స్ , గ్రిల్డ్ వెజిటేబుల్స్, గ్రిల్ లేదా బేక్ చేసిన మాంసాహారం, చేపలు వంటివి తినడానికి ప్రయత్నించండి. మైక్రోవేవ్ ను నివారించండి.

భోజనానికి ముందు పండ్లు:

భోజనానికి ముందు పండ్లు:

మీరు తీసుకొనే భోజనానికి అరగంట ముందు పండ్లను తినాలి. దాంతో పండ్లు త్వరగా జీర్ణం అవుతాయి. కాలీ కడుపుతో పండ్లను తినడం వల్ల మీ జీవక్రియలను ప్రక్షాళ చేస్తుంది. బరువు తగ్గడానికి గొప్ప శక్తిని అంధిస్తుంది.

రెడ్ సాస్:

రెడ్ సాస్:

సువాసనలతో కూడిన టమోటోసాస్ వంటివి ఉపయోగించడం వల్ల క్రీమ్ సాస్ లలో కంటే తక్కువ క్యాలరీలు మరియు తక్కువ ఫ్యాట్ కలిగి ఉంటాయి. అయితే తక్కువగా ఉపయోగించాలని గుర్తుపెట్టుకోండి.

తక్కువ మాంసాహారం:

తక్కువ మాంసాహారం:

తరచూ శాఖాహారాన్ని తీసుకోవడం వల్ స్లిమ్ గా మారడానికి అలవాటు పడుతారు. మాంసాహారం కంటే శాఖాహారం బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. బర్గర్, లెంటిల్స్, సూప్స్, మరియు ఇతర టేస్టీ లెగ్యుమ్ జాతీ ఆహారాలు ఫైబర్ తో నిండి ఉంటాయి.

వంద క్యాలరీలన్ కరిగించుకోవడం :

వంద క్యాలరీలన్ కరిగించుకోవడం :

ప్రతి రోజూ వంద క్యాలరీలన్ కరిగించుకోవడం వల్ల సంవత్సరానీకి 10పౌండ్ల బరువును తగ్గించుకోవచ్చు. వీటిలో ఏదో ఒకదాన్ని ప్రయత్నించండి: 1. నడక: 20 నిముషాలు2. గార్డెన్ లో కలుపు తీయడం లేదా పువ్వులు కోయడం 20 నిముషాలు, పచ్చిక కోయడం 20 నిముషాలు, అరగంట పాటు ఇంటిని శుభ్రం చేయడం, పది నిముషాలు జాగింగ్ చేయడం.

రాత్రి ఎనిమిది గంటల తర్వాత తినడం మానేయండి:

రాత్రి ఎనిమిది గంటల తర్వాత తినడం మానేయండి:

రోజులో మీ చివరి భోజనం రాత్రి 8గంటల లోపు తీసుకొనే విధంగా జాగ్రత్త తీసుకోండి. దాంతో మీరు డిన్నర్ సమయంలో స్నాక్స్ తినాలనే కోరిక కలగదు. మీకు ఇది కష్టం అనిపించినప్పుడు, కొద్దిగా హేర్బల్ టీ తీసుకోవడం మంచిది . డిన్నర్ చేసిన తర్వాత బ్రష్ చేయడం మర్చిపోకండి దాంతో మీరు మరేదైనా ఆహారం తినాలనేకోరిక మీలో కలగదు.

ఆహారాన్ని తీసుకోవడం దినచర్యలో ఒక భాగం చేసుకోండి:

ఆహారాన్ని తీసుకోవడం దినచర్యలో ఒక భాగం చేసుకోండి:

ప్రతి రోజూ మీరు ఏం తినాలనుకుంటున్నారో, తింటున్నారు గమనించుకోవాలి. దాంతో మీరు ఎంత మొత్తంలో తీసుకుంటున్నారన్న విషయం తెలిసిపోతుంది. దాంతో తీసుకొనే ఆహారాన్ని తగ్గించవచ్చు. లేదా పెంచవచ్చు. ఇలా చేయడం కష్టం అనుకుంటారు కానీ, చాలా సులభం, కొన్ని నిముషాల్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు.

సెలబ్రేట్:

సెలబ్రేట్:

అంతే ఇటువంటి సింపుల్ చిట్కాలను ఆచరించడం వల్ల తప్పనిసరిగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడానికి జీవనశైలిలో మార్పులు చాలా అవసరం. ప్రణాళిక లేకుండా బరువు తగ్గడం సాద్యం కాదు, కాబట్టి ముందు ప్లాన్ చేసుకొని తర్వాత ఆచరణలో పెట్టడం వల్ల ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. దాంతో మీ స్లిమ్ బాడీతో సంబరాలు చేసుకోవచ్చు.

English summary

25 Ways to Lose Weight Without Dieting

Sure, you can lose weight quickly. There are plenty of fad diets that work to shed pounds rapidly -- while leaving you feeling hungry and deprived.
Desktop Bottom Promotion