For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిమ్మల్ని నాజూగ్గా మార్చే 9 ఫుడ్ కాంబినేషన్స్

By Super
|

బరువు పెరుగుట మరియు బరువు కోల్పోవడం అనేవి నిర్ణయించడంలో ఆహారంను ఒక ముఖ్యమైన కారకంగా చెప్పవచ్చు. కొన్ని ఆహారాలు బరువు పెరుగుటకు,కొన్ని ఆహారాలు బరువు కోల్పోవటానికి సహాయపడతాయి. బరువు కోసం మాత్రమే కాకుండా చర్మము యొక్క శ్రద్ధ లేక రక్షణ,రోగనిరోధక శక్తి వంటి ఇతర అంశాలలో కూడా సహాయంచేస్తుంది.

ఇక్కడ ఆరోగ్యంగా మరియు సులభంగా చేయగల్గిన తొమ్మిది ఆహార సమ్మేళనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని అదృష్ట కలయికలు ఉన్నట్టుగా నమ్మకం ఉన్నది. అవి మీ శరీరం మరియు చర్మంలో అద్భుతాలు చేయవచ్చు. వాటిలో కొన్ని మిమ్మల్ని ఆరోగ్యంగా తయారు చేయవచ్చు.

ఈ ఆహారాలు ఒక విధంగా మా ఆహారంలో ఒక భాగంగా ఉన్నాయి. అందువలన మంచి ఫలితం కోసం ఈ సమ్మేళనాల కొరకు వెళ్ళండి.

కాంబినేషన్: గుడ్లు మరియు మామిడి

కాంబినేషన్: గుడ్లు మరియు మామిడి

మీకు అందిస్తుంది : దృడమైన చర్మం

మంచి దృడమైన చర్మం పొందడానికి అనేక ఉత్పత్తులను వాడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఇప్పుడు పండ్ల సీజన్లో గుడ్లు మరియు మామిడి తినాలి. గుడ్లు లో ఆకర్షణీయమైన చర్మం కొరకు కొల్లాజెన్ నిర్మాణం కోసం ముఖ్యమైన అమైనో ఆమ్లాలు సహజసిద్దంగా సమృద్ధిగా ఉంటాయి. మామిడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తి పెంచడానికి ఈ ఆమ్లాలు పనిచేస్తాయి. శరీరంలో కోల్పోయిన నిల్వలను తిరిగి రూపొందించడానికి సహాయపడుతుంది. అంతేకాక చెప్పుకోదగ్గ విధంగా చర్మం యొక్క రూపాన్ని మెరుగుపరుస్తాయి.

ఇలా చేస్తే మంచిది : మీ తదుపరి అల్పాహారం ఒక ఊపును ఇవ్వడానికి ఒక కప్పు మామిడి ముక్కలు,ఒక ఆమ్లెట్ కలిపి తీసుకోండి. ఇది దాదాపు పూర్తి రోజు విటమిన్ C ని సరఫరా చేస్తుంది.

కాంబినేషన్: రెడ్ బెల్ మిరియాలు మరియు బ్లాక్ బీన్స్

కాంబినేషన్: రెడ్ బెల్ మిరియాలు మరియు బ్లాక్ బీన్స్

మీకు అందిస్తుంది: మెరుగైన రోగనిరోధక శక్తి

వీటిని కూరగాయల మార్కెట్ లో పరిశీలిస్తే ఖరీదు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ వాటిని కొనుగోలుకు ఒక మంచి కారణం ఉంది. మీ ప్లేట్ లో కొన్ని రెడ్ బెల్ మిరియాలు జోడించడం ద్వారా మరింత నిరోధకత పెంచటానికి ఇనుము సహాయం చేస్తుంది. నలుపు బీన్స్ లో ఉండే ఐరన్ ను శరీరం స్వీకరించటానికి కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ విటమిన్ సి అధికంగా ఉన్న రెడ్ మిరియాలు వంటి వాటిని జోడించడం ద్వారా శరీరంనకు ఉపయోగించడానికి వీలుగా సులభంగా ఇనుముగా మారుస్తుంది.

ఇలా చేస్తే మంచిది: రెడ్ బెల్ మిరియాలు తో బ్లాక్ బీన్స్ కలిపి చాలా రుచికరమైన భోజనం ఎలా తయారుచేయాలో మీకు చూపించడానికి ఆన్ లైన్ గొప్ప వంటకాలు ఉన్నాయి.

కాంబినేషన్: అదనపు వర్జిన్ ఆలివ్ ఆయిల్ మరియు టొమాటోస్

కాంబినేషన్: అదనపు వర్జిన్ ఆలివ్ ఆయిల్ మరియు టొమాటోస్

మీకు అందిస్తుంది: వ్యాధుల నుండి మెరుగైన రక్షణ

టమోటాలలో క్యాన్సర్ తో పోరాటం మరియు గుండె జబ్బులకు సహాయపడే మూడు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో పాటు నాలుగు ప్రధాన కరొటెనాయిడ్లను కలిగి ఉంటాయి. ఈ రక్షణ రసాయనాలు మెరుగైన అదనపు వర్జిన్ ఆలివ్ నూనె ను గ్రహిస్తుంది. దీనిలో ఆరోగ్యకరమైన మోనో సాచురేటేడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.

ఇలా చేస్తే మంచిది: టమోటా చర్మం తీసివేస్తే లోపల ఫైటోకెమికల్స్ తో నిండి ఉంటుంది. అదనపు వర్జిన్ ఆలివ్ నూనె తక్కువ ప్రాసెస్ చేయబడిన రూపంగా చెప్పవచ్చు. కాబట్టి అది చాలా ప్రయోజనకరమైన సమ్మేళనాలను కలిగి ఉంటుంది. వేడి మరియు కాంతి నుండి దూరంగా నిల్వ చేయాలి.

కాంబినేషన్: బ్రోకలీ మరియు టొమాటోస్

కాంబినేషన్: బ్రోకలీ మరియు టొమాటోస్

మీకు అందిస్తుంది: క్యాన్సర్ వ్యతిరేకంగా రక్షణ

రెండింటిలోను విడి విడిగా క్యాన్సర్ ఎదుర్కోగల లక్షణాలు కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. కానీ పరిశోధన ప్రకారం కలిసికట్టుగా అవి క్యాన్సర్ పోరాట ఆహారపదార్ధాల హల్క్ అని చూపించింది. శాస్త్రవేత్తలు అదే సమయంలో వినియోగించే టమోటా మరియు బ్రోకలీ కలిపి తింటే క్యాన్సర్,ప్రోస్టేట్ కణితుల పెరుగుదల మందగిస్తుందని మరింత సమర్థవంతంగా కనుగొన్నారు.

ఇలా చేస్తే మంచిది: పిజ్జా లేదా స్ఫగెట్టి తో ఒకటిన్నర కప్పుల బ్రోకలీ,రెండున్నర కప్పుల తాజా టమోటా ముక్కలు తీసుకోవాలి.

కాంబినేషన్: వోట్మీల్ మరియు స్ట్రాబెర్రీ

కాంబినేషన్: వోట్మీల్ మరియు స్ట్రాబెర్రీ

మీకు అందిస్తుంది: ఆరోగ్యవంతమైన గుండె

వోట్స్ అవెనన్థ్రమిదెస్ మరియు ఫినాల్ ఆమ్లాలు అని రెండు ముఖ్యమైన ఫైటోకెమికల్స్ కలిగి ఉంటుంది. ఇవి విటమిన్ సి తో కలసి పని చేసి చెడు కొలెస్ట్రాల్ యొక్క హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి మరియు గుండె దాడులకు ప్రధాన కారణమైన ఫలకము ఏర్పాటును నివారిస్తుంది.

ఇలా చేస్తే మంచిది: ఉదయం ఒక కప్పు వోట్మీల్ లో అర కప్పు స్ట్రాబెర్రీ ముక్కలను కలిపి తినండి.

కాంబినేషన్: గ్రీన్ టీ మరియు నిమ్మ

కాంబినేషన్: గ్రీన్ టీ మరియు నిమ్మ

మీకు అందిస్తుంది: ఆరోగ్యకరమైన గుండె

గ్రీన్ టీ లో కాటెచిన్స్ అని పిలిచే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల గొప్ప మూలం ఉంది. ఇది గుండె యొక్క ఆరోగ్యం మెరుగుపరచడంలో సహాయం చేయడానికి ప్రసిద్ధి చెందింది. అయితే అధ్యయనాలు ప్రకారం ఈ సమ్మేళనాలు 20 శాతం మాత్రమే మానవ శరీరంలో శోషించబడతాయి. గ్రీన్ టీ కు నిమ్మరసం జోడించడం వల్ల 80 శాతం వరకు కాటెచిన్స్ స్థాయిలు పెరుగుతాయని తెలిసింది.

ఇలా చేస్తే మంచిది: ఒక కప్పు గ్రీన్ టీ కాచిన తర్వాత దానిలో ఒక మొత్తం నిమ్మకాయ రసం పిండాలి.

కాంబినేషన్: దాల్చిన చెక్క మరియు ధాన్యపు టోస్ట్

కాంబినేషన్: దాల్చిన చెక్క మరియు ధాన్యపు టోస్ట్

మీకు అందిస్తుంది: అదనపు శక్తి మరియు వేగంగా బరువు తగ్గడం

మీ కాల్చిన రొట్టె మీద దాల్చిన చెక్క పొడి చల్లటం వలన ఒక ఆరోగ్యకరమైన స్థాయిలో మీ బ్లడ్ షుగర్ ఉంచేందుకు సాయపడుతుంది. మీ ఆకలి స్థాయి తీవ్ర తారతమ్యాలు మరియు మీ శక్తి ముంచటాన్ని నిరోధిస్తుంది. క్లినికల్ న్యూట్రిషన్ అమెరికన్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనంలో దాల్చిన చెక్క భోజనం తర్వాత ఖాళీ కడుపు రేటు వేగాన్ని తగ్గిస్తుందని కనుగొనబడింది. భోజనం తర్వాత మరింత అడ్డగించి రక్తంలోని చక్కెర పెరుగుదల తగ్గించడానికి సహాయపడుతుంది.

ఇలా చేస్తే మంచిది: సంపూర్ణ ధాన్య బ్రెడ్,క్రొవ్వు లేని వెన్న మరియు ఒక స్పూన్ దాల్చినచేక్క పొడి లను ఉపయోగించండి.

కాంబినేషన్: వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు

కాంబినేషన్: వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు

మీకు అందిస్తుంది: పూర్తి శరీరంనకు రక్షణ

ఈ వెజ్జీస్ రెండు అనేక సంఖ్యలో ఆర్గానో సల్ఫర్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. అంతేకాక హృదయ ఆరోగ్యకరమైన ప్లాంట్ రసాయనాలు ధమనులలో ఫలకం లేకుండా చేయడంలో సహాయపడతాయి. వీటిలో కొన్ని సమ్మేళనాలను శరీరంలో లో క్యాన్సర్ నిర్విషీకరణ శక్తి కోసం అధ్యయనం చేశారు.

ఇలా చేస్తే మంచిది: అత్యంత భారతీయ వంటలలో రెండు కలిపి ఉపయోగిస్తారు. ఈ కాంబినేషన్ సూప్ మరియు సాస్ ల కోసం కూడా పనిచేస్తుంది.

కాంబినేషన్: గ్రీన్ టీ మరియు బ్లాక్ పెప్పర్

కాంబినేషన్: గ్రీన్ టీ మరియు బ్లాక్ పెప్పర్

మీకు అందిస్తుంది: సన్నటి నడుము

ప్రమాదంలో ఆహార నియంత్రణ మర్చిపోతే అప్పుడు కొద్దిగా నల్ల మిరియాలు తో గ్రీన్ టీ తయారుచేసుకొని భోజనం తర్వాత ఒక కప్పు త్రాగాలి. ఈ కాంబినేషన్ EGCG యొక్క శోషణ సౌలభ్యం మరియు టీ లో కీలక యాంటిఆక్సిడెంట్ 130 శాతం కాలరీలు కోల్పోవటానికి సహాయపడతాయి. నిపుణులు గ్రీన్ టీ లో ఉండే కాంపౌండ్స్ ఆకలి మరియు సంపూర్ణత్వం క్రమబద్దీకరించే హార్మోన్లను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.

ఇలా చేస్తే మంచిది: ఒక కప్పు టీ లో అర స్పూన్ నల్ల మిరియాలు కలిపితే ప్రయోజనకరమైన కాంపౌండ్స్ శోషణను పెంచుతుందని చెప్పుతారు.

English summary

9 food combos to make you lean

Food is a major factor in deciding weight gain and weight loss. Some foods add tons to your weight while some others help to loss weight. Not only for weight, they can help in other factors like immunity, skincare etc.
Desktop Bottom Promotion