For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ టీ డైట్ విశేషాలు-ఔషద గుణగణాలు మీకుతెలుసా?

|

పొద్దున్నే టీ కప్పు కనిపిస్తే మనిషికి ఉదయించే సూర్యుణ్ణి చూసినంత ఆనందం కలుగుతుంది. టీ మాధుర్యాన్ని చవి చూసిన ఆనందంలో కొందరు పాలు కలపడానికి కూడా ఇష్టపడక ఏకంగా బ్లాక్ టీనే తాగడం మొదపూట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల గ్రీన్ టీ పట్ల మోజు బాగా పెరుగుతోంది. ఆరోగ్యపరమైన ఎన్నో సమస్యలకు గ్రీన్ టీ మంచి ఔషధంలా పనిచేస్తుంది. అందుకే దీన్ని తీసుకునేవారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. గ్రీన్ టీలోని విశేషాలను, ఔషధ గుణాలను మరింత లోతుగా పరిశీలిస్తే....

గ్రీన్ టీని తయారుచేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. టీ ఆకులో ఉండే సహజమైన ఆకుపచ్చదనాన్నీ, పరిమళాన్నీ నిలబెట్టే ప్రయత్నం ఈ తయారీలో ఉంటుంది. నిజానికి పూర్వకాలం నుంచే గ్రీన్ టీ వినియోగం ఉంది. అయితే, ఇప్పుడు ఆ ప్రాచీన విజ్ఞానానికి కొంత ఆధునిక అవగాహన జత చేయడం ద్వారా గ్రీన్ టీ ప్రయోజనాలు రెట్టింపు అవుతున్నాయి. వ్యాధి నిరోధక శక్తి కలిగిన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం గ్రీన్ టీలోని ఒక ప్రధాన విశేషం.

బరువు తగ్గించడంలో అద్భుతమైనది మార్గం గ్రీన్ టీ, గ్రీన్ టీ డైట్ వల్ల శరీరంలోని అనేక వ్యాధులు క్యాన్సర్, రక్తంలోని హై కొలెస్ట్రాల్ లెవల్స్ మరియు డయాబెటిస్ వంటివి అనేక రుగ్మతలను నివారించడంలో అద్భుతమైన మార్గం గ్రీన్ టీ డైట్. మరి మీ డైట్ లో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలేంటో ఒక సారి చూద్దాం...

Green Tea

1. వేగగంగా బరువు తగ్గిస్తుంది: గ్రీన్ టీ లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు ముఖ్యంగా, ఉదరంలో ఉన్న శరీరాన్ని ఉత్తేజపరిచే కాలరీలను తగ్గించి బరువు తగ్గించి, శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది.అధికబరువుతో బాధ పడేవారికి గ్రీన్‌‘టీ' ఓ చక్కని పరిష్కారం. కొవ్వును తగ్గించడంలో గ్రీన్‌‘టీ' చాలా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఉరుకులు, పరుగుల జీవితంలో అధికబరువుతో అనారోగ్యాల పాలవుతున్న వారికి గ్రీన్‌‘టీ' దివ్యౌషదం అని చెబుతున్నారు.

2. డయాబెటిస్ ను దూరంగా ఉంచుతుంది: డయాబెటీస్ బాధితులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రాథమిక ధశలో ఉంటే ఈ ‘టీ' మంచి ఫలితాలను ఇస్తుంది. బ్లడ్‌షుగర్ బాధితులకు కూడా ఎంతో మేలు చేస్తుంది.

3. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: గ్రీన్‌టీలో మెం డుగా వున్న రెస్‌పెరట్రాల్‌ అనే పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో వుంచుతుంది. దీనితో, రక్తనాళాలలో చెడు కొలెస్ట్రాల్‌ వలన రక్తం గడ్డకట్టిపోదు. తద్వారా గుండెపోట్ల వంటివి నివారించబడతాయి.

4. క్యాన్సర్ ను నిరోధిస్తుంది: (టీ లో కనిపించే యాంటీఆక్సిడెంట్లు) టీ లోని పాలీఫేనాల్స్ వల్ల, ఒక కప్పు టీ లో కాన్సర్ ఎదుర్కొనే సామర్ధ్యం ఎక్కువగా ఉంటుంది. అయితే పరిశోధన అసంపూర్తిగా ఉన్నప్పటికీ, టీ లో పాలీఫేనల్స్ అధికంగా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి, ముఖ్యంగా కాటచిన్స్, కాన్సర్ నివారణకు సంబంధించిన జీవకార్యకలాపాలను కలిగి ఉండవచ్చు.

5. దంత సమస్యలను నివారిస్తుంది: టీ లో సహజమైన ఫ్లోరైడ్లు, దంతక్షయాన్ని నివారించడానికి సహాయపడే రసాయనాలు స్వల్ప పరిమాణంలో కలిగిఉంటాయని ఆమె చెప్పారు. ఫ్లోరైడ్ లాలాజలంతో కలిసినపుడు, బాక్టీరియా కావిటీస్ ప్రోత్సహించే ఉత్పత్తులుగా ఆమ్లాలను ఉత్పత్తి చేయదు. అదనంగా, ఫ్లోరైడ్ ప్రారంభ దశలో ఉన్న దంతక్షయాన్ని నివారించడానికి పనిచేస్తుంది.

6. వ్యాధినిరోధకతను మెరుగుపరుస్తుంది: ఈ గ్రీన్‌‘టీ' రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

7. ఆర్థరైటిస్ (కీళ్ళనొప్పుల)ను మాయం చేస్తుంది: బోన్‌వూఫాక్చర్ అయినప్పుడు గ్రీన్‌టీ ఎంతో లాభదాయకం, తిరిగి ఆరోగ్యకరమైన ఎముకల నిర్మాణం జరుగుతుంది. బోన్స్ పటిష్టంగా, దృఢంగా తయారవుతాయి.

8. బ్యూటీ బెనిఫిట్స్: గ్రీన్‌టీ తీసుకోవడం వల్ల కాంతివంతమైన చర్మం కూడా మీ సొంతం అవుతుంది. ఇది పూర్తిగా ప్రకృతి సిద్ధమైనది కావడంతో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవు. ప్రతిరోజు 2 నుంచి 5 కప్పుల గ్రీన్‌‘టీ' తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. గ్రీన్‌టీలో ఉండే బలమైన యాంటి ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని కొంతమేరకు నిలుపుచేస్తాయి. శరీరంలోని డిఎన్‌ఎ దెబ్బతినకుండా నిరోధించడం ద్వారా వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది. చర్మం ముడుతలు పడటం తగ్గిస్తుంది.

English summary

Benefits Of A Green Tea Diet

Green tea diet has become very famous across the globe as it has many wonderful qualities which benefit our body. Green tea contains high amount of antioxidants which help our body in many ways. If you are trying to lose your weight, it is a great drink for you.
Desktop Bottom Promotion