For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవంబర్ లో దొరికే బెస్ట్ సీజనల్ ఫ్రూట్స్ & వెజిటేబుల్స్

|

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

సీజనల్ గా వచ్చే పండ్లు వెజిటేబుల్స్ ను ఆయా సీజన్ లో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాల పోషకాలను, ప్రోటీనుల, నూట్రీషియన్స్ ను పుష్కలంగా అంధిచవచ్చు. సీజనల్ గా లభించే పండ్లు చాలా విలువైనవి మరియ పూర్తి పోషకాంశాలు కలిగినవి అందుకే అవి అంత ఖరీదై ఉంటాయి. ఉదాహారణకు స్వీట్ పొటాటో , ద్రాక్ష, బ్లాక్ బెర్రీస్, మరియు పీర్స్ వంటి సూర్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇవీ ఆ సీజన్ లో తీసుకోవడం వల్ల వ్యాధినిరోధకత ఆరోగ్యంగా ఉంటుంది . కాబట్టి సీజనల్ గా లభించే న్యూట్రీషియన్స్ మరియు ఫైబర్ రిచ్ పండ్లు, వెజిటేబుల్స్ తప్పకుండా తీసుకోవడం మంచిది. సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మరి ఈ నవంబర్ సీజన్ లో మార్కెట్లో మనకు అందుబాటులో ఉండే పండ్లు మరియు వెజిటేబుల్స్ మనకు వివిధ రకాలగా ఈ సీజన్ మొత్తం అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా హెల్తీ డైట్ కోసం ఈ పండ్లు మరియు వెజిటేబుల్స్ ఎకనామికలీ మరియు హైన్యూట్రీషినల్ ఫుడ్స్.

నవంబర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆపిల్స్, కివి, బెర్రీస్, ఆరెంజెస్, బెర్రీస్, క్యాబేజ్, మరియు క్యాలీఫ్లవర్ వంటి పలాటబుల్ హెల్తీ డైట్ కు మాత్రమే కాదు, వీటిలో అధికంగా యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉండి మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి . క్యాబేజ్ , కాలీఫ్లవర్ వంటి వెజిటేబుల్స్ లో కొన్ని కాంపౌండ్స్ (గ్లూకోసినోలేట్స్-ఇవి క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు పుష్కలంగా కలిగి ఉంటాయి. ఈ సీజనల్ ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ లో వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండి మన శరీరానికి బలాన్ని, వ్యాధినిరోధక శక్తిని పుష్కలంగా అంధిస్తాయి . ఇవి కణాజాలలకు మద్దతుగా మరియు నాసికా రద్దీ నివారించబడుతాయి. నవంబర్ లో మనకు అందుబాటులో ఉండే పండ్లు మరియు వెజిటేబుల్స్ లో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్, కాపర్, విటమిన్ సి, విటిమన్ ఇ మరియు మ్యాంగనీస్ కలిగి ఉంటాయి.

ఇక్కడ మీకోసం కొన్ని సీజనల్ నవంబర్ ఫ్రూట్స్ మరియు వెజిటేబల్స్ ను తెలియచేస్తున్నాము. వీటిని మీ రెగ్యులర్ హెల్తీ డైట్ లో ఒకటిగా చేర్చుకోవచ్చు.

1. కివి:

1. కివి:

కడుపు నింపుతాయి. పీచు అధికం. కేలరీలు తక్కువ, గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ. కివి మరో విటమిన్ సి అధికంగా ఉండే పండు, కివిలో యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలమే. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది.

2.ఆపిల్స్:

2.ఆపిల్స్:

రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల డాక్టర్ సంప్రదించాల్సిన పనిలేదు. అది నిజం. ఆపిల్స్ లో ఫైటోన్యూట్రియంట్స్, ఫ్లెవనాయిడ్స్, మరియు యాంటీఆక్సిడెంట్స్ అది శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది.

 3. బ్రొకోలీ:

3. బ్రొకోలీ:

మిగితా గ్రీన్ వెజిటేబుల్స్ లాగో బ్రొకోలిలో కూడా అధిక యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇందులో ఫైటో న్యూట్రియంట్స్ శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా అనేక వ్యాధులతో పోరాడే ఫోలీన్యూట్రియంట్స్ కలిగి ఉంటుంది. బ్రక్కోలిలో విటమిన్ ఎ మరియు సి మరియు కాల్షియం కూడా ఉంటాయి. వీటితో సూప్ సలాడ్ వంటివి చేసుకోవచ్చు. కేలరీలు తక్కువ.

4. రెడ్ క్యాబేజ్:

4. రెడ్ క్యాబేజ్:

క్యాబేజిలో వివి ధ రకాలున్నాయి. వాటిలో ముఖ్యంగా రెడ్ మరియు గ్రీన్ క్యాబేజీ . వీటిని అలాగే పచ్చిగా తినవచ్చు లేదా ఉడికించి తినవచ్చు. దీని రుచి మాత్రం కొద్దిగా తీపిగా ఉంటుంది. ఎరుపురంగు క్యాబేజీ కొన్ని ప్రదేశాలలో మాత్రమే లభిస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు బాగుంటుంది. రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యము చేస్తుంది . శరీరములొ కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది . రక్తములో చెక్కెర స్థాయిని అదుపు చేసేందుకు గ్లూకోజ్ టోలరెన్స్) లో భాగమైన ' క్రోమియం ' ఈ లెట్యూస్ లో పుష్కలముగా ఉంటుంది . నిద్ర పట్టేందుకు దోహదం చేసే " లాక్ట్యుకారియం అనే పదార్ధము ఇందులో ఉంటుంది . ఇంకా క్యాబేజీలో విటమిన్స్ , ఐరన్ మరియు పొటాషియం మరియు తక్కువ క్యాలరీలు కలిగి ఉండటం వల్ల క్యాబేజ్ ను ఇటు సౌత్ అటు నార్త్ రెండు ప్రదేశాలలోనూ దీని వినియోగం ఎక్కువ.

5. బీట్ రూట్:

5. బీట్ రూట్:

శరీరాన్ని ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉంచే విటమిన్లు, మినరల్స్, ప్రోటీనులు అధికంగా ఉండే అతిముఖ్యమైన కూరగాయలను తీసుకోవడం చాలా అవసరం. బీట్ రూట్ తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. పీచు అధికం, ఆరోగ్యకర షుగర్ వుండి ఆకలి తీరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. కాబట్టి యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ ను మీ ఆహారంలో తీసుకోవడం మర్చిపోకండి.

6. క్రాన్ బెర్రీస్:

6. క్రాన్ బెర్రీస్:

రాన్ బెర్రీ పండు ఆరోగ్యానికి మంచిది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా మరీ మంచిదని పోషకాహార నిపుణులు చెపుతారు. ప్రతిరోజూ ఒక గ్లాసు క్రాన్ బెర్రీ రసం తాగితే, గుండె ఆరోగ్యం బాగా వుంటుంది. అది ఎలా అనేది పరిశీలించండి. క్రాన్ బెర్రీ జ్యూస్ రక్తంలోని మంచి కొలెస్టరాల్ పెంచుతుంది. కనీసం అంటే 10 శాతం పెరుగుతుందని నిపుణులు వెల్లడించారు. ప్లాస్మా యాంటీ ఆక్సిడెంట్ల సామర్ధ్యం 121 శాతం వరకు పెరుగుతుందట. ఈ పండు రసంతాగితే పిల్లలలో సాధారణంగా వచ్చే శ్వాస సంబంధిత ఇన్ ఫెక్షన్లు కూడా తగ్గిస్తుందని కూడా స్టడీ చెపుతోంది.

 7. యామ్:

7. యామ్:

యామ్స్ ను dioscoreaeకుటుంబానికి చెందినవిగా అని పిలుస్తారు. యామ్స్ లో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్స్ రక్లనీళ గోడలు కీడు కలిగించకుండా హోమోసిస్టీన్ అని పిలిచే ఒక పదార్థం నాశనం చేయడానికి సహాయపడుతుంది.

8. కాలీఫ్లవర్:

8. కాలీఫ్లవర్:

పచ్చటి ఆకుల మధ్య ముద్దగా కనిపించే తెల్లటి పూలగుచ్ఛమే కాలీఫ్లవర్‌. ఇది ప్రకృతి సిద్ధమైన ఫ్లవర్‌ బొకేలా ముచ్చటగా వుంటుంది. క్యాలీప్లవర్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి'ని తక్కువగా తీసుకుంటే డోపమైన్ తయారీని తగ్గిస్తుంది. ఆరోగ్య భావనలను కల్గిస్తుంది. క్యాలీప్లవర్ లో ఉత్పాత స్పూర్తిని పెంచే విటమిన్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఒక కప్పు ఉడకపెట్టిన కాలీఫ్లవర్‌లో సి విటమిన్‌, పీచు పదార్థం పుష్కలంగా లభిస్తుంది. విటమిన్‌ బి5, బి6, మాంగనీస్‌, ఫాటీ యాసిడ్లు కూడా అందులో వుంటాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, సోడియం మినరల్స్‌ కూడా కాలీఫ్లవర్‌లో లభిస్తాయి. కాలీఫ్లవర్‌ను అతిగా తినడం వల్ల కొందరిలో కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం జరుగుతుంది. వీటిలో వుండే ప్యురీన్లు అనే పదార్థాలు దీనికి కారణం. అయితే అందరికీ ఈ సమస్య ఎదురుకాదు

9. ఫిగ్:

9. ఫిగ్:

రక్తహీనత (అనీమియా)ను నివారించాలంటే సాధారణంగా మాంసాహారమైన కాలేయం, గుడ్లు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే ఈ వింటర్ సీజన్ లో దొరికే ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా గడుపగలుగుతారు.

10. ఆరెంజ్:

10. ఆరెంజ్:

ఈ తియ్యని మరియు పుల్లని సిట్రస్ పండ్లు విటమిన్ ఎ, సి, ఫ్లెవనాయిడ్స్ మరియు బీటా కెరోటిన్స్ అధికంగా ఉంటాయి. శరీరాన్ని శుభ్రం చేసి, డిటాక్స్ చేస్తుంది. విటమిన్ సి బాగా ఉంటుంది. వింటర్ జలుబులు అరికడతాయి. తక్కువ కేలరీలు. తీపి కోరిక తగ్గిస్తాయి.

11. కాలే:

11. కాలే:

ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఫోలీ ఫినాలిక్ ఫెవనాయిడ్స్ (యాంటీఆక్సిడెంట్స్)ఇవి క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటుంది మరియు కార్డియో వాస్కులార్ వ్యాధులను నిరోధిస్తుంది.

12. ఎర్రముల్లంగి మరియు ద్రాక్ష:

12. ఎర్రముల్లంగి మరియు ద్రాక్ష:

రెడ్ రాడిష్ తినడం వల్ల మీ శరీరంలో తగినంత చేరుతుంది. అంతే కాదు, ఈ రెడ్ రాడిష్ అతి తేలికగా జీర్ణం అవుతుంది. కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలు లేకుండా కాపాడుతుంది. ఎర్ర ముల్లంగి ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావల్సిన నీటి నింపుతుంది. ఇంకా ఇది సులభంగా జీర్ణం అవుతుంది. కడుపు నిండుగా ఉండేలా చేసి ఆకలిని కలగనివ్వదు. ఈ ఎర్రని మరియు తెల్లని ముల్లంగి వ్యాధి నిరోధక శక్తిని అందిస్తాయి.

13. రెడ్ పెప్పర్:

13. రెడ్ పెప్పర్:

బెల్ పెప్పర్ లో అధికంగా కెరోటినాయిడ్స్ మరియు విటమిన్ సి(యాంటీఆక్సిడెంట్స్)పుష్కలంగా ఉంటాయి. రెడ్ మరియు ఎలో బెల్ పెప్పర్స్ ఆరోగ్యానికి మంచిది మరియు న్యూట్రిషియన్స్ పుష్కలం.

14. గుమ్మడి:

14. గుమ్మడి:

గుమ్మడిలో విటమిన్‌ ఎ పుష్కలంగానూ, కేలరీలు తక్కువగానూ కలిగిన కూరగాయ. ఇందులో ఫైబర్‌ ఎక్కువశాతం వుంది. అంతేకాక వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. ఎలా తినాలి: కూర, పులుసు, సాంబారు, హల్వా... ఏదైనా సరే! గుమ్మడి గింజల్లో మెగ్నీషియం మెండుగా వుంది. ఇంకా మినరల్స్‌ అత్యధికంగా పోగుపడ్డ గింజలు. అంతేకాదు వీటికి ఆహారంలో భాగస్వామ్యం కల్పిస్తే మన జీవితకాలం మరింత పెరుగుతుందట! ఎలా తినాలి: దోరగా వేపుకుని స్నాక్స్‌ రూపంలో తినొచ్చు. లేదంటే ముద్దలా నూరి కూరలో వేయొచ్చు. దానివల్ల గ్రేవీ రుచిగా తయారవుతుంది.

15. అవొకాడో:

15. అవొకాడో:

అవొకాడోలో విటమిన్స్, ఎ, సి మరియు ఇ పుష్కలంగా ఉండి శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. ఫ్రీరాడికల్స్ ను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు పొటాషియం అవొకాడోలో పుష్కలంగా ఉంటాయి.వీటిలో కెరోటినాయిడ్స్, ఫొల్లెట్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి మధుమేహగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది. ఈ పండు కూడా ట్రిగ్లేసెరైడ్ మరియు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది.

English summary

Best November Fruits n Vegetables

Welcome to November. Summer is finally gone and now we are left to witness some of the fascinating fruits and vegetables making its way to the grocery shelves. Each season has its own uniqueness when it comes to fruits and vegetables, and it is always healthy and cost-effective to purchase seasonal foods during the peak time.
Story first published: Friday, November 15, 2013, 17:02 [IST]
Desktop Bottom Promotion