For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడానికి సహాయపడే 10 ఉత్తమ సూపులు

|

మీరు అధికబరువుతో బాధపడుతూ బరువు తగ్గించుకొనేందుకు చాలా హార్డ్ గా పనిచేస్తున్నారా? ప్రతి రోజూ వ్యాయామం చేయడం మరియు డైట్ ప్లాన్ ను ఫాలో చేయడంతోనే మీరు ఆశించిన ఫలితాలను పొందలేకపోతున్నారా? అందుకు మీకు కొంత సమయం పడుతుంది. ఓపికగా ఈ పద్దతులను పాటిస్తూ పోతే కొద్ది రోజులకు తప్పనిసరిగా మార్పులు గమనించవచ్చు. అయితే, ప్రస్తుతం మీరు అనుసరిస్తున్న ఆహార నియమాలు అంతగా పనిచేయకపోవచ్చు. మీ టేస్ట్ బడ్స్ కు మరింత రుచికరంగా మరియు సంతృప్తికరంగా కలిగి ఉండకపోవచ్చు. అందుకు మీరు ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు, మన దగ్గర చాలా సింపుల్ గా మరియు హెల్తీగా మరియు టేస్టీ పరిష్కార మార్గం ఉంది. మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవల్సిన కొన్ని హెల్తీ మరియు అద్భుతమైన రుచి కలిగిన సూప్స్ ఉన్నాయి. ఇవి మీ బరువును త్వరగా తగ్గించడం మాత్రమే కాదు. ఇవి మీ టేస్ట్ బడ్స్ ను సంతృప్తికరంగా ఉంచుతాయి.

సెలబ్రెటీల విషయంలో ఈ సూప్ డైట్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. అందువల్లే ఇవి చాలా బాగా ప్రసిద్ది చెందాయి. ఈ సూప్స్ యొక్క ఉత్తమ విషయమేమిటంటే వీటిలో విటమిన్స్ మరియు మినిరల్ అధికంగా ఉన్నాయి మరియు లోక్యాలరీ, లోఫ్యాట్ మరియు లో కార్భోహైడ్రేట్స్ ను కలిగి ఉన్నారు. మీరు ఒక ఖచ్చితమైన హెల్తీ వైయిట్ లాస్ డైట్ ను అనుసరిస్తున్నట్లైతే, మీ రెగ్యులర్ డైట్ లో కొన్ని సూపులను జోడించి మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సూపులు మీ నాలుకకు రుచిని మాత్రమే కాకుండి అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరల్స్ అంధిస్తాయి. మరియు ఎటువంటి హై క్యాలరీ ఫుడ్స్ తీసుకోకుండానే మీలో ఎక్కువ సమయం మీ పొట్ట నిండుగా ఉండేందుకు సహాయపడుతాయి.

అనేక అధ్యయనాలు మరియు పరిశోధనల ప్రకారం, ప్రజలు ఎవరైతే భోజనం లేదా డిన్నర్ కు ముందు వెజిటేబుల్ సూప్స్ తీసుకుంటారో వారిలో 20క్యాలరీలు మిగిలిన వారికంటే తక్కువగా చేరుతాయని కనుగొన్నారు. కాబట్టి, మీ రోజువారి ఆహారంలో సూపులను జోడించడానికి వేగంగా బరువు తగ్గించుకోవడానికి సమయం వచ్చిందని గుర్తించాలి. మీ బరువు ఖచ్చితంగా తగ్గించే కొన్ని హెల్తీ సూపులను ఇక్కడ అంధిస్తున్నాం. వాటిని అనుసరించి బరువు తగ్గించుకొని మంచి ఫలితాలను పొందండి.

ఖచ్చితంగా బరువు తగ్గించే సూప్స్:

1. వెజిటేబుల్ సూప్స్:

1. వెజిటేబుల్ సూప్స్:

అనేక ఆరోగ్యప్రయోజనాలు కలిగినటువంటి ఒక సౌకర్యమైన మరియు తేలికగా తయారుచేసే ఒక హెల్తీ సూప్స్.కాబట్టి మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ పొటాటో, క్యారెట్, బీన్స్ మరియు పచ్చిబఠానీ వీటిలో ఏదో ఒకటి మిక్స్ చేసి సూప్ తయారుచేసుకోవచ్చు. ఈ సింపుల్ సూప్ లో ఒక అద్భుతమైన పొటాషియం కంటెంట్, బీటా కెరోటిన్ మరియు ఫైబర్ ఫుష్కలంగా ఉంటుంది. మరియు చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది.

2. మెనోస్ట్రోన్ సూప్:

2. మెనోస్ట్రోన్ సూప్:

దీన్ని బంగాళదుంప, టమోటో, క్యారెట్, కార్న్ మరియు ఇతర హెల్తీ వెజిటేబుల్స్ కూడా వేసి ఈ సూప్ ను తయారుచేస్తారు. ఇది చాలా తక్కువ క్యాలరీలను మరియు తక్కువ కార్బోహైడ్రేట్స్ ను కలిగి ఉంటుంది. మరియు ఇందులో అధిక శాతంలో ఫైబర్, ప్రోటీన్స్ మరియు ఐరన్ కలిగి ఉంటుంది. మరియు దీన్ని ఇంట్లోనే తయారుచేయడం చాలా సులభం.

3. చికెన్ అండ్ వెజిటేబుల్ సూప్:

3. చికెన్ అండ్ వెజిటేబుల్ సూప్:

ఇది బరవు తగ్గించడానికి చాలా మంచిది. ఇది మీ జీర్ణవ్యవస్థకు చాలా ఆరోగ్యకరంగా ఉండటానికి సహాయపడుతుంది మరియు బరువును క్రమబద్దం చేస్తుంది. మీరు రెగ్యులర్ గా వ్యాయం చేస్తున్నట్లైతే, అప్పుడు అది, మీరు తిన్నఆహారం విచ్ఛిన్నం చేయడానికి ఒక ఉత్తమ ఆహారంగా తీసుకోవచ్చవచ్చు. మరియు ఇది పుష్కలమైన ఎనర్జీని అంధిస్తుంది.

4. టమోటో సూప్:

4. టమోటో సూప్:

టమోటో సూప్ ను భోజనానికి మరియు డిన్నర్ కు ముందు మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇది మీ రెగ్యులర్ డైట్ కు ఎటువంటి క్యాలరీలను చేర్చదు. ఇందులో చాలా తక్కువ క్యాలరీలు మరియు లోఫ్యాట్ మరియు జీరో కొలెస్ట్రాల్ కలిగి ఉంటాయి. అంతే ఒక అద్భుతమైన యాంటీఆక్సిడెంట్స్, లైకోపిన్ కలిగి ఉంటుంది. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

5. బ్లాక్ బీన్ :

5. బ్లాక్ బీన్ :

ఇది ప్రోటీన్లు మరియు ఫైబర్ పుష్కలంగా ఉండే అత్యధిక న్యూట్రీషియన్స్ కలిగినటువంటి ఒక అద్భుతమైన ఆహారం. ఇది తక్కువ ఫ్యాట్ మరియు అధిక యాంటీఆక్సిడెంట్స్ కలిగినటువంటి ఫోటో కెమికల్స్. బ్లాక్ బీన్స్ తో వివిధ రకాలైనటువంటి సూపులను తయారుచేయచ్చు.

6. గ్రీన్ లీఫీ వెజిటేబుల్ సూప్:

6. గ్రీన్ లీఫీ వెజిటేబుల్ సూప్:

గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఆరోగ్యానికి చాలా మంచిది వీటిలో క్యాలరీలు తక్కువ మరియు కొలెస్ట్రాల్ జీరో. కాబట్టి, బరవు తగ్గించుకొనేందుకు ఒది ఒక అద్భుత సూప్. అంతే కాదు, ఈ గ్రీన్స్ లో విటమిన్ సి, కె, ఇ మరియు ఐరన్ క్యాల్షియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

7. బట్టర్ నట్ పంప్కిన్ సూప్:

7. బట్టర్ నట్ పంప్కిన్ సూప్:

గుమ్మడిలో చాలా తక్కువ కేలరీలున్నాయి . బరువు తగ్గాలనుకొనే వారికి ఇది చాలా మంచిది. ఇది చాలా తక్కువ ఫ్యాట్ కలిగి సోడియం మరియు గులెటిన్ ఫ్రీ కలిగిన సూప్ ఇది, కాబట్టి మీరు దేనిగురించి భయపడాల్సి అవసరం లేదు.

8. ఆకుకూరలతో సూస్:

8. ఆకుకూరలతో సూస్:

ఇది ఒక అద్భుతమైన గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మీ శరీరానికి అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరల్స్ ఎక్కువగా అంధిస్తుంది. దీన్ని తయారుచేయడం చాలా సులభం.

9. గ్రీన్ పీస్ సూప్స్:

9. గ్రీన్ పీస్ సూప్స్:

ఇది మరొక హెల్తీ సూప్ . క్యాబట్టి ఈ సూప్ కు క్యారెట్ మరియు పొటాటో ముక్కలను జోడించండి. పచ్చిబఠానీలతో వివిధ రకాలైన సూప్ లను తయారుచేయవచ్చు. వీటిలో ఫ్యాట్ తక్కువ మరియు షుగర్ మరియు ప్రోటీనులు ఎక్కువ

10. క్వీనా సూప్:

10. క్వీనా సూప్:

క్వీనా ప్రోటీనులు, డైటరీ ఫైబర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, మరియు ఐరన్ వంటి వాటికి ఇది ఒక అద్భుతమైన మూలం. అంతే కాదు, ఇందులో క్యాల్షియం, మరియు గులిటిన్ ఫ్రీ ఎక్కువగా ఉంటుంది మరియు జీర్ణం అవ్వడానికి చాలా సులభం అవుతుంది. మీ రెగ్యులర్ డైట్ లో క్వినైన్ చేర్చుకోవడం వల్ల తప్పకుండా బరువు తగ్గుతారు.

English summary

Best Soups For Weight Loss

You are trying hard to lose weight, working out every day and following a diet plan also but not very satisfied with the results.
Desktop Bottom Promotion