For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొడి చర్మం నివారించడానికి అనుసరించాల్సి హెల్తీ డైట్

|

వింటర్ సీజన్ ఒక భయంకరమైన సీజన్, ఎందుకంటే, వివిధ రకాల సమస్యలు ఈ సీజన్ తో పాటు వెంటబెట్టుకొని వస్తాయి. ఈ సీజన్ లో, ఒక ప్రధాన మరియు సాధారణ సమస్య డ్రై స్కిన్. ఈ సీజన్ లో వాతావరణంలో మార్పల వల్ల మాత్రమే కాదు, మనం తీసుకొనే కొన్ని ప్రత్యేకమైన ఆహారం వల్ల కూడా మన చర్మం పొడిగా మారుతుందని అంటారు . ఇది వింటిర్ స్కిన్ సమస్యకు దారితీస్తుంది. కాబట్టి, హైడ్రేషన్ కలిగించే ఆహారాలు తీసుకోసుకోవడం వల్ల మీ చర్మం సాఫ్ట్ గా మరియు సపల్ గా ఉంటుంది. ఆకుకూరలు మరియు అవొకాడో వంటి ప్రధాన ఆహారాలు శరీరంలో హైడ్రేషన్ ను బ్యాలెన్స్ చేస్తుంది. దాంతో చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. చర్మం పొడి బారదు.

డ్రై స్కిన్ నివారించడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలున్నాయి. వాటిని మీ రెగ్యురల్ డైట్ లో ఉంచుకోవాలి. ఈ వింటర్ సీజన్ లో మీ చర్మాన్ని అందంగా మరియు కాంతివంతంగా ఉంచుకోవడానికి స్కిన్ కేర్ డైట్ ను అనుసరించడం చాలా అవసరం. డ్రై స్కిన్ డైట్ ను క్రింది విధంగా లిస్ట్ చేయబడింది. ఇవి డ్రై స్కిన్ నివారించడం మాత్రమే కాదు, మొటిమలు ఏర్పడకుండా పోరాడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? డ్రై స్కిన్ డైట్ ను ఈ శీతాకాలంలో మీరు అనుసరించండి. ఈ శీతాకాలంలో ఖరీదైన వింటర్ లోషన్స్ మరియు ఇతర బ్యూటీ ప్రొడక్ట్స్ ను కొనే అవసరం ఉండదు.

డ్రై స్కిన్ డైట్ :

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

డ్రై స్కిన్ డైట్ లో ప్రధానంగా చేర్చుకోవల్సిన ఒక ప్రధానమైన పదార్థం కొబ్బరి నూనె. ఈ నూనెలో ఉండే ఫ్యాట్ శరీరంలోపల నుండి చర్మానికి ట్రీట్ చేస్తుంది.

జాస్మిన్ టీ:

జాస్మిన్ టీ:

మీ చర్మానికి బూస్ట్ వంటిది, డ్రై స్కిన్ డైట్ లో ప్రధానంగా చేర్చుకోవల్సిన హైడ్రేటింగ్ ఫుడ్ జాస్మిన్ టీ. సీజన్ మొత్తం మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

సాల్మన్:

సాల్మన్:

డ్రై స్కిన్ నివారించే ఒక ఉత్తమ ఆహారం సాల్మన్. ఈ బోన్ లెస్ ఫిష్ ను మీ డ్రైస్కిన్ డైట్ లో వింటర్ సీజన్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

కీరదోస:

కీరదోస:

కీరదోస మరియు తాజాగా ఉండే కీరదోసకాయ ముక్కలరు మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో అధిక శాతంలో సిలికా ఉండటం వల్ల ఇది మీకు మాయిశ్చరైజ్ గా ఉపయోగపడుతుంది మరియు మీ చర్మానికి సాగేతత్వాన్ని అంధిస్తుంది.

సెలెరీ(కొత్తిమీర):

సెలెరీ(కొత్తిమీర):

కొత్తిమీరలో కూడా సిలికా ఉంటుంది. అందువల్ల డ్రై స్కిన్ డైట్ లో దీన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలి . తాజాగ ఉండే కొత్తమీరను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్:

చర్మానికి ఒక అద్భతు మాయిశ్చరైజర్ గా పనిచేయడం వల్ల ఈ ఫ్లాక్స్ సీడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల, ఇది వింటర్ సీజన్ లో మీ చర్మానికి మరియు శరీరానికి చాలా మేలు చేస్తుంది.

వాల్ నట్స్:

వాల్ నట్స్:

వింటర్ సీజన్ లో మీ చర్మం తేమగా ఉండాలి. అందుకు వాల్ నట్స్ బాగా సహాయపడుతాయి. అందువల్ల మీ డ్రై స్కిన్ డైట్ లో మీ బ్రైయిన్ ఫుడ్ ను జోడించండి.

బ్లాక్ కరెంట్స్:

బ్లాక్ కరెంట్స్:

చిన్న చిరుధాన్యం బ్లాక్ కరెంట్స్ ఇది ఒక నేచర్ బెస్ట్ ఫుడ్ . ఇది డ్రెస్కిన్ కు సహాయపడుతుంది . ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

వెజిటేబుల్ ఆయిల్ తో కంపేర్ చేస్తే ఆలివ్ ఆయిల్ మంచి ఫ్యాట్స్ మరియు విటమిన్స్ తో నిండి ఉంటుంది. ఇది చర్మానికి మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది అందుకే ఆలివ్ ఆయిల్ ను డ్రై స్కిన్ డైట్ లో చేర్చుకోవాలి.

ఆకుకూర:

ఆకుకూర:

రీసెర్చ్ ప్రకారం, ఫైటోకెమికల్స్ చర్మం కొత్తగా కాంతివంతంగా ఉండేలా మరియు హైడ్రేషన్ తో ఉంచుతుంది . వింటర్ సీజన్ లో డ్రై స్కిన్ నివారణకు కేలా మరో లీఫీ వెజిటేబుల్.

నట్స్:

నట్స్:

వింటర్ సీజన్ లో నట్స్ చర్మానికి తగినంత తమే అంధివ్వడానికి సహాయపడుతుంది. కాబట్టి, డ్రై స్కిన్ డైట్ లో నట్స్ ను చేర్చుకోండి.

టర్కీ:

టర్కీ:

ఇది ఇక సీజనల్ డిష్. టర్కీలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది పొడి చర్మం మరియు పగిలిన చర్మంను నయం చేస్తుంది. దాంతో ఇది తేమకలిగి మరియు ప్రకాశవంతంగా ఉంటుంది.

క్యారెట్స్:

క్యారెట్స్:

విటమిన్ ఎ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం డ్రై స్కిన్ నివారించవచ్చు. కాబట్టి, క్యారెట్స్ ను డ్రై స్కిన్ డైట్ లో చేర్చుకోవాలి.

English summary

Dry Skin Diet: Foods That Cure

The winter season is the most dreadful one because of it various problems which come along. During this season, one of the main and common problems is that of dry skin.
Story first published: Wednesday, December 18, 2013, 13:35 [IST]
Desktop Bottom Promotion