For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళల బరువును అతి సాధారణంగా తగ్గించే ఆహారాలు...

|

సాధారణంగా మహిళలు పెళ్ళికి ముందు సన్నగా నాజూగ్గా ఉన్నా.. పెళ్ళి తర్వాత..పిల్లలు పుట్టిన తర్వాత బరువు పెరగడం లేదా లావుగా పొట్ట ఇలాంటి సమస్యలు ఏదుర్కోవల్సి వస్తుంది. అటువంటి వారు వారి పొట్ట చూసుకొని, లేదా తరచూ బరువు పెరుగుతున్నామన్న ఆలోచనతో బాధపడుతుంటారు. పెళ్ళి అయిన తర్వాత బరువు పెరిగే మహిళలు సన్నగా మారడానికి చాలా మంది ప్రయత్నించరు. ఇక ఎక్కడ సన్నబడుతారు? ప్రయత్నం ఉంటేనేగా ఫలితం ఉంటుంది.

అయితే శరీరం అధిక బరువుతో బాధ పడే వారు, వారి ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేయడం చాలా అవసరం. మహిళలు తమ సౌందర్యం మాత్రమే చూసుకోకుండా.. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవల్సిన బాధ్యత ఎంతో ఉంది. అధిక బరువు పెరిగే కొద్ది అనారోగ్యసమస్యలు అధికమౌతాయి. కాబట్టి మహిళల సౌందర్యంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడి, బరువును తగ్గించే కొన్ని పండ్లు, ఆహారాల గురించి తెలుసుకొని వాటిని తరచూ తినడం వల్ల ఎప్పుడూ ఎకే బరువును కలిగి ఉండేలా చేసుకోవచ్చు. మరి ఆ పండ్లు, ఆహారాలేంటో తెలుసుకుందాం...

మహిళలను ఎప్పుడూ నాజూగ్గా ఉంచే ఆహారాలు

ద్రాక్ష: ప్రతి రోజూ ఉదయాన్నే ఒక కప్పు ద్రాక్ష జ్యూస్ ను తాగడం వల్ల లేదా ద్రాక్ష పండ్లను తినడం వల్ల అధిక శరీర బరువును తగ్గించుకోవచ్చు.

మహిళలను ఎప్పుడూ నాజూగ్గా ఉంచే ఆహారాలు

గోధుమలు: ప్రతి రోజూ అన్నంకు బదులు గోధుమలతో తయారు చేసి ఆహారాలను ఎక్కుగా తీసుకోవాలి. రాత్రి సమయంలో మితాహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా చపాతీ తీసుకొన్నా సరిపోతుంది.

మహిళలను ఎప్పుడూ నాజూగ్గా ఉంచే ఆహారాలు

రెడ్ చిల్లీ: వంటకాల్లో ఎరుపు రంగులో ఉండే పచ్చిమిర్చిని ఉపయోగిస్తే కనుక శరీరంలో ఉండే అధిక కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.

మహిళలను ఎప్పుడూ నాజూగ్గా ఉంచే ఆహారాలు

రాస్ బెర్రీ: రాస్ బెర్రీ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవడం వల్ల, ఆహారంతో పాటు రాస్ బెర్రీని తినడం వల్ల జీర్ణక్రియ నిధానంగా జరగడం వల్ల త్వరగా ఆకలి అనిపించదు. అలాగే ఇందులో ఉండే పీచు శరీరంలో పేరుకొన్న కొవ్వును కరిగిస్తుంది.

మహిళలను ఎప్పుడూ నాజూగ్గా ఉంచే ఆహారాలు

నట్స్: స్నాక్స్ తినే సమయంలో లేదా ఎక్కువగా ఆకలిగా ఉన్న సమయంలో బేకరీ ఫుడ్స్ కు, స్నాక్స్ ను తినడం కంటే నట్స్(డ్రై ఫ్రూట్స్)ను తినడం వల్ల నోటికి రుచి మాత్రమే కాదు, శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. బరువు పెరగకుండా కాపాడుతుంది.

మహిళలను ఎప్పుడూ నాజూగ్గా ఉంచే ఆహారాలు

ఆరెంజ్: ఆరెంజ్ ఇది ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరం. ఉదయం నిద్ర లేచిన వెంటనే,ఆరెంజ్ జ్యూస్ తాగడం కానీ, ఆరెంజ్ ను తినడం కానీ చేస్తే శరీరం బరువు పెరగదు. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్, పీచు జీర్ణక్రియకు చాలా సహాయకారిగా పనిచేస్తుంది.

మహిళలను ఎప్పుడూ నాజూగ్గా ఉంచే ఆహారాలు

స్ట్రాబెర్రీ మరియు ఇతర బెర్రీస్: స్ట్రాబెర్రీ శరీర బరువును తగ్గిస్తుంది. శరీరానికి కావల్సిన శక్తిని ఇచ్చి, ఎక్కువ సేపు ఆకలికాకుండా సహాయపడుతుంది. కొవ్వును కరిస్తుంది.

మహిళలను ఎప్పుడూ నాజూగ్గా ఉంచే ఆహారాలు

నిమ్మకాయ: భోజనం చేసిన తర్వాత నిమ్మరసం, నిమ్మజ్యూస్ తాగడం వల్ల శరీరానికి చాలా మంచిది. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులోని సిట్రస్ ఆమ్లం బరువు పెరగనీయకుండా అడ్డుకుంటుంది.

English summary

Fat Burning Food for Women | మహిళలను ఎప్పుడూ నాజూగ్గా ఉంచే ఆహారాలు

There is a list of fat burning foods especially for women. As women needs more nutritional supplement when compared to men, there fat burners are rich in vitamins and nutrients to help shed weight whilst staying healthy.
Story first published: Friday, January 4, 2013, 12:36 [IST]
Desktop Bottom Promotion