For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లోయర్ బెల్లీ ఫ్యాట్ కరిగించే 15 టిప్స్ అండ్ ట్రిక్స్ .!

|

మీకు బెల్లీ ఫ్యాట్ ఉంది అంటే, అందుకు మీరు అనారోగ్యకరమైన జీవనశైలి ఎంపిక చేసుకొన్నారనడానికి సాక్ష్యం. ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల మీకు బెల్లీ ఫ్యాట్ ఉన్నప్పుడు మీరు ఎంత మంచి దుస్తులు ధరించినా కూడా ఆకర్షణీయంగా కనబడరు. బెల్లీ ఫ్యాట్ ఉంది అంటే, మీరు జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటున్నారని మరియు మీరు తగినంత వ్యాయామం చేయలేదని అర్ధం. అందుకు మీరు చింతించాల్సిన అవసరం లేదు; మీరు బరువు కోల్పోవానుకొన్నప్పుడు, లోయర్ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం చాలా సులభం. మీరు ఎప్పుడైతే బరువు తగ్గడం ప్రారంభిస్తారో, అప్పుడు మీ బెల్లీ ఫ్యాట్ కూడా అదృశ్యం అవ్వడం మొదట జరిగే మార్పు.

బరువు తగ్గించుకోవాలని ప్లాన్ చేసుకొన్నప్పుడు, మీ శరీరంలోని కొన్ని భాగాల్లో కొవ్వు కరింగించుకోవడం లక్ష్యంగా ఒక నిర్ధిష్ట మార్గం ఎంపిక చేసుకోవాలి. అందుకు సమతుల ఆహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాల మీద ప్రభావం చూపి, బరువు కోల్పోవడానికి సహాయపడుతుంది. కానీ, లోయర్ బెల్లీ ఫ్యాటి వదిలించుకోవటానికి , ఇక్కడ కొన్ని చిట్కాలు మరియు ట్రిక్స్ ఉన్నాయి . వాటిని ఫాలో అయితే తప్పకుండా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. మరి ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

లోయర్ బెల్లీ ఫ్యాట్ ను కరిగించేందుకు సహాయపడే కొన్ని ఆహారాలు...

నీళ్ళు:

ప్రతి రోజూ నీళ్ళు అధికంగా తీసుకోవడం వల్ల లోయర్ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. అందుకు మీరు ప్రతి రోజూ కనీసం 7-8గ్లాసుల నీరు త్రాగడం తప్పని సరి. దీని వల్ల మీ శరీరం ఎప్పుడూ హైడ్రేషన్ లో ఉంటుంది. ప్రతి రోజూ తగినంత మోతాదులో నీళ్ళు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు నెట్టివేయబడుతాయి. అంతే కాదు జీవక్రియలు క్రమంగా పనిచేసుందుకు బాగా సహాయపడుతాయి.

హెర్బ్స్(మూలికలు):

శరీరంలోని నీటిని శాతాన్ని తగ్గించే సోడియంను తీసుకోవడం చాలా తగ్గించాలి. అంటే మీరు తీసుకొనే ఆహారంలో ఉప్పు తగ్గించాలి . మీరు తీసుకొనే ఆహారంలో లేదా తినే ఆహారంలో ఉప్పుకు బదులు కొన్ని రకాల హెర్బ్స్ (మూలికలు) మరియు ఫ్లేవర్డ్ స్పైసీస్ తీసుకోవచ్చు.

తేనె:

ప్రతి రోజూ మీరు తీసుకొనే షుగర్ కంటెంట్ వల్ల బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంది. కాబట్టి మీరు మీ రెగ్యులర్ డైట్ నుండి చక్కెర మొత్తం తగ్గించండి. బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు చక్కెరకు బదులు తేనె బాగా సహాయపడుతుంది. కాబట్టిమీరు పంచదారకు బదులు తేనెను ఉపయోగించుకోవచ్చు.

చెక్క:

మీ శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంచడానికి, మీరు ప్రతి రోజూ తీసుకొనే కాఫీ మరియు టీ లలో దాల్చిన చెక్క పొడిని చల్లుకోవచ్చు. బెల్లీ ఫ్యాట్ కారణం అయ్యే చక్కర ఉపయోగాన్ని తగ్గించడానికి చెక్కను ఉపయోగించుకోవడం కూడా ఒక అద్భుతమైన మార్గం. లోయర్ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో ఖచ్చింతంగా ఒక ప్రభావంతమైన మార్గం.

నట్స్:

మీరు ఫ్యాట్ కరిగించుకోవాలంటే అందుకు కొన్నిఫ్యాట్ ఫుడ్స్ కూడా ఉపయోగపడుతాయి. కొవ్వు పదార్థాలు బరువు పెంచుతాయనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే కొన్ని కొవ్వు ఉన్న ఆహారాలు కూడా శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఏర్పడటానికి సహాయపడుతుంది. ఉదాహరణకు: నట్స్(వాల్ నట్స్, బాదం, వేరుశెనగ)వంటి వాటిలో మన శరీరానికి అవసరం అయ్యే మంచి కొవ్వులు కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని మీరు రెగ్యులర్ గా తీసుకోవడాన్ని పెంచండి.

అవొకాడో:

మన శరీరానికి అవసరం అయ్యే మంచి ఫ్యాట్స్ అవొకాడోలో ఉన్నాయి. అవొకాడోలో ఉన్న న్యూట్రిషియన్స్ కడుపు నిండుగా ఉండేట్లు చేస్తుంది . మీరు ఎక్కవగా తినాలనే కోరికను తగ్గిస్తుంది.

ఆరెంజెస్:

ఎప్పుడైతే మీరు ఒత్తిడికి గురిఅవుతారో అప్పుడు మీ శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ కు విరుగుడుగా విటమిన్ సి ఉపయోగపడటంతో పాటు, ఒత్తిడిని నియంత్రించడానికి సహాయపడుతుంది. కాబట్టి మీరు ఒత్తిడికి గురైనప్పుడు ఒక ఆరెంజ్ ను తినడం మంచిది. ఇది ఒత్తిడిని మొదట్లోనే నిరోధిస్తుంది.

పెరుగు:

మీరు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకున్నప్పుడు అనారోగ్యకరమైన డిజర్ట్స్ కు మీరు దూరంగా ఉండటమే మంచిది. బెల్లీ ప్యాట్ కు కారణం అయ్యే అటువంటి డిజర్ట్స్ కు ప్రత్యామ్నాయంగా పెరగును బాగా సహాయపడుతుంది. ఇందులో చాలా తక్కువ కాలరీలు మరియు పోషకాలతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

గ్రీన్ టీ:

లోయర్ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం కోసం, కనీసం రోజులో ఒకసారైనా గ్రీన్ టీని తాగడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా ఫలితం ఉంటుంది. గ్రీన్ టీ జీవక్రియలు సక్రమంగా పనిచేయడానికి తగినంత శక్తిని అందిస్తుంది మరియు త్వరగా ఫ్యాట్ ను కరిగిస్తుంది.

సాల్మన్:

సాల్మన్ ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో హెల్తీ ఫ్యాట్ కలిగి ఉండి శరీరంలో జీవక్రియలు సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతాయి. ఈ ఫ్యాట్స్ మిమ్మల్ని రోజంతా కడుపునిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. లోయర్ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం కోసం ఇటువంటి ఆహారాలు తీసుకోవడం ఒక అద్భుతమైన మార్గం.

బెర్రీస్:

శరీరంలో కొవ్వు నిల్వ ఉండటానికి చక్కెర కారణం అవుతుంది. బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి మీరు ఖచ్చితంగా చక్కెరకు మరియు ఆర్టిఫిషియల్ స్వీట్స్ (హానికరమైన సంరక్షణకారులకు) దూరంగా ఉండాలి . బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీ, చెర్రీస్ మరియు బ్లూ బెర్రీ వంటివి చక్కెర డెసెర్ట్లకు ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉన్నాయి.

బ్రొకోలీ:

బ్రొకోలీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని కార్టిసాల్ స్థాయిలు నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది.

నిమ్మరసం:

బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి ప్రతి రోజూ ఉదయం నిమ్మరసం తాగడం ఒక ఉత్తమమైన మార్గం. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు మరియు కొద్దిగా తేనె మిక్స్ చేసి ఉదయం పరకడుపు తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.

వెల్లుల్లి:

లోయర్ బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి, తాజాగా ఉండే ఒక వెల్లుల్లి రెబ్బను నమలడం మంచిది. ఒక వెల్లుల్లి రెబ్బ లెమన్ వాటర్ కంటే డబుల్ గా పనిచేస్తుంది. మరియు శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది.

అల్లం:

మీ రెగ్యుర్ డైట్ లో అల్లంను చేర్చుకోవడం చాలా మంచిది. లోయర్ బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడంలో ఇది ఒక ఉపాయకారి. ఇందులో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ ఉండి, ఇల్యూషన్ రెసిస్టెంట్ ను మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

English summary

Get Rid Of Lower Belly Fat With These Foods

Having belly fat is a testament to the unhealthy lifestyle choices made by you. You will not be able to look attractive in most of your clothes, due to your prominent paunch of muffin top. Having lower belly fat means you are eating too much junk food and not exercising enough.
Desktop Bottom Promotion