For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

12వారాల్లో అధిక బరువును తగ్గించే హెల్తీ మిల్క్ షేక్స్

|

ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం మన పెద్దల నుండి వింటూనే ఉంటాం. బ్రతికినంత కాలం ఎటువంటి అనారోగ్యం లేకుండా సంతోషంగా, ఆరోగ్యంగా బ్రతకగలిగినప్పుడు అంతకంటే మహాభాగ్యమా?

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండం వల్ల మన శరీరానికి కావల్సినన్ని పోషకాంశాలు పుష్కలంగా అంది, ఆరోగ్యంగా జీవించడానికి ఎక్కువగా సహాయపడుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొనే అలవాటును మెరుగుపరుచుకోవడం అనేది ఒక మంచి ఆలోచన మరియు మార్పు కూడా, కానీ న్యూట్రీషియన్ డైట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన శరీరంతో పాటు, ఆరోగ్యకరమైన బరువు మరియు మెంటలీ చాలా ఉపయోగకరం. ఆరోగ్యకరమైన డైట్ ను ఫాలో చేయకపోతే అధిక బరువు, ఒబేసిటి, మధుమేహం మరియు హైకొలెస్ట్రాల్ సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

ప్రస్తుత ఉరుకులపరుగుల రోజుల్లో చాలా మంది టైమ్ లేదనో, బద్దకించే శారీరక వ్యాయామం చేయడానికి ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించికపోతున్నారు. అయితే, వ్యాయామం లేకున్నా ఆరోగ్యకరమైన వెయిట్ లాస్ డైట్ వల్ల కొన్ని పౌండ్ల బరువును తగ్గించుకోవచ్చు. కానీ చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం బరువు తగ్గించుకోవడానికి క్యాలరీలను తగ్గించుకోవడం మరియు రెగ్యులర్ వ్యాయామం బాగా సహాయపడుతుందని తెలపడం జరిగింది.

ముఖ్యంగా, కొన్ని ముఖ్యమైన అలవాట్లను మార్చుకోవడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఉత్తమ మార్గం. మీరు స్లిమ్ గా మారాలనుకొన్నప్పుడు క్యాలరీలను తగ్గించుకోవడం ద్వారా ఇది సాధ్యం అవుతుందని గ్రహించాలి. ఇది చాలా త్వరగా బరువుతగ్గడానికి మరియు శాశ్వతంగా బరువు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. లోఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ మరియు తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా కూడా కొన్ని పౌండ్ల బరువును తగ్గించుకోవచ్చు.

అలాగే తాజా పండ్లు మరియు కూరగాలయతో తయారుచేసే మిల్క్ షేక్స్ కూడా కొన్ని పౌండ్లు బరువు తగ్గించడంతోపాటు, శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి(శరీరాన్ని శుభ్రపరచడానికి)మరియు జీవక్రియలు ఆరోగ్యంగా పనిచేయడానికి బాగా సహాయపడుతాయి. మరి అటువుంటి మిల్క్ షేక్స్ కొన్ని ఈ క్రింది స్లైడ్ లో ఇవ్వబడుతున్నాయి. ఈ మిల్క్ షేక్స్ క్రమం తప్పకుండా 12వారాలు తీసుకుంటే తప్పకుండా కొన్ని పౌండ్ల బరువును తగ్గించుకోవచ్చు...

స్ట్రాబెర్రీ-ఆరెంజ్ డైట్ మిల్క్ షేక్:

స్ట్రాబెర్రీ-ఆరెంజ్ డైట్ మిల్క్ షేక్:

మిక్సీలో రెండు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్ మరియు ఒక కప్పు స్ట్రాబెరీ వేసి గ్రైండ్ చేయాలి. అలాగే అందులో రెండు మూడు స్లైస్ లఅరటిపండు, రెండు కప్పులు ఫ్యాట్ ఫ్రీ మిల్క్ ఒక కప్పు ఐస్ ముక్కలు వేసి మరో సారి గ్రైండ్ చేయాలి. ఐస్ ముక్కలు పూర్తిగా మిల్క్ షేక్ తో కలిసిపోయే వరకూ బ్లెండ్ చేయాలి. ఇది చాలా స్మూత్ గా కొద్దిగా పెరుగు కూడా మిక్స్ చేసి బ్లెడ్ చేయాలి . అంతే చల్లచల్లగా తాగాల్సిందే..

బెర్రీ మిల్క్ షేక్:

బెర్రీ మిల్క్ షేక్:

బెర్రీస్ పుష్కలమైన్ యాంటీఆక్సిడెంట్స్ ను అంధిస్తాయి. బెర్రీస్ లో ఎక్కువ ప్రయోజనాలను అందించే బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్ మరియు స్ట్రాబెర్రీస్ తీసుకొని మిల్క్ షేక్ మిక్సర్ లో వేయాలి, కొద్దిగా మెత్తగా అయ్యాక అందులో లో ఫ్యాట్ వెనీలా ఐస్ క్రీమ్ మరియు లోఫ్యాట్ పాలు వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. అంతే ఈ చల్లని బెర్రీ మిల్క్ షేక్ ను వెంటనే సర్వ్ చేయాలి.

సోయా మిల్క్ షేక్:

సోయా మిల్క్ షేక్:

మీరు చాలా నిసత్తువగా ఉన్నప్పుడు మీకు వెంటనే ఎనర్జీని అందించే ఒక బెస్ట్ డ్రింక్ ఇది. ఫ్యాట్ ఫ్రీ సిరప్, లోఫ్యాట్ సోయా మిల్క్, రెండు టేబుల్ స్పూన్ల ఇన్ స్టాంట్ కాఫీగ్రాన్యుల్స్ మరియు వెనీల సోయా ఐస్ క్రీమ్ వేసి బ్లెడ్ చేయాలి. అంతే చల్లగా సర్వ్ చేయాలి.

మ్యాండరిన్ -మ్యాంగో మిల్క్ షేక్:

మ్యాండరిన్ -మ్యాంగో మిల్క్ షేక్:

రెండు కప్పులు ఎండిన ఆరెంజ్ తొనలు, 2కప్పుల మ్యాంగో చుంక్స్, ఒక కప్పు లోఫ్యాట్ మిల్క్ , ఒక కప్పు మ్యాంగో ఫ్లేవర్డ్ లోఫ్యాట్ పెరుగు మరియు 1కప్పు ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేయాలి. అంతే ఈ మిల్క్ షేక్ ను చల్లచల్లాగా తీసుకోవాలి.

మజ్జిగ -బనానా చాక్లెట్ వెనీలా షేక్:

మజ్జిగ -బనానా చాక్లెట్ వెనీలా షేక్:

బ్లెండర్ లో అరటికాయ ముక్కలు, 1టేబుల్ స్పూన్ వెనీ ఎక్సాక్ట్, ఒక కప్పు సోయా మిల్క్, 1టేబుల్ స్పూన్ పంచదార, ఒక చెంచా తియ్యగా లేని కోకో పౌడర్ మరియు ఒక కప్పు లోఫ్యాట్ పెరుగు వేసి, బ్లెండ్ చేయాలి. మీకు చల్లగా ఉండాలంటే ఐస్ ముక్కలు కూడా వేసుకోవచ్చు.

కాఫీ -మోచా డైట్ షేక్:

కాఫీ -మోచా డైట్ షేక్:

ఇది భోజనానికి ప్రత్యామ్నాయంగా తీసుకొనే ఒక ఉత్తమ పానియం. ఒక చెంచా ఇన్ స్టాంట్ కాఫీ పౌడర్, ఒక చెంచా కోకా పౌడర్, ఒక చెంచా పంచదార, కొన్ని ఐస్ క్యూబ్స్, ప్లెయిన్ లోఫ్యాట్ పెరుగు మరియు ప్రోటీన్ సప్లిమెంట్ పౌడర్ ను వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. అంతే చల్లచల్లగా సేవించాలి.

స్ట్రాబెర్రీ-ఆరెంజ్ మిల్క్ షేక్:

స్ట్రాబెర్రీ-ఆరెంజ్ మిల్క్ షేక్:

బ్లెండర్ లో రెండు కప్పుల స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ మిల్క్, ఒక కప్పు ఆరెంజ్ తొనలు, ఒక కప్పు ఆరెంజ్ పాప్, సెమీ స్వీట్ చాక్లెట్ చిప్స్ మరియు ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేసి వెంటనే త్రాగాలి.

బ్లూ బెర్రీ-క్రాన్ బెర్రీ మిల్క్ షేక్:

బ్లూ బెర్రీ-క్రాన్ బెర్రీ మిల్క్ షేక్:

బ్లెండర్ లో ఒక కప్పు క్రాన్ బెర్రీ జ్యూస్, 3-4స్ట్రాబెర్రీస్, కొద్దిగా బ్లూ బెర్రీస్, కొద్దిగా రాస్బెర్రీస్, కొద్దిగా అరటిపండు, లోఫ్యాట్ పెరుగు, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేసి కూల్ కూల్ గా తీసుకోవాలి.

మ్యాంగో మిల్క్ లస్సీ:

మ్యాంగో మిల్క్ లస్సీ:

ఇది పూర్తి ఇండియన్ పానీయం. దీన్ని తాజా మామిడిపండ్లతో తయారుచేస్తారు. మామిడి ముక్కలు అరకప్పు, ఒక కప్పు లోఫ్యాట్ మిల్క్, ఒక కప్పు ప్లెయిన్ పెరుగు, కొన్ని పిస్తాలు, మరియు ఒక టేబుల్ స్పూన్ యాలకులపొడి, ఐస్ క్యూబ్స్ వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. దీన్ని కూల్ కూల్ గా తీసుకోవాలి.

గుమ్మడి మిల్క్ షేక్:

గుమ్మడి మిల్క్ షేక్:

గుమ్మడితో తయారుచేసే మిల్క్ షేక్క్ ఆరోగ్యకరమైన డ్రింక్. ఇది చాలా పాపులర్. మిక్సీలో ఒక కప్పు వెనీలా లోఫ్యాట్ ఐస్ క్రీమ్, స్కిమ్డ్ మిల్క్, ఒక స్లైస్ గుమ్మడి పీ, వేసి మొత్తాన్ని మొత్తగా బ్లెండ్ చేయాలి. తర్వాత కూల్ కూల్ గా తీసుకోవాలి.

బ్లూ బెర్రీ సోయా మిల్క్:

బ్లూ బెర్రీ సోయా మిల్క్:

ఒక కప్పు బ్లూబెర్రీస్, ఒక కప్పు పెరుగు, ఒక కప్పు సోయా మిల్క్, ఒక టీస్పూన్ వెనీలా ఎక్సాక్ట్ మరియు ఐస్ క్యూబ్స్ వేసి మెత్తగా బ్లెండ్ చేసి వెంటనే తీసుకోవాలి.

రాస్బెర్రీ-అవొకాడో షేక్:

రాస్బెర్రీ-అవొకాడో షేక్:

బ్లెండర్ లో ఒక పొట్టు తీసి కట్ కట్ చేసిన అవొకాడో ముక్కలు 3/4కప్పు ఆరెంజ్ జ్యూస్, 2కప్పుల రాస్బెర్రీ జ్యూస్, 1కప్పు ఫ్రోజోన్ రాస్బెర్రీ, ఒక కప్పు లోఫ్యాట్ మిల్క్ మరియు కొన్ని ఐస్ ముక్కలు వేసి మెత్తగా బ్లెండ్ చేసి కూల్ కూల్ గా తాగాలి.

ఖర్జూరం మిల్క్ షేక్:

ఖర్జూరం మిల్క్ షేక్:

ఒక కప్పు వెనీల్ పెరుగు, ఒక కప్పు లోఫ్యాట్ మిల్క్, అరకప్పు గింజలు తీసేసిన ఖర్జూరం, ఒక టీస్పూన్ వెనీలా ఎక్సాక్ట్ మరియు ఐస్ క్యూబ్స్ మెత్తగా గ్రైండ్ చేసి చల్లచల్లగా సర్వ్ చేయాలి.

ఆపిల్ మిల్క్ షేక్:

ఆపిల్ మిల్క్ షేక్:

బ్లెండర్ లో 1/4కప్పు ఆపిల్ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ ఆర్టిఫీషియల్ స్వీట్ నర్స్, ఒక కప్పు స్కిమ్డ్ మిల్క్, ఒక కప్పు నీళ్ళు, కొన్ని ఐస్ ముక్కలు వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. వెంటనే సర్వ్ చేయాలి.

English summary

Healthy Milk Shakes For Weight Loss

We always come across the old saying, "health is wealth" most of the times and it literally means that no matter how much of wealth you try to acquire, if you aren't hale and hearty then you can never lead a healthy and fulfilling life.
Desktop Bottom Promotion