For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల కొరకు ప్రత్యేకమైన 15 హార్ట్ హెల్తీ ఫుడ్స్!

|

అనుకోకుండా సడెన్ గా చెస్ట్ పెయిన్ అనిపిస్తే, గుండె ఆరోగ్యం గురించి చాలా మంది ఆందోళన చెందుతారు. ఎప్పుడైతే మీరు బయట ఆహారాలు తినడానికి ఇష్టపడుతారో, అప్పుడు, ఫ్యాట్ అధికంగా ఉన్న మరియు కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలను కు దూరంగా ఉంటారు. అందుకు మీరు ఆందోళన చెందాల్సిన అవసంర లేదు. పురుషుల్లో గుండె సంబంధిత వ్యాధులను నిరోధించడంలో అనేక డైట్ ఫుడ్స్ ఉన్నాయి. ఈ ఆహారాలను పురుషుల రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల, మీరు గుండె సంబంధిత వ్యాధులు మరియు గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

గుండెకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు ఆందోళన చెందకుండా ఉండాలంటే, ఈ డైట్ ఫుడ్స్ ను పురుషుల రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు, ఫ్లెవనాయిడ్స్ మరియు విటిమిన్స్ అధికంగా ఉన్న ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అనేక గుండె సమస్య నివారించడానికి జాగ్రత్త వహించవచ్చు.

పురుషుల్లో గుండె వ్యాధులను దూరంగా ఉంచేందుకు అటువంటి ఆహారాలను ప్రకృతి సృష్టించింది. ప్రకృతి పరంగా, సహజంగా మనకు లభించే వాటిలో చేపలు, నట్స్, పండ్లు, కూరగాయలు, రెడ్ వైన్, చాక్లెట్స్ మరియు టీ వంటి వాటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొంటే, మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి పురుషు గుండె సమస్యలను నివారించడంలో మంచి ఆహారాలను ఈ క్రింది విధంగా ఉన్నాయి..పరిశీలించండి..

సాల్మన్:

సాల్మన్:

వారంలో ఒకటి రెండు సార్లు సాల్మన్ చేపలను తినడం వల్ల హార్ట్ అటాక్ లను నివారించవచ్చు. అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ వీటిని ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనిపిలుస్తారు. ఇవి చేపల్లో అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గిస్తుంది. గ్రిల్డ్ సాల్మన్ లేదా క్రిస్పీ సాల్మన్ సలాడ్ ను బ్రేక్ ఫాస్ట్, లంచ్, లేదా డిన్నర్ కు తినవచ్చు.

ఓట్ మీల్:

ఓట్ మీల్:

ఓట్ మీల్ ల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియ, పొటాషియం, ఫొల్లెట్, నియాసిన్, క్యాల్షియం, మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఓట్ మీల్లో ఉండే సొల్యుబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ కు ఓట్ మీల్ ను తీసుకోవడం ఉత్తమమైన ఆహారం. ఓట్ మీల్ మీద తాజాగా ఉండే బెర్రీస్ ను గార్నిష్ చేసుకోవచ్చు.

బాదాం:

బాదాం:

దం కూడా హార్ట్ హెల్తీ కోసం తీసుకొనే ఆహారాల్లో ఒక భాగమే. ఇందులో అధిక శాతంలో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్, మెగ్నీషియం, ఫైబర్, హార్ట్ ఫేవరబుల్ మోనో, పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండి, గుండె సమస్యలను నివారిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఆకలిని పెంచదు.

కిడ్నీ బీన్స్:

కిడ్నీ బీన్స్:

గింజ దాన్యాలలో సోయా చాల ప్రత్యేకమైనది. మిగిలిన ఆహారపదర్దాల తో పోలిస్తే సోయా సమాహారమైన పోషకాలు కలిగి ఉంటుంది. కొన్ని రకాల జబ్బులను దరిచరనివ్వదు. త్వరగా జీర్ణము అవుతుంది. అందుకే దీన్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చ్ను. శరీరానికి అవసరమైన అమినోయసిడ్లు, లైసీన్ ల తోపాటు పరొక్షముగా ఇసోఫ్లేవిన్స్(Isoflavins) ని కలిగిఉంటుంది. సోయద్వారా లబించే మాంసకృత్తులు-పాలు, మాంసము, కోడిగుడ్లతో సరిసమానము. గుండె ఆరోగ్యాన్ని కాపాడే మెగ్నీషియం, ఫైబర్ యాంటీఆక్సిడెంట్స్, ఫొల్లెట్ పుష్కలం. తృణధాన్యాలల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బి కాంప్లెక్స్ అధికం. కాలేయ పనితీరు సామార్థాన్ని ప్రోత్సహించేందుకు బాగా సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ మల్టీ గ్రెన్ పిండి మరియు సోయా పిండి ఆరోగ్యానికి చాలా మంచిది అందువలన వాటిని వాడటం వల్ల కాలేయ సమస్యలను దూరంగా ఉంచవచ్

రెడ్ వైన్:

రెడ్ వైన్:

రెడ్ వైన్ గుండెకు మేలు చేస్తాయని అనేక పరిశోధనలు నిరూపించాయి. గుండె ఆరోగ్యానికి ప్రభావంతంగా ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. రెడ్ వైన్ లో 70శాతం పైగా కోకో కేట్ ఛిన్స్ అనే పదార్థం శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కనుక రెడ్ వైన్ గుండెకు చాలా మంచి పానీయం. మితంగా తీసుకోవచ్చు.

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లు:

నిమ్మజాతికి చెందిన పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. బాగా పండిన నారింజలో విటమిన్ -ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్ పొటాషియమ్, ఫైబర్ ఎక్కువ. పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండెకు రక్షణ కలుగుతుంది.

టమోటో:

టమోటో:

ఎర్రగా చూస్తానే ఆకర్షించే టమోటోలలో ఒక సీక్రెట్ దాగిఉంది. ఇందులో చాలా శక్తివంతమైనటువంటి యాంటి ఆక్సిడెంట్ కాంపౌడ్ లైకోపెనే కలిగి ఉండి. దీని ద్వారానే ఆ టమోటోలకు అంతటి ఆకర్షనీయమైన కలర్ ను కలిగి ఉంటుంది. చాలా తక్కువ ఖరీదులో అరుదుగా దొరికేటటువంటి టమోటోలు లోఫాట్ ఆహారం. కాబట్టి అతి త్వరగా బరువును తగ్గించే ఆహార పదార్థాలల్లో తప్పనిసరిగా టమోటోలను చేర్చండి. శరీరానికి కావలసిన శక్తిని పొందండి. హర్ట్ రేట్ తగ్గించడంతో పాటు, గుండెలో మంటను తగ్గిస్తుంది. టమోటోలను రెగ్యులర్ గా తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చు.

బొప్పాయి:

బొప్పాయి:

గుండె ఆరోగ్యానికి మేలుచేసే మరో పండు బొప్పాయి. రోజు పరగడుపున చిన్న బొప్పాయి ముక్క తీసుకొని చూడండి ఎంతో మార్పూ కనిపిస్తింది. ఇందులో బీటా కెరోటిన్, బీటా క్రిప్టాక్సాన్తిన్, లూటిన్, విటమిన్ సి మరియు ఇ, ఫొలేట్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పుష్కలంగా ఉంటాయి. ఫ్రూట్ సలాడ్స్ లో బొప్పాయిని కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు.

డార్క్ :

డార్క్ :

చాక్లెట్ బార్ లో ఉన్న కొన్ని రసాయనాలు హృదయనాళ వ్యవస్థను సాఫీగా ఉంచుతాయి. అలాగే గుండె జబ్బులు రాకుండా సహాయపడతాయి. డార్క్ చాక్లెట్ ముఖ్యముగా దాదాపు 50% గుండెపోటు,10% హృదయ వ్యాధుల యొక్క ముప్పు తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఒక చాక్లెట్ బార్ ను తినవచ్చు. చాక్లెట్లులో ముఖ్యమైన పదార్ధంగా ఉన్న కోకో పౌడర్ లో తక్కువ కొవ్వు ఉంటుంది. చాక్లెట్లు అంటే ఇష్టపడే వారు బరువు పెరగకుండా ఉండటానికి తక్కువ కొవ్వు ఉన్న చాక్లెట్లు ఎంపిక చేసుకోవాలి. కానీ ఎక్కువ కాకుండా ఒక పరిమితిలో తినాలి. అలాగే, మీరు తినే చాక్లెట్లులలో కోకో పౌడర్ 60% కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.

టీ:

టీ:

వారంలో కనీసం రెండు, మూడు సార్లు అయిన హెర్బల్ "టీ" తాగాలి. ఎందుకంటె.. ఈ "టీ" లో కేఫినే ఉండదు కాబట్టి గుండెకు మేలు చేస్తుంది. ముఖ్యంగా టీలో యాంటీఆక్సిడెంట్స్, ప్రధానంగా పిలువబడే ఫ్లెవనాయిడ్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తం గడ్డకట్టడానికి నిలుపు చేస్తుంది మరియు బ్లడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది .

ఎండు ద్రాక్ష:

ఎండు ద్రాక్ష:

ఎండు ద్రాక్షలో కూడా అధిక పొటాషయం ఉంటుంది. మరియు సోడియం తక్కువ. ఇవి టిచికార్డియా(గుండె సమస్యలకు కారణం అయ్యే)ను సహజంగా నివారిస్తుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. శరీరంలో మెగ్నీషియం తక్కువ కావడం వల్ల కూడా హై హార్ట్ రేట్ పెరగడానికి మరియు ఇతర హార్ట్ సమస్యలు ఏర్పడటానికి కారణం అవుతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతాయి. బాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి సహాయపడుతుంది. అంతే కాదు శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను శరీరం నుండి బయటకు పంపడానికి బాగా సహాపడుతాయి.

ఆపిల్స్:

ఆపిల్స్:

యాపిల్ ను ఆహరంలో ఓ భాగంగా చేసుకోవాలి. ఈ పాండులో లబించే పోtaశియం, ఫాస్ఫరస్ చాల మేలు చేస్తుంది. విటమిన్స్‌, మినరల్స్‌, ఐరన్‌ ఆపిల్‌లో పుష్కలం గా వున్నాయి. ఇంకా ఇందులో పాస్పరస్‌, పొటాషియం, కాల్షియం, విటమి న్‌ ఏ, బి, సి కూడా ఇందులో అధిక మోతాదులో వుంటాయి. ఇవి గుండెకు రక్తాన్ని తీసుకువెళ్ళే నరాలకు ఎంతో మంచి చేస్తాయిí అని న్యూట్రీషనిస్ట్‌ స్నేహా త్రివేది చెబుతున్నారు. ఇందులో గ్లైసెమిక్‌ చాలా తక్కువ మోతాదులో వుంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో మంచిది అని చెబుతున్నారు.

ఆలివ్‌ ఆయిల్‌ :

ఆలివ్‌ ఆయిల్‌ :

ఆలివ్‌ ఆయిల్‌లో వుండే మోనో-శాటురేటెడ్స్‌ వల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గేందుకు వుపయోగపడతాయి.ఇందులో యాంటీ యాక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో వున్నాయి. ఇవి గుండె కవాటాలు సక్రమంగా పనిచేసేందుకు వుపయోగపడతాయి. గుండె సంబంధిత సమస్యలను కూడా ఇవి నివారిస్తాయి. ఇది శరీరంలోని చెడు కూవ్వు ను సులువుగా తగ్గిస్తుంది. అందుకే సలాడ్ లో ఆలివ్ నూనె తప్పనిసరిగా వేయాలి.

English summary

Heart Healthy Foods For Men

Whenever you have chest pain, you get so worried about your heart's health. Or whenever you eat out you regret later for having food full of fat and cholesterol. You need not worry now. There are many diet foods for men which prevents heart diseases.
Desktop Bottom Promotion