For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుభవార్త! బరువు తగ్గాలనుకునే వారు కూడా తీపి తినవచ్చు.

|

How to Enjoy Sweets on a Diet
మీరు మీ శరీర ఆకృతిని మరియు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీపి వంటి కొన్ని ఆహార పదార్ధాలకి దూరంగా ఉన్నారా? అయితే మీకొక శుభవార్త. మీ శరీరానికి ఎటువంటి చెడు కలుగకుండా మీకు నచ్చిన ఆహారాలు ఎన్నో తినవచ్చు. చాక్లెట్స్, కుకీస్, చిప్స్ లేదా మరేవైనా అధిక కేలరీలని పెంచేవి కుడా తినవచ్చు. ఇవన్ని మీ ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావం చూపెట్టకుండా ఉండేలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేమిటంటే

1. ఒక రోజులో ఎన్ని కేలరీలున్న తీపి పదార్ధాలు మీరు తీసుకుంటున్నారో గమనించండి. 200 నుండి 300 కేలరీల వరకు తీసుకోవడం అయితే పరవాలేదు.

2. తీపి పదార్ధాలని కొంచెం అదుపులో ఉంచుకుని తినాలి. క్రిస్టీస్ తిన్సేషన్స్ కుకీస్(Christie thinsations cookies) మరియు స్నాక్స్ వంటివి 100 కేలరీ పాక్స్ లలో లభించేవి కొనుక్కుని తినండి. ఇంకా ఓరియోస్(Oreos), చిప్స్ ఆహాయ్ (Chips Ahoy), గ్రహం క్రాకర్స్(Graham Crackers), బిట్స్ అండ్ బైట్స్ (Bits and Bites ) వంటివి ఒక సారి తినేందుకు ప్రతి బాగ్ లో ప్యాక్ చేసి ఉంచి అమ్ముతారు. అంతే కాదు కాడ్బరీ తిన్స్ (Cadbury Thins ), కిట్ కాట్ (Kitkaat ) మరియు ఏరో సింగిల్స్ (Aero Singles) వంటివి అతి తక్కువ కేలరీలు లభించే ఆహార పదార్దములు.

3. షుగర్ ఫ్రీ స్వీట్స్ ని వాడండి. ఆహార దుకాణాలలో ఇవి ఎక్కువగా లభిస్తాయి. కాని వీటిని ఎక్కువగా వాడకూడదు. ఎందుకంటే ఇవి నిజమైన పంచదార ని తినాలనే కోరిక ని తీవ్రం చెయ్యడం తో పాటు వీటిలో ఉండే అస్పర్టం (Aspartame) మరియు కృతిమ తీపి పదార్దములు కాన్సర్ కి కూడా దారి తియ్యవచ్చు.

4. మీ శరీరంలో నున్న అదనపు కేలరిలను వ్యాయామం ద్వారా ఖర్చు చెయ్యండి. ఒక వేళ మీరు 200 కేలరీలు న్న తీపి లేదా వేరే ఇతర పదార్దములు ఏవైనా తింటే అదనపు కేలరీల ను ఖర్చు చెయ్యడం ద్వారా తొలగించుకోండి. శరీరపు బరువుని తగ్గాలనుకుంటున్న వారు, ప్రతి రోజు తినే ఆహార పదార్ధములో ఉండే అదనపు కేలరీల తో పాటు మరికొన్ని అదనపు కేలరీలను ఖర్చు చెయ్యవలసి వస్తుంది.

కేలరీలు ఎలా ఖర్చవుతాయి
పదిహేను నిమిషాల పాటు మెట్లు ఎక్కడం వల్ల 220 కేలరీలు ఖర్చవుతాయి.

ఒక గంట పాటు డ్రమ్స్ ని వాయించడం ద్వారా 235 కేలరీలు ఖర్చవుతాయి.

ఒక గంట సేపు బాస్కెట్ బాల గేమ్ లో ని షూటింగ్ బాస్కేట్స్ ద్వారా 265 కేలరీలు నశిస్తాయి.

ముప్పై నిమిషాల పాటు లాన్ ని శుభ్రం చెయ్యడం వాళ్ళ 117 కేలరీలు ఖర్చవుతాయి.

ఒక గంట బౌలింగ్ వల్ల 175 కేలరీలు ఖర్చవుతాయి.

ఒక గంట పాటు మినీ గోల్ఫ్ ఆడడం ద్వారా 175 కేలరీలు ఖర్చవుతాయి.

పదిహేను నిమిషాల పాటు స్కిప్పింగ్ వల్ల 177 కేలరీలు ఖర్చవుతాయి.

పదికిలోమిటర్ల దూరం పరిగెత్తడం ద్వారా 100 కేలరీలు ఖర్చవుతాయి.

పదిహేను నిమిషాల పాటు ఈత కొట్టడం ద్వారా 100 కేలరీలు ఖర్చవుతాయి.

ఒక గంట పాటు బీచ్ వాలీ బాల్ ఆడడం వల 470 కేలరీలు ఖర్చవుతాయి.

చిట్కాలు

కాఫీకి దూరంగా ఉండండి. తాజా పళ్ళతో తయారు చేసే ఫ్రూటీ స్మూతీ(Fruity smoothie ) తో కాఫీ ని భర్తీ చెయ్యండి

తాజా పళ్ళు, మరియు కూరగాయలు, తక్కువ కొవ్వు కలిగిన వెజీస్, స్మూతీస్ వంటివి తినడానికి అందుబాటులో ఉంచుకోండి.

తీపి పదార్దములు ఎవైనా తినాలనిపించినప్పుడు బబుల్ గమ్ ని నమలండి. మీకు తీపి తినాలనే కోరిక తగ్గడమే కాకుండా, నమిలే టప్పుడు మీకు ఆకలి వెయ్యదు. కానీ ఫ్రూటీ గమ్స్ కి దూరంగా ఉండండి, వీటికి ఆకలి పెంచే గుణం ఉంది.

ఈ పద్దతులు పాటించే టప్పుడు, కొంచెం తేనెని, బ్రౌన్ షుగర్(తెల్లటి షుగర్ బదులు) వాడండి. అయినా మీకు తీపి తినాలనే కోరిక తగ్గకపోతే, కొంచెం టీ లో తేనెని లేదా బ్రౌన్ షుగర్ ని కలిపి తాగండి. కాకపోతే, టీ లో వాడే మాములు మిల్క్ బదులు తక్కువ కొవ్వు కలిగిన మిల్క్ ని లేదా రైస్ మిల్క్ ని వాడండి.

English summary

How to Enjoy Sweets on a Diet | స్వీట్స్ తింటూనే...బరువు తగ్గించేసుకోండిలా...!

Even if you are on a diet, you can still enjoy your favourite sweets and other empty calorie treats. Whether you love chocolate, cookies, chips or any other indulgence, with some basic knowledge, you can enjoy your favourite treats while still being successful at loosing weight and staying healthy! 
Story first published:Wednesday, January 2, 2013, 8:32 [IST]
Desktop Bottom Promotion