For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటివద్దనే మీ పొట్టను తగ్గించే సూపర్ టిప్స్

By Super
|

మీ పొట్టను మీరు తగ్గించుకోవాలి అనుకుంటే, మీరు ఏంతింటున్నారో మీరు గమనించుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్ తినడానికి చాలా ఉత్సాహంగా ఉంటాయి, కానీ మీ మధ్యస్థ విభాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడం అంత తేలికైన పనికాదు. ఇదంతా మీరు దేనిని ఎక్కువ ఇష్టపడుతున్నారు...... ఆహారమా లేదా పొట్ట తగ్గిన్చుకోవడం గురించా.

బరువు తగ్గడానికి, మొదట మీ ఆహార అలవాట్లను నియంత్రి౦చు కోవడానికి మనసిక శక్తిని బలోపేతం చేయండి, తరువాత ప్రతిరోజూ వ్యాయామం చేయండి. ఇందులో కోతలేమీ లేవు.

ఉప్పగా ఉండే పుల్లని పండ్లు:

ఉప్పగా ఉండే పుల్లని పండ్లు:

ఆరంజ్, నిమ్మ, కివి, తన్జేరిన్, తాజా లైం వంటివి కొవ్వును తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడే పండ్లు. ఇతర పండ్లతో పోల్చుకుంటే, విటమిన్ C సంపన్నంగా కలిగిన పుల్లని పండ్లు కొవ్వును కరిగించి, జీవక్రియను అభివ్రుద్దిపరుస్తుంది. మీరు బరువు తగ్గే ప్రయత్నాలను ప్రారంభించినపుడు, ఆపిల్, పుచ్చకాయ, ద్రాక్ష, స్ట్రాబెరీ వంటి కొవ్వును కరిగించే అనేక ఇతర పండ్లతో పాటు పుల్లని పండ్లను తీసుకుంటే తక్షణ ఫలితం ఉంటుంది.

రంగుల కూరగాయలు:

రంగుల కూరగాయలు:

కూరగాయలలో మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి, కాలరీలు తక్కువగా ఉంటాయి. కాబేజ్, బ్రోకోలి, టమోటాలు, బచ్చలి కూర, బీన్స్, బఠాణీ వంటి కూరగాయలలో మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి, కొవ్వు అస్సలు ఉండదు. కూరగాయలను అధిక నూనె, సుగంధ ద్రవ్యాలతో వండడానికి బదులుగా, కొద్ది ఆలివ్ లేదా సన్-ఫ్లవర్ నూనెతో ఉడికించి వేయించండి.

వివిధరకాల పప్పులు:

వివిధరకాల పప్పులు:

పప్పుదినుసులు లేదా పప్పులలో అమైనో యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి, కాలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. మొలకెత్తిన గింజలలో అమైనో యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి, వీటిని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.

అల్పాహారంగా ఓట్స్:

అల్పాహారంగా ఓట్స్:

ఓట్మీల్ కరగని ఫైబర్ ని కలిగి ఉంటుంది, దీన్లో మీకు ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉండే కొన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అవి మీకు మంచి బలాన్ని చేకూరుస్తాయి.

గింజల అల్పాహారం:

గింజల అల్పాహారం:

గుప్పెడు బాదం లేదా వాల్నట్స్ మీ ఆకలిని తరిమికొట్టడానికి చక్కగా సరిపోతాయి, మీ కాలరీలను పెంచవు.

గుడ్లు మంచివి:

గుడ్లు మంచివి:

గుడ్లు ప్రోటీన్ ని సమృద్ధిగా కలిగి ఉ౦డి, తక్కువ కాలరీలను, కొవ్వును కలిగి ఉండి మీ జీవక్రియ స్థాయిని పెంచుతాయి.

ఆయిలీ ఫిష్:

ఆయిలీ ఫిష్:

సాల్మన్, మకేరెల్, టున వంటి చేపలలో ప్రోటీన్ అధికంగా ఉండి, జీవక్రియను పెంపొందిస్తాయి. ఇవి మంచి కొవ్వు ఆమ్లాలను (ఒమేగా 3 యాసిడ్) కలిగి ఉండడం వల్ల మీ పొట్టను కరిగిస్తాయి.

ఎక్కువ నీరు:

ఎక్కువ నీరు:

నీరు మీ జీవక్రియను అభివ్రుద్దిపరిచి, కొవ్వును కరిగించే విధానాన్ని ప్రారంభిస్తుంది.

వ్యాయామం: 1

వ్యాయామం: 1

మీ కాలును అటూఇటూ తిప్పడం మీ పొట్ట, సేల్యులైట్ తో నిండిఉన్న తొడలు, పిరుడులపై బాగా పనిచేస్తుంది.

మీరు నేలపై ఫ్లాట్ గా వంగి, అరచేతులు కిందకు చూస్తున్నట్లుగా మీ చేతులను వెనుకకు బిగించ౦డి.

నేలపై నుండి మీ రెండు కాళ్ళను 45 డిగ్రీల యాంగిల్ లో గాలిలోకి పైకి పెట్టండి.

మొదట క్లాక్-వైస్ డైరెక్షన్లో 10 నిమిషాలపాటు అటూఇటూ తిప్పండి, ఎటువంటి ఆటంకం లేకుండా యాంటీ క్లాక్-వైస్ డైరెక్షన్లో అదేవిధంగా తిప్పండి.

ప్రారంభంలో, ఒక కాలుతో 2 సార్లు కాలక్-వైజ్ డైరెక్షన్లో 2 సార్లు యాంటీ క్లాక్-వైస్ డైరెక్షన్లో తిప్పడం ప్రారంభించండి.

మొదటగా చేసేవారు మోకాలిని వంపి తరువాత తిప్పండి.

ఆపకుండా 5-6 సార్లు ఇలా చేయండి.

మీ పొత్తికడుపు కండరాలు, మీ తొడలు అలసినట్లుగా అనిపిస్తుంది.

వ్యాయామం 2:

వ్యాయామం 2:

ఇంటివద్ద పొట్టను తగ్గించుకోవడానికి పైన చెప్పిన ఆసనాల పద్ధతిలో మీ చేతులను వెనుకకు ఉంచండి.

మీ కాళ్ళను 45 డిగ్రీల యాంగిల్ లో పైకి ఎత్తడం దించడం చేయండి.

అలాగే మరో 5-6 సార్లు చేయండి.

మొదట ఒకేకాలుతో అంటే మీ కుడికాలుతో 10 సార్లు పైకి, కిందకు చేయండి, తరువాత ఎడమ కాలితో.

మొదట కొన్నిరోజులు నెప్పిగా ఉంటుంది, కానీ చేస్తూ ఉంటే బాగానే ఉంటుంది.

వ్యాయామం 3:

వ్యాయామం 3:

క్రంచెస్ పొట్టతగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. మీరు సరైన విధానంలో క్రంచింగ్ వ్యాయామాన్ని చెయ్యడం ప్రారంభి౦చడానికి ఇదే సరైన సమయం.

స్త్రీలు ఇంటివద్దనే పొట్టతగ్గించుకునే వ్యాయామాలు

1. వంచిన మోకాళ్ళతో చాపపై నేలమీద పడుకుని, పాదాలను నేలపై ఉంచండి. మీ కాళ్ళను 90 డిగ్రీల యాంగిల్ లో ఒకదాని తరువాత ఒకటి పైకి లేపండి. (బొమ్మ చూడండి).

2. ఇప్పుడు మీ చేతులను పైకెత్తి, మీ తలవెనుక లేదా మీ గుండెలకు పక్కగా ఉంచండి.

3. గాలిబాగా పీల్చి, మీ తలను పైకెత్తి గాలి వదలండి.

4. మొదటగా చేసేవారు ఇలా 10 సార్లు చేయండి, తరువాత మళ్ళీ ఇలాగే 2-3 సార్లు చేయండి.

మీ తలను పైకెత్తి ఉంచి, 30-40 డిగ్రీల యాంగిల్ లో నేలపై కూర్చుని, మీ పొత్తికడుపు కండరాలపై ఒత్తిడి పెట్టినట్టు భావించండి.

వ్యాయామం 4:

వ్యాయామం 4:

స్త్రీలు ఇంటివద్దనే పడుకుని పొట్టతోచేసే వ్యాయామాలు

1. నేలపై పడుకుని మీ చేతులను పక్కకు పెట్టుకోండి లేదా మీ తల వెనుక క్రంచెస్ లో లాగా పెట్టుకోండి.

2. ఇప్పుడు మోకాళ్ళు వంచకుండా రెండు కాళ్ళనూ పైకి లేపండి.

3. మీ కుడి మోకాలును గుండెల వరకు వంచి, ఎడమకాలును బైటికి పెట్టండి.

4. మీ ఎడమ కాలును గుండెల వద్దకు తీసుకువచ్చి కుడికాలును బైటికి చాపండి.

ఇవి మిమ్మల్ని ఇబ్బందిపెట్టే పొట్టకు ఖచ్చితమైన ఆహరం, కొన్ని వ్యాయామాలు!

English summary

How To Flatten Out Your Belly At Home?

If you want to flatten your belly your belly out, then you must watch what you eat. It must be tempting to eat fast foods and but it is not easy to get rid of fat accumulation in your middle section. It’s all about what you love more…the food or the flat belly.
Desktop Bottom Promotion