For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సహజ పద్దతులతో ఎత్తు పెరగడం సాధ్యమే!?

|

వ్యక్తి పొడవును బట్టి కూడా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు అంటుంటారు. అయితే, పుట్టుకతోనే దేవుడు ఇచ్చిన ఎత్తును మార్చుకోవడం అన్నది అంత సులభం కాదు. సాధారణంగా పుట్టినప్పటి నుంచి మగవారిలో 18 ఏళ్ల వరకు, ఆడవారిలో 16 సంవత్సరాల వరకు ఎముకల్లో పొడవు పెరుగుదల ఉంటుంది. పెరిగే వయసులో ఎముకల్లోని ముఖ్యభాగాలు మూడు అవి... ఎపిఫైసిస్‌, డయాఫైసిస్‌, మెటాఫైసిస్‌. ఈ చిత్రంలో చూపినట్టు ప్రతి ఎముకలోను కింద భాగానా, పైభాగాన కల రెండు మెటాఫైసిస్‌ యూనిట్లలో పెరుగుదలకు సంబంధించిన కణజాలం ఉంటుంది. దీన్ని గ్రోత్‌ప్లేట్‌ అంటారు. ఈ కణజాలం ప్రతి వ్యక్తిలోను తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన (జీన్స్‌) అనువంశిక లక్షణాలకు లోబడి వ్యక్తి పొడవు నిర్ణయమవుతుంది. అంటే మనిషి ఎత్తు మూలకాలు జీన్స్‌ద్వారా నిర్ణయమవుతాయి. కొంతవరకు ఆహార పోషక పదార్థాలు మనిషి ఎత్తు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. అంతేకానీ రకరకాల వ్యాపార ప్రకటనలతో మోసపోయి ఎక్కువ ఎత్తు పెరగడం అనే అపోహను వదులుకోవాలి.

ఎవరైతే పొట్టిగా ఉన్నారు వారు, వారి ఎత్తును ఎలా పెంచకోవాలో తెలుసుకోవాలి. దురదృష్టవశాత్తు, అందుకు చాలా రకాల సౌందర్య లేదా రసాయన పద్దతులు అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు నిజంగా సహాజంగానే ఎత్తు పెరగడాన్ని తెలుసుకోవాలంటే, అప్పుడు కొన్ని ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా వరకూ తల్లిదండ్రుల జీన్స్ వల్ల పిల్లల ఎత్తు ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రుల ఎత్తుగా ఉన్నప్పుడు పిల్లలు కూడా ఎత్తుగా పెరుగుతారు లేదంటే లేదు. అయితే కొన్ని సందర్భాలలో కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. ఈ ఆహారాలతో శరీర పెరుగుదలకు ఉద్దీపన కలిగించినప్పుడు, ఎత్తు పెంచడానికి సహాయపడుతాయి. అంతే కాదు, ఎత్తును పెంచడానికి వ్యాయామాలు కూడా సహాయపడుతాయి. ఎత్తు పెరగడం మొదలైనప్పుడు వ్యాయామాల వల్ల శరీరంలోని కండరాలు వదులు అవుతాయి.

21సంవత్సరాల్లోపు మీ బరువును పెంచుకోవడం తెలుసుకోవాలంటే, ఇది చాలా సులభం. 18ఏళ్ళ వరకూ మీ శరీరం పెరుగుతున్న దశలోనే ఉంటుంది. 21 సంవత్సరాల తర్వాత, పెరుగుదల సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఆహారం తీసుకోవడం వల్ల ఎత్తు పెరగడానికి ఎటువంటి హాని జరగదు. సరైన వ్యాయామం మరియు ప్రత్యేకమైన డైట్ ఈ రెండింటి కాంబినేషన్ ఎత్తు పెరగడానికి బాగా సహాయపడుతాయి. కాబట్టి, ఎటువంటి కాస్మొటిక్ పద్దతులు ఉపయోగం లేకుండానే మీ ఎత్తును పెంచుకోవడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని పరిశీలించండి.

సహజ పద్దతులతో ఎత్తు పెరగడం ఎలా?

స్కిప్పింగ్: ఎత్తు పెరగడానికి స్కిప్పింగ్ చాలా సులభమైన వ్యాయామం. జంపింగ్ రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. శరీరంలో కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.

సహజ పద్దతులతో ఎత్తు పెరగడం ఎలా?

పాలు: పాలలో ఉన్నటువంటి అన్ని న్యూట్రీషియన్స్ ఎత్తు పెరుగుదలకు బాగా సహాయపడుతాయి. పాలు తాగడం వల్ల క్యాల్షియం, విటమిన్ డి మరియు ప్రోటీనులు ఇవన్నీ కూడా ఎత్తు పెరుగుదలకు బాగా సహాయపడుతాయి.

సహజ పద్దతులతో ఎత్తు పెరగడం ఎలా?

వర్టికల్ హ్యాంగింగ్: వర్టికల్ (నిలువుగా) ఉండే బార్లు ను పట్టుకుని, వేలాడటం వల్ల ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. యవ్వన దశ నుండే మీరు ఇలా చేయగలిగితే, మీ వెన్నెముక పెరగడానికి సహాయపడుతుంది.

సహజ పద్దతులతో ఎత్తు పెరగడం ఎలా?

గుడ్లు: గుడ్లలో కూడా మూడు ప్రధాన పోషకాంశాలున్నాయి. వాటిలో క్యాల్షియం, ప్రోటీన్స్ మరియు విటమిన్ డి. ప్రతి రోజూ ఒక గ్లాస్ పాలతో పాటు సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ తినడం వల్ల ఎత్తు పెరగడానికి బాగా సహాయపడుతాయి.

సహజ పద్దతులతో ఎత్తు పెరగడం ఎలా?

యోగా -కోబ్రా భంగిమ: ఫ్లోర్ మ్యాట్ మీదు ఫ్లాట్ గా బోర్లా పడుకోవాలి. లోయర్ బాడీ(నడుము క్రింది)నుండి అలాగే ఉంచి, అప్పర్ (శరీరం యొక్క నడుము పైబాగం)ను మెల్లిగా పైకి లేపాలి. ఈ భంగిమలో తలను(పాము తలలా) బాగా సాగదీయాలి. ఈ యోగ భంగిమ వల్ల మీ ఎగువ శరీరం యొక్క కండరాలు వదులు అవుతాయి మరియు ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది.

సహజ పద్దతులతో ఎత్తు పెరగడం ఎలా?

అనిమల్ ప్రోటీన్స్: అనిమల్ ప్రోటీన్స్ అంటే చికెన్, బీఫ్ మొదలగునవి. వీటిలోని ప్రోటీనులు కండరాల పెరుగుదలకు బాగా సహాయపడుతాయి. కండరాల పెరుగుదలకు కావల్సిన రా ప్రోటీన్స్ అనిమల్స్ ప్రోటీనుల్లో అధికంగా ఉంటాయి.

సహజ పద్దతులతో ఎత్తు పెరగడం ఎలా?

వర్టికల్ స్ట్రెట్చ్: నిటారుగా నిలుచుకొని చేతులను బాగా పైకి ఎత్తాలి(తల పైవరకూ), రెండు చేతులనూ జోడిస్తూ చేతులను బాగా పైకి చాచుటకు ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో కండరాలు వదులు అవ్వడానికి మరియు పెరుగుదలకు బాగా సహాయపడుతాయి.

సహజ పద్దతులతో ఎత్తు పెరగడం ఎలా?

సోయా బీన్స్: వెజిటేరియన్స్ కు తగినన్ని పోట్రీనులు అందాలంటే సోయాబీన్స్ ను ఎంపిక చేసుకోవడం ఉత్తమమైన పద్దతి. సోయా చంక్స్, టోఫు, సోయా మిల్క్, మొదలగునవి శరీరంలోని కండరాల పెరుగుదలకు బాగా సహాయపడుతాయి.

సహజ పద్దతులతో ఎత్తు పెరగడం ఎలా?

లెగ్ కిక్కింగ్ (కాలితో తన్నడం): మార్షల్ ఆర్ట్స్ లో కాలితో తన్నడం అనేది, ఒక కీలకమైన వ్యాయామం. ఒక ప్రదేశంలో నిలుచోవాలి. నిటారుగా నిలుచున్నాక, కాళ్ళతో క్రింది ఉన్న వస్తువులను తన్నడానికి ప్రయత్నించాలి. అలాగే కాళ్ళను కొంచెం పైకి లేపుతో చేతులను తాకడానికి ప్రయత్నించడం వల్ల కాళ్ళు దిగువ భాగాలు పెరుగుదలకు సహాయపడుతాయి.

సహజ పద్దతులతో ఎత్తు పెరగడం ఎలా?

కోరల్ కాల్షియం: క్యాల్షియం, సముద్రపు పగడాలు నుండి స్వచ్చమైన క్యాల్షియంను పొందవచ్చు. కాబట్టి మీ ఎముకల సాంద్రత మరియు పెరుగుదల పెంచడానికి ఈ పగడపు కాల్షియంను తీసుకోవచ్చు.

English summary

How To Increase Your Height Naturally?


 A tall stature is something that lends an edge to your personality. However, it is not easy to increase your god-given height. Many people who are short want to know to how to increase their height. Unfortunately, most of the methods available to them are cosmetic or chemical.
Story first published: Monday, June 24, 2013, 16:47 [IST]
Desktop Bottom Promotion