For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రంజాన్ సమయంలో ఆరోగ్యంగా ఉండటం ఎలా ?

By Super
|

రంజాన్ సమయంలో తరచుగా అతిగా తినడం వలన వేగంగా బరువు పెరుగుట,ఆమ్లత్వం మరియు జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి. నిపుణుల ద్వారా ఒక సరైన ఆహార ప్రణాళికను అనుసరించండి. వేయించిన ఆహారం మరియు ఎరుపు మాంసంనకు దూరంగాఉండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రజలు తరచుగా వ్యాయామం మొత్తాన్ని తగ్గించడానికి రంజాన్ ను ఒక సాకుగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొంత శారీరక శ్రమను కొనసాగించటం మాత్రం ముఖ్యం. రెగ్యులర్ గా తినడం అనేది క్రమం లేకపోవడం వలన సమర్థవంతమైన జీవక్రియ వేగాన్ని తగ్గిస్తుంది. దాని ఫలితంగా బరువు పెరుగుట జరుగుతుంది. మా ఫిట్ నెస్ నిపుణుడు ఈ పవిత్ర నెలలో కొన్ని వ్యాయామాలు మరియు సంతోషంగా ఉండటానికి ఆరోగ్యవంతమైన ఉపవాసం మరియు విందు కోసం న్యూట్రిషన్ చిట్కాలు చెప్పుతున్నారు.

How to stay fit during Ramadan

సిఫార్సు చేసిన వ్యాయామాలు

1. వాకింగ్ లేదా సైక్లింగ్ వంటి కార్డియో వ్యాయామాలు చేయండి. ఇది కేలరీలను తగ్గించటానికి సహాయపడుతుంది. అంతేకాక సహనశక్తిని మెరుగుపరుస్తుంది.

2. రంజాన్ ముందు తక్కువ తీవ్రత గల నిరోధక శిక్షణ కోసం వెళ్ళవచ్చు. ఇది కండరాల బలంను నిర్వహించడానికి సహాయపడుతుంది.

3. వార్మప్ మరియు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండి. స్ట్రెచింగ్ పూర్తి శరీరంనకు సౌలభ్యతను మరియు డిటాక్సికేషన్ మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

4. మీరు చాప మీద కూర్చొని స్థిర మరియు పుష్-అప్స్ వంటి వ్యాయామాలు చేయవచ్చు.

5. యోగ మరియు ధ్యానం డిటాక్సిఫికేషన్ లో సహాయపడుతుంది.

6. గ్రూప్ వ్యాయామాలు కోసం ఎంపిక - ఇది కేలరీలను ఖర్చు చేస్తుంది. అంతేకాక మీరు ఇతరులతో కలసి వ్యాయామం చేయటం కూడా సరదాగా అనిపిస్తుంది.

7. కనీసం 20 నుంచి 40 నిమిషాల పాటు వర్క్అవుట్ చేయాలి. మీరు ఉపవాసం చేసినప్పుడు వ్యాయామం చేయవద్దు. ఒకటి సెహ్రి (సూర్యోదయానికి పూర్వమే భోజనం) ముందు లేదా ఇఫ్తార్ (సూర్యాస్తమయం తర్వాత భోజనం) తర్వాత వ్యాయామం చేయాలి.

8.అధిక వేగంతో పరిగెట్టటం మరియు అధిక బరువులెత్తడం వంటి అధిక తీవ్రత గల వ్యాయామాలు చేయొద్దు. దీని వలన తక్కువ రక్తపోటు,హైపోగ్లైసెమియా మరియు మైకము,కీళ్ళు లేదా కండరాల గాయాలు వంటి సమస్యలకు దారితీస్తుంది.

9. సిఫార్సు చేసిన ఆహారం
- ధాన్యాలు,బార్లీ,గోధుమలు,వోట్స్,జొన్నలు,సెమోలినా,బీన్స్,కాయధాన్యాలు,తవుడు,ఆకుపచ్చ బటానీలు,జల్దారు పండ్లు,ప్రూనే మరియు బాదం వంటి పదార్థాలను తినాలి.
ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తినకండి. నెమ్మదిగా తినండి.( అంతేకాకుండా రంజాన్ సందర్భంగా ఆరోగ్యవంతమైనవి తినడం ఎలా - న్యూట్రిషన్ ఆహారం ప్రణాళిక గురించి చదవండి.)
- జీర్ణశక్తి సంబంధించిన సమస్యలను నిరోధించడానికి ప్రూనే జ్యూస్ ను త్రాగండి.
- బాగా వేయించిన ఆహారం మరియు ఎరుపు మాంసం తినటం మానుకోండి.
- వ్యాయామం తర్వాత సరైన ప్రోటీన్ తీసుకోవాలి.
- డయాబెటిక్ రోగులు మరింత జాగ్రత్తగా ఉండండి. అంతేకాక హైపోగ్లైసిమియ(రక్తంలో తక్కువ చక్కెర స్థాయి) రాకుండా చూసుకోవాలి. రంజాన్ నెలరోజుల ఉపవాసం కలిగి ఉంటుంది కాబట్టి సులభంగా మిమ్మల్ని మీరు రోజువారీ వ్యాయామంలో మార్పులు చేసుకోవటం ద్వారా చాలా తీవ్రమైన అంశాలను దూరం చేసుకోవచ్చు.

English summary

How to stay fit during Ramadan

Those who fast during Ramadan often end up overeating leading to weight gain, acidity and digestion proble
Desktop Bottom Promotion