For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెస్క్ జాబ్ ?మిమ్మల్ని లావుగా మార్చేస్తుందా?

By Super
|

మీ డెస్క్ ఉద్యోగం కారణంగా మీరు అనారోగ్యకరంగా మరియు లావుగా తయారు కావొద్దు. ఇక్కడ సిట్ డౌన్ ఉద్యోగం ఉన్నప్పటికీ, మీరు ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని వ్యాయామాలు మరియు ఆహార చిట్కాలు ఇస్తున్నాము.

చాలా మంది ఈ విషయంగా ఫిర్యాదు చేస్తున్నారు. పనివద్ద ఒత్తిడి మరియు క్రియారహితంగా ఉండటం బరువు పెరుగటానికి దారితీస్తున్నది. వీటిని ఎదుర్కోవటానికి ఏమి చేయాలో ఇక్కడ తెలియపరుస్తున్నాము.

మీ డెస్క్ వద్ద వ్యాయామం
బిగువు పొట్ట కోసం: వెన్నెముక నిఠారుగా ఉంచి పొడవుగా కూర్చోండి. ఉదర కండరాలు గట్టిగా వెన్నెముక లోకి లాగి ఉంచండి. ఒకటి నుండి అయిదు సెకన్ల నొక్కి ఉంచండి మరియు 20 సార్లు రిపీట్ చేయండి. ఇలా రోజులో కనీసం మూడుసార్లు చేయటానికి ప్రయత్నించండి.

Is desk job making you fat?

గొప్ప తొడల కోసం: మోకాళ్లను కలిపి కూర్చోండి. ఎవరూ బలవంతంగా కూడా విడదీయలేనంత దగ్గరగా కూర్చోండి. మీ లోపలి తొడ కండరాలు గట్టిగా హత్తుకుపోయే విధంగా ఒకటి,రెండు సేకండ్లపాటు ఉండండి. ఇలా రోజుకు కనీసం మూడుసార్లు చేయండి.

ఒక కుదురైన బట్ కోసం: మొదట నిటారుగా నిలబడండి మరియు మీ బట్ మరియు తొడ కండరాలు బిగించండి; ఒక గెంతు తరువాత విరామం తీసుకోండి. మీరు మీ కుర్చీ నుండి లేచిన ప్రతిసారి ఈ విధంగా చేయండి.

పోషకాహార పట్టిక
నట్స్ మరియు విత్తనాలు ఎక్కువగా తినండి: బాదం, జీడి పప్పు, గుమ్మడికాయ గింజలు మరియు పొద్దుతిరుగుడు విత్తనాలు వంటివాటిలో మీ శరీరానికి అవసరమయిన కీలక పోషకాలు-ప్రోటీన్, మెగ్నీషియం, విటమిన్ B మరియు ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు ఉన్నాయి. ఇవి మన శరీరంలో రక్తం, షుగర్ లను నియంత్రిచటంలో సహాయపడతాయి. వీటిని మీరు రోజును ప్రారంభించే సమయంలో తీసుకోండి-ఇవి మీకు ఎక్కువ బలాన్ని చేకూరుస్తాయి.

పచ్చి కూరగాయలు మరియు చల్లని మాంసపు ముక్కలు: ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోండి. బ్రోకలీ మరియు ఆకుకూరల వంటి కూరగాయలలో రక్తం, షుగర్ లను క్రమబద్దీకరణ చేసే మొక్కల కాంపౌండ్స్ సమృద్ధిగా ఉంటాయి. మాంసకృత్తులు అధికంగా ఉన్న టర్కీ మరియు జున్ను వంటి చల్లని ముక్కలను కూడా తీసుకోండి.

ప్రతిరోజూ గ్రుడ్లను తీసుకోండి: మీరు తీసుకునే గ్రుడ్లలో ఎక్కువ నాణ్యమైన ప్రొటీన్ ఉంటుంది. ఇవి కండరాలలో నత్రజని నిలవాలను పెంచడానికి మరియు మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా అధిక కేలరీలు బర్న్ అవుతాయి కాబట్టి వాటిని గట్టిగా తయారవుతాయి. అంతేకాక ఇవి విటమిన్ D తో నింపబడ తాయి మరియు కొవ్వును నిరోధిస్తాయి.

ఊలాంగ్ టీ కొద్దికొద్దిగా త్రాగండి: ఊలాంగ్ తేనీరు రక్తం, షుగర్ మరియు కార్టిసాల్ స్థాయిలు సమతుల్యంగా ఉంచుతుంది-ఇది ఆఫీస్ ఇనాక్టివిటీ కారణంగా ఏర్పడే కొవ్వు నిల్వ విధానాలను తలక్రిందులు చేస్తుంది. మీరు ఆఫీస్ లో ఉన్నప్పుడు ఒకటి నుండి మూడు కప్పుల ఈ ఊలాంగ్ తేనీరు త్రాగండి.

English summary

Is desk job making you fat?

Don't let your desk job make you unhealthy and fat. Here are a few exercises and diet tips to stay fit in spite of a sit-down job Many people complain about this.
Story first published: Sunday, November 24, 2013, 15:28 [IST]
Desktop Bottom Promotion