For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కొన్ని సులభ చిట్కాలు...?

|

వ్యాయామం చేస్తున్నా, ఆహార నియమాలు పాటిస్తున్నా బరువు తగ్గటం లేదని చాలామంది వాపోతుంటారు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంతగా దృష్టిపెట్టరు. బరువు తగ్గటానికి వ్యాయామం, ఆహార నియమాల వంటి వాటిని సరైన క్రమంలో చేయటం ఎంతో ముఖ్యం. అధిక బరువు పెరగటానికి అనేక కారణాలు ఉండవచ్చు. వీటిలో కొన్ని శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, భోజనానికి సమయపాలన లేకపోవడం, శారీరక శ్రమ అస్సలు లేకపోవడం, కొన్ని సార్లు వంశపారంపర్యంగా కూడా అధిక బరువు నమోదు కావచ్చు.

అధికబరువు, స్థూలకాయం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఇవి డయాబెటిస్, గుండె సమస్యలు, రక్త పోటు, కీళ్ల నొప్పులు, స్త్రీలలో క్రమం తప్పిన నెలసరి, అవాంచిత రోమాలు, మెడమీద నుదుటి మీద పిగ్మెం సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఆయాసం, ముఖం మీద కాక వీపు మీద కూడా మొటిమలు వస్తాయి. కాబట్టి ఎక్కువ మంది బరువు తగ్గడం మీద దృష్టి పెడుతున్నారు. పదిశాతం బరువు తగ్గితే గుండె సంబంధిత సమస్యల రిస్క్ 20 శాతం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి ఎంత బరువు ఉండాలన్నది వయసు, ఎత్తు మీద ఆధారపడి ఉంటుంది. దీనిని బాడీ మాస్ ఇండెక్స్ పరీక్ష (బిఎమ్‌ఐ)ద్వారా తెలుసుకోవచ్చు. ఉండాల్సిన బరువు కంటే 20 శాతం ఎక్కువగా ఉంటే దానిని హెచ్చరికగానే భావించాలి. బిఎమ్‌ఐ పరీక్షలో బరువు 25 నుంచి 29.9 శాతం వరకు ఎక్కువ ఉంటే అధిక బరువుగా, అంతకంటే ఎక్కువైతే స్థూలకాయంగా పరిగణించాలి.

నార్మల్ వెయిట్ ఎంత?
4 -10 ఏళ్లలోపు పిల్లలు 12 -25 కేజీలు, టీనేజ్ పిల్లలు 35 -50 కిలోలు (మగపిల్లలు 60 కేజీలు), పెద్దవాళ్లలో మగవాళ్లు 60-65 కేజీలు, మహిళలు 50 -55 కిలోల బరువు సాధారణం.

Lose Weight the Healthy Way

ఇవన్నీ కారణాలే!
చిన్న పిల్లల్లో ఓవర్ ఈటింగ్, వ్యాయామం లేకపోవడం, జన్యుపరమైన కారణాలు, టీనేజ్‌లో డిప్రెషన్ కారణాలు. పెద్దవాళ్ల విషయానికొస్తే మహిళల్లో మెటబాలిజంలో మార్పులు, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, మెనోపాజ్ వంటి కారణాలను గమనిస్తుంటాం. గర్భిణిగా ఉన్నప్పుడు పెరిగిన బరువు ప్రసవం తర్వాత వీలైనంత త్వరగా తగ్గించుకోవాలి.

ఆహారంలో మార్పులు: ఇవి డయాబెటిస్, గుండె సమస్యలు, రక్త పోటు, కీళ్ల నొప్పులు, స్త్రీలలో క్రమం తప్పిన నెలసరి, అవాంచిత రోమాలు, మెడమీద నుదుటి మీద పిగ్మెం సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఆయాసం, ముఖం మీద కాక వీపు మీద కూడా మొటిమలు వస్తాయి. బరువు తగ్గాలన్న ఆసక్తి కొద్దీ రెండు - మూడు నెలల్లోనే 5-10 కేజీలు తగ్గిపోతుంటారు. ఇది ఆరోగ్యకరం కాదు. కనీసం ఆరునెలల్లో ముందు ఉన్న బరువులో పదిశాతం తగ్గడం ఆరోగ్యకరమైన వెయిట్‌లాస్. వారానికి అరకేజీ నుంచి కేజీ మాత్రమే తగ్గాలి. అంతకంటే ఎక్కువగా తగ్గకూడదు.

పిల్లలకు ఆహారంలో మార్పులు చేయాలి తప్ప, పరిమాణాన్ని తగ్గించకూడదు. సమతుల ఆహారాన్ని ఇస్తూ స్వీట్లు, చాక్లెట్లు, జంక్‌ఫుడ్ వంటివి మాన్పించాలి. శారీరక వ్యాయామం కోసం స్విమ్మింగ్, ఆటలను ప్రోత్సహించాలి.

టీనేజ్ పిల్లల్లోనూ ఇంతే. సరైన సమయానికి సమతుల ఆహారాన్ని ఇస్తూ, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంచితే మేలు.

పెద్దవారు బరువు తగ్గడానికి ఆహారంలో ఉప్పు, కొవ్వులను మానేయాలి. పండ్ల రసాలకు బదులు తాజా పండ్లను తీసుకోవాలి. సమతుల ఆహారం తీసుకుంటూనే ఆహారం పరిమాణాన్ని తగ్గించాలి.

English summary

Lose Weight the Healthy Way | ఆరోగ్యంగా బరువు తగ్గడమెలా?

You might want to lose weight quickly and with little effort, but weight loss takes commitment and time. A healthy manner of weight loss requires real lifestyle changes that will make your efforts stick.
Story first published: Wednesday, January 16, 2013, 16:13 [IST]
Desktop Bottom Promotion