For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులు ఖచ్చితంగా తినాల్సినటువంటి ఆహారాలివి...!

|

సాధారణంగా మనం తీసుకొనే వివిధ రాకాలైనటువంటి సమతుల్య ఆహారం అందరికీ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందిస్తుంది. అయితే కొన్ని సార్లు మనం తీసుకొనే ఆరోగ్యకరమై ఆహారాలు లిగం బేదం(ఆడ, మగ)పై ఆధారపడి ఉంటాయి. కొన్ని ఆహార పదార్థాలు మహిళలకు, పురుషులకు అని లేకుండా తింటుంటారు. అయితే డైయట్ విషయంలో మహిళలు ఒక రకమైన ఫుడ్ ను తీసుకొంటే పురుషులకు మరో రకమైనా ఆహారాలు ఉన్నాయి. అది వారి వారి ఆరోగ్యాలపై ప్రభావాన్ని చూపెడుతాయి. మామూలుగానే పురుషులకంటే స్త్రీలు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు అదనంగా పాటిస్తుంటారు. తినే ఆహారంలో కొన్ని రకాలు మహిళలు పూర్తిగా ఉపయోగపడతాయి.శరీరం ఒకే బరువున్న స్త్రీపురషులు ఒకే రకమైన కొవ్వునిల్వలు కలిగివున్నా, వారు వ్యాయామం ద్వారా ఖర్చుచేసే కేలరీలు కూడా ఒక్కటే అయినా స్త్రీపురుషులకు కాలరీల అవసరం మాత్రం వేరు వేరుగా ఉంటుంది. మగవారిలో కండరాలు పెద్దగా ఉండటం వలన వారు వ్యాయామం చేయకపోయినా కండరాలు యథాస్థితిగా ఉండటానికైనా కేలరీలు అవసరం అవుతాయి. అందుకే మగవారిలో మహిళలకంటే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి.

మహిళలు చిన్న పరిమాణంలో ఉండటం వలన కండరాలు కూడా చిన్నగా ఉండటం కారణంగా వారిలో ఎక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటే అది కొవ్వుగా మారుతుంది. అందుకే స్త్రీలకు పోషకారం అందాలి. అదే సమయంలో తక్కువ కేలరీలు ఉండాలి. సాధారణంగా మహిళలకు రోజుకి 1200కేలరీలు అవసరం అవుతాయి. మగవారికి మరికొన్ని ఎక్కువ కావాలి. మరి పురుషులకు అన్ని క్యాలోరీలను అందించి.. ప్రత్యేకంగా ఉపయోగపడే ఆహారాలు కూడా ఉన్నాయి. కాబట్టి మగవారు వారు తీసుకొనే ఆహారంలో తప్పకుండా తీసుకోవలసిన కొన్ని రకాల డైయట్ ఫుడ్ లిస్ట్ మీకోసం...

పురుషులు ఖచ్చితంగా తినాల్సినవి ఇవే...!?

నేరుడు పళ్ళు: సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఆక్సాలిక్‌ టాన్మిక్‌ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలం. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కాబట్టి.. అధిక బరువు ఉన్నవారు.. మధుమేహ రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు.

పురుషులు ఖచ్చితంగా తినాల్సినవి ఇవే...!?

బ్రొకోలి: విదేశీయులు బ్రొకోలిగా పిలుచుకునే ఈ క్యాలీఫ్లవర్ లో పోషక తత్వలు, విటమిన్ ‘ఎ' యాంటి ఆక్సిండెంట్స్ ఉన్నాయి. ఉడికించిన లేదా పచ్చి క్యాలీఫ్లవర్ ను వ్యాయామానికి ముందే లేదా తర్వాత తీసుకుంటే కండరాల నొప్పులు ఉండవు. కొన్ని శక్తివంతమైన ఆరోగ్యకరమై కూరగాయలు, మొలకెత్తిన ధాన్యాలల్లో లాగా కాన్సర్ అరికట్ట గలిగే శక్తివంతమైన కెమికల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నందున మగవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ మరయు, పురుషనాళ కాన్సర్ రాకుండా నివారిస్తుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

పురుషులు ఖచ్చితంగా తినాల్సినవి ఇవే...!?

టమోటాలు: మనకు ఎక్కువగా లభించే ఎర్రగా అందం గా చూడముచ్చటగా కనిపించే టమాటోలు ఆరోగ్యానికు మేలు చేసస్తాయి . శక్తివంతమైన యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తాయి .సాధారణంగా రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని చెపుతారు . . . కాని అన్ని కాలాల్లో లభించే టమాటోలు తీసుకుంటే డాక్టరు తో అవసరముండదని చెప్పవచ్చు. ఎందుకంటే టమోటోలను తినడం వల్ల మహిళలకంటే పురుషులకే ప్రత్యేక ప్రయోజనాలు కలిగిస్తాయి. దీనిలో "లైకోపీన్ (Lycopene)" అనే పదార్ధము శక్తి వంతమైన anti-oxydentగా పనిచేస్తుంది. రోగనిరోధక టమోటా తక్కువ కేలరీలు గల టమోటాలు చర్మం, కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లోని విటమిన్‌ ఏ, విటమిన్‌ సి రోగ నిరోధకశక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించటంలో తోడ్పడతాయి. టమోటాలు తరచుగా తింటుంటే ఆహారం ద్వారా తీసుకోవాల్సిన ఇనుములో 7 శాతం వరకు లభిస్తుంది. శరీర బరువును నియంత్రించాలనుకుంటే టమోటా అత్యద్భుతమైన పండు. సాధారణ సైజు కలిగిన టమోటాలో 12 కెలోరీలుంటాయి. ప్రతి రోజు టమోటాలు ఆహారంతోపాటు తీసుకుంటుంటే శరీర బరువు నియంత్రణలోవుంటుంది.

పురుషులు ఖచ్చితంగా తినాల్సినవి ఇవే...!?

గుడ్లు (Eggs): గుడ్డు పిల్లల నుంచి పెద్దల దాకా అందరికి పౌష్టికాహారము అన్న సంగతి తెలిసిన విషయమే. ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది. పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా సలహాలిస్తుంటారు. మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. కండపుష్టికి, ప్రత్యేకంగా మగవారికి కండర నిర్మాణానికి ఎంతో మేలు. తేలికగా జీర్ణము కావుగనుక తొందరగా ఆకలివేయదు. గుడ్డులో ఉన్న పోషకపదార్ధాలు: ఎమినోయాసిడ్లు, ఎ.,డి., ఇ. విటమిన్లతో సహా11 అత్యవసర పోషకాలు, థయమిన్‌, నియాసిన్‌, రైబోఫ్లేవిన్‌, ఐరన్‌, పాష్పరస్.. ఉంటాయి. పురుషులు అధికంగా హెయిర్ రాలిపోవడంతో బాధ పడుతుంటారు అలాంటి వారికి గుడ్డు ఒక మంచి ఆహారమనే చెప్పాలి. ఇది వెంట్రుకలు పెరిగేందుకు బాగా ఉపయోగపడుతుంది. గుడ్డులోని తెల్లని పదార్థంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది.

పురుషులు ఖచ్చితంగా తినాల్సినవి ఇవే...!?

దానిమ్మ జ్యూస్ (Pomegranate juice): ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించేదానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి. పండులోని "ఇల్లాజిక్ యాసిడ్" ను చర్మంపై రాస్తే సూర్యకిరణల తాలూకు ప్రభావము నుంచి రక్షింస్తుంది. ఈ కిరణల తాకిడివల్ల చర్మం లోని కొలాజెన్‌ తగ్గిపోతుంది. దీని ఫలితంగా చర్మం ముందే వార్ధక్యా నికి లోనై ముడతలు పడుతుంది. అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్‌, వక్షోజ క్యాన్సర్‌, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి. దానిమ్మ సహజ యాస్పిరిన్‌. గుండె (హృదయము)కు మేలు చేస్తుంది. దానిమ్మ రసములోని రసాయనాలు 'కొలెస్టరాల్' వల్ల జరిగే ప్రమాదాల జోరును తగ్గిస్తుంది. రక్తపోటును తగ్గించే గుణము దీనికి ఉంది. రక్తనాళాలు ముసుకుపోయే గుణము నుండి రక్షిస్తుంది. ఫ్లవనోయిడ్స్ వలన కాన్సర్ వ్యాధి వచ్చే అవకాసము తగ్గుతుంది. దానిమ్మ గింజ, నూనె... రొమ్ము కాన్సర్ అదుపుచేయు లక్షణము కలిగివుంది. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా బీరువాలో ఉన్నట్టే.

పురుషులు ఖచ్చితంగా తినాల్సినవి ఇవే...!?

వెల్లుల్లి(Garlic): ఘాటైన వాసన కలిగి ఉండే వెల్లుల్లి గుండెకు నేస్తం, క్యాన్సర్ కు ప్రబల శత్రువు. దీన్ని నేరుగా వేయించకూడదు. వెల్లుల్లిని ఒలిచి పది నిముషాలు అలా ఉంచితే క్యాన్సర్ నిరోధించే ఎంజైమ్ ఎలెనాస్ బాగా మెరుగువుతుంది. దీనిలో సల్ఫర్ పరిమాణము ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది.. రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది, కాలేయము ఆరోగ్యానికి, కీళ్ళనొప్పులు తగ్గడానికి పనికివస్తుంది. రోజూ రెండు వెల్లుల్లిపాయలను కాన్సర్ ఉన్నావారు తీసుకుంటే కాన్సర్ కణాలు తిరిగి గడ్డకట్టడం దూరమువుతుంది. అలాగే గుండెజబ్బులకి దీన్ని మించిన ఔషధం లేదంటే అతిశయోక్తి కాదు. జుట్టు రాలిపోకుండా మంచిగా పెరగడానికి ఎంతో దోహదపడుతుంది.

పురుషులు ఖచ్చితంగా తినాల్సినవి ఇవే...!?

సాల్మన్(Salmon): ఫిష్ మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్‌ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్‌ ఫిష్‌ ప్రొటీన్‌ తో సమృద్ధి. వారంలో మూడు సార్లు సాల్మన్‌ ను ఆరగించండి. అందమైన మార్పుకు ఆహ్వానం పలకండి. ఇందులో ఓమేగా ఫ్యాటి యాసిడ్స్ అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మజిల్స్ ను మెయింటైన్ చేయాలంటే మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా తీసుకోవాలి. అవి సాల్మన్ ఫిష్ లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి మజిల్సె పెరగడానికి బాగా సహాయపడుతాయి.

పురుషులు ఖచ్చితంగా తినాల్సినవి ఇవే...!?

తృణధాన్యాలు(Whole Grains): ఆరోగ్యానికి అవసరమైన తృణధాన్యాలలో విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ అధిక స్థాయిలో ఉన్నాయి. తృణధాన్యాలు అత్యధికంగా కలిగినటువంటి బ్రౌన్ రైస్ మరియు వోట్స్ అధికంగా కలిగిఉంటాయి. వీటిలో విటమిన్ B పుష్కలంగా ఉండటం వల్ల సాధారణ శ్రేయస్సు కొరకు మంచి మరియు నిస్పృహ ఉపశమనంకు సహాయపడుతుంది. వ్యక్తిగతంగా B విటమిన్లు అనేక విధాలుగా పురుషుడు ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చుతుంది. తృణధాన్యాలలో ఉన్న Biotin (B7) వెంట్రుకలు రాలిపోకుండా సహాయపడుతుంది. అలాగే విటమిన్ (ఫోలేట్ B9) వీర్యం ఆరోగ్యంగా ఉండేదుకు సహాయపడుతుంది. తృణధాన్యాలులో ఉన్నసిలికా కూడా ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

పురుషులు ఖచ్చితంగా తినాల్సినవి ఇవే...!?

బెర్రీస్ క్రాన్ బెర్రీస్, రెస్ బ్రెర్సీ, బ్లూ బెర్రీస్: ఇలా ముదురు రంగుల్లో ఉండే బెర్రీస్ అంటే అందరీకీ చాలా ఇష్టమే. బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. బెర్రీస్ లో ఫైబర్, తక్కువ పిండి పదార్థాలు అనేక విటమిన్స్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని షుగర్ వ్యాది గ్రస్తులు తీసుకోవడం చాలా మంచిది.

పురుషులు ఖచ్చితంగా తినాల్సినవి ఇవే...!?

ఓయిస్ట్రస్: సముద్రంలో చేపల తర్వాత స్థానం ఓయిస్ట్రస్. వీటిలో జింక్ మరియు కాల్షియం అధికంగా ఉంటుంది. అందుకే వీటిని స్త్రీలు మరియు పురుషులు తీసుకోవడం చాలా అవసరం. పురుషుల సంతానోత్పతి, లైంగిక ఆరోగ్యానికి అవసరమైన జింక్ అత్యధికంగా కలిగి ఉన్నటు వంటి సహజ వనరు. జింక్ మగవారిలో ఆరోగ్యకరమైన టెస్టోస్టెరాన్ స్థాయిని నిర్వహించడమే కాకుండా ఆరోగ్యరమైన స్పెర్మ్(వీర్యం)వృద్ది చెందడానికి సహాయపడుతుంది. పురుషుల్లో జింక్ లోపించడం వల్ల అత్యధికంగా హెయిర్ ఫాల్ సంభవిస్తుంటుంది. కాబట్టి శరీరానికి ఎక్కువ మోతాదులో జింక్ ను అందించే ఓయిస్ట్రెస్. కాబట్టి పురుషు ఆరోగ్యాని, అందానికి అత్యంత ప్రయోజకారినిగా పనిచేస్తుంది ఓయిస్ట్రెస్.

English summary

Men’s Diet-The must eats | పురుషులు ఖచ్చితంగా తినాల్సినవి ఇవే...!?

Healthy eating can sometimes be different depending on your gender. Here’s a list of foods that men must include in their diet.
Story first published: Wednesday, February 27, 2013, 17:28 [IST]
Desktop Bottom Promotion