For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో బయటకు వెళ్ళకుండానే ఫిట్ నెస్ టిప్స్

|

వర్షాకాలం వచ్చిందంటే వాకింగ్‌కు ఎసరు వస్తుంది. ముసురు పట్టిందికదా అని ముసుగుతన్ని పడుకుంటారు చాలా మంది. దీంతో మిగిలిన ఎనిమిది నెలలు పడిన శ్రమ అంతా వృథా అవుతుంది. వర్షాకాలం ఆరంభంతో సంతోషాలతోపాటు ఉపశమనాన్ని తీసుకువస్తుంది. అయితే బయట జోరుగా వర్షం కురుస్తున్నపుడు జిమ్‌కు వెళ్లాలన్నా, రన్నింగ్, వాకింగ్‌కు వెళ్లాలన్నా ఇబ్బందే. అందుకని మీరు రెగ్యులర్‌గా చేసే వ్యాయామానికి స్వస్థిచెప్పకూడదు. వర్షాకాలంలో ఇంటినే జిమ్‌గా మార్చుకొని వ్యాయామాన్ని కొనసాగించండి అంటున్నారు ఫిట్‌నెస్ నిఫుణులు.అవేంటో చూద్దాం.

1. వర్షం వేళ, ముసురు పట్టినప్పుడు వాకింగ్‌ చేయకపోవడమే మేలు. గాలిలో తేమ ఎక్కువగా ఉండడం, నేలంతా చిత్తడిగా ఉండడం వల్ల వాకింగ్‌ సరిగా సాగదు.

2. అయితే వాకింగ్‌కు బదులుగా ఇంట్లోనే స్కిప్పింగ్‌, సైక్లింగ్‌ వంటివి చేయాలి.

3. ఇంట్లోనే కనీసం 40 నిముషాలకు తగ్గకుండా వ్యాయామం చేసుకోవాలి.

4. వర్షాలు కురుస్తున్నప్పుడు శారీరిక శ్రమ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి తప్పని సరిగా ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయాలి. ఈఇంట్లో మిగిలిన వ్యాయామాలు చేసే అవకాశం లేని వారికి యోగా ఉత్తమం.

5. పడకగదిలో లేదా హాల్‌లో ఒక దుప్పటి పరుచుకొని ఓ అరగంట సేపు యోగాసనాలు వేయాలి. వర్షాకాలంలో క్రమం తప్పకుండా ఇంట్లోనే యోగా, మెడిటేషన్, ప్రాణాయామం చేయటం ఆరోగ్యానికి మంచిదంటున్నారు.

6. ప్రాణాయామం వంటి శ్వాసపరమెన వ్యాయామాలు ఈ సీజన్‌లో చాలా మంచివి.

7. కాస్త ఎండ వచ్చిన రోజున తప్పనిసరిగా వాకింగ్‌కు వెళ్లండి. ఎలాగూ నాలుగు రోజులు పోలేదు కాబట్టి ఈ సీజన్‌కు వాకింగ్‌ వదిలేద్దాంలే అనే ధోరణి సరికాదు. ఈముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఈ సీజన్‌లో రెగ్యులర్‌గా వాకింగ్‌ కుదరదు కాబట్టి తప్పనిసరిగా ఇంట్లోనే వ్యాయామాలు చేసుకోవాలి.

8. వర్షాకాలంలోనూ వ్యాయామాన్ని కొనసాగించటం వల్ల మీరు ఆరోగ్యంగా, చురుకుగా ఉండవచ్చని ఫిట్‌నెస్ నిపుణులు చెపుతున్నారు. ఇంట్లోనే మీ శరీర దారుఢ్యాన్ని పెంచేందుకు వీలుగా డంబెల్స్‌తో కొద్దిసేపు వ్యాయామం చేయటం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

English summary

Monsoon Fitness Tips

The onset of monsoon brings respite from the scorching heat of summer but it also throws a different challenge for maintaining fitness.
Desktop Bottom Promotion