For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీ బిల్డింగ్ కు ఖచ్చితంగా తినాల్సిన ఆహారాలు

By Derangula Mallikarjuna
|

సాధారణంగా కొంత మంది కండర పుష్టి కోసం వివిధ రకాలుగా ప్రయోగాలు చేస్తుంటారు. కండరనిర్మాణానికి డైట్ లో మార్పులు మరియు జిమ్ కు వెళ్ళడం వంటివి చేసినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు. అటువంటి వారు అతి తక్కువ సమయంలో వేగవంతంగా కండరాలు నిర్మానికై మీరు ముఖ్యంగా మీ జీవనశైలి మీద ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన పద్దతిలో కండర పుష్టి పొందాంటే అందులకు సరైన ఆహారం మరియు వ్యాయామం ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. డైట్, జిమ్ కుల వెళ్ళితే సరిపోదు. తీసుకొనే డైట్ లో కండరపుష్టికి అవసరం అయ్యే వాటిని ఎంపిక చేసుకోవడం ప్రధానం. అలాని రాత్రికి రాత్రే మార్పు వచ్చేయదు. ఈ క్రింది పద్దతులను అనుసరించడం వల్ల కొన్ని వారాల్లో తప్పనిసరిగా ఫలితం కనిపించవచ్చు.

దేహ దారుడ్యాన్ని పెంచుకోవాలనుకొనే వారు మంచి పౌష్టికాహారాన్ని తింటే మీరు కండలు పెంచుకోగలుగుతారు, దాన్ని కఠినంగా అమలు చేస్తే అధిక బరువు వదిలించుకో గలుగుతారు, ఆరోగ్యకరమైన బరువును కలిగి వుంటారు. మాంసకృత్తులు, పీచు పదార్ధం ఎక్కువగా వుండి పిండి, కొవ్వు పదార్ధాలు తక్కువగా వుండే ఆహారం తీసుకోవడం ఇందులో ప్రాధమిక ఉద్దేశ్యం.

బాడీనీ స్లిమ్ గా ఉంచుకోవాలంటే.. చాలా వర్క్ అవుట్సే ఉన్నాయి. అయితే వర్క్ అవుట్స్ చేయడంతో బరువు తగ్గుతారు తప్ప మంచి శరీరసౌష్టవం(ఆకారం) కనబడదు. వ్యాయమంలో ముఖ్యంగా కార్డియో మరియు ఏరోబిక్ ఎక్సర్ సైజులను మాత్రమే చేయిస్తుంటారు. అయితే ఇవి మంచి శరీరసౌష్టవాన్నందిచి మజిల్స్ (కండరాలు) ఏర్పడేలా చేసేవి వేరేవి ఉన్నాయి. అలా బాడీ బిల్డప్ చేయాలనుకొనే వారు బాడీ బిల్డిగ్ ఉపయోగపడే ఆహారాలను ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడాలి. ఈ ఆహారాలు బాడీబిల్డ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతాయి. పెద్ద పెద్దగా మజిల్స్ ఉండి.. అందంగా కనబడే శరీర సౌష్టవానికి ఇదిగో డైయట్ లిస్ట్...!

ఎగ్ వైట్:

ఎగ్ వైట్:

గుడ్లలో అధిక ప్రోటీనులు మరియ ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉండి అతి తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. మీ శరీరాన్ని, కండర పుష్టిని పెంచుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. అధిక కొవ్వును నియంత్రించడానికి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకోవడానికి గుడ్లు బాగా సహాయపడుతాయి. గుడ్డు ఆరోగ్యం, పోషక విలువలు కల బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే శరీర కొవ్వు కరిగి ఎనర్జీ వస్తుంది. గుడ్డు పొట్ట నింపుతుంది. కొవ్వును కరిగించి ఎనర్జీగా మార్చి శరీరానికిస్తుంది.

ఓట్ మీల్:

ఓట్ మీల్:

ఓట్ మీల్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. మరియు టైప్ 2మధుమేహాన్ని తగ్గిస్తుంది. శరీరం మరియు జీవన చర్యకు ఉపయోగపడు శక్తిని విడుదల చేయుట మరియు కొవ్వు నిల్వలను తగ్గించుటకు ఓట్ మీల్ అద్భుతంగా సహాయపడుతుంది.

ప్రోటీన్స్:

ప్రోటీన్స్:

మీరు వ్యాయామం చేసేటప్పుడు, ముఖ్యంగా వెయిట్ ట్రైనింగ్ , మరియు మీరు మీ శరీరం అధిక ఒత్తిడికి లోనవుతుంది. వర్కౌట్స్ చేసేటప్పడు ఎక్కువ ఒత్తిడిని మీ శరీరం మీద పెట్టాల్సి వస్తుంది. అందువల్ల వ్యాయామాలు చేసే వారికి ప్రోటీనులు చాలా అవసరం . ఒకసారి ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల ఇది శరీరంలో అమైనో ఆసిడ్స్ గా విడగొట్టబడుతుంది,అది శక్తిగా మారి ప్రతి రోజూ వ్యాయామం చేయడానికి అవసరం అయ్యే శక్తిని అందిస్తుంది.

రెడ్ మీట్:

రెడ్ మీట్:

కండర పుష్టికోసం రెడ్ మీట్ తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే రెడ్ మీట్ లో ఇనుము పుష్కలంగా ఉంటుంది. బాడిబిల్డ్ కు గుడ్లు కూడా చాలా ముఖ్యమైన ఆహారం. వివిద రకాలా ప్రోటీన్ ఆహారం తీసుకొని వివిధ రకాల పోషకాలను పొందండి.

బీన్స్ & లెగ్యూమ్స్:

బీన్స్ & లెగ్యూమ్స్:

మీరు కండర నిర్మాణాన్ని పెంచుకోదలచుకుంటే కాయధాన్యాలను తీసుకుంటుండాలి. కాయధాన్యాలలో మినిరల్స్, ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ కు బాగా సహాయపడుతుంది. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ గుండెకు, కండరాలకు ఆక్సిజన్ చేరవేడయడంలో సహాయకారిగా ఉండి శరీరానికి కావలసిన శక్తి, సామర్థ్యాలను అందిస్తుంది. ఇందులో కండరాల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు సహాయపడే అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు పాటు మాంసకృత్తులు సమృద్ధిగా ఉన్నాయి.

చేపలు:

చేపలు:

ఫిష్ మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్‌ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్‌ ఫిష్‌ ప్రొటీన్‌ తో సమృద్ధి. వారంలో మూడు సార్లు సాల్మన్‌ ను ఆరగించండి. అందమైన మార్పుకు ఆహ్వానం పలకండి. ఇందులో ఓమేగా ఫ్యాటి యాసిడ్స్ అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మజిల్స్ ను మెయింటైన్ చేయాలంటే మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా తీసుకోవాలి. అవి సాల్మన్ ఫిష్ లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి మజిల్సె పెరగడానికి బాగా సహాయపడుతాయి.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

బాడీ బిల్డ్ చేయడానికి సహాయపడే ఆహారాల్లో మరో ప్రధానమైన ఆహారం బ్రొకోలీ. ఇది ఒక గ్రీన్ లీఫీ వెజిటేబుల్. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మరియు అవసరం అయ్యే ఫైబర్ ను ఇది అంధిస్తుంది. చాలా నిధానంగా జీర్ణం అవుతుంది. దాంతో మీ పొట్ట ఫుల్ గా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. ఎక్కువ సేపు ఆకలికానివ్వదు. ఇది మెటబాలిజంను పెంచుతుంది మరియు బరువు తగ్గిస్తుంది.

English summary

Must have foods for body building

Men love to have a fit and well built body with lots of muscles. As a man, you attain lot of self confidence with a well built and toned body. You will walk around feeling strong and good about how you look.
Story first published: Tuesday, December 10, 2013, 17:49 [IST]
Desktop Bottom Promotion