For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధిక వ్యాయామం చేశారనడానికి సంకేతాలు

By Derangula Mallikarjuna
|

మన శరీరం ఫిట్ గా మరియు హెల్తీ గా ఉంచుకోండానికి రోజురోజుకు రెగ్యులర్ వ్యాయామాలు ముఖ్యమైనాయి. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల మీ శరీరంలో నిల్వ ఉన్న అధనపు కొవ్వును తగ్గించడమే కాదు, మీ శరీరాన్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ , వ్యాయామాలు చేయాల్సిన దానికన్నా ఎక్కువగా చేయడం వల్ల విషయం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. మీరు మీ శ్రమకు మించి అధిక వ్యాయామం చేయడం వల్ల మీరు ఒకేసారి ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చని మీరు ఆశించకూడదు.
వ్యాయామం అధికంగా చేయడం వల్ల మీ శరీరం ఎక్కువ శ్రమకు గురిఅవుతుంది. ఇది మీ బలాన్ని తగ్గిస్తుంది. మరియు మీలో అధిక ఒత్తిడిని పెంచుతుంది.

మీరు మీ రోజువారీ జీవితంలో ఒక బహుముఖ ఫిట్నెస్ ప్రణాళిక పొందుపరచడానికి ఉత్సాహంగా ఉంటే , ఒక అర్హత కలిగిన మంచి ఫిట్నెస్ శిక్షణా నిపుడిని సహాయం తీసుకోండి. మీరు మీ వ్యాయామంను హెల్తీగా చేయాలనికి కోరుకోవాలంటే, అప్పుడు మీ శరీరం వ్యాయామాలకు సహరిస్తుందో లేదో తెలుసుకోవాలి. అధిక వ్యాయామం చేయడం వల్ల మీకు ముందుగానే కొన్ని హెచ్చరిక సంకేతాలను తెలియజేస్తుంది. ఈ లక్షణాలలు భౌతిక లేదా మానసిక సూచనలు మరియు చిహ్నాలు ఉన్నాయి.

అధిక వ్యాయామాల వల్ల మీ శరీరం చూపించే కొన్ని సంకేతాలను పరిశీలించండి. అధిక వ్యాయామం వల్ల మీ శరీరం ఎదుర్కొనే కొన్ని అతి సాధారణ లక్షణాలు మీరు అర్థచేసుకోవడానికి కొన్ని ఇక్కడ ఉన్నాయి. దాన్ని అనుసరించి మీ వ్యాయామాన్ని ప్లాన్ చేసుకోండి.

నీరసించిపోవడం :

నీరసించిపోవడం :

మీరు శక్తిని పొందడానికి బదులుగా అధికంగా అలసిపోవడానికి గురైనప్పుడు, అప్పుడు మీరు అధిక వ్యాయమాయం చేశారని సంతేతాలని నిర్ధారించుకోవాలి. మీరు మీ రెగ్యులర్ వ్యాయామం చేయడానికి ఎక్కువగా అలసిపోతున్నట్లు గమనించినట్లైతే, అది మీ శరీరం చాలా నీరసానికి గురిచేస్తుందని ఒక స్పష్టమైన సంకేతం.

అలసట :

అలసట :

వ్యాయామం ప్రారంభ దశలో అధిక వ్యాయామం వల్ల ఎక్కువ అలసటకు మరియు అధిక శ్రమపడినట్లు అనిపిస్తుంది . చివరకు పనితీరు మరియు సమన్వయం తగ్గిపోతుంది . అధిక వ్యాయామం చేశారనడానికి ఇది ఒక సాధారణ సంకేతం.

హార్మోన్ల అసమతౌల్యం :

హార్మోన్ల అసమతౌల్యం :

అధిక వ్యాయామం వల్ల హార్మోన్ల అసమతుల్యతానికి కారణం కావచ్చు. ఇది స్త్రీ మరియు పురుషులు ఇద్దరిలోనూ ఏర్పడవచ్చు. మహిళలో ఇది రుతుక్రమ సమస్యలకు దారి తీయవవచ్చు . వ్యాయామం పెంచడం వల్ల స్ట్రెస్ హార్మోనులు, హార్మోన్ కార్టిసాల్ కూడా పెరుగుతాయి. దాంతో పెరిగిన వ్యాయామం క్రమంగా హార్మోన్ సంతులనం ప్రభావితం చేస్తుంది .

కండర నొప్పి :

కండర నొప్పి :

మీరు మొదటి సారి వ్యాయామం మొదలుపెట్టినప్పుడు,సాధారణంగా కండరాల్లో నొప్పి కలుగుతుంది . అయితే ఈ నొప్పి ఎక్కువ రోజులున్నట్లు మీరు గమనించినట్లైతే, ఎటువంటి మార్పులు కనబడనట్లైతే, మీ వర్కౌట్ ప్లాన్ మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఇలా కండరాల నొప్పి కూడా అధిక వ్యాయామానికి సూచనే

మానసిక ఒత్తిడి :

మానసిక ఒత్తిడి :

అధిక వ్యాయామం వల్ల మీ శరీరం మాత్రమే కాదు మీ మనస్సును కూడా ప్రభావితం చేస్తుంది. మీరు భావేద్వేగ ఒత్తిడికి మరియు స్ట్రెస్ కు గురి అవుతారు. ఇలా అనిపించినప్పుడు ఎక్కువ వ్యాయామాల జోలికి పోకూడదు. అది తిరిగా మీ మానసిక మరియు శరీరక శ్రమ మీద ప్రభావం చూపుతుంది.

కోలుకోవడానికి ఆలస్యం అవుతుంది :

కోలుకోవడానికి ఆలస్యం అవుతుంది :

సాధారణంగా, అధిక వ్యాయామాల నుండి ఎటువంటి నొప్పులు, లేదా గాయాలను అయినప్పుడు చాలా తక్కువ సమయంలో నయం అవుతాయి. అలా కాకుండా, వీటిని నయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకొన్నప్పుడు, అది మీరు అధిక వ్యాయామాలు చేస్తున్నారని గుర్తించాలి.

నిద్రలేమి :

నిద్రలేమి :

అధిక వ్యాయామం మీ సాధారణ నిద్రకు ఆటంకానికి కారణం కావచ్చు . అధిక వ్యాయామం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యమీ ఎక్కువ ప్రభావం చూపుతుంది. మీరు గాఢంగా నిద్రించడానికి బదులు అలసటగా మరియు నిద్రలేమికి కారణం కావచ్చు.

 ఆసక్తి కోల్పోవడం :

ఆసక్తి కోల్పోవడం :

క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పుడు ఎక్కువ ఆసక్తిని చూపించలేకపోవడం. ఇదికూడా అధిక వ్యాయామానికి ఒక సంకేతంగా భావించవచ్చు. అధిక వ్యాయామం శారీరక మరియు మానసిక సంకేతాలు శాంతముగా వదిలిపెట్టాలంటే, ఆలోచించటం బలవంతంగా ఉండవచ్చు .

 డీహైడ్రేషన్:

డీహైడ్రేషన్:

అధిక వ్యాయామం వల్ల అధికంగా నీళ్ళు తీసుకోవడం చాలా ముఖ్యం . అధిక వ్యాయామం వల్ల మీ శరీరం డీహైడ్రేషన్ కు గురికావచ్చు . ఈ నిర్జలీకరణ సంబంధం అధిక వ్యాయామం ఇతర చిహ్నాలు దారి తీస్తుంది .

 తక్కువ రోగనిరోధకత పనితీరు :

తక్కువ రోగనిరోధకత పనితీరు :

అధిక వ్యాయామం సంకేతాలు, మీ రోగనిరోధకత వ్యవస్థ మీద ఆధారపడుతుంది . అధిక వ్యాయామం వల్ల మీరు తరచూ ఇన్ఫెక్షన్స్ లేదా ఇన్ఫ్లమేషన్ కు గురికావచ్చు . వాటిని తగ్గించుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు . కాబట్టి, మీ రోగనిరోధక వ్యవస్థను పరిశీలించి తగుజాగ్రత్తలు తీసుకోండి.

Desktop Bottom Promotion