For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ఫ్లూ’ నుండి తక్షణ ఉపశమనాన్నిచ్చే సింపుల్ డైయట్

|

సాధారణంగా ఫ్లూ వాతావరణంలోని తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఫ్లూజ్వరం వాతావరణంలో మార్పు, రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం, వర్షంలో తడవటం మరియు వైరస్‌వలన వ్యాప్తి చెందుతుంది. ఇది ఒక వైరస్ వల్ల కలిగే జబ్బు . దీనివల్ల ప్రాణ హాని కలుగదు కాని రకరకాల వ్యాధులకు ఇది దారి తీయవచ్చు. ఇది పూర్తిగా అంటువ్యాధి. ఇన్‌ఫ్లుయోంజా క్రిములు శరీరంలోకి ప్రవేశించి రెండు మూడు రోజులలోనే అపరిమితంగా వృద్ధిపొందుతాయి. ఆ క్రిములు వెలిగ్రక్కే విషం శరీరంలో హెచ్చు తుంది. అందువల్ల శరీరావయవాలన్నీ క్రుంగిపోతాయి.

వ్యాధి లక్షణాలు: వ్యాధి క్రిములు శరీరంలో ప్రవేశించిన రెండు, మూడు రోజులలో జ్వరం వస్తుంది. కాళ్ళు చేతులు, గొంతు, రొమ్ము ... శరీరం అంతటా నొప్పులు ఉంటాయి. దగ్గినప్పుడు నొప్పి ఉంటుంది. తలనొప్పి ఎక్కువగా వస్తుంది. దగ్గినప్పుడు కళ్లె తెగిపడదు. నాలుగైదు రోజుల తర్వాత క్రమంగా వ్యాధి తగ్గుముఖం పడుతుంది.

జాగ్రత్తలు: పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఒళ్ళు నొప్పులూ, తల నొప్పి తగ్గడానికి వైద్యుని సలహామేరకు మందులువాడలి. శ్వాసనాళాలకు సంబంధించిన వ్యాధి కాబట్టి విటమిన్ సి వాడితే మంచిది. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి, ఆ ఉప్పు నీటితో పుక్కిలించవచ్చు. మరుగుతున్న నీటిలో టించర్ అయోడిన్ కలిపి ఆవిరిపట్టడం మంచిది. ఆ ఆవిరిని పీల్చడంవల్ల బాధ తగ్గుతుంది. నీలగిరి తైలం ( యూకలిప్ట్‌స్ ఆయిల్) వాడవచ్చు. జలుబు, దగ్గు, తుమ్ములు, జ్వరం, ముక్కు నుండి నీరు కారటం వంటి లక్షణాలు మూడు రోజులకు మించి ఉంటే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలి. మంచినీరు, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి.

వ్యాధి నివారణ మార్గాలు: ఆరోగ్యంగా ఉండి, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి దరిచేరదు.ఈ వ్యాధితో బాధపడుతున్న రోగి తుమ్మినప్పుడు ఆ రోగక్రిములు గాలిలో ప్రవేశించి ఆ గాలి పీల్చినవాళ్ళందరికీ ఈ వ్యాధి సోకుతుంది. గొంతులో నుంచి, ముక్కులోనుంచి వెలువడే స్రావంలో సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉంటాయి. కనుక మాట్లాడేటప్పుడు జేబు రుమాలు నోటికి అడ్డంగా పెట్టుకోవడం చాలా అవసరం. రోగస్థులు ఎక్కడపడితే అక్కడ ముక్కు చీదడం, ఉమ్మివేయడం లాంటి దురలవాట్లు మానుకోవాలి. ఫ్లూ జ్వరం సోకినవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముక్కుకు, నోటికి చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. ముక్కుకు, నోటికి మాస్కు ధరించి ఉండాలి.

మనందరికి తెలుసు జలుబు, దగ్గు, జ్వరం ఇటువంటి సాధారణ జబ్బుల నుండి బయటపడాటానికి వ్యాధినిరోధక శక్తి పెంచుకోవడానికి, సరైన ఆహార, పానియాలు తీసుకోవాలని. ఐతే అందులో కూడా ఫ్లూ నివారణకు సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అయితే ఫ్లూ మరియు ఇతర ఇన్ఫెక్షన్ కు గురియైనప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలో చాలా మందికి తెలియదు. ఇన్‌ఫ్లూయంజా వైరస్ వలన జలుబు వస్తుంది. ఇది సాధారణ ఫ్లూ. ఈ మధ్య ‘ఫ్లూ'కి సంబంధించిన ఓ కొత్త విషయం కనిపెట్టారు శాస్తజ్ఞ్రులు. ఆహారంలో మార్పులు చేస్తే ‘ఫ్లూ'ని అరికట్టవచ్చని. భారతీయ ఆహార విధానం ‘ఫ్లూ'ని సమర్ధవంతంగా అరికడుతుంది. జలుబు, దగ్గు, ఫ్లూ ఉన్నప్పుడు మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కొన్ని ఆహారాలు మీకోసం....

‘జలుబు, దగ్గు, ఫ్లూ’కు తక్షణ ఉపశమనం ‘డైయట్’

హెర్బల్ టీ: ‘హెర్బల్ టీ'. ఫ్లూతో బాధపడుతున్నప్పుడు ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఈ హెర్బల్ టీలో కొన్నితులసి ఆకులు మరియు కొద్దిగా అల్లం ముక్క, బ్లాక్ పెప్పర్ చేర్చి బాగా మరింగించి గోరువెచ్చగా వెంటవెంటనీ తీసుకొన్నట్లైతే కోల్డ్ నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

‘జలుబు, దగ్గు, ఫ్లూ’కు తక్షణ ఉపశమనం ‘డైయట్’

సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లను ముఖ్యంగా తీసుకోవడం ఎందుకంటే ఇందోల విటమిన్ సి పుష్కలంగా ఉండటమే. ఇది మనలో రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. సిట్రస్ పండ్లు ఆహారంగానే కాదు విటమిన్ ఫుడ్ గా బాగా సహాయపడుతుంది. కోల్డ్, ఫ్లూ వంటి కామన్ జబ్బులను పోగొట్టడానికి, పొటాటో, పచ్చిబఠానీ, పెప్పర్, స్ట్రాబెర్రీ, మరియు పైనాపిల్, గ్రీన్ పీస్ వంటి ఆహారాలు బాగా సహాయపడుతాయి.

‘జలుబు, దగ్గు, ఫ్లూ’కు తక్షణ ఉపశమనం ‘డైయట్’

వెల్లుల్లి: వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మాత్రమే కాదు, ప్లూ, కోల్డ్ వంటి వాటికి కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి మీ డైలీ డైయట్ లిస్ట్ లో ఈ వెల్లుల్లిని చేర్చుకోవచ్చు.

‘జలుబు, దగ్గు, ఫ్లూ’కు తక్షణ ఉపశమనం ‘డైయట్’

చికెన్ సూప్: చాలా మంది దీన్ని నేచర్ పెన్సిలిన్ అంటుంటారు. వ్యాధి నివారణ శక్తుల జాబితాలో మొదటి స్థానంలో ఉంటుంది. వేడిగా ఉండే చికెన్ సూప్ శ్వాసనాళాల్లో గాలిపోవడానికి అడ్డుపడుకుండా సహాయపడుతుంది. అదనపు శక్తిని పొందడానికి మరియు మంచి టేస్ట్ కోసం ఈ సూప్ లో కొద్దిగా వెజిటేబుల్ ముక్కలను మరియు వెల్లుల్లి ముక్కలను చేర్చాలి.

‘జలుబు, దగ్గు, ఫ్లూ’కు తక్షణ ఉపశమనం ‘డైయట్’

హాట్ అండ్ స్పైసీ ఫుడ్: మనం సాధారణంగా చాలా కారంగా ఉండే ఆహారాలను తినడం ఇష్టం ఉండదు. మనం ఫ్లూతో బాధపడుతున్నప్పుడు టేస్ట్ బడ్స్ చాలా ఆక్టివ్ గా ఉంటాయి. అటువంటి సమయంలో చాలా మంది చాలా కారంగా అనిపించే సాస్ లను రుచిచూడాలని కోరిక ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఇండియన్ స్టైల్లో గార్లిక్, పచ్చిమిర్చితో తయారు చేసి వంటలు చేసి రుచి చూడండి. రుచికి రుచికి. ఆరోగ్యానికి ఆరోగ్యం.

‘జలుబు, దగ్గు, ఫ్లూ’కు తక్షణ ఉపశమనం ‘డైయట్’

అల్లం: ఈ అల్లంలో ఔషద విలువలు అపరిమితంగా ఉంటాయి. మరియు చాలా మంది సాధరణంగా వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ, జ్వరం వంటి వాటి నివారణకు ఈ అల్లం రూట్ ను ఔషదంగా తయారు చేసుకొని లేదా టీలో అల్లం చేర్చి బాగా మరింగించి సేవిస్తుంటారు.

‘జలుబు, దగ్గు, ఫ్లూ’కు తక్షణ ఉపశమనం ‘డైయట్’

ద్రవాలు: సాధరణ ఫ్లూ, జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు శరీరం డీహైడ్రేట్ అవుతుంటుంది. దీన్ని నుండి బయటపడాలంటే ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా సిట్రస్ పండ్లతో తయారు చేసిన తాజా పండ్ల రసాలను తీసుకుంటుండాలి. ఇంకా హెర్బల్ టీ మరియు లెమన్ టీ కూడా మంచిదే.

‘జలుబు, దగ్గు, ఫ్లూ’కు తక్షణ ఉపశమనం ‘డైయట్’

విటమిన్ బి6 మరియు బి12 (గోరువెచ్చని పాలు): చాలా రకాల విటమిన్లను ఔషద పోషకాలు అంటుంటారు. గోరువెచ్చని పాలు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. పోషకాలు అధికంగా ఉండే చేపలు, సోయా మిల్క్, సెరియల్, ఆకుకూరలు, మరియు టర్కీ వంటివి మీ డైలీ డయట్ లిస్ట్ లో చేర్చుకోవాలి.

‘జలుబు, దగ్గు, ఫ్లూ’కు తక్షణ ఉపశమనం ‘డైయట్’

నిద్ర: ప్రతి రోజూ తగినంత నిద్ర పోవడం వల్ల శరీరం, మనస్సు తాజాగా ఉండటమే కాకుండా.. జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది. కనీసం ఎనిమిది గంటలు నిద్రతో విశ్రాంతి తీసుకోవడం వల్ల కోల్డ్ కు తొలగించే ప్రయోజనం ఉంది.

‘జలుబు, దగ్గు, ఫ్లూ’కు తక్షణ ఉపశమనం ‘డైయట్’

జింక్(రెడ్ మీట్): సాధారణ జలుబును తగ్గించుకోవడానికి మీ డైలీ డైయట్ లో జింక్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం అందుతుంది. అంతే కాదు వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది. ఓస్ట్రెయిస్, రెడ్ మీట్ మరియు పౌల్ట్రీ ఆహారాలను తీసుకోవాలి. ఇంకా నట్స్, లెగ్యుమ్స్, ధాన్యాలు వంటివి కూడా ప్లూ నివారణకు మంచి పోషకపదార్థాలు.

English summary

Simple Diets To Get Rid Of Flu | ‘జలుబు, దగ్గు, ఫ్లూ’కు తక్షణ ఉపశమనం ‘డైయట్’

Winter and rainy seasons are something that we usually dread about. Not because we get drenched or have to feel the spine chilling cold, but for the aftermath of it. It is true that most of us get affected by flu as soon as the onset of winter or rainy season arrives or even during certain weather change. Cold and flu are the most common illness we deal in our day to day life.
Story first published: Tuesday, February 12, 2013, 13:32 [IST]
Desktop Bottom Promotion