For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గించడంలో తేనె చేసే అద్భుత మ్యాజిక్ !

|

తేనే ప్రకృతి సిద్దం గా దొరికే అపురాపమైన ఔషధము . తేనెటీగలు రకరకాల పుల మకరందాలను పోగు చేసి తేనే రూపము లో మనకి (వాటికోసమే అనుకోండి) అందిస్తున్నాయి . ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి. బహుశా ఎలాంటి కల్తీకి లోనుకానిది, బలవర్ధక ఆహారం కూడా ఇదేనేమో! స్వచ్ఛమైన తేనె ఆరోగ్య ప్రదాయిని. ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడే వాటిలో ఇది కూడా ఒకటి. ఒకప్పుడు అడవుల్లో మాత్రం లభించే ఈ తేనె ఇప్పుడు పట్టణాల్లో అదీ ఇళ్ల పెరడులో కూడా తయారవుతోంది.

తేనెలో ఉన్న అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయని మనకు తెలిసిందే. తేనెలో అనేక ఔషధగుణాఉన్నడటమే కాదు, ఇది బరువు తగ్గించి స్లిమ్ చేయడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. బరువు తగ్గించేందుకు డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక అద్భుతాలను చేస్తుంది. మరి మీ అందానికి ఆరోగ్యానికి కొన్ని అద్భుతాలు జరగాలంటే ఈ ప్రకృతి సిద్దంగా లభించే తేనెను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే.

ఎల్లప్పుడూ తేనెను పంచదారకు ప్రత్యామ్నాయంగా మన డైట్ ప్లాన్ లో ఉపయోగించుకోవచ్చు. తేనెను టీ, జ్యూస్ మరియు ఇతర పానీయాల్లో కూడా తేనెను కలుపుకోవడం వల్ల తియ్యదనంతో పాటు, మంచి ఫ్లేవర్ ను అంధిస్తుంది. తేనె పంచదారకు ప్రత్యామ్నాయంగానే కుండా మరిన్ని ప్రయోజనాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది బరువు తగ్గించడం. ఉదాహరణకు ప్రతి రోజూ ఉదయం కాలీ కడుపుతో నిమ్మరసం, గోరువెచ్చనినీళ్ళు, తేనె మిక్స్ చేసి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ మరియు ఫ్యాట్స్ ను శరీరం నుండి బయటకు పంపడానికి బాగా సహాయపడుతుంది.

అలాగే తేనెను కొన్ని రకాల సలాడ్స్ లో డ్రెస్సింగ్ కోసం ఉపయోగిస్తారు. తేనె వల్ల మరో ఆరోగ్యప్రయోజనం కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. తులసి ఆకుతో పాటు తేనెను తీసుకోవడం వల్ల శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి, మీరు బరువు తగ్గాలనుకుంటే తేనెను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని మీమ్మిల్ని మీరు స్లిమ్ గా మార్చుకోండి. అందుకు ఇక్కడ కొన్ని చక్కటి మార్గాలున్నాయి. వాటని మీ బరువు తగ్గించే ఎఫెక్టివ్ డైట్ ప్లాన్ లో చేర్చుకోండి...

ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే అద్భుత ఔషధం తేనె

తేనె నిమ్మ మరియు నీళ్ళు: గోరువెచ్చని నీళ్లు, నిమ్మరసం, తేనెతో మీ దినచర్యను ప్రారంభించండి. ఈ హెల్తీ డ్రిక్ జీర్ణక్రియలను యాక్టివ్ గా ఉంచుతుంది. టాక్సిన్స్ మరియు ఫ్యాట్స్ ను శరీరం నుండి తొలగిస్తుంది.

ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే అద్భుత ఔషధం తేనె

తేనె మరియు బాదాం: డైట్ ప్లాన్ లో పచ్చివి కోరుకుంటున్నారా? తేనె అలాగే డైరెక్ట్ గా తీసుకోవడం ఒక ఉత్తమ మార్గం. ఇక స్పూన్ నిండుగా తేనె, దాంతో పాటు నాలు బాదాంలను తీసుకోవడం మంచిది. బాదం మీకు తగిన ఎనర్జీ మరియు విటమిన్ ఈ ని అందిస్తుంది. తేనె మెగ్నీషియం మరియు ఇతర మినిరల్స్ ను అంధిస్తుంది.

ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే అద్భుత ఔషధం తేనె

తేనె మరియు టీ: మీ టీలో ఒక చెంచా పంచదార వేసుకోవడానికి బదులుగా తేనె చేర్చుకోవడం ఉత్తమ పద్దతి. బ్లాక్ లేదా గ్రీన్ టీలో కొద్దిగా తేనె మరియు నిమ్మరసం కలుపుకోవడం ఉత్తమమైన మార్గం.

ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే అద్భుత ఔషధం తేనె

తేనె మరియు పెరుగు: చాలా మందికి వారి భోజనం పూర్తిఅయిన తర్వాత పెరుగులో పంచదార కలుపుకొని తినడం చాలా మంది అలవాటు ఉంటుంది. పంచదార స్థానంలో తేనె ను బదలాయించి, మీ ఈటింగ్ హ్యాబిట్స్ ను హెల్తీగా మార్చుకోండి.

ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే అద్భుత ఔషధం తేనె

భోజనం తర్వాత తేనె మరియు గోరువెచ్చని నీళ్ళు: భోజనం తర్వాత గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకొని తాగడం వల్ల మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.

ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే అద్భుత ఔషధం తేనె

సలాడ్ డ్రెస్సింగ్ గా తేనె: చాలా వరకూ సలాడ్స్ ను ఆయిలీగా లేదా అనారోగ్యరంగా డ్రెస్సింగ్ చేస్తారు. కాబట్టి సలాడ్ డ్రెస్సింగ్ కోసం ఫ్యాటనింగ్ సాల్సా బదులు, చిలికిన పెరుగు మరియు తేనె ను మిక్స్ చేసుకోవాలి.

ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే అద్భుత ఔషధం తేనె

డిజర్ట్స్ : డిజర్ట్స్ కు పంచదార బదులు, తేనెను ఉపయోగించడం మంచి పద్దతి. పాన్ కేక్ అయినా సరే తేనె ఉపయోగించడం వల్ల తియ్యదనాన్ని ఇస్తుంది.

ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే అద్భుత ఔషధం తేనె

తేనె -పాలు: తియ్యగా లేకుండా పాలు తాగడానికి చాలా మంది ఇష్టపడురు పిల్లలైతే మరీనూ. కాబట్టి చల్లటి పాలకు తేనె మిక్స్ చేసి ట్రై చేసారా?టేస్ట్ చాలా అద్భుతం. మరియు ఆరోగ్యకరం.

ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే అద్భుత ఔషధం తేనె

తేనె మరియు చెక్క: యునాని మెడిసిన్ ప్రకారం, హెర్బల్ టీ తేనె మరియు చెక్క పౌడర్ తో తయారు చేసి టీ తాగడం వల్ల చాలా ప్రయోజనకరం. తులసి టీని చెక్కపొడి, తేనె మిక్స్ చేసి తాగడం మంచి ఫలితాలను అందిస్తుంది. బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే అద్భుత ఔషధం తేనె

తేనె మరియు అల్లం కషాయం: : ఔషధగుణాలున్న తేనెను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం, మరియు అల్లం రసంతో పాటు తాగడం వల్ల బ్యాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. మెటబాలిజంను మెరుగుపరుస్తుంది మరియు జీర్ణక్రియను పెంచుతుంది.

English summary

Smart Ways To Use Honey In Diet Plan

We all know that honey have several health benefits. Apart from having many medicinal qualities, it can also help you slim down. That is why, including honey in a weight loss diet can work wonders for you.
Story first published: Friday, July 12, 2013, 17:57 [IST]
Desktop Bottom Promotion