For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు జంక్ ఫుడ్ ప్రియులా..అయితే ఆరోగ్యం ..?

|

జంక్ ఫుడ్ ఎంత నాణ్యత లేనిదో అర్ధం చేసుకోవడానికి మీరు పాక శాస్త్ర ప్రవీణులు కావలసిన అవసరం లేదు. అవకాశం వుంటే ఎవరైనా జంక్ ఫుడ్ నే ఎంచుకుంటారని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ అది అంత ఆరోగ్యకరమైన ఎ౦పిక కాదు కదా. జంక్ ఫుడ్ వ్యామోహాన్ని తగ్గించుకునేందుకు ఇక్కడ కొన్ని ఉపాయాలు చెప్పబడ్డాయి.

1. ఒక కారణం వుండాలి
జంక్ ఫుడ్ పట్ల వ్యామోహాన్ని తగ్గించుకోవడంలో మొదటి మెట్టు మీ ఆరోగ్యంపై దాని దుష్ప్రభావాన్ని అంగీకరించి, ఒక వ్యక్తిగత కారణంతో దానికి దూరంగా ఉండడమే. వాటిని వదలివేయడానికి మీకు గల కారణాలు ఏమిటి? మీ రక్తపోటు స్థాయి పెరుగోతోందా? కొవ్వు శాతం పెరుగుతోందా? నడుము కొలత పెరుగుతోందా? ఒక్కసారి ఆ కారణమేమిటో తెలుసుకుంటే వాటినుంచి దూరంగా వుండే శక్తి వస్తుంది.

Steps to Avoid Eating Junk Foods..
2. ఒక ప్రణాళిక తయారు చేసుకో౦డి
మీకు ఇష్టమైన మాక్ బర్గర్లు, వేపుళ్ళు వదలివేయాలంటే, మీ జీవనశైలిలో గణనీయమైన మార్పు రావాలి. దీనికి సంబంధించి మీకున్న ఎంపికలు ఏమిటో మదింపు చేసుకోండి. అదయ్యాక, మీ ఆహార ప్రణాళికను వివరంగా తయారు చేసుకుంటే అది మీరు ఒక క్రమ పద్ధతిలో ఉండేందుకు సహాయపడుతుంది. దానిలో మీరు తినడానికి ఇష్టపడే ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చండి. ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి. దీనివల్ల డబ్బు ఆదా అవడమే కాదు, ఇది మీ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రయోగింఛి చూసే అవకాశాన్ని కూడా అందిస్తుంది. మీరే కాబోయే షెఫ్ ఏమో - ఎవరికీ తెలుసు? మీరు మీ ఆహార పట్టికను, తినే షెడ్యూల్ ను తయారు చేయండి, దానిని చక్కగా అనుసరించండి. వీటిని అనుసరించడ౦ మీకు కొంచెం విసుగు అనిపి౦చవచ్చు, కానీ దీర్ఘ కాలంలో ఇవి చాలా ఫలితాలిస్తాయి.
3. వ్యాయామం
వ్యాయామం చేస్తుంటే ఆహారాన్ని గమని౦చుకోవాలన్న స్పృహ పెరుగుతుంది. గొప్ప శరీరాకృతికి, ఒక ప్లేటు ఫ్రెంచ్ ఫ్రై లకు మధ్య ఏదో ఒకటి ఎంచుకోవాల్సివస్తే తెలివైనవారు మొదటి దాన్నే ఎంచుకుంటారు. మీకు నచ్చిన వ్యాయామ ప్రణాళిక ఎంచుకొని దాన్ని తూ.చ. తప్పక పాటించండి. మీకు నడక ఇష్టమైతే ఉదయం సాయంత్రం శికారుకి వెళ్ళండి. మీకు నాట్యం నచ్చితే, డాన్స్ క్లాసుల్లో చేరి ఆరోగ్యానికి చేరువ కండి. మీరు సంప్రదాయ వాది అయితే జిమ్ లో చేరడం మంచి ఐడియా.
4. మీ ఆహారాన్ని ఆస్వాదించండి
ఆరోగ్యకరమైన ఆహారం తయారుచేయడం చాలా కష్టమనే అపోహ వుంది. మీరు అలాగే అనుకుంటుంటే, మీ దృక్పథం మార్చుకోవాలి. సరిగ్గా వండితే ఆరోగ్యకరమైన ఆహారం కూడా జంక్ ఫుడ్ లాగే రుచికరంగా వుంటుంది. ఇంట్లో తయారైన ఆహారాన్ని ఆసక్తికరంగా చేయడానికి మంచి వంటకాలు ఎంచుకోండి, మసాలా దినుసులు కూడా కలపండి. మీరు దీనికి ఎంత త్వరగా అలవాటు పడతారో మీరు గుర్తించలేరు.
5. నియంత్రణ
మీ కోరికల మీద సరిపడా నియంత్రణ వచ్చేసాక, నెలకొకసారో రెండో సార్లో ఫ్రెంచ్ ఫ్రై లు కూడా తినవచ్చు. జంక్ ఫుడ్ ను మీ ఆహారం నుంచి పూర్తిగా తొలగించకుండా దాని వాడకాన్ని వీలైనంత నియంత్రించడమే ఇక్కడ అసలు ఉద్దేశ్యం. మీరు జంక్ ఫుడ్ కూడా తినండి, కానీ పరిమితంగా. అయితే, ఈ ప్రక్రియ లో మీ లక్ష్యం మీద గురి తప్పకుండా ఉండేలా చూసుకోండి. మీ కోరికలను నియంత్రించాలి కానీ వాటికి లొంగి పోకూడదు అనేది మన ఉద్దేశ్యం.
సరైన మార్గదర్శకంతో ఎటువంటి వ్యసనాలనైనా విజయవంతంగా తగ్గించుకోవచ్చు. పైన చెప్పిన చర్యలను పాటి౦చడం ద్వారా, మీ జంక్ ఫుడ్ వ్యామోహాన్ని పూర్తిగా అరికట్టగలరు.

English summary

Steps to Avoid Eating Junk Foods.. | మీరు జంక్ ఫుడ్ ప్రియులా..అయితే ఆరోగ్యం ..?


 If given a choice, one can be sure that you will pick junk food over anything. But let’s face it, that wouldn’t be a very healthy choice, would it? Here are some steps to curb your junk food addiction, for good.
Story first published: Monday, April 8, 2013, 11:25 [IST]
Desktop Bottom Promotion