For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శీతాకాలంలో బరువు తగ్గడానికి చిట్కాలు

|

శీతాకాలంలో బరువు తగ్గడం అనేది చాలా కష్టమైన అంశం ఎందుకంటే మిగిలన సీజన్లలో కంటే ఈ సీజన్ లో చలికి చాలా మంది అవుట్ డోర్ వ్యాయామాలకు వెళ్ళరు. చలికి బద్దకించి వెచ్చగా పడుకొంటారు. దాంతో ఇతర సీజన్లలో కంటే ఈ సీజన్లో మరికొంత బరువు పెరుగుతారు. కాబట్టి అవుట్ డోర్ వర్కౌట్ మరియు డైట్ ప్లానింగ్ శీతాకాలంలో బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. ఉదాహరణకు, అవుట్ డోర్స్లో వ్యాయామాలు చేయడానికి, బయట చలి, మంచు మిమ్మల్నిబయట అడుగుపెట్టడానికి నిరుత్సాహపరుచవచ్చు మరియు అసౌకర్యానికి గురిచేయవచ్చు.

శీతాకాలంలో బరువు తగ్గించడానికి మరో మార్గం సూపర్ ఫుడ్స్ ను నిల్వ చేసుకోవడమే. అంటే మీరు శీతాకాలంలో మీ శరీరానికి ఉపయోగకరమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలని అర్థం. స్వీట్ పొటాటోలో అధిక ఫైబర్ ఉండి, అవి మీ పొట్టను కడుపు నిండుగా ఉండేట్లు చేస్తుంది మరియు ఎక్కువ సమయం ఆకలి కానివ్వదు మరియు ఇది ఆరోగ్యకరమైనది కూడా. మెకరోనీ మరియు చీజ్ వంటివి చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతారు, కానీ, శీతాకాలంలో క్యాలరీలను తగ్గించాలన్నా మరియు బరువు తగ్గాలన్నా, ఆరోగ్యకరమైన ఆహారాలు అంటే, ఎక్కువ వెజిటేబుల్స్ అందులో విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. మరియు కొన్నిబరువు పెంచే ఆహారాలు చీజ్ సలాడ్స్ మరియు పాస్తా వంటివి నివారించాలి.

వింటర్లో అదనపు బరువు పెగకుండా ఉండటానికి, ఆహారాపు అలవాట్లను మీరు ఖచ్చింత అనుసరించాలి, ఉదయం బ్రేక్ ఫాస్ట్ గీసుకోవడం వల్ల మీ మెటబాలిజం పెరగుతుంది. బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడానికి ముందు వ్యాయామం చేయడం వల్ల అది మీలో ఆకలి మరియు ఆహారం తినాలనే కోరికను పెంచుతుంది. మీశరీరానికి అవసరం అయ్యే కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీనులు అధికంగా ఉండే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. ఆహారం తీసుకోవడానికి ముందు 20నిమషాలు వేచిఉండాలి. దాంతో మీలో నిజంగా ఆకలి అనిపిస్తోందా లేదా అని తెలుస్తుంది. అధిక క్యాలరీలున్న బెవరేజ్ లను తీసుకోవకూడదు. మీకు మద్యం రెగ్యులర్ గా తీసుకొనే వారైతే, స్పార్కిలింగ్ వాటరల్ తో లిక్కర్ మిక్స్ చేయాలి అలాగే టానిక్ లేదా సోడాకు బదులుగా నిమ్మరసాన్ని మిక్స్ చేయవచ్చు.

వింటర్ సీజన్లో మీరు బరువు తగ్గడానికి ఇక్కడ కొన్ని చురకైన చిట్కాలు మీకోసం...

వ్యాయామం:

వ్యాయామం:

వింటర్ సీజన్ లో మీరు బద్దకంగా ఉన్నప్పుడు మీరు వెచ్చగా దుప్పటితన్ని పడుకోవడం ఉత్తమం అని భావిస్తారు. అయితే, మీరు రెగ్యులర్ గా వ్యాయామం చేయడ వల్ల శరీరంలోని క్యాలరీలను తగ్గించుకోవడంతో పాటు శరీరంలో కొవ్వు నిల్వలను కరిగించుకోవచ్చు.

ఆకలితో బయటకు వెళ్ళకూడదు:

ఆకలితో బయటకు వెళ్ళకూడదు:

వింటర్లో అదనపు బరువు తగ్గించుకోవడానికి ఇది మరోక చిపట్కా. మీరు బయట ఆహారాలు తీనడం వల్ల మీరు ఇంట్లో తీసుకొనే ఆహారంలో కంటే అధనంగా 40శాతం ఎక్కువ క్యాలరీలను తీసుకుంటారని కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. కాబట్టి, ఆకలితో బయటకు వెళ్ళకండి.

సూపులు:

సూపులు:

ఆప్టైజర్స్ మరియు స్టార్టర్స్ మీ కడుపు ను సులభంగా నింపుతాయి మరియు అధికంగా తినడాన్ని నివారిస్తుంది . మీరు బయట డిన్నర్ కు వెళ్ళే టప్పుడు ఒక కఠినమైన వెయిట్ లాస్ డైట్ ను అనుసరించండి. అందుకు మీరు కొన్ని హాట్ ఫ్యాట్ బర్నింగ్ లో క్యాలరీ సూపులను ఎంపిక చేసుకోండి.

స్నాక్స్ తినడం మానుకోండి:

స్నాక్స్ తినడం మానుకోండి:

వింటర్ సీజన్ లో, ప్రజలు మరింత బద్దకంగా ఉండటం వల్ల, అది వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, ఆయిల్ తో తయారుచేసిన స్నాక్స్ మరియు జంక్ ఫుడ్స్ తినడం వల్ల అదనపు బరువు పెరగడానికి కారణం అవుతుంది. కాబట్టి, స్నాక్స్ మీద కోరికలను నియంత్రించుకోవాలి.

ఆల్కహాల్ కు నో చెప్పండి:

ఆల్కహాల్ కు నో చెప్పండి:

శీతాకాలంలో ఆల్కహాల్ త్రాగడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచుతుందని మీరు అనుకోవచ్చు. కానీ, ఆల్కహాల్లోని అనేక క్యాలరీలు మిమ్మల్ని బరువు పెరిగేలా చేస్తాయి. అయినా కూడా మీరు త్రాగాలనుకుంటే, చాలా నిధానంగా త్రాగాల్సి ఉంటుంది. అలాగే దాంతో పాటు మరే ఇతర ఆయిల్ ఫుడ్స్ తీసుకోకుండా నివారించాలి.

నీళ్ళు త్రాగాలి:

నీళ్ళు త్రాగాలి:

రోజూ తగినంత నీళ్ళు త్రాగడం వల్ల మిమ్మల్ని హైడ్రేషన్ గా ఉంచడంతో పాటు, అధికంగా తినడం నివారిస్తుంది. వింటర్ సీజన్ లో బరువు తగ్గాలనుకొనే వారు, భోజనానికి 20నిముషాల ముందు ఒక గ్లాసు నీళ్ళు త్రాగాలి. మీరు బయట భోజనం చేసేవారైతే ఈ వెయిట్ లాస్ చిట్కాలను తరచూ అనుసరించండి.

ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్:

ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్:

బెర్రీస్, సిట్రస్ పండ్లు, ఆకుకూరలు వంటి అనేక ఫ్యాట్ బర్నింగ్ ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతాయి. మరియు ఇది శరీరంలో కొవ్వును నిల్వలను కరిగించడానికి సహయపడుతుంది.

ఆరోగ్యకరమైన ఎంపిక:

ఆరోగ్యకరమైన ఎంపిక:

వింటర్ సీజన్ అనవసరపు, అదనపు బరువును తగ్గించుకోవడానికి ఉడికించి, పచ్చికూరలు, మరియు ఆయిల్ తక్కువగా ఉన్న ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

సైక్లింగ్:

సైక్లింగ్:

బరువు తగ్గాలనుకొనే వారు సైకిల్ తొక్కడం వల్ల మిమ్మల్ని ఫిట్ గా ఉంచడంతో పాటు, బరువును తగ్గిస్తుంది . కాబట్టి, మీరు రెగ్యులర్ గా సౌకిల్ తొక్కడం అలవాటు చేసుకోండి.

English summary

Tips To Prevent Winter Weight Gain

Winter and weight gain go hand in hand. Outdoor workouts and planing your diet to avoid gaining weight is very important. There are various methods to avoid putting on unwanted weight during winter.
Story first published: Monday, December 16, 2013, 14:51 [IST]
Desktop Bottom Promotion