For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా బరువు పెంచే శక్తి ఈ ఆహారాలకే ఉంది...

By Super
|

ఒక ఆరోగ్యకరమైన శరీరం పొందడానికి రహస్యంగా ఆరోగ్యకరమైన ఆహారం ఎల్లప్పుడూ ఉంది. అయితే ప్రస్తుత రోజుల్లో అనేక మంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు, వారిలాగే మరికొంత మంది బరువు పెరగాలనే కోరికను కలిగి ఉన్నారు . బరువు పెరడగం చాలా సులభం అని మీరు భావిస్తూ ఉండవచ్చు. అందుకు కేవలం, ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటే చాలు ఆటోమాటింక్ గా బరువు పెరవచ్చు అనుకుంటారు.కానీ ఇలా చేయడం ఖచ్చితంగా ఆరోగ్యకరమైన మార్గం కాదు.

ఆరోగ్యకరంగా ఉంటూనే బరువు పెరగడం అనేది ఒక చాలెంజ్ వంటిదే, అయితే బరువు అదిగమించడానికి అంత కష్టమైన పనేం కాదు. అందుకు మీరు కేవలం కేలరీలు అధికంగా ఉన్నా మరియు సరైన పోషకాంశాలు కలిగి ఆహారాలను తీసుకోవడమే. అధిక ప్రోటీనులున్న ఆహారాలు తీసుకోవడం వల్ల మీ శరీరంలో కండరాలు ఏర్పడటానికి మరియు బరువు పెరగడానికి బాగా సహాయపడుతాయి. అందువల్ల, బరువు పెంపొందించుకోవడానికి సహాయపడే కొన్ని సరైన పోషకాంశాలు, మరియు క్యాలరీలు అధికంగా ఉండే అలాంటి ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిని పరిశీలించి మీ బరువును పెంచుకోండి....

డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్:

డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్:

డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ లో పుష్కలమైన క్యాలరీలు, పోషకవిలువలు, మరియు ఫైబర్ కలిగి ఉంది. అందువల్ల మీ రెగ్యులర్ డైట్ లో ఎండుద్రాక్ష, బాదాం, వాల్ నట్స్ మరియు జీడిపప్పు వంటి వాటిని చేర్చుకోండి. ఒక కప్పు ఎండు ద్రాక్షలో 449 క్యాలరీలో , అలాగే మరో కప్పు బాదంలో 529క్యాలరీలు కలిగి ఉన్నాయి. ఇటువంటి పోషకవిలువలున్న డ్రై ఫ్రూట్స్ ను పెరుగు లేదా ఐస్ క్రీమ్ , సలాడ్లు మరియు ధాన్యాలలో ల మీద గార్నిషింగ్ గా వేసుకొని తిని ఆనందించవచ్చు.

జున్ను(చీజ్):

జున్ను(చీజ్):

అన్ని డైరీప్రొడక్ట్ జున్నుతో సహాయ అన్ని డైరీ ప్రొడక్ట్స్ లో అవసరమైన పోషకాలు కలిగి ఉంటాయి. మీరు త్వరగా బరువు పెరగాలనుకుంటే వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా కలిగి ఉన్నాయి . వీటితో పాటు, క్యాలరీలు, అధిక ప్రోటీనులు, అధిక క్యాల్షియం, మరియు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నాయి. చెద్దా చీజ్ ఒక్క సర్వింగ్ లోనే 69 క్యాలరీలు పొందవచ్చు.

పీనట్ బటర్

పీనట్ బటర్

పీనట్ బటర్ లో ప్రోటీన్ మరియు కొవ్వు పుష్కలంగా ఉన్నాయి. మరియు బరువు పెరగాలనుకొనే వారు దీన్నిఎంపిక చేసుకోవడా ఒక ఉత్తమమైన మార్గం. ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్ లో సుమారు 100క్యాలరీలు కలిగి ఉంటుంది. ఇందులో అనేక ముఖ్యమైన పోషకాలున్నాయి . పీనట్ బటర్ లోని కొవ్వు, అసంతృప్త రకాని చెందినది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. మీరు గోధుమలతో తయారుచేసిన రొట్టెలతో పాటు పీనట్ బటర్ ను కలిపి తినవచ్చు లేదా యాపిల్ ముక్కలను పీనట్ బటర్ లో డిప్ చేసి తినడం వల్ల వ్యాయమం తర్వా త ఎనర్జీని పొందవచ్చు.

హోల్ మిల్క్:

హోల్ మిల్క్:

మొత్తం ‘ఫ్యాట్' మిల్క్ ను ఓట్ మీల్, తృణధాన్యాలతో ఉపయోగించుకోవచ్చు లేదా ఒక గ్లాసు పాలు అదనంగా చాక్లెట్ వంటి వాటితో తీసుకోవడం అదనపు ఎనర్జీ పొంది ఆనందించవచ్చు. ఇందులో క్యాలరీలు మరియు విటమిన్ డి మరియు విటమిన్ ఎ అధికంగా ఉన్నాయి. స్కిమ్డ్ మిల్క్ కు బదులు మొత్తం పాలను మీగడతో పాటు అలాగే తాగడం వల్ల శరీరంలో అదనపు కొవ్వు ఏర్పడి త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది. ఒక గ్లాసు పాలలో 120-150 క్యాలరీలున్నాయి.

బంగాళదుంప

బంగాళదుంప

బంగాళ దుంప ఒక సాధరణమైన వెజిటేబుల్. బరువు తగ్గాలనుకొనే వారు, ఈ దుంపను నివారిస్తుంటారు. మరి మీరు వీటికి దూరంగా ఉంచడంలో అర్థంమేంటి?వీటిలో అధికంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మరియు బరువు పెరగడంలో అద్భుతంగా సహాపడుతాయి. ఇందులో గొప్ప పోషక విలువలు, స్టార్చ్, ఫైబర్ మరియు విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. బంగాళదుంపలను పొట్టుతో సహా తీసుకోవడం వల్ల అధిక శాతంలో ప్రోటీనులను పొందవచ్చు . ఒక మీడియం బంగాళదుంపలో 150కేలరీలు ఉన్నాయి.

పాస్తా:

పాస్తా:

పాస్తా ఒక రుచికరమైన మరియు కెలోరీలు అధికంగా ఉండే ఒక ఆహారం. ఇది కార్బోహైడ్రేట్లు యొకక ఒక గొప్ప మూలం. అనేక రకాల వెజిటిబుల్స్ తో వీటిని జోడించండి మరిన్ని అవసరమయ్యే పోషకాలు సమృద్ధిగా అవుతుంది . ఒక కప్పు మెకరోనీ లో సుమారు 390కాలోరీలుంటాయి, అలాగే వండిన స్పెగెట్టిలో సుమారు 220 కాలోరీలున్నాయి.

బటర్ (వెన్న)

బటర్ (వెన్న)

వెన్న సంతృప్త కొవ్వులకు ఒక మూలం. మరియు దీన్ని ఒక చిన్న మొత్తంలో వంటకోసం ఉపయోగించవచ్చు. లేదా బ్రెడ్ తో దీన్ని మిక్స్ చేసి ఎంజాయ్ చేయవచ్చు. లేదా స్నాక్స్ ఫ్రై చేసి తినవచ్చు మరియు రుచికరమైన వంటల్లో కూడా మిక్స్ చేయవచ్చు. బటర్ లేదా నెయ్యి మంచి ఫ్లేవర్ కలిగి మరియు గొప్పక్యాలరీలున్నాయి కాబట్టి మిమ్మల్ని త్వరగా బరువు పెరిగేలా చేస్తాయి.

ఆరోగ్యకరమైన షుగర్ ఫ్రూట్స్

ఆరోగ్యకరమైన షుగర్ ఫ్రూట్స్

షుగరీ ఫ్రూట్స్ అంటే పండ్లు, బొప్పాయి, అరటి మరియు అనాస వంటి పండ్లు మీరు త్వరగా బరువు పెరగడానికి సహాయపడుతుంది. వీటిలో సహజ చక్కెరలు కలిగి మరియు శక్తిని నింపడానికి ఒక గొప్ప మూలం. బరువు పెరగాలనుకొనే వారికి అవొకాడో ఒక గొప్ప ఎంపిక. వీటిలో అధికంగా కొవ్వులు మరియు క్యాలరీలు కలిగి ఉంటాయి. అవొకాడోలో 300క్యాలరీలు పొందవచ్చు. కాబట్టి, ఈ స్వీట్ అండ్ హెల్తీ ప్రూట్స్ ను ఫ్రూట్ సలాడ్స్, డిజర్ట్స్, స్మూతీస్ వంటి రూపంలో వాటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి .

గుడ్లు:

గుడ్లు:

గుడ్లలో క్యాలరీలు, పోషకాలు మరియు ప్రోటీనులు కూడా అధికంగా ఉంటాయి. ఒక గుడ్డులో సగటున 70క్యాలరీలు మరియు 5గ్రాముల ఫ్యాట్ కలిగి ఉంటుంది. అందువల్లే, బాడీబిల్డర్స్ కోసం ఒక ఫేవరెట్ ఫుడ్ వంటిది. అంతే కాదు వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు గుడ్డులోని పచ్చ సొనలో ఆరోగ్యానికి మంచిది కాని, కొలెస్ట్రాల్ అధిక శాతంలో ఉంటుంది. కాబట్టి, త్వరగా బరువు పెరగడానికి ఉడికించిన గుడ్లు లేదా స్రాంబుల్డ్ ఎగ్ లేదా పచ్చసొన తీసేసిన గుడ్లను తీసుకోవచ్చు.

లీన్ రెడ్ మీట్:

లీన్ రెడ్ మీట్:

లీన్ రెడ్ మీట్ లో క్యాలరీలు అధికంగా ఉండటం వల్ల బరువు త్వరగా పెరిగేందుకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన శరీరం పొందడానికి మీ హెల్తీ డైట్ లో చేర్చుకోవచ్చు. ఇంకా వీటిలో ప్రోటీనులు పుష్కలం మరియు కండర పుష్టికి బాగా సహాయపడుతాయి. దీన్ని వేగించి లేదా, ఉడికించు తీసుకోవడం వల్ల బరుతు త్వరగా పెరగవచ్చు.

English summary

Top 10 Healthy Foods to Gain Weight Fast

Healthy food has always been the secret of attaining a healthy body. While many strive to lose their weight, many are craving to gain a few pounds as well. You might think it is easy to gain weight; just swallow all sorts of oily, fried and fatty foods. But, that is definitely not a healthy way.
Desktop Bottom Promotion