For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాయంకాలం తినదగ్గ టాప్ 10 లోకేలరీల చిరుతిళ్ళు !!

By Super
|

సాయంత్రం 7.30 కి బాగా ఆకలనిపించినా, మీ నడుము చుట్టుకొలత పెరుగుతు౦దనే భయం వల్ల మీకిష్టమైన ఫాస్ట్ ఫుడ్ చిరుతిండి తినలేక పోతున్నారా, కంగారు పడకండి. ముంబై లోని హెల్దీ లివింగ్ డైట్ క్లినిక్ లో సీనియర్ రిజిస్టర్డ్ డైటీషియన్, డయాబెటీస్ ఎడ్యుకేటర్ గా పని చేస్తున్న సునితా పఠానియా సాయంతో మేము మీ కోసం ఆరోగ్యకరమైన చిరుతిళ్ళ జాబితా తయారు చేసారు - వీటి వల్ల మీ ఆకలి దూరం అవుతుంది, మీ బరువు కూడా నియంత్రణలో వుంటుంది.

బాదంబాదం పప్పులు

బాదంబాదం పప్పులు

మీకు సాయంకాలం పూట ఆకలి అయితే సుమారు 13-14 బాదం పప్పులు తినమని సిఫార్సు చేస్తున్నాం. ఇది చక్కటి చిరుతిండి, ఎందుకంటే కడుపూ నిండుతుంది, కానీ ఇవి కేవలం 98 కేలరీలే వుంటాయి.

ఒక యాపిల్

ఒక యాపిల్

రోజుకో యాపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండడమే కాక, మీ కాలరీల స్వీకరణ కూడా తగ్గుతుంది. ఒక యాపిల్ కేవలం 100 కేలరీలు కలిగి వుంటుంది. అందుకని కరకరలాడే యాపిల్ కోరికేయండి, ఎందుకంటే దాంట్లో వుండే కరిగే పీచు పదార్ధం వల్ల వాతావరణంలోని కాలుష్య కారకాల నుంచి రక్షణ అందుతుంది, కొలెస్టరాల్ ను కూడా తగ్గిస్తుంది.

ఉప్పుఉప్పు వేసిన వేరుశనగ పప్పులు

ఉప్పుఉప్పు వేసిన వేరుశనగ పప్పులు

వేరుశనగలు చాలా ఆరోగ్యకరమైన, పోషక విలువలున్న చిరుతిండి. కనుక ఓ పదో లేక చిన్న గుప్పెడో వేరుశనగలు తినండి, వాటిలో కేవలం 74 కేలరీలే వుంటాయి. అంతే కాదు, ఇవి తక్కువ గ్లూకోస్ కలిగి వుంటాయి కనుక శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. దాని వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి వుంటుంది.

ద్రాక్ష పళ్ళు : ద్రాక్ష

ద్రాక్ష పళ్ళు : ద్రాక్ష

కడుపు నిండి, తక్కువ కేలరీలు కావాలంటే ద్రాక్ష పళ్ళు సరైన మార్గం. ఒక 30 ద్రాక్ష పళ్ళు తినండి, ఎందుకంటే అవి రక్తహీనతను, అలసటను, కీళ్ళ నెప్పులను, కీళ్ళ వాతాన్ని, రుమాటిజంను, తగ్గించడానికి దోహదం చేస్తాయి, కేవలం 100 కేలరీలు మాత్రమె కలిగి వుంటాయి.

పుచ్చకాయ

పుచ్చకాయ

పుచ్చకాయలు మంచి డైట్ స్నాక్ గా చెప్పుకోవచ్చు. ఒక పుచ్చాకాయలో కేవలం 88 కేలరీలు మాత్రమె వుంటాయి. అవి నీటితో తయారవుతాయి, అందువల్ల చాలా తక్కువ కేలరీలు వుంటాయి.

టమాటో సూప్

టమాటో సూప్

మీకు తినడం ఇష్టం లేకపోతె, టమాటో సూప్ తాగండి, ఎందుకంటే అది చాలా తేలిగ్గా తయారు చేయవచ్చు, కేవలం 74 కేలరీలు మాత్రమె కలిగి వుంటుంది.

చెర్రీ

చెర్రీ

ఈ చిన్ని రుచికరమైన పళ్ళు పుష్కలంగా విటమిన్లు కలిగి వుంటాయి, తక్కువ కొవ్వు పదార్ధం కలిగి వుంటాయి. 25 చెర్రీలలో కేవలం 100 కేలరీలే వుంటాయి.

సీమ రేగు కాయ

సీమ రేగు కాయ

ఒక తాజా సీమ రేగు కాయ తిని మీ ఆకలి తీర్చుకోండి, ఎందుకంటే ఒక్క సీమ రేగు కాయలో 100 కేలరీల శక్తి వుండి, మీకు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది.

బ్లూ బెర్రీలు

బ్లూ బెర్రీలు

ఈ అధ్బుత పదార్ధం ఒక కప్పులో 83 కేలరీలు వుంటాయి. బ్లూ బెర్రీలలో పుష్కలంగా యాంటీ ఆక్సిడేంట్లు వుండి, వార్ధక్య ప్రక్రియను మందగింప చేస్తాయి, మీ గుండెను రకరకాల జబ్బుల నుంచి కాపాడతాయి.

కివీ పండు

కివీ పండు

ఈ ఆరోగ్యకరమైన పండులో విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. రెండు కివీ పళ్ళను సాయంత్రం స్నాక్ గా తీసుకోండి, ఇవి కడుపు నింపుతాయి, కేవలం 58 కేలరీలే వుంటాయి. కాబట్టి సాయంత్రపు స్నాక్ గా దీన్ని వాడుకోండి. అంతేకాక కివి పళ్ళు జీర్ణ క్రియకు సాయం చేస్తాయి, స్పష్టమైన, ఆరోగ్యకరమైన మేని చాయను కూడా ఇస్తాయి.

Desktop Bottom Promotion