For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గించే ఆరోగ్యకరమైన 12 చిరుతిళ్ళు!

|

‘రోజుకో యాపిల్ తింటే డాక్టర్ తో పని లేద'నే మాట మీరు వినే వుంటారు. అదే మాట ఇప్పుడు పప్పులు, పాప్ కార్న్, క్రస్ట్ బ్రెడ్ లాంటి చిరుతిళ్ళ గురించి కూడా అంటున్నారు. తెలుసుకోవడానికి ఆశ్చర్యంగానూ, నమ్మడానికి కష్టంగానూ వున్నా చిరుతిళ్ళతో కూడా బరువు తగ్గ వచ్చనేది అన్ని రకాలుగా నిజం. మీరు బరువు తగ్గే ఆహార ప్రణాళిక పాటిస్తుండి విరామాల్లో తినే వాటిని తగ్గించడం కష్టంగా భావిస్తుంటే మీ కోసం ఇక్కడ ఒక అనుకూలమైన పరిష్కార మార్గం వుంది.

బరువు తగ్గడం అంటే సరైన ఆహారాన్ని ఎంచుకోవడం, నియమిత వ్యాయామం, ఎక్కువగా నీళ్ళు తాగడం. అయినప్పటికీ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మానలేని వారు చాలా మందే వున్నారు - వాళ్ళు నూనెతో చేసిన చిరుతిళ్ళూ మానలేరు, రోజుకు మూడు భోజనాలూ మానలేరు. మీరు కూడా భోజనం గురించి రాజీ పడకుండా బరువు తగ్గాలనుకుంటే, ఇదిగో మీకు ఒక శుభ వార్త. ఈ వ్యాసం మీ ఆహార ప్రణాలికను కఠిన తరం చేసుకోకుండా బరువు తగ్గడానికి పనికి వచ్చే తక్కువ కాలరీల చిరుతిళ్ళ గురించిన సిఫార్సులు అందిస్తోంది.

ఆరోగ్యకరమైన తక్కువ కాలరీల చిరుతిళ్ళు

బరువు తగ్గించే టాప్ 12 హెల్తీ స్నాక్స్..!

పాప్ కార్న్: మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు మీరు నిలవ ఉంచుకోదగ్గ చిరుతిండి పాప్ కార్న్. ఐతే, మీరు నిల్వ ఉంచిన వాటిలో సినిమా హాళ్ళు, సూపర్ మార్కెట్ల లోలాగా వెన్న, చక్కర, ఉప్పు లాంటివి లేకుండా చూసుకోండి. పాప్ కార్న్ తేలిగ్గా వుండి పీచు పదార్ధం కలిగి వుంటుంది. ఒక కప్పు పాప్ కార్న్ లో కేవలం 31 కాలరీలే వుంటాయి, కేవలం అర గ్రాము కొవ్వు పదార్ధం వుంటుంది. గాలి ద్వారా తయారు చేసే పాప్ కార్న్ లో కొవ్వు వుండదు. వెన్న, తీపి, ఉప్పటి పాప్ కార్న్ లకు మాత్రం దూరంగా వుండండి.

బరువు తగ్గించే టాప్ 12 హెల్తీ స్నాక్స్..!

కరకరలాడే బ్రెడ్ లు: ఫాస్ట్ ఫుడ్లను ఇష్టపడే వారిని బరువు పెరగకుండా కాపాడే మరో చిరుతిండి కరకరలాడే బ్రెడ్. ఇది ప్రధానంగా తృణధాన్యాలతో తయారౌతుంది - అనేక రుచులు, రకాలలో దొరుకుతుంది. మీరు బరువు తగ్గే ఆహార ప్రణాళిక పాటిస్తుంటే ఇది మంచి పోషకాలిచ్చే చిరుతిండి. కరకరలాడే బ్రెడ్ ఒక ముక్క32కాలరీలను ఇస్తుంది, 0.2 గ్రాముల కొవ్వును కలిగి వుంటుంది, శరీరానికి మేలు చేసి బరువు తగ్గడంలో ఉపకరించే ఈ చిరుతిండిలో ధాన్యం, పీచు పదార్ధం వుంటాయి.

బరువు తగ్గించే టాప్ 12 హెల్తీ స్నాక్స్..!

ఆలివ్ లు: కాలరీలు అధికంగా వుండే ఇతర చిరుతిళ్ళకు అనుబంధాలుగా పని చేసే ఆలివ్ లు రుచిగా వుంటాయి. విటమిన్లు, యాంటి-ఆక్సిడెంట్లు పుష్కలంగా వుండే ఆలివ్ లలో ఒస్టియోపోరాసిస్, కాన్సర్, కీళ్ళ నెప్పులు లాంటి వ్యాధులతో పోరాడే సామర్ధ్యం వుంటుంది. ఆలివ్ లను నిమ్మరసంలో ముంచి, మూలికలు, సుగంధ ద్రవ్యాలతో వేయించి, లేదా సహజ రూపంలోనో తినవచ్చు. ఒక ఔన్సు పచ్చ ఆలివ్ లలో 41 కాలరీల శక్తి, 5 గ్రాముల కన్నా తక్కువ కొవ్వు వుండగా, ఒక ఔన్సు నల్లటి ఆలివ్ లలో 47కాలరీలు, 3.8 గ్రాముల కొవ్వు వుంటాయి.

బరువు తగ్గించే టాప్ 12 హెల్తీ స్నాక్స్..!

కూరగాయలు & డిప్ లు: మీ పోషకాహార నిపుణుడు ఇప్పటికే ఒక వంద సార్లు చెప్పినా, మరోసారి చెప్తున్నాం. ఆరోగ్యకరమైన తక్కువ కాలరీల చిరుతిళ్ళ గురించి మాట్లాడే టప్పుడు మీరు కూరగాయలను విస్మరించలేరు. కారెట్లు, తోటకూర, దోసకాయ లాంటి కూరగాయలు వాడడం కావలసిన అధిక బరువు తగ్గించుకోవడానికి సులభమైన మార్గం. హమ్మస్ లాంటి డిప్ లతో మీరు ఇలాంటి కూరగాయలు తినవచ్చు. అవోకాడో, ఆరిచోక్ డిప్ లు కూడా మీ ఆహార పట్టిక లో చేర్చుకోదగ్గ చిరుతిళ్ళు. ఈ డిప్ లలో కాలరీలు, కొవ్వు తక్కువగా వుంటాయి.

బరువు తగ్గించే టాప్ 12 హెల్తీ స్నాక్స్..!

పళ్ళు: ఒక పళ్ళెం నిండా పళ్ళతో కూడిన ఆహారంతో బరువు తగ్గించుకోవడం కన్నా ఆనందాన్నిచ్చేది ఏదీ లేదు. ఒక గుప్పెడు ద్రాక్షలు, కాసిన స్ట్రా బెర్రీలు ఆకలి మంటలను సరైన భోజన సమయం దాకా ఎలా ఆపగలవో తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ద్రాక్ష, స్ట్రా బెర్రీ కాకుండా పుచ్చకాయ, యాపిల్, బెర్రీలు, బత్తాయి, అత్తి పళ్ళు లాంటివి కూడా మీకు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.

బరువు తగ్గించే టాప్ 12 హెల్తీ స్నాక్స్..!

పెరుగు: కొవ్వు లేని లేదా తక్కువ కొవ్వుండే పెరుగు తినడం కూడా ఆకలిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన మార్గమే. పెరుగులో ఇతర పోషక విలువలు కూడా వుంటాయి. ఇందులో పుష్కలంగా కాల్షియం, మాంసకృత్తులు, పొటాషియం వుంటాయి. ఇవి మంచి సూక్ష్మ క్రిములను ఉత్పత్తి చేసి జీర్ణ సంబంధమైన సమస్యలను ఎదుర్కొంతటాయి. మీరు బెర్రీలు, గ్రనోలా లాంటి వాటితో కూడా మీగడ వాడవచ్చు.

బరువు తగ్గించే టాప్ 12 హెల్తీ స్నాక్స్..!

పీనట్ బట్టర్: పీనట్ బటర్ కాయధాన్యాల కుటుంబానికి చెందినది కాబట్టి గింజల గుణాలు కలిగి వుంటుంది - చక్కటి చిరుతిండి కూడా. రెండు టీ స్పూన్ల పీనట్ బట్టర్ తరువాతి భోజన౦ దాకా మీ ఆకలిని ఆపుతుంది. దీన్ని పళ్ళు, కరకరలాడేవి, లేదా మెత్తగా వుండే వాటితో ఉపయోగించి కావలసినంత బరువు తగ్గవచ్చు.

బరువు తగ్గించే టాప్ 12 హెల్తీ స్నాక్స్..!

బాదం పప్పు, ఇతర గింజ ధాన్యాలు: బాదం పప్పు, ఇతర గింజల్లో ఏక అసంతృప్త కొవ్వు పదార్ధాలు వుంటాయి కనుక అవి మీ శరీరానికి చాలా మంచివి - మీ ధమనులను శుభ్ర పరుస్తాయి. గింజలు తరువాతి భోజనం వరకు మీకు కడుపు నిండుగా అనిపిస్తుంది. వాటిలో విటమిన్ ఇ, పీచు పదార్ధం, మెగ్నీషియం పుష్కలంగా వుంటాయి. గింజల్లో వుండే విటమిన్ ఇ యాంటి ఆక్సిడెంట్ గా పని చేసి కాన్సర్, ఉబ్బసం, ఇతర ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో మీ రోగనిరోధక వ్యవస్థకు సహకరిస్తుంది.

బరువు తగ్గించే టాప్ 12 హెల్తీ స్నాక్స్..!

ఓట్ మీల్: ఒక కప్పు ఓట్ మీల్ ని పాలల్లో కానీ మరే రూపంలో కానీ తీసుకొన్నా ఫలితాలుంటాయి. ఓట్ మీల్ లోని పీచు... ఇతర కార్బొహైడ్రేట్ల వల్ల శరీరానికి నూతనోత్తేజం లభిస్తుంది. దీనిలోని పొటాషియం, పాస్ఫరస్ వంటి ఖనిజలవణాలు మీరు ఉత్సాహాంగా ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది. కొత్త ఆలోచనలు వచ్చేలా ఉత్తేజపరుస్తుంది. అధిక కొవ్వు సమస్య కూడా ఉండదు. అన్నిటికంటే గొప్ప ప్రయోజనం అంటే దానిని క్షణాలలో తయారు చేయవచ్చు. పనిలోకి తొందరగా వెళ్ళే వారు మైక్రోవేవ్ లో ఓట్ మీల్ తయారు చేసి రెడీగా తినేయవచ్చు.

బరువు తగ్గించే టాప్ 12 హెల్తీ స్నాక్స్..!

గ్రనోలా బార్స్ ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ కింద అధిక పీచు పదార్థం కలిగిన ఆహారాన్ని తీసుకుంటే రెండింతల కొవ్వు కరిగిపోతుందని మియామి.

బరువు తగ్గించే టాప్ 12 హెల్తీ స్నాక్స్..!

డార్క్ చాక్లెట్స్: మీకు చాక్లెట్స్ తినే అలవాటుంటే మరీ మంచిది. చాక్లెట్స్ లో అంత అద్భుతమైన గుణాలున్నాయి. వయస్సును తెలియనియ్యకుండా చేసే లక్షణం చాక్లెట్స్ లో అధికంగా ఉన్నాయి. అనేక అధ్యయనాల ప్రకారం, చాక్లెట్స్ లో ఉపయోగించి కోకో, చాక్లెట్ మిల్క్ చర్మ కణజాలాలు సురక్షింతంగా ఉంచుతాయి. మరియు కణాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. దాంతో చర్మంలో గరుకుదనం పోయి, చర్మం సున్నితంగా తయారువుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న ఆహారనియమాలను పాటించి వయస్సు మీద పడకుండా.. యవ్వనంగా కనబడేందుకు ప్రయత్నం చేయండి..!

బరువు తగ్గించే టాప్ 12 హెల్తీ స్నాక్స్..!

సూప్: సూప్ తాగండి 7 కేజీల బరువు తగ్గిపోతారు..... ప్రస్తుతం మనంలో సూప్ తాగే అలవాటు చాల పెరిగింది. ప్రతి ఒక్కరు సూప్ తాగడానికి అలవాటు పడుతున్నారు. ప్రతి రోజు బోజం చేసే ముందు సూప్ తాగితే సంవత్సరంలో మీరు పెరిగే బరువులో 7 కేజీలు తగ్గిపోతారు.

English summary

Top 12 Healthy Snacks For Weight Loss | బరువు తగ్గించే టాప్ 12 హెల్తీ స్నాక్స్..!

You might have heard of the phrase ‘an apple a day keeps the doctor away’. Well, the phrase is now being associated with snacks, like nuts, popcorns and crust breads as well. Though it is astonishing to learn and difficult to believe that consuming snacks can help people lose weight and attain the desired mark, it is but true in all respects.
Desktop Bottom Promotion