For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యంగా ఉండటానికి వింటర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్

|

నవంబర్- డిసెంబర్ వచ్చిందంటే చాలు చలికి సంకేతం. రుతు చక్రంలో చలికాలం ఒక ప్రధానమైన మలుపు. గజగజ వణికించే చలిని తన వెంట తీసుకువస్తుంది. మారిన రుతువుకనుగుణంగా మన దుస్తులు మారాలి. చలినుండి శరీరాన్ని కాపాడుకోవడం కోసం రక్షక కవచంగా స్వెటర్లు, కాళ్ళకు సాక్సులు, చేతులకు గ్లౌజులు ఉపయోగిస్తాం.. ఇలా దుస్తులు మారితేనే మనం మన దైనందిన జీవనాన్ని యథావిధిగా కొనసాగించ గలుగుతాము.

అయితే శరీరానికి బయట రక్షణ సరే.. శరీరంలోపల ఆరోగ్యం సంగతేంటి? కాలాన్ని బట్టి ఆహారనియమాలు కూడా పాటించాలి. అప్పుడే జీవక్రియ కూడా సక్రమంగా పనిచేస్తుంది. మరి ఈ సీజన్ కు తగ్గ వింటర్ డైయట్ పాటించాలి. ముఖ్యంగా పండ్లు మరియు కూరగాలు ఈ సీజన్ కు తగ్గట్లు తీసుకోవాలి . సీజనల్ గా వచ్చే పండ్లు వెజిటేబుల్స్ ను ఆయా సీజన్ లో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాల పోషకాలను, ప్రోటీనుల, నూట్రీషియన్స్ ను పుష్కలంగా అంధిచవచ్చు. సీజనల్ గా లభించే పండ్లు చాలా విలువైనవి మరియ పూర్తి పోషకాంశాలు కలిగినవి అందుకే అవి అంత ఖరీదై ఉంటాయి.

ఉదాహారణకు స్వీట్ పొటాటో , ద్రాక్ష, బ్లాక్ బెర్రీస్, మరియు పీర్స్ వంటి సూర్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇవీ ఆ సీజన్ లో తీసుకోవడం వల్ల వ్యాధినిరోధకత ఆరోగ్యంగా ఉంటుంది . కాబట్టి సీజనల్ గా లభించే న్యూట్రీషియన్స్ మరియు ఫైబర్ రిచ్ పండ్లు, వెజిటేబుల్స్ తప్పకుండా తీసుకోవడం మంచిది. సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మరి ఈ నవంబర్ సీజన్ లో మార్కెట్లో మనకు అందుబాటులో ఉండే పండ్లు మరియు వెజిటేబుల్స్ మనకు వివిధ రకాలగా ఈ సీజన్ మొత్తం అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా హెల్తీ డైట్ కోసం ఈ పండ్లు మరియు వెజిటేబుల్స్ ఎకనామికలీ మరియు హైన్యూట్రీషినల్ ఫుడ్స్.

నవంబర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆపిల్స్, కివి, బెర్రీస్, ఆరెంజెస్, బెర్రీస్, క్యాబేజ్, మరియు క్యాలీఫ్లవర్ వంటి పలాటబుల్ హెల్తీ డైట్ కు మాత్రమే కాదు, వీటిలో అధికంగా యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉండి మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి . క్యాబేజ్ , కాలీఫ్లవర్ వంటి వెజిటేబుల్స్ లో కొన్ని కాంపౌండ్స్ (గ్లూకోసినోలేట్స్-ఇవి క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు పుష్కలంగా కలిగి ఉంటాయి. ఈ సీజనల్ ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ లో వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండి మన శరీరానికి బలాన్ని, వ్యాధినిరోధక శక్తిని పుష్కలంగా అంధిస్తాయి . ఇవి కణాజాలలకు మద్దతుగా మరియు నాసికా రద్దీ నివారించబడుతాయి. నవంబర్ లో మనకు అందుబాటులో ఉండే పండ్లు మరియు వెజిటేబుల్స్ లో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్, కాపర్, విటమిన్ సి, విటిమన్ ఇ మరియు మ్యాంగనీస్ కలిగి ఉంటాయి.

ఇక్కడ మీకోసం కొన్ని సీజనల్ నవంబర్ ఫ్రూట్స్ గురించి తెలియచేస్తున్నాము. వీటిని మీ రెగ్యులర్ హెల్తీ డైట్ లో ఒకటిగా చేర్చుకోవచ్చు.

ఆపిల్:

ఆపిల్:

రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల డాక్టర్ సంప్రదించాల్సిన పనిలేదు. అది నిజం. ఆపిల్స్ లో ఫైటోన్యూట్రియంట్స్, ఫ్లెవనాయిడ్స్, మరియు యాంటీఆక్సిడెంట్స్ అది శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది.

ఆరెంజ్:

ఆరెంజ్:

వింటర్ లో వీటి తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే.. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని అలాగే తినడం లేదా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల శీతాకాలంలో తరుచూ వేదించే జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. దగ్గు, జలుబుకు కారణం అయ్యే బ్యాక్టీరియాతో పోరాడగలిగే శక్తి ఇందులో అధికంగా ఉన్నాయి. కాబట్టి ఆరెంజ్ ను ఇంట్లో నిల్వ చేసుకొని తరచూ తినడం వల్ల యాంటీబయాటిక్ అవసరం ఉండదు.

దానిమ్మ:

దానిమ్మ:

ఇది మరో ఎక్స్ పాన్సీ ఫ్రూట్ . వింటర్ లో చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. ఇది రుచికరమైనది మరియు లోక్యాలరీలు కలిగినది. ఇందులో పొటాషియం మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంది . ఇది శరీరాన్ని శుభ్రం చేయడానికి, రోగనిరోధకతను పెంచడానికి సహయడపతుంది.

క్రాన్ బెర్రీ:

క్రాన్ బెర్రీ:

రాన్ బెర్రీ పండు ఆరోగ్యానికి మంచిది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా మరీ మంచిదని పోషకాహార నిపుణులు చెపుతారు. ప్రతిరోజూ ఒక గ్లాసు క్రాన్ బెర్రీ రసం తాగితే, గుండె ఆరోగ్యం బాగా వుంటుంది. అది ఎలా అనేది పరిశీలించండి. క్రాన్ బెర్రీ జ్యూస్ రక్తంలోని మంచి కొలెస్టరాల్ పెంచుతుంది. కనీసం అంటే 10 శాతం పెరుగుతుందని నిపుణులు వెల్లడించారు. ప్లాస్మా యాంటీ ఆక్సిడెంట్ల సామర్ధ్యం 121 శాతం వరకు పెరుగుతుందట. ఈ పండు రసంతాగితే పిల్లలలో సాధారణంగా వచ్చే శ్వాస సంబంధిత ఇన్ ఫెక్షన్లు కూడా తగ్గిస్తుందని కూడా స్టడీ చెపుతోంది.

జామ:

జామ:

జామపండును తినడం వల్ల జీవక్రియను మెరుగు పరచడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా అద్భుతంగా సహాయపడుతుంది. పచ్చి జామకాయలో ఉన్న లైకోపిన్ అనే పదార్థం ధమని సమస్యలను నివారించడంలో బాగా పనిచేస్తుంది. పింక్ కలర్ లో ఉన్న జాపపండు, జ్యూసి జామపండ్లను వింటర్ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవడం ఆరోగ్యానికెంతో క్షేమం.

స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీ:

ఇది మరో అద్భుతమ రుచి కలిగిన ఫ్రూట్ . ఇవి వింటర్లో ఎక్కువగా అందుబాటులో ఉంటాయి . ఈ సీజన్ లో చాలా పాపులర్. దీని రుచి పుల్లగా, తియ్యగా ఉంటుంది . దీన్ని జ్యూసుల రూపంలో లేదా డైరెక్ట్ గా లేదా మిల్క్ షేక్స్ ద్వారా తీసుకోవచ్చు.

కివి:

కివి:

ఇదొక అసాధరన పండు. ఇందులో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఉప్పు చల్లిన ఈ కివి పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావల్సిన శక్తినందిస్తుంది. అంతే కాకుండా ఈ కివి పండ్లను శీతాకాలంలో వివిధ రకాల సలాడ్లలో కలిపి తీసుకోవడం మరింత ఆరోగ్యధాయకం. టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది.

English summary

Top 7 Winter Fruits To Stay Healthy

Winter in India sets in by November through most parts of the country and stays till the end of February and some part of March. India is a diverse country with tropics to deserts and snow filled regions packed in one.
Story first published: Tuesday, December 3, 2013, 17:38 [IST]
Desktop Bottom Promotion