For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులలో గ్యాస్ కారణం అయ్యే కూరగాయలు

By Lakshmi Perumalla
|

కూరగాయలు మీ శరీరంనకు సహజ రూపంలో అవసరమైన పోషకాలను అందిస్తాయి. అంతేకాక మీ ఆహారంలో ఒక ఆరోగ్యకరమైన భాగంగా ఉన్నాయి.అయితే కొన్ని కూరగాయల వలన కొన్ని అవాంఛిత దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉన్నది. కాయగూరలు మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందించటమే కాకుండా,మీ ఉదరంలో సాధారణ గ్యాస్ ఏర్పడటానికి మరియు కడుపు ఉబ్బరం సంభవించటానికి కారణం అవుతాయి. భోజనం ముందు మరియు తరువాత కూడా తరచుగా వాయువుల నుండి మీకు ఉపశమనం లేక చాలా అసౌకర్యంగా ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో, కొంత మందికి అధిక గ్యాస్ ఏర్పడి తద్వారా నొప్పి కూడా ప్రారంభమవుతుంది. కూరగాయలలో వివిధ రూపాల్లో ఉన్న రాఫ్ఫినోస్,లాక్టోజ్,ఫ్రక్టోజ్ మరియు సార్బిటాల్ వంటి చక్కెరలు మీ శరీరంలో సాధారణ గ్యాస్ ఏర్పడటానికి కారణం అవుతాయి. కూరగాయలలో కనిపించే రాఫ్ఫినోస్ అనే క్లిష్టమైన చక్కర అధిక ఉబ్బరం మరియు వాయువు సంబంధించిన కడుపు నొప్పికి కారణం అని తెలిసినది. కొన్ని ఆహారాలు ఎక్కువ గ్యాస్ ను ఉత్పత్తి చేస్తాయి. అయినప్పటికీ,ప్రతి వ్యక్తీ లోను గ్యాస్ ఉత్పత్తి ఒకేలా ఉండకుండా భిన్నంగా ఉంటుంది.

మీరు కొన్ని కూరగాయలను భోజనంలో సమృద్ధిగా తీసుకున్నప్పుడు,భోజనం చేసిన తరువాత గ్యాస్ ఏర్పడటాన్ని గుర్తించి మరియు అసాధారణతను గమనించాలి. ఈ విధంగా గమనించినప్పుడు మీరు తప్పనిసరిగా ఆ కూరగాయలను తీసుకోవడం తగ్గించటం చాలా ముఖ్యం. పొట్టలో అదనపు గ్యాస్ ను ప్రేరేపించటానికి ఉల్లిపాయలు,పచ్చికూరలు,క్యారెట్లు,బ్రస్సెల్స్ మొలకలు,దోసకాయ,క్యాబేజీ,కాలీఫ్లవర్, రాడిష్ మొదలైన కూరగాయలు ఉన్నాయి. మీరు పూర్తిగా గ్యాస్ ను నివారించేందుకు ఇటువంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తినటం ఆపాల్సిన అవసరం లేదు. కాబట్టి వాటి పరిమాణంను తగ్గించి తీసుకోవాలి. అంతేకాక వాటిని ఎక్కువ క్రమ విరమాలలో తీసుకోవటం మంచిది.

ఇక్కడ పురుషులకు సాధారణం కంటే అదనపు గ్యాస్ కలిగించే కొన్ని కూరగాయలు ఉన్నాయి.

ఉల్లిపాయలు

ఉల్లిపాయలు

ఉల్లిపాయ దేశవ్యాప్తంగా ప్రధానమైన ఆహారంలో ఉపయోగించే ఒక మౌలిక కూరగాయగా ఉంది.వంటలోఉల్లిపాయ మానివేయటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అయితే,దాని పరిమాణం తగ్గించుట వలన కడుపు ఉబ్బరం మరియు మిగులు వాయువు ఏర్పాటు అవకాశాలను నివారించవచ్చు. ఉల్లిపాయను పూర్తిగా నివారించుట వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

బ్రస్సెల్స్ మొలకలు

బ్రస్సెల్స్ మొలకలు

ఇది కూడా క్యాబేజీ, బ్రోకలీ మొదలైన ఆకుకూరల జాతికి చెందినది. వాటిలో విటమిన్ A,విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లం మరియు పీచు పదార్థం మంచి మొత్తంలో ఉంటుంది. అయినప్పటికీ,జీర్ణక్రియ సందర్భంగా కడుపు ఉబ్బరం మిగులు గ్యాస్ ఏర్పడటానికి కారణమయ్యే ఒలిగోసకరైడ్లు అనే

సంక్లిష్ట కార్బోహైడ్రేట్ కలిగి ఉంటుంది.

మొక్క జొన్న

మొక్క జొన్న

ఇది అనేక పోషకాలు మరియు సుక్రోజ్ అధికంగా ఉన్న మరొక ఆహారం. మొక్కజొన్నలో పిండి పదార్ధాలు మరియు చక్కెరలు అధిక శాతం ఉండుట వలన జీర్ణక్రియ సమయంలో గ్యాస్ ఏర్పడుతుంది. దీనిలో అధిక ఫైబర్ మరియు సహజ చక్కెరలతో పాటు జీర్ణంనకు కష్టంగా ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్ కలిగి ఉండుటవలన కూడా జీర్ణక్రియ సమయంలో గ్యాస్ ఏర్పడుతుంది.

బ్రోకలీ

బ్రోకలీ

బ్రోకలీ కూడా క్యాబేజీ కుటుంబానికి చెందినది. బ్రోకలీ లో మీ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండే విటమిన్లు,ఖనిజాలు మరియు ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి. దీనిలో చాలా లాభాలు ఉన్నా కూడా కొంతమంది బ్రోకలీ తినడానికి దూరంగా ఉంటారు. ఎందుకంటే ఇది ప్రేగు సంబంధిత గ్యాస్ ను కల్గిస్తుంది. బ్రోకలీ లో రాఫ్ఫినోస్ అనే చక్కర ఉండుట వలన జీర్ణ వ్యవస్థ లో ఎంజైముల విచ్ఛిన్నంనకు సాధ్యం కాకా గ్యాస్ ఏర్పడటానికి కారణం అవుతుంది.

క్యాబేజీ

క్యాబేజీ

క్యాబేజీ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండే పిండిపదార్ధాలు పుష్కలంగా ఉన్న మరొక కూరగాయ అని చెప్పవచ్చు. అయితే క్యాబేజీలో గ్యాస్ ఏర్పడటానికి కారణమయ్యే ఒలిగోసకరైడ్లు అనే సంక్లిష్ట కార్బోహైడ్రేట్ కలిగి ఉంటుంది.

బీన్స్

బీన్స్

బీన్స్ లో వెయ్యికి పైగా రకాలు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒకటి వేర్వేరు విధాలుగా ఆరోగ్యవంతముగా ఉంటాయి. బీన్స్ లో జీర్ణం కానీ ట్రిపుల్ స్తచ్యోస్,నాలుగింతల రాఫ్ఫినోస్,ఐదింతల వేర్బస్కస్ అనే చక్కెరలు ఉంటాయి. ఈ చక్కెరలు ఎంజైమ్ లను విచ్ఛిన్నం చేయకపోవుట వలన గ్యాస్ ఏర్పడుతుంది.

దుంపలు

దుంపలు

మీరు దుంపలు తినడం వలన మీ సున్నితమైన జీర్ణకోశ వ్యవస్థను చికాకుపెట్టే పేగు వ్యాధి,కడుపు ఉబ్బరం,అపానవాయువు,కడుపు నొప్పి,తిమ్మిరి,జీర్ణకోశ (అదనపు గ్యాస్ ఏర్పడటం) అసౌకర్యం వంటి వాటికీ కారణం కావచ్చు. దుంపలలో పోలిసచ్చరైడ్స్ అని పిలిచే కార్బోహైడ్రేట్ ఉంటుంది. జీర్ణం కానీ చక్కర రూపాలు ఉండుట వలన గ్యాస్ ఏర్పడుతుంది.

English summary

Vegetables That Cause Gas In Men

Vegetables are the healthiest part of your diet, which provides your body most of the essential nutrients in natural form. However there are some vegetables that come with all the goodies and some undesired side effects.
Story first published: Wednesday, December 4, 2013, 7:06 [IST]
Desktop Bottom Promotion