For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల మగతనానికి అత్యంత ముఖ్యమైన హార్మోన్..!

By Super
|

పురుషుల్లో బీజాల నుండి, ఎడ్రినల్‌ నుండి టెస్టోస్టిరాన్‌ హార్మోను ఉత్పత్తి అవుతుంది. పురుషుల మగతనానికి ఇది అత్యంత ముఖ్యమైంది. ఇది లేకపోతే మీసాలు, గడ్డాలు పెరగవు. గొంతులో మార్పు రాదు. సెక్స్‌లోపం కూడా సంభవిస్తుంది. మహిళల్లో కూడా టెస్టోస్టిరాన్‌ హార్మోను ఉంటుంది. కాకపోతే పురుషుల్లో కన్నా బాగా తక్కువగా ఉంటుంది. మహిళల్లో ఎడ్రినల్‌ గ్రంథుల నుండి టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి అవుతుంది. పురుషుల్లో ప్రతి 100 మిల్లీలీర్ల రక్తంలో 300 నానోగ్రాముల నుండి 1200 నానోగ్రాముల దాకా టెస్టోస్టిరాన్‌ ఉంటుంది. మహిళల్లో ప్రతి 100 మిల్లీలీరట్ల రక్తంలో 15 నుండి 100 నానోగ్రాముల పరిమాణంలో టెస్టోస్టిరాన్‌ ఉంటుంది.

ఆండ్రోజన్లు అంటే పురుషు లైంగిక హార్మోనులు. ఇవి మహిళల్లో లైంగిక వాంఛను, శక్తిని, ఎముకల సాంధ్రతను, కండరాల పటుత్వాన్ని పెంచుతాయి. అండాల్లోని పురుష హార్మోనుల చురుకుదనం వల్ల మహిళల్లో సంతానోత్పత్తి నియంత్రణలో ఉంటుంది. అండాశయంలో ఫాలికిల్స్‌ ఉంటాయి. వీటిని పుటికలు అంటారు. ఇవి కూడా ఒక రకమైన కణాలు. ఫాలికిల్స్‌ నుండి అండాలు విడుదలవుతాయి. పురుష హార్మోనులు ఫాలికిల్‌ పెరుగుదల, అభివృద్ధిని నియంత్రిస్తుంది. ఇవి ఫాలికిల్‌ ఎదుగుదలను, అభివృద్ధిని నియంత్రిస్తాయి. అదే సమయంలో పెరుగుతున్న అండాలు కలిగున్న ఫాలికిల్స్‌ క్షీణించడాన్ని నివారిస్తాయి.

టెస్టాస్టిరాన్ స్థాయిలు తగ్గితే శారీరిక ఎదుగుదల కుంటుపడుతుంది. ఈ హార్మోన్ సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలంటే ఈ క్రింది అంశాలను మీరు గుర్తుంచుకోవాలి.

బరువు తగ్గండి :

బరువు తగ్గండి :

బరువు ఎక్కువగా వుంటే మీరు ఎదుర్కోవాల్సిన ప్రతికూల ఫలితాలు చాలానే వుంటాయి. శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా వుంటే టెస్టాస్టిరాన్ స్థాయి తగ్గిపోతుంది. మీ టెస్టాస్టిరాన్ స్థాయి పెరగాలంటే ముందు మీ బరువు తగ్గే కార్యక్రమంతో మొదలు పెట్టండి.

లోహాల పోషణ :

లోహాల పోషణ :

జింకు, మెగ్నీషియం లాంటి లోహాలు టెస్టాస్టిరాన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఈ లోహాలందే ఆహారం తినడం మగవారిలో టెస్టాస్టిరాన్ స్థాయి పెరగడానికి చాలా ముఖ్యం. లోపం మరీ ఎక్కువగా వుంటే మినరల్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల సమస్య చాలా వరకు తగ్గుతుంది.

ఒత్తిడి స్థాయి :

ఒత్తిడి స్థాయి :

వ్యక్తిగత, వృత్తిగత వత్తిడి కూడా శరీర ఆరోగ్యాన్ని చాలా రకాలుగా దెబ్బ తీస్తుంది. బాగా వత్తిడిలో వున్నప్పుడు, శరీరం ఒత్తిడి హార్మోన్లను అధిక స్థాయిలో విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు శరీరంలో టెస్టాస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి కాకుండా అడ్డు పడతాయి. తేలిగ్గా, ప్రభావవంతంగా వుండే ధ్యానం లాంటి ప్రక్రియల వల్ల మీరు ఒత్తిడిని ఎదుర్కోగలుగుతారు.

చక్కర స్థాయి :

చక్కర స్థాయి :

చక్కర స్థాయి పెరిగితే శరీరంలో ఇన్సులిన్ స్థాయి కూడా పెరుగుతుంది. మీరు చక్కర తీసుకున్నప్పుడు మీ శరీరంలో టెస్టాస్టిరాన్ స్థాయి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. చక్కర ఎక్కువగా తీసుకోవడం తగ్గించండి. అత్యవసరమైన ఎదుగుదల హార్మోన్ సరైన స్థాయిలో అందేలా చూసుకోండి.

పోషకాహారం :

పోషకాహారం :

తాజాగా, పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహరం తింటే మనం ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. పచ్చటి ఆకుకూరలు, పళ్ళు, డ్రై ఫ్రూట్స్, లాంటివి మీ ఆహారంలో నిత్యం భాగం కావాలి. ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకునేలా చూసుకోవాలి.

శరీరానికి విశ్రాంతి :

శరీరానికి విశ్రాంతి :

ఈ ఎదుగుదల హార్మోన్ మీ శరీరంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చూసుకోవడంలో ప్రధానమైన భాగం ఏమిటంటే మీ శరీరానికి సరిపడా విశ్రాంతి, నిద్ర అందించడం. కనీసం 7-8 గంటలు పడుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు, ఎందుకంటే 70% టెస్టాస్టిరాన్ మీరు నిద్రపోతున్నప్పుడే తయారౌతుంది.

వ్యాయామం సెషన్లు తగ్గించడం :

వ్యాయామం సెషన్లు తగ్గించడం :

మీరు 45-75 నిమిషాలపాటు సాగే తీవ్రమైన వ్యాయామ ప్రణాళికలో వుంటే మీరు మీ శరీరంలో టెస్టాస్టిరాన్ స్థాయిని నిరోధించినట్టే. నిపుణుల సలహా తీసుకుని మీకు పనికి వచ్చే వ్యాయామ ప్రణాలికను తయారు చేసుకోండి.

ఆల్కహాల్ స్థాయి పరీక్షించుకోవడం :

ఆల్కహాల్ స్థాయి పరీక్షించుకోవడం :

లెక్క లేకుండా ఆల్కాహాల్ తాగితే మీ శరీరంలో టెస్టాస్టిరాన్ స్థాయి తగ్గిపోతుంది. నిత్య మద్యపాన౦ చేసేవారిలో దాదాపు 50% తక్కువ టెస్టాస్టిరాన్ ఉత్పత్తి అవుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

సహజ మార్గాల్లో టెస్టాస్టిరాన్ ఉత్పత్తి అయ్యేలా చూసుకుంటే తరువాత మందుల అవసరం లేకుండా పోతుంది.

English summary

Ways To Boost Male Hormone Levels


 Reduced levels of testosterone in your body can disrupt its physical development. In order to ensure that the level of this growth hormone is under control you must keep the following facets in mind.
Desktop Bottom Promotion