For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధిక బరువు తగ్గించే అతి సులభమైన యోగాసనాలు...

|

యోగా అనేది చాలా ఉపయోగకరమైన మరియు ఆరోగ్యకరమైన వ్యాయామం. మనందరికీ తెలుసు ఈ యోగా వ్యాయామం వల్ల శరీరానికి, మెదడుకు, మనస్సుకు చాలా మంచిదని. యోగా వ్యాయామం వల్ల శరీరానికి కొత్త శక్తి వస్తుంది. కండరాలు పుష్టిగా మారుతాయి. జీవక్రియలను క్రమబద్దం చేయడానికి, వ్యాధి నిరోధకతను పెంచడానికి మరియు బరువును తగ్గించడానికి అద్బుతంగా పనిచేస్తుంది.

యోగా వల్ల చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలున్నాయి వ్యాధులతో పోరాడటానికి ఈ యోగా.. వ్యాయామ రూపంలో పురాతన కాలం నుండినే భారతదేశంలో ప్రారంభమైనది. ఈ యోగా ద్వారా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచి, శరీరం ఫిట్ గా ఉండటానికి చాలా బాగా సహాపడుతుంది. యోగా ఆసనాల వల్ల శరీరక, భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనుసరించడానికి ప్రదర్శించబడుతుంది. పాశ్చాత్య దేశాలలోని చాలా మంది సన్యాసులు, స్వామి వివేకనంద కూడా ఈ వ్యాయం ఆచరించడం వల్లే యోగ యొక్క ప్రజాదరణ పెరిగింది.

అనేక అధ్యయనాలు మరియు సర్వేల ప్రకారం, యోగా రెగ్యులర్ గా చేయడం వల్ల క్యాన్సర్, మనోవైకల్యం, ఉబ్బసం మరియు గుండె సంబంధించిన సమస్యలు దరిచేరకుండా దూరంగా ఉంచుతుంది. అంతే కాకుండా ఈ యోగా వల్ల మానసిక మరియు శరీరక అస్థిపంజర ఆరోగ్య సమస్యలు మెరుగుదలకు సంకేతాలు చూపించింది.

ఇటువంటి అనేక రకాలైన జబ్బులను నయం చేయడమే కాకుండా ఆరోగ్య ప్రమాదాల నుండి శరీరాన్ని రక్షించేదుకు కూడా యోగా బాగా సహాయపడుతుంది. బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. చాలా మంది బరువు తగ్గాలనుకొనే వారీ డైయట్ ప్లాన్ ప్రకారం ఇది వారిలో చాలా అద్భుతమైన ఫలితాలను చూపించింది. ఒక సారి డైయట్ ప్లాన్ ను వదిలేసారంటే తిరిగి మళ్ళీ అతి సులభంగా బరువు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ డైయట్ ప్లాన్ తో పాటు రెగ్యులర్ యోగా సాధన చేస్తే మీరు తప్పనిసరిగా అధిక బరువును కోల్పోయి స్లిమ్ గా మారవచ్చు. దాంతో ఎల్లప్పుడూ ఒకే బరువును మెయింటైన్ చేయవచ్చు.

ఏ రకమైన యోగా లేదా ఆసనం మీ బరువును అతి సులభంగా తగ్గిస్తుందో తెలుసుకోవాలనుంది?అయితే బరువు తగ్గడానికి ఈ క్రింది తెలిపిన అత్యంత ప్రభావంతమైన యోగాసానాలను పరిశీలించి స్లిమ్ గా నాజూగ్గా మారండి...

అతి సులభంగా బరువు తగ్గించే యోగాసనాలు...

బో(బోర్లాపుడకొనే)భంగిమలో: ఈ యోగాసనం కొన్ని డిఫికల్ట్ పార్ట్స్ లో కొవ్వును కరిగించడానికి బాగా సహాయపడుతుంది. ఈ వ్యాయం వల్ల తొడలు, పొట్ట, ఛాతీ మరియు తుంటి మీద అధికంగా ఒత్తిడిని కలుగజేస్తుంది. కాబట్టి ఈ వ్యాయమం చేసే సమయంలో మీరు మనస్సును విశ్రాంతి పరిచి, శ్వాసను లోపలికి లోతుగా పీల్చుకొని బయటకు వదలాలి.

అతి సులభంగా బరువు తగ్గించే యోగాసనాలు...

పశ్చిమోత్తా నాసన: సులభంగా బరువు తగ్గించే మరొక సమర్ధవంతమైన యోగాసనం. అలాగే దీన్ని ఫార్వర్డ్ బెండ్ అని కూడా పిలుస్తారు. ఈ యోగా భంగిమ ఉదరంలో పేరుకొన్న కొవ్వును తగ్గిస్తుంది. మరియు వెన్ను నొప్పిని తగ్గిస్తుంది. చక్కగా పడుకుని రెండు పాదాలు దగ్గరగా ఉంచి రెండు చేతులు తలపైకి లేపి నేలకానించి గాలి పీలుస్తూ లేచి కుర్చుని గాలి వదులుతూ ముందుకు వంగాలి. తల మోకాళ్ళ వైపు, చేతులు పాదాల వైపు పోనిచ్చి వాటిని అన్చాడానికి ప్రయత్నిచాలి. ప్రారంభంలో తల మోకాళ్ళకు తగలకపోవచ్చు, చేతులు పాదాలకు అందకపోవచ్చు, కాని రోజు సాదన వల్ల సాధ్యమవుతుంది. తిరిగి పండుకుని మళ్ళి మళ్ళి లేస్తూ ఈ ఆసనం చేయాలి. కనిసం 5 నుండి 20 సార్లు చేయాలి.

అతి సులభంగా బరువు తగ్గించే యోగాసనాలు...

ట్రీ భంగిమ: బరువు తగ్గించడానికి ఉపయోగించే యోగాసనాల్లో అతి సులభమైన భంగిమ ఇది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఈ ఆసనాన్ని మొదులు పెట్టాలి. మంచి ఫలితాల కోసం కాలీ కడుపుతో ఈ ఆసనాన్ని ఆచరించడం మంచిది. బరువు తగ్గడానికి ఉపయోగించే ఈ ఆసనం వేయడంలో తగు జాగ్రత్త అవసరం. ఒంటి కాలి మీద నిలబడేటప్పుడు బ్యాలెస్ గా నిలబడాలి.

అతి సులభంగా బరువు తగ్గించే యోగాసనాలు...

భుజంగాసనం: రెండు అరచేతులు భూమిపై చాతిని ఇరువైపులా ఉంచి, గాలి పీలుస్తూ తలను చాతి పైకి నిదానముగా ఎత్తాలి. పది నుండి ఇరవై క్షణాలు అలాగే ఆగి, గాలిని వదులుతూ తిరిగి మెల్లగా యధాస్థానానికి రావాలి. ఇలా అయిదు నుండి పది సార్లు ఎవరి శక్తీ కొలది వారు చేయాలి. చేసిన తరువాత పది నుండి ఇరవై సెకండ్లు విశ్రాంతి పొందాలి. ఈ ఆసనాన్ని క్రమబద్దంగా ప్రతీ రోజు ఆచరిస్తూ ఉంటె, అతిగా కొవ్వు పెరిగిన వారికి నాభి క్రింద గల కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది, అంతేగాక, స్త్రీలలో గర్భాశయ శుద్ది జరిగి గర్భాశయంలోని గడ్డలు, కరిగిపోవడం లేదా పుట్టకపోవడం జరుగుతుంది. ఇంకా మలబద్దక సమస్య కుడా నివారించండి వెన్నెముక బలపడుతుంది.

అతి సులభంగా బరువు తగ్గించే యోగాసనాలు...

బటర్ ఫ్లై: బటర్ ఫ్లై ఈ యోగ వ్యాయామం ఉదరం మరియు తొడల మీద బాగా పనిచేస్తుంది. మీరు అందంగా, ఆకర్షనీయంగా ఉండే సన్నని కాళ్ళు పొందడానికి ఈ యోగా ఆసనం చాలా బాగా పనిచేస్తుంది.

అతి సులభంగా బరువు తగ్గించే యోగాసనాలు...

క్యామెల్ (ఒంటె) భంగిమ: ఎక్కువగా బెల్లీ (కడుపు)ఫ్యాట్ కలిగి ఉందా?ఈ యోగా వ్యాయమం ఉదరం, నడుము, ఛాతీ మరియు భుజాలు మీద ఒత్తిడి పెంచి బరువు కోల్పోయేందుకు సహాయపడుతుంది.

అతి సులభంగా బరువు తగ్గించే యోగాసనాలు...

కుండలిని: కుండలిని ఈ యోగ వ్యాయామం ఉదరం, తొడల వద్ద పేరుకొన్న కొవ్వును కరిగించడానికి బాగా సహాయపడుతుంది. మీ కాళ్ళు సన్నగా మరియు ఫ్లాట్ గా ఉండే పొట్టను మీరు పొందాలంటే ఈ ఆసనం చాలా బాగా సహాయపడుతుంది.

అతి సులభంగా బరువు తగ్గించే యోగాసనాలు...

ధనురాసనం: ధనుస్సును పోలి ఉన్నందున ఈ ఆసనానికి ధనురాసనం అనే పేరు వచ్చింది. ఆసనం అనే ప్రక్రియ కొద్దిగా క్లిష్టంగా ఉన్నప్పుడు ప్రారంభంలో అందరూ చేయలేరు. పూర్తి ఆసన స్థితిని కాకుండా మొదట సులభమైన స్థితిని ప్రయత్నించి, సాధన తరువాత పూర్ణస్థితిని చేరుకోవచ్చు. రాలేదు అని అనుకోకుండా మొదట అర్ధ ధనురాసనమును ప్రయత్నించి తరువాత పూర్ణ ధనురాసనం చేయవచ్చు. ఉదరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ ఎక్కువ జరిగి, అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

English summary

Yoga Asanas For Easy Weight Loss | అతి సులభంగా బరువు తగ్గించే యోగాసనాలు...

Yoga is one of the most beneficial and healthy exercises. We all know that this form of exercise is very good for the body, mind as well as soul. Yoga strengthens the body, tones body muscles, boosts up immunity, aids weight loss and most importantly, increases stretchability of the body.
Story first published: Friday, January 11, 2013, 17:53 [IST]
Desktop Bottom Promotion