For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొడలు,బొజ్జను కరిగించి స్లిమ్ గా మార్చేయోగాసనాలు

By Super
|

మహిళలు బరువు పెరగడం అనేది ఒక పెద్ద డీల్. అయితే, శరీరంలో కొన్ని ప్రముఖ భాగాలు, అంటే తొడలు, పిరుదులు, మరియు నడుము వంటి భాగాల్లో సులభంగా కొవ్వు చేరడానికి ఆకర్షిస్తాయి. శరీరంలో మార్పులు జరిగినప్పుడు మొదటి ఈ బాగాల్లో చాలా ఎఫెక్టివ్ గా మార్పులు చూపుతుంది. ఇలా ఉన్న మహిళలు వెంటనే వారు బరువు తగ్గాలనే ఆలోచన వారి మనస్సులో మెదులుతూనే ఉంటుంది.

మహిళలు వారి శరీరంను నాజూగ్గా మార్చుకోవడానికి, మసాజ్ జెల్స్ రాయడం, క్రీమ్, డైట్ మొదలగువన్నీ చేస్తుంటారు. అయితే వీటిలో ఏ ఒక్కటీ, శరీరంలోపల ఏర్పడ్డ కొవ్వను కరిగించలేవు. నిజం ఏంటంటే, వీటికి బదులు ఒక మంచి వ్యాయామాన్ని మొదలు పెడితే మీ శరీరంలోపల ఏర్పడ్డ అదనుపు కొవ్వు కరిగించుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి, మీకు నచ్చిన రీతిలో మీ శరీరంను మార్చుకోవడానికి రెండు మార్గాలున్నాయి, ఒకటి జిమ్ కు వెళ్ళడం, రెండవది యోగా చేయడం. వీటిని చేయడానికి మీ బిజీ షెడ్యూల్స్ తో మీకు సమయం దొరకదు అని అనుకొన్నప్పుడు, ఇంట్లో చేసే యోగా పద్దతులను పాటిస్తే తప్పనిసరిగా తొడలు, పిరుదుల భాగంలోని కొవ్వును కరిగించుకోవచ్చు. ఈ యోగాసనాల వల్ల మీ తొడలు మరియు పిరుదుల బాగం, నడుము బాగంలో కొవ్వు తగ్గించి మిమ్మల్ని స్లిమ్ గా మార్చాడానికి బాగా సహాయపడుతాయి.

తొడలు మరియు పిరుదులు తగ్గించుకోవడం కోసం యోగాసనాలు:

ఉత్కంటాసన:

ఉత్కంటాసన:

ఈ ఆసనంకు అపారమైన శక్తి అవసరమవుతుంది మరియు మీరు మొదటి సారిచేసేటప్పుడు మీ కాళ్ళలో నొప్పికలగవచ్చు. అయితే, ఈ ఆసనాలను రెగ్యులర్ గా చేయడం ద్వారా, మీరు శరీరం ఫ్లెక్సిబుల్ గా (కండరాలు సడలించబడి) మారుతుంది. మరియు నొప్పులనేవి ఉండవు.

రెండు పాదాలు దగ్గరగా చేర్చి నిటారుగా నిలబడాలి.

శ్వాస పీల్చేటప్పుడు,మీ చేతులను చెవులకు ఆనిస్తూ పైకి లేపాలి.

అంతేకాక , కొద్దిగా మీ మోకాలు వంచాలి మరియు శ్వాస లోనికి తీసుకొని, అలాగే గంటిగా బిగబట్టాలి.

30-60 సెకన్ల ఈ స్థానం లో ఉండాలి మరియు తిరిగి మీరు నిలబడే స్థానానికి వచ్చేయాలి.

మొదట ప్రారించిచే వారు, ఇలా పది సార్లు చేయాలి, రాను రాను కౌంట్ ను పెంచుకుంటూ పోవాలి.

నిజంగా ఈ చెర్ భంగిమ తొడల కండరాలకు మరియు టోన్లు బలపడటంతో పాటు, అధనపు కొవ్వును కరిగించేందుకు చాలా సహాయపడుతుంది.

ఉత్తిత హస్త పదంగుస్తాసన:

ఉత్తిత హస్త పదంగుస్తాసన:

మీ నడుము నిటారుగా , మీ రెండు పాదాలు దగ్గరగా చేర్చి నిలబడాలి మరియు మీ చేతులు రెండూ నడుము మీద ఉంచాలి.

మీ ఎడమ కాలుతో సపోర్ట్ తో మీ కుడికాలును సూటిగా పైకి ఎంత్తండి.

అలా ఎత్తి కొంత శ్వాస పీల్చుకొని అలాగే నిలబడాలి మరియు అదే విధంగా మరో కుడికాలు సహాయంతో ఎడమకాలను పైకి లేపాలి.

ఈ ఆసనం మీ తొడలు మరియు పిరుదుల బాగంలో ఏర్పడ్డ అదనపు కొవ్వును తొలగించడానికి చాలా సులభంగా సహాయపడుతుంది.

డీప్ స్వాట్స్ (deep squats) :

డీప్ స్వాట్స్ (deep squats) :

థైస్ (తొడల) వద్ద కొవ్వు తగ్గించడం కోసం ఈ యోగా వ్యాయామం అద్భుతంగా పనిచేస్తుంది !

రెండు కాళ్ళను(పాదాలను) 12 అంగుళాల దూరంగా ఉంచి నిలబడాలి మరియు మీ రెండు చేతులను ముందుకు చాపాలి, చేతులను ముందుకు చాపుతూనే రెండు అరచేతులూ ఒకదానికి ఒకటి ఎదురా ఉండేలా చేయాలి.

ఇప్పుడు మీరు శ్వాస పీల్చుతూనే అలాగే 90డిగ్రీల కోణంలో మోకాళ్ళను వంచికి కూర్చొన్నట్లు చేయాలి, కానీ కూర్చోకూడదు.

తర్వాత వెంటనే తిరిగి మొదటి నిలబడినట్లు నిలబడాలి, తిరగి అలాగే చేయాలి.

ఆనంద బాలాసన:

ఆనంద బాలాసన:

యోగా మ్యాట్ మీద వెళ్లకిలా పడుకోవాలి. రెండు కాళ్ళను స్లైడ్ లో చూపిన విధంగా పైకి ఎత్తాలి, మీ రెండు చేతులతో, రెండు పాదాలను గట్టిగా పట్టుకోవాలి. ఈ ఆసనంను గర్భ ిణీ స్త్రీలు చేయకూడదు.

వీరభద్రాసన 1:

వీరభద్రాసన 1:

పాదాలు రెండూ ఒకటిగా జోడించి నేరుగా నిలబడాలి.

ఇప్పుడు ఎడమ పాదంను మూడు నుండి నాలుగుఅడుగు దూరంకు జరపండి. రెండు పాదాల మద్య దూరం కనీ నాలుగుఅడుగులు ఉండేలా నిలబడాలి.

ఇప్పుడు ఎడమకాలు పాదాన్ని అలాగే లెఫ్ట్ కు రొటేట్ చేయండి, అదే విధంగా కుడికాలు పాదాన్ని రైట్ కు రొటేట్ చేయండి.

ఇప్పుడు మీపాదాలను అదే స్థానంలో ఉంచి మీ శరీరం(మొండెం)ను స్పిన్ చేయండి.

తర్వాత మీ ఎడమకాలును వంచండి. ఇప్పుడు మీ శరీరంను తిరిగి అదేస్థానంకు తీసుకొచ్చి మీ రెండు చేతులు తలవైకు చాచీ నమస్కరించేలా చేతులను జోడించాలి.

ఈ భంగిమ మీ స్టామినాను పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

వీరబందాసనం II :

వీరబందాసనం II :

వీరబందాసనం ఒకటి చేసిన పద్ధతినే ఈ వీరబందాసనం 2లో కూడా అనుసరించండి. ఇక్కడ మార్పుఏంటే మీ రెండు చేతులను పైకి ఎత్తి, తిరిగా భూమికి సమాంతరంగా క్రింది వంచాలి.

సేథుబందాసన:

సేథుబందాసన:

మీకాళ్ళను బాగా విస్తరించి వెల్లకిలా పడుకోండి. తర్వాత మీ మోకాళ్ళ వరకూ కాళ్ళను ముందుకు మడవాలి.

తర్వాత చేతులను నిటారుగా చాచి పడుకోవాలి. రెండు అరచేతులు బూమిని చూస్తున్నట్లుగా ఉంచాలి.

ఇప్పుడు మీ కాళ్ళు, మరియు చేతులు కదలకుండా మీ వెన్నెము సహాయంతో మీ పిరుదులను పైకి ఎత్తండి.

ఈ భంగిమలో అలాగే ఉండి, ఇప్పుడు మీ చేతులను తలమీదుగా పైకి లేపడానికి ప్రయత్నించండి.

ఈ ఆసనంలో కొద్దగా వైవిధ్యం తీసుకురావడం కోసం, ఒకకాలును పైకిలేపాలి. ఇలా పైకి ఎత్తిన తర్వాత కొద్దిసమయం అలాగే ఉండి, తర్వాత రెండవ కాలును పైకి లేపాలి.

ట్రై పద అథోముఖాసన:

ట్రై పద అథోముఖాసన:

కుక్కనిలబడిన విధానంలో భంగిమను ప్రారంభించండి.

ఇప్పుడు రెండు చేతుల సపోర్ట్ గా బూమిని గట్టిగా అదిపిపట్టుకొని మీ ఎడమకాలును పైకిలేపండి. లేపిన తర్వాత ఒక నిముషం పాటు అలాగే ఉండాలి. ఇప్పడు కాలు క్రిందికి దింపి, తర్వాత ఇదే పద్దతితో కుడికాలు చేయడాన్ని అనుసరించాలి.

బంధకోనాసన :

బంధకోనాసన :

నేల మీద కూర్చొని, మీ అరికాళ్ళు రెండి ప్రతి ఇతర ముఖంగా బెండ్ చేయాలి.

మీ వెన్నెముక మీ కూర్చొనే భంగిమకు నేరుగా ఉంచండి.

షలభాసన:

షలభాసన:

యోగా మ్యాట్ మీద నిటారుగా బోర్లా పుడుకోవాలి. తర్వాత రెండు చేతులను భూమికి ఆనిచ్చి, అరచేతులు రెండూ భూమికి అభిముఖంగా ఉండేలా స్లైడ్ లో చూపిన విధంగా పెట్టుకోవాలి. అదే సమయంలో గెడ్డం భూమిని తాకేవిధంగా ఆనించాలి. అదే స్థానంలో ఉండి, రెండు కాళ్ళును పైకి లేపాలి. ఇలా లేపిన తర్వాత కొంత శ్వాస తీసుకొని తిరిగి క్రిందికి దింపాలి. తిరిగి అలాగే నాలుగైదు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

విపరీత వీరబంధాసన:

విపరీత వీరబంధాసన:

ఇది నిలబడిచేసే యోగా భంగిమ. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీరబందాసన 2 భంగిమలో నిలబడినట్లు నిలబడి, మొదట కుడికాలును సాధ్యమైనంత వరకూ వెనకకు జరపాలి. అలాగే కుడి చేతిని వెనక జరికిపి కుడికాలున తాకడానికి ప్రయత్నించాలి. అలా చేస్తూనే, శరీరాన్ని కొద్దిగా వెనుకకు బెడ్ చేయాలి. అదే సమయంలో ఎడమ చేతిని పైకిఎత్తి నిలబడాలి. తర్వాత క్రిందికి దించి ఒక సెకన్ విశ్రాంతి తీసుకొని, అదే రీతిలో తిరిగి ఎడమ కాళు, ఎడమ చేయితో ప్రయత్నించండి.

English summary

Yoga Exercises To Get Your Thighs And Hips In Shape

For women, gaining weight is a huge deal. However, there are certain prominent regions like thighs, hips and waist that can easily attract fat accumulation, thus it is very important to work on those areas first.Ask women who have heavy thighs and hips, the only thing on their mind would be to find the perfect means to lose weight.
Desktop Bottom Promotion