For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇది క్రేజ్ ఉన్న డ్యాన్స్ కాదు..క్యాలరీలను తగ్గించే డ్యాన్స్

|

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో యూత్‌ ప్రతీది వెరైటీగా ఉండాలని కోరుకుంటున్నారు. ధరించే వస్త్రాలు, ఫ్యాషన్‌ యాక్ససరీస్ తదితరాలే కాదు పబ్‌లలో చేసే డ్యాన్సులు సైతం వెరైటీగా ఉండాలని వారు తాపత్రయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫాస్ట్‌ బీట్‌ మ్యూజిక్‌ మధ్య హుషారుగా చేసే జుంబా నృత్యం పట్ల యూత్‌ ఎంతో ఆకర్షితులవుతున్నారు. నేడు ఈ లాటిన్‌ అమెరికన్‌ డ్యాన్స్‌కు యూత్‌ లో మంచి క్రేజ్‌ ఉంది. మన దేశంలోని పలు ప్రధాన నగరాల్లో యూత్‌ ఎంతో ఇష్టపడి జుంబా నృత్యాన్ని నేర్చుకుంటున్నారు. జుంబా నృత్యం చేస్తే ఏరోబిక్స్‌ మాదిరిగా ఫ్యాట్‌ బాగా తగ్గుతుందని ఫిట్‌నెస్‌ నిపుణులు సెలవిస్తుండడం విశేషం.

ఉర్రూతలూగించే మ్యూజిక్‌ మధ్య యువతీ, యువకులు హుషారుగా కాళ్లు, చేతులు ఆడిస్తూ నృత్యాలు చేస్తున్నారు. ఏరోబిక్స్‌ను తలపించే విధంగా ఉన్న డ్యాన్సును యువ జంటలు ఉత్సాహంగా చేస్తూ ఆకట్టుకున్నారు. నేడు లాటిన్‌ అమెరికన్‌ డ్యాన్స్‌ జుంబా నృత్యాన్ని మన దేశంలోని ప్రధాన నగరాల్లోని యూత్‌ ఎంతో ఇష్టపడి నేర్చుకుంటున్నారు. ప్రతి దాంట్లో వెరైటీని కోరుకునే యువతీ,యువకులు జుంబా డ్యాన్స్‌ను ప్రత్యే కంగా నేర్చుకొని పబ్‌లలో జరిగే నైట్‌పార్టీలలో వీటిని ప్రదర్శిస్తున్నారు.

మన దేశంలో జుంబా నృత్యానికి యువతలో మంచి క్రేజ్‌ ఉంది. ముంబాయ్‌, ఢిల్లీ నగరాలలో ఈ నృత్యాన్ని కొంత భాంగ్రా నృత్యంతో మేళవించి శిక్షణని స్తుండడం విశేషం. నాసిక్‌ డోల్‌ బీట్స్‌ మధ్య ఈ నృత్యాన్ని నేర్పిస్తున్నారు. ఏరోబి క్స్‌ను పోలి ఉండే జుంబా నృత్యంలో బాడీ వర్కవుట్స్‌ ఎక్కువగా ఉంటాయి. కార్డి యో బేస్డ్‌ వర్కవుట్‌లతో కూడిన ఈ నృత్యాన్ని ప్రాక్టీస్‌ చేస్తే శరీరంలో ఫ్యాట్‌ తగ్గుతుందని ఫిట్‌నెస్‌ నిపుణులు సైతం చెబుతుండడం విశేషం. ఇక ఇందులోని వార్మప్‌, కూల్‌ డౌన్‌ సెషన్స్‌ ఏరోబిక్స్‌ మాదిరిగానే ఉంటాయి. ఈ డ్యాన్సులో కొన్ని స్టెప్పులలో జంపింగ్‌, స్క్వాటింగ్‌, కిక్స్‌ సైతం ఉంటాయి జుంబా డ్యాన్సర్‌ షాలినీ చెప్పారు.

జుంబా డ్యాన్స్ వల్ల క్యాలరీస్ ఎలా కరుగుతాయో చూద్దాం..జుంబా డ్యాన్స్ వర్కవుట్స్‌ను బట్టి ప్రాక్టీస్‌ చేసే వారిలో ఫ్యాట్‌ కరిగిపోతుంది. ఒక గంటకు కనీసం 500-8000 కేలరీలు కరిగిపోతుందని ఫిట్ నెస్ నిపుణులు వివరించారు. ఇక లైట్‌వెయిట్స్‌తో చేసే ఈ నృత్యం ఎంతో వెరైటీగా ఉంటుంది. జుంబా టోనింగ్‌ పేరుతో పిలిచే ఈ నృత్యాన్ని డంబెల్స్‌తో చేయడం వల్ల భుజాలు గట్టి పడతాయి. ఇక జుంబా నృత్యం చేసేవారు ఏరోబిక్స్‌ డ్యాన్స్‌ షూస్‌, స్నీకర్స్‌ను ధరించాల్సి ఉంటుందని, ఈ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేయడానికి ముందు తర్వాత మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. దాంతో చెమట రావడం మూలంగా బాడీ హైడ్రేటెడ్‌ కాకుండా ఉంటుందని చెప్పారు.

Zumba Dance

ఇది బ్రీతిగ్ ఎక్సర్ సైజ్: జుంబా డాన్స్ ఏరోబిక్స్ ను పోలిఉంటుందని ముందు చేప్పాం. అదే విధంగా ఎరోబిక్స్ ఎక్సర్ సైజ్ లా, ఇది పూర్తి శ్వాస తీసుకోవడానికి బాగా సహాయపడుతుంది. అందువల్ల బరువు తగ్గుతారు. అంతే కాదు ఇది ఊపిరితిత్తుల పవర్ ను కూడా పెంచుతుంది.

వయస్సు మీద పడనివ్వదు: జుంబా డ్యాన్స్ బరువు సులభంగా తగ్గించడమే కాదు, శరీరంలో అన్ని అవయవాలు కదిలేలా చేస్తాయి. కండరాలు బలంగా ఉండేలా సహాయపడుతాయి. రెగ్యులర్ గా ఈ డ్యాస్ చేయడం వల్ల వయస్సు మీద పడనియ్యకుండా కాపాడుతుంది.

చాలా వరకూ అన్ని రకాల డ్యాన్సులు అంత మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అలాగే వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు బలపడుతాయే ముఖం, చేతులు, నడుము వద్ద బరువు కోల్పోతారు తప్పు శరీరంలో మిగతా అన్ని ప్రదేశాల్లో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి ఇటువంటి జుంబా, సాల్సా డ్యాన్సు ల వల్ల శరీరంలో ప్రతి పార్ట్ నుండి క్రొవ్వును కరిగిస్తాయి.

ఈ జుంబా డ్యాన్స్ నేర్చుకొని బరువు తగ్గించుకోవాలనుకొనే వారికి కొన్ని చిట్కాలు...
1. ఈ డ్యాన్స్ నేర్చుకోవాలనుకొనే వారు, ట్రైనర్ వద్దకు ఒంటరిగా వెళ్ళడం కంటే చాలా మంది ఉన్నప్పు వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఈ డ్యాన్స్ చాలా తమాషాగా ఉంటుంది కాబట్టి మీరు బాగా ఎంజాయ్ చేయవచ్చు.
2.జుంబాడ్యాన్స్ వ్యాయామం వంటిదే. కాబట్టి ఆరోగ్యపరంగా మీకేదైన సమస్య ఉన్నప్పుడు డ్యాన్స్ కు వెళ్ళడానికి ముందు డాక్టర్ ను సంప్రదించిన తర్వాత చేరండి.
3. జుంబాడ్యాన్స్ ను కనీసం 45నిముషాల తప్పనిసరిగా చేయాలి . అప్పుడు మంచి ఫలితం ఉంటుంది.

English summary

Zumba Dance For Natural Weight Loss | అతి త్వరగా బరువు తగ్గించే జుంబా డ్యాన్స్..!

No more need of doing tedious exercises and boring gym workouts to lose weight. You can dance your way to get a slim-trim figure. Dancing is the best exercise for your body. And Zumba is one of the best dances for weight loss. Zumba is actually a Latin dance that packs a punch of Latino music and some really effective aerobic exercises. That is why the Zumba dance is a fun way not only to lose weight but also to maintain it.
Story first published: Thursday, April 18, 2013, 14:57 [IST]
Desktop Bottom Promotion