For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ 10 యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్: కిడ్నీ డైట్

|

మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ(మూత్ర పిండాలు)లు ప్రాధానమైనవి. ఇవి నిరంతరం రక్తంలోని వ్యర్ధాలను వడకడుతూ.. మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం.

నేటి రోజులలో ఈ ప్రశ్న చాలా మందిని వేధిస్తూనే వున్నది. మీ కిడ్నీలు శరీరంలో చాలా ప్రధాన అవయవాలు. ఇవి లేకుండా మానవులు జీవించలేరు. మీకు కిడ్నీ సమస్యలు ఉన్నట్లయితే, ఒక్కసారి భయంకరమైన డయాలసీస్ చేసే పరిస్థితిని ఊహించుకొండి. కనుక కిడ్నీలకు హాని రాకుండా వాటి పోషణ మరియు సంరక్షణ ప్రధానం . మంచి పోషకాలుకల ఆహారం కిడ్నీల ఆరోగ్యానికి సహకరిస్తున్ది. ఈ ఆరోగ్యకరమైన కిడ్నీ ఆహారాలు కిడ్నీ లను ధృడ పరుస్తాయి. మీ కిడ్నీలు ప్రధానంగా శరీరంలో బ్లడ్ ను శుభ్ర పరుస్తాయి. అవి శరీరంలోని మలినాలను జల్లెడ పట్టి బయటకు పంపుతాయి. కనుక మీరు మీ కిడ్నీ లను శుభ్రంగా వుంచుకొవాలి. మరి కిడ్నీ లను శుభ్రం చేసుకోవడానికి యాంటీఆక్సిడెంట్ ఫుడ్స్ చాలా గ్రేట్ గా సహాయపడుతాయి.

కిడ్నీలకు రక్షణ కల్పించే 15 వెజిటేరియన్ ఫుడ్స్..!క్లిక్ చేయండి

మనకు తెలిసినంత వరకూ యాంటిఆక్సిడెంట్స్ ఆహారాలు చాలానే ఉన్నాయి. యాంటీయాక్సిడెంట్స్ అంటే కెరోటినాయిడ్స్, మెలాటినిన్, విటమిన్స్(ఎ, సి, ఇ)ఫోటోకెమికల్ (బీటా కెరోటిన్ మరియు లైకోపిన్) మరియు మినిరల్స్ అంటే సెలీనియం మరియు జింక్ వంటివి తీసుకోవడం వల్ల అవి శరీరంలో మనకు అనవసరంలేని ఫ్రీరాడికల్స్ గా మార్పు చెందుతాయి. ఇవి మల మూత్రాల ద్వారా విడుదలవుతాయి.

దీర్ఘకాలం కిడ్నీలను ఆరోగ్యం గా వుంచుకోవటం ఎలా :క్లిక్ చేయండి

ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మలినాలను తొలగించడం మరియు చర్మాని శుభ్రపచడం కాకుండా మరో ఆరోగ్య ప్రయోజనం కూడా ఉంది. అది సెల్యులార్ డ్యామేజ్ ను నిరోధించడానికి, టైప్ 2 డయాబెటిస్ ను వ్యతిరేకించడానికి, క్యాన్సర్ నిరోధించడానికి మరయు గుండె జబ్బులను అడ్డకోవడానికి ఉపయోగపడుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ రెగ్యులర్ ఆహారంతో పాటు ఈ యాంటీఆక్సిడెంట్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ను తీసుకొని మీ కిడ్నీ ఆరోగ్యాన్నికాపాడుకొని మీ జీవితాంతా ఆరోగ్యంగా ఉండండి...

మూత్రపిండాల్లో రాళ్ళు నివారణ చిట్కాలు..క్లిక్ చేయండి

క్రాన్ బెర్రీస్:

క్రాన్ బెర్రీస్:

చెర్రీస్ లో అధికంగా విటమిన్స్ మరియు లోప్రోటీన్స్ కలిగి ఉంటాయి. చెర్రీస్ ను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలోని పొటాషియం లెవల్స్ ను తగ్గించేదుకు సహాయపడుతుంది. దాంతో కిడ్నీ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది.

ప్లమ్స్:

ప్లమ్స్:

రెడ్ కలర్ ప్లమ్స్ కంటే బ్లాక్ కలర్ ప్లమ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ప్లమ్స్ ను అలాగే తాజాగా తినవచ్చు లేదా డ్రై ఫ్రూట్ గా తినవచ్చు. ఇందులో ఆరోగ్యానికి ఉపయోగపడే ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండి యాంటీ ఆక్సిడెంట్స్ లా పనిచేస్తాయి.

 బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్:

కిడ్నీలను శుభ్రపరిచి మరియు శుద్ధి చేయు యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంథోసైయనీడిన్స్ (Anthocyanidins)పుష్కలంగా ఉన్నాయి. బ్లూ బెర్రీస్ లో సిట్రస్ ఆమ్లం మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా యాంటీఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉండి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి.

 బ్లాక్ బెర్రీ లేదా రాస్బెర్రీస్:

బ్లాక్ బెర్రీ లేదా రాస్బెర్రీస్:

రాస్బెర్రీస్ లో అలెర్జిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. రాస్బెర్రీస్ -బెర్రీ ఫామిలికీ చెందినవే. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధులను నిరోధించడానికి మరియు గుండె సంబంధిత వ్యాధులను నిరోధించడానికి బాగా సహాయపడుతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి యాంటిబయోటిక్ లక్షణాలు కలిగినదని మనందరికీ తెలిసిన విషయమే. అంతే కాదు ఇందులో యాంటీఆక్సిడెంట్స్, ఎ, బి, మరియు సి, సెలీనియం, ఐరన్, జింక్ మొదలగునవి ఫుష్కలంగా ఉండి. హై బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిస్తుంది. దాంతో కిడ్నీ వ్యాధులు దూరంగా ఉంటాయి

ఆపిల్స్:

ఆపిల్స్:

ఆపిల్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతాయి. మరియు అతి సులభంగా జీర్ణం అవుతాయి. వీటిలో ఫైబర్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి మూత్రపిండాలు నిర్విషీకరణం మరియు శుభ్రపరచడానికి బాగా సహాయపడుతాయి. మీరు డాక్టర్ కు దూరంగా ఉండాలంటే ప్రతి రోజూ ఒక ఆపిల్ తినడం మంచిది!

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్ లో పుష్కలమైన యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి. వీటిలో బ్లాక్‌ బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, ఇది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచతుంది.

రెడ్ బెల్ పెప్పర్:

రెడ్ బెల్ పెప్పర్:

చాలా మంది వారికి తెలిసి మరియు తెలికుండానే కిడ్నీ వ్యాధులకు గురిఅవుతుంటారు. కిడ్నీ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందడానికి ఈ సూర్ ఫుడ్ ను మీ డైలీ డైయట్ లో చేర్చుకోవాలి. రెడ్ బెల్ పెప్పర్ లో పొటాషియం తక్కువగా ఉండి విటమిన్స్ (ఎ, సి మరియు బి6), ఫోలిక్ యాసిడ్ మరియు ఫైబర్ ఉండటం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాదు కొన్ని క్యాన్సర్ల ను ఎదుర్కొంటుంది. బెల్ పెప్పర్ లో అధికంగా కెరోటినాయిడ్స్ మరియు విటమిన్ సి(యాంటీఆక్సిడెంట్స్)పుష్కలంగా ఉంటాయి. రెడ్ మరియు ఎలో బెల్ పెప్పర్స్ ఆరోగ్యానికి మంచిది మరియు న్యూట్రిషియన్స్ పుష్కలం.

రెడ్ లీఫ్ క్యాబేజ్:

రెడ్ లీఫ్ క్యాబేజ్:

క్యాబేజ్ మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. సాధారణంగా క్యాబేజ్ ను మూత్రపిండాల డ్యామేజ్ ను అరికట్టడానికి మరియు మూత్రపిండాల పోషణకు ఒక మంచి సహజ ఔషధంగా ఉపయోగిస్తారు.

రెడ్ లీఫ్ లెట్యూస్ :

రెడ్ లీఫ్ లెట్యూస్ :

రెడ్ లేదా పర్ఫుల్ కలర్ ఉన్నటువంటి లెట్యూస్ లో కొంతలోనే చాలా పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. లెట్యూస్ ను మనం ‘సలాడ్ పట్టా' అనవచ్చు . ఎందుకంటే వీటిని ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తుంటారు .ఇంకా సాడ్విచ్ మరియు బర్గర్సో లో ఉపయోగిస్తుంటారు . ఈగ్రీన్ లీఫీ వింటర్ వెజిటేబుల్ తో అనేక స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి . లెట్యుస్ లో విటమిన్ ఎ అధికంగా ఉంది, అందువల్ల , చర్మాన్ని మాయిశ్చరైజింగ్, తాజాగా ఉంచుతుంది. అలాగే ఇందులో పొటాషియం కంటెంట్ కూడా పుష్కలం. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది. .లెట్యూస్ ను క్రమంగా తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలన్నింటిని తొలగిస్తుంది. దాంతో మన శరీరం మరియు చర్మం ఆరోగ్యంగా మారుతుంది.

Desktop Bottom Promotion