For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెగ్యురల్ డైట్ లో ఖచ్చితంగా ఉండాల్సిన 10 ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్

|

బరువు తగ్గాలనుకొనే వారికి కొన్ని పదార్థాలు, ఫ్యాట్ కరిగిస్తాయి. అవి ముఖ్యంగా మహిళలకు చాలా ఉపయోగపడుతాయి. పురుషులతో పోల్చితే మహిళలకు న్యూట్రిషినల్ సప్లిమెంట్స్ చాలా అవసరం. ఫ్యాట్ బర్నింగ్ ఆహారాల్లో విటమిన్స్ మరియు న్యూట్రిషియన్స్ అధికంగా ఉండటం వల్ల అవి బరువు తగ్గించడానికి, మహిళలను ఆరోగ్యంగా ఉంచడాని బాగా ఉపయోగపడుతాయి. ఉదాహరణకు రాస్ బెర్రీస్, ఆకుకూరలు, సిట్రస్ పండ్లు మరియు ధాన్యాలు ఇవన్నీ లోక్యాలరీ ఫుడ్స్. ఇవన్నీ కూడా కొవ్వు కరిగించడానికి బాగా సహాయపడుతాయి. అయితే ఈ ఆహారాలను పురుషులు కూడా తినవచ్చు. మహిళలకు, పురుషులకు ఇద్దరికీ వీటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి.

బరువు తగ్గాలనుకుంటే కడుపు నిండా తిని ట్రెడ్‌మిల్‌ మీద పరిగెత్తితే సరిపోదు. బరువును తగ్గించే పదార్థాలేవో తెలుసుకుని అవి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేయకుండా బరువు తగ్గటం అసాధ్యం. బరువు తగ్గాలంటే వ్యాయామం చేయటంతోపాటు మెటబాలిజమ్‌ను పెంచే పదార్థాలు కూడా తినాలి. ఈ ఫ్యాట్ బర్నీంగ్ ఫుడ్స్ తో పాటు కొన్ని రెగ్యులర్ వ్యాయామాలను చేయడం వల్ల మీ హెల్తీ లైఫ్ స్టైల్ ను పొందవచ్చు. మరి మహిళలకు ఉపయోగపడే ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందామా...

కాల్షియం

కాల్షియం

కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా తయారవుతాయని తెలుసుగా! కాల్షియం ఆకలిని అదుపు చేస్తుంది. పాల ఉత్పత్తులు, కాల్షియం ఉండే ఇతర పదార్థాలు తినే వ్యక్తుల శరీరాల్లో మాస్‌ తక్కువగా ఉండటంతోపాటు వాళ్లు ఆకలిని కూడా బాగా కంట్రోల్‌ చేసుకోగలుగుతారు. దాంతో చేతికందిన పదార్థాలన్నిటినీ తినకుండా ఉంటారు. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది. కాబట్టి కాల్షియం ఉత్పత్తులు తినాలి.

యాపిల్స్‌

యాపిల్స్‌

ప్రతిరోజూ యాపిల్‌ పళ్లు తింటే శరీరంలో పేరుకున్న కొవ్వు కణాలు తగ్గుముఖం పడతాయి. యాపిల్‌ తోలులో ఉండే పెక్టిన్‌ శరీర కణాలు కొవ్వును పీల్చుకోకుండా నియంత్రిస్తాయి.

వాల్‌నట్స్‌

వాల్‌నట్స్‌

వాల్‌నట్స్‌లో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు, లినోలెనిక్‌ యాసిడ్‌, మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్‌ పెద్ద మొత్తంలో కొవ్వును కరిగించటంతోపాటు మెటబాలిక్‌ రేట్‌ను పెంచుతుంది. రోజుకి గుప్పెడు వాల్‌నట్స్‌ తింటే ఆరోగ్యంతోపాటు అధిక బరువూ తగ్గుతుంది.

చిక్కుళ్లు

చిక్కుళ్లు

చిక్కుళ్లలో కొవ్వు తక్కువ, ఫైబర్‌ ఎక్కువ. శాకాహారులు మాంసకృత్తులు సమృద్ధిగా పొందాలనుకుంటే చిక్కుళ్లు తినాలి. ఇవి శరీరంలో ఫ్యాటీ యాసిడ్లు త్వరితంగా ఖర్చయ్యేలా చేసి ఫలితంగా బాడీ మెటబాలిక్‌ రేట్‌ పెరిగేలా చేస్తాయి.

అల్లం

అల్లం

అల్లం జీర్ణ సమస్యలను చక్కదిద్దుతుంది. రక్త ప్రసరణ మెరుగుపరిచి, కండరాలకు బలాన్నిస్తుంది. బరువు తగ్గాలనుకుంటే ఆహారంలో అల్లం చేర్చాలి. ఇది కెలోరీలు, కొవ్వులు త్వరగా ఖర్చయ్యేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది.

ఓట్‌మీల్‌

ఓట్‌మీల్‌

ఉదయం వ్యాయామం చేసిన తర్వాత ఓట్‌మీల్‌ తినటం అలవాటు చేసుకోవాలి. ఓట్‌మీల్‌ నెమ్మదిగా అరుగుతూ రక్తంలో షుగర్‌, ఇన్సులిన్‌ల విడుదలను క్రమబద్ధీకరిస్తుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు కరిగే వేగం పెరుగుతుంది. నెమ్మదిగా అరిగే పిండి పదార్థం కాబట్టి బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరూ ఓట్‌మీల్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి.

గ్రీన్‌ టీ

గ్రీన్‌ టీ

గ్రీన్‌ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ మెటబాలిజమ్‌కు అనువైన పరిస్థితిని శరీరంలో కల్పిస్తాయి. అలాగే క్యాన్సర్‌ నిరోధక కారకాలు, కొవ్వు అదుపులో ఉంచే అంశాలు గ్రీన్‌ టీలో పుష్కలం.

మిరపకాయలు

మిరపకాయలు

మిరపకాయలు తింటే కొవ్వు, క్యాలరీలు కరిగే వేగం పెరుగుతుంది. మిరపకాయల్లోని క్యాప్సైసిన్‌ శరీరంలో స్ర్టెస్‌ హార్మోన్లు విడుదలయ్యేలా చేస్తుంది. ఫలితంగా మెటబాలిజమ్‌ పెరిగి కొవ్వులు, క్యాలరీలు కరుగుతాయి.

గోధుమలు

గోధుమలు

డైయట్ లిస్ట్ లో తప్పనిసరిగా ఉండాల్సినవి గోధుమలు. ఎందుకంటే వీటిలో ఎక్కుగా ఫైబర్, యాంటియాక్సిడెంట్స్ మరియు విటమిన్స్ కలిగి ఉంటాయి. ఈ ధాన్యాలు త్వరగా జీర్ణ అవ్వడానికి కూడా ఉపయోగపడుతాయి. లోక్యాలరీలను కలిగి న్యూట్రీషియన్స్ ను శరీరానికి అందిస్తుంది.

నీరు

నీరు

శరీర జీవక్రియలకు నీరు అత్యవసరం. నీరు తాగకపోతే నిమిషాల వ్యవధిలోనే డీహైడ్రేట్‌ అయిపోతాం. దాంతో దాహం వేస్తుంది. ఆ లక్షణాన్ని ఆకలిగా పొరబడి ఆహారం తినేస్తూ ఉంటాం. కాబట్టి తరచుగా నీళ్లు తాగుతూ ఉంటే ఈ సమస్య తలెత్తకుండా ఉంటుంది. అలాగే ఎక్కువగా నీళ్లు తాగటం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది.

English summary

10 Fat Burning Foods You Should Be Eating


 There are many foods that you can eat each day to burn calories and lose weight. The great news is that these foods are super delicious and they boast amazing health benefits. Try adding several of these foods into your daily or weekly diet and don’t forget to exercise regularly.
Story first published: Saturday, August 2, 2014, 15:49 [IST]
Desktop Bottom Promotion