For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో బరువు తగ్గడానికి 12 సులభ మార్గాలు

|

ప్రస్తుత జనరేషన్ లో చాలా మంది యువత తమ శరీర సౌష్టం కోసమని జిమ్ లు, ఫిట్ నెస్ సెంటర్లు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సుందరమైన శరీర సౌష్టం పొందడానికి, ఆకర్షణీయంగా కనబడటానికి వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఫలితం కనిపించినా, తర్వాత తర్వాత తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటారు. దాంతో ఒక్కోక్కో సారి విసిగు చెంది, అసలు డైయట్ చేయడమే మానేస్తారు. కాబట్టి కృత్రిమంగా కాకుండా సహజంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే తప్పకుండా శాశ్వత పరిష్కారం ఉంటుంది. దాంతో అధిక బరువును తగ్గించుకోవడం ద్వారా సౌందర్యం మాత్రమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు.

అధిక బరువు పెరిగితే ఒబేసిటి, కొలెస్ట్రాల్, అధిక బ్లడ్ ప్రెజర్ వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి అధిక బరువును తగ్గించుకోవడానికి మీకు సహాయపడే కొన్ని చిట్కాలు మీకోసం...

నీరే అమృతం

నీరే అమృతం

రోజుకి పదిగ్లాసుల నీరు తాగితే అమృతంలా పనిచేస్తుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు మీ దరిచేరవు. నీరు ఎక్కువ తాగడం వలన ఆకలి త్వరగా వేయదు. నీరు ఎక్కువగా తాగడం వల్ల ఎక్కువ తినాలన్న కోరిక కలగదు. తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకొంటారు. నాన్ స్టిక్ పాత్రలలో వంట చేయడం వల్ల నూనె తక్కువ పట్టడంతో పాటు పదార్థాలలో పోషకవిలువలు పోకుండా ఉంటాయి. అప్పడాలను వేయించుకునే బదులు కాల్చుకొని తింటే వాటిని తినాలన్న కోరిక తీరుతుంది. నూనెనుండి తప్పించుకున్నట్లు ఉంటుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం

వ్యాయామం తప్పనిసరి. రోజులో కనీసం కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. అలా కేటాయించడం కుదరని వారు ఇంట్లోని మెట్లు ఎక్కడం, దిగడం, ఇంట్లోనే ఇటూ అటూ అరగంట పాటు ఆపకుండా నడవడం లాంటివి చేయాలి. నిద్ర లేచిన వెంటనే ఇలాంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వీలుంటే ఉదయం, సాయంత్రం ఓ అరగంట పాటు నడవడం అలవాటు చేసుకోవాలి. నడక, జాయింగ్, బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలు అధిక బరువు తగ్గడానికి బాగా సహాయపడుతాయి.

నిద్ర

నిద్ర

కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర ఆరోగ్య రహస్యాలు అంటారు. నిద్ర లేమి కూడా ఊబకాయానికి ఓ కారణం. ఏడెనిమిది గంటలు నిద్ర తప్పనిసరి. ఆరోగ్యకరమైన జీవితానికి తగినంత నిద్ర అవసరం. మనిషికి కనీసం 7-8గంటల నిద్రఅవసరం. నిద్రలో వ్యత్యాసం లేకుండా ప్రతి రోజూ ఒకే సమయానికి క్రమంగా నిద్రపోవాలి. నిద్రలో వ్యత్యాసం వల్లే బరువు పెరగడంలో హెచ్చుతగ్గులు ఏర్పడుతాయి. కాబట్టి సరైన నిద్ర, టైమ్ మెయింటెనెన్స్ అవసరం.

ఒత్తిడికి, ఆందోళన దూరంగా

ఒత్తిడికి, ఆందోళన దూరంగా

బరువు తగ్గే క్రమంలో ఉన్నవారు తప్పనిసరిగా ఆందోళన, ఒత్తిడికి దూరంగా ఉండాలి. పై రెండిటి కారణంగా అధికంగా తినేయడంతో బరువు పెరిగే అవకాశం ఉందని పరిశోధనల్లో రుజువైంది. అందుకే సాధ్యమైనంత వరకూ ఒత్తిడి తగ్గించుకోవాలి.

బార్లీ గింజలు

బార్లీ గింజలు

అధిక బరువును అరికట్లే ఆహార పదార్థం బార్లీ. ఈ బార్లీ గింజలను గంజి చేసుకొనే తాగడం ద్వారా అధిక బరువును గణనీయంగా తగ్గించేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని బాగా తగ్గించేస్తుంది.

ఉప్పును తగ్గించాలి

ఉప్పును తగ్గించాలి

సగటున, ఒక వ్యక్తి ఉప్పు 6 గ్రాముల తినాల్సి ఉంటులుంది. సో, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లైతే మీరు ఉప్పను తక్కువగా ఉపయోగించాలి.

స్పైసీ పుడ్

స్పైసీ పుడ్

చాలా ముఖ్య మైన ప్రయోజనం స్పైసీ ఫుడ్ ను తినడం వల్ల బరువును కోల్పొతాం. ఎప్పుడైనా సరే మీరు స్పైసీ ఫుడ్ ను తినడం వల్ల శరీరంలోనున్న ఫ్యాట్ ను కరిగించేస్తుంది. స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పుట్టిస్తుంది. దానికి కారణంగానే కొన్ని కాలోరీలను కోల్పొవచ్చు.

తృణధాన్యాలు బెటర్

తృణధాన్యాలు బెటర్

ఉదయం నిద్రలేచిన తర్వాత భారీ ఎత్తున తీసుకునే బ్రేక్ ఫాస్ట్ సంగతి మరిచిపోండి. కడుపు నిండుగా వుండి క్యాలరీలు తక్కువగా వుండే తృణధాన్యాలను ఉపాహారం కింద తీసుకుంటే మంచిది. ముందు రోజూ నానబెట్టి మొలకలు వచ్చిన తృణధాన్యాలలో కొద్దిగా ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, నిమ్మరసం కలిపి తింటే రుచిగా వుంటాయి. ప్రతి రోజూ తినలేకపోయినా వారానికి రెండు మూడు సార్లు తప్పనిసరిగా తృణధాన్యాలు తీసుకునే అలవాటు చేసుకోండి.

ఫైబర్ తప్పనిసరి-పళ్ళు మరవద్దు

ఫైబర్ తప్పనిసరి-పళ్ళు మరవద్దు

తీసుకొనే ఆహారంలో ఫైబర్ వుండేట్లు చూసుకోవాలి. ఆకు కూరల్లో ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. రోజు మొత్తం మీద కనీసం ఒక పెద్ద పండన్నా తీసుకోవాలి. ప్రతి పండులోనూ పోషక విలువలు, ఫైవర్ ఎక్కువగానే లభిస్తాయి. ఫైబర్ తో పాటు చర్మం సౌందర్యానికి పళ్లు బాగా పనిచేస్తాయి.

పంచదార ఉన్న ఆహారాలను తగ్గించండి లేదా మానుకోండి

పంచదార ఉన్న ఆహారాలను తగ్గించండి లేదా మానుకోండి

మీ శరీరానికి చక్కెరలు ఏవిధంగా హానికరమైన ప్రభావాలు కలిగిస్తాయో తెలుసుకోవాలి. కాబట్టి, మీ డైలీ డైట్ లో చక్కర అంశాలు లేకుండా జాగ్రతపడాలి. మీరు శరీరం చక్కెర హానికరమైన ప్రభావాలు గురించి తెలుసు ఉండాలి. సో, అది రోజువారీ ఆహారంలో చక్కెర అణిచివేసేందుకు మంచిది.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

రీన్ టీ లో పోలిఫెనోల్స్ మరియు కాటెచిన్స్ వంటి కొన్ని రసాయనాలు జీవక్రియను పెంచడానికి మరియు కొవ్వును కరిగించటానికి సహాయం చేస్తాయి. మీరు ప్రతి రోజు 2 కప్పుల గ్రీన్ టీ ని తీసుకోవాలి. నడుమభాగం తగ్గించేందుకు సహాయం,అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఫ్యాట్ తగ్గించే ఆహారాలను తీసుకొని, కొన్ని వారల్లో మీ పొట్టను ఫ్లాట్ చేసుకోవడానికి ప్రయత్నించండి..

తేనె - నిమ్మరసం

తేనె - నిమ్మరసం

లెమన్ హని జ్యూస్ లో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది, శరీరాన్నిశుభ్రం చేస్తుంది. ఫ్రీరాడికల్స్ తొలగిస్తుంది మరియు బరువును సులభంగా తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే పరగడుపుతో నిమ్మ తేనెమిశ్రంతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని త్రాగాలి.

English summary

12 Easy Ways to Lose Weight in Summer

seems it's natural to want to lose weight in summer, after all, that's when you want to look your best, right? For some, it is entirely too easy to lose weight, whether it be summer or winter, while others, like me, tend to battle weight gain as a constant enemy.
Story first published: Saturday, April 5, 2014, 15:04 [IST]
Desktop Bottom Promotion