For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచే 13 ఆహారాలు

By Mallikarjun
|

వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం చాలా సాధారణం. సూర్యుని తాపానికి, అధిక వేడితో శరీంలోని నీరంత చెమట రూపంలో బయట విసర్జించబడి శరీరం నీటిశాతాన్ని కోల్పోతుంది. కాబట్టి మీ శరీరం వేసవి వేడి నుండి ఉపశమనం పొందాలి. వేసవికాలంలో చెమట వల్ల ఒంట్లో నీటిని కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురికావల్సి ఉంటుంది. అధిక చెమట, శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల మన శరీరంలో సాల్ట్ కంటెంట్ తగ్గి అది మనల్ని డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది. డీహైడ్రేషన్ ను రీ హైడ్రేషన్ చేసుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించాలి...

# 1 నీటి

# 1 నీటి

అందువల్ల, వేసవి కాలంలో ఎక్కువ నీరు తీసుకోవాలని చెబుతుంటారు. నీరు శరీరానికి హైడ్రేషన్ కలిగించడం మాత్రమే కాదు, శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ మరియు ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపివేయడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. శరీరానికి తగినంత హైడ్రేషన్ కల్పించడానికి ఆహారాలతో పాటు కొన్ని వాటర్ రిచ్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇవి బాడీకి హైడ్రేషన్ కల్పించడంతో పాటు, శరీరానికి తగినంత ఎనర్జీని అందిస్తాయి.

మరి కొన్ని వాటర్ రిచ్ సమ్మర్ ఫుడ్స్ ను మీ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఈ వేసవికి మీ శరీరానికి హైడ్రేషన్(తగినంత తేమను) అందించవ్చు. అటువంటి కొన్ని ఆహారాలు మేం మీకోసం కొన్ని లిస్ట్ ఇస్తున్నాం. ఇవి అధిక నీటిశాతాన్ని కలిగి మరియు లోక్యాలరీస్ ఉంటాయి. బాడీహైడ్రేషన్ కల్పించడానికి వేసవిలో తీసుకోవల్సిన ఆహారాలు..

# 2 దోసకాయ

# 2 దోసకాయ

కీరదోసకాయ: సమ్మర్ సీజన్ లో ఎక్కువ ఉత్పత్తి అయ్యేటటువంటి వాటర్ రిచ్ ఫుడ్ ఇది. ఇది గార్డ్(బిట్టర్ గార్డ్, రింగ్ గార్డ్, స్నెక్ గార్డ్) ఫామిలికి చెందినది. కాబట్టి ఈ సమ్మర్ లో వీటిని ఎక్కువగా తిని శరీరానికి కావల్సినంత హైడ్రేషన్ ను పొందండి.కీరదోసకాయను జ్యూస్, స్మూతీస్, సలాడ్స్ సూప్స్ తయారుచేసి తీసుకోవచ్చు.

# 3 ఐస్బర్గ్ పాలకూర

# 3 ఐస్బర్గ్ పాలకూర

లెట్యుస్: ఇది అంత ఎక్కువ ఫైబర్ కలిగి ఉండకపోయినా కానీ, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది . కీరదోసకాయలో ఉన్నంత నీటిశాతతం లెట్యుస్ లో ఉంటుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో తగినంత్ ఐస్ బర్గ్ లెట్యుస్ ను చేర్చుకోవాలి. ఇది మీ శరీరానికి కావల్సినంత నీరు అందించి వాటర్ ను సమతుల్యం చేస్తుంది. తాజా పాలకూరను సలాడ్స్ లో చేర్చి తినడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది మరియు శరీరంలోని హైడ్రేషన్ స్థాయి నిలకడగా ఉంటుంది. తాజా పాలకూరలో విటమిన్ ఎ, కె మరియు బీటా కెరోటిన్స్, పుష్కలంగా ఉండటం వల్ల ఈ న్యూట్రీషియన్ గ్రీన్ లీఫీనీ మీ సమ్మర్ డైట్ లో చేర్చుకోండి.

# 4 ముల్లంగి

# 4 ముల్లంగి

ముల్లంగి: రాడిష్(ముల్లంగి) తినడం వల్ల మీ శరీరంలో తగినంత చేరుతుంది. అంతే కాదు, ఈ రెడ్ రాడిష్ అతి తేలికగా జీర్ణం అవుతుంది. కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలు లేకుండా కాపాడుతుంది.

# 5 టొమాటోస్

# 5 టొమాటోస్

టమోటోలు: టమోటోలో 93% వాటర్ ఉంది, మరియు ఇందులో యాంటీఆక్సిడెంట్స్, లైకొపిన్ పుష్కలంగా ఉండి శరీరం నుండి టాక్సిన్స్ ను శుభ్రపరచడానికి వయస్సు మీదపడకుండా కాపాడుతుంది. మీరు డైట్ ఫాలో చేస్తున్నట్లైతే ప్రతి రోజూ పచ్చిగా ఉన్న ఒక టమోటోను తినడం వల్ల మీకు ఆకలిగి కలిగించదు.

# 6 కాప్సికం

# 6 కాప్సికం

క్యాప్సికమ్:బెల్ పెప్పర్ (క్యాప్సికమ్)లో 90%వాటర్ కలిగి ఉండటం వల్ల మీ సమ్మర్ డైట్ లిస్ట్ లో చేర్చుకోవడం మంచిది. అంతే కాదు వీటిలో విటమిన్ సి, ఎ, కె మరియు లుటిన్, జియాక్సిథిన్, పొటాషియం వంటి మరికొన్ని పోషకాంశాలు పుష్కలంగా ఉంటాయి.

# 7 కాలీఫ్లవర్

# 7 కాలీఫ్లవర్

కాలీఫ్లవర్ : కాలీఫ్లవర్ వేసవిలో శరీరానికి చాల మేలు చేస్తుంది. కాలీఫ్లవర్ లో తగినన్ని ప్రోటీనులు మరియు అధిక శాతంలో నీరు కలిగి ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, కాలీఫ్లవర్ లో గొప్ప యాంటీయాక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులతో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి.

# 8 పుచ్చకాయ

# 8 పుచ్చకాయ

వాటర్ మెలోన్: వేసవిలో కాలంలో ఎక్కువగా అందుబాటులో ఉండేవి, వేసవితాపాన్ని తీర్చేవి వాటర్ మెలోన్. ఈ జ్యూసీ ఫ్రూట్ ను ఏ ఒక్కరూ మరిచిపోలేరు . ఈ కలర్ చూస్తేనేనోట్లో నీళ్ళు ఊరాల్సిందే . టమోటోల్లో లాగే వాటర్ మెలోన్ లో లైకోపిన్ అత్యధికంగా ఉంటుంది . ఇది క్యాన్సర్ కు కారణం అయ్యే ఏజెంట్స్ ను నాశనం చేస్తుంది.

# 9 బచ్చలికూర

# 9 బచ్చలికూర

ఆకు కూరలు: ఆకు కూరలు, ముఖ్యంగా లెట్యుస్ పాలకూరలో అత్యధిక శాతం నీరు కలిగి ఉండటం వల్ల దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఉత్తమం. ఇది శరీరానికి తగినంత హైడ్రేషన్ ను అంధిస్తుంది.

# 10 స్టార్ ఫ్రూట్

# 10 స్టార్ ఫ్రూట్

స్టార్ ఫ్రూట్: స్టార్ ఫ్రూట్స్ లో అత్యధిక శాతం పోషకాల తో పాటు దప్పికను తీర్చే గుణం కూడా ఇందులో ఎక్కువే. ఇంకా ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది .ఇది చూడటానికి పైనాపిల్ లా ఉంటుంది మరియు తియ్యగా టేస్టీ గా ఉండే ఆ స్టార్ ఫ్రూట్ సమ్మర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవలసినదే.

# 11 స్ట్రాబెర్రీలు

# 11 స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీస్: సమ్మర్ సీజన్ లో స్ట్రాబెర్రీస్ కాస్త తక్కువగానే ఉంటాయి. అయితే వీటిని కనుగొనే కొనుగోలు చేయడం వల్ల సమ్మర్ డీహైడ్రేషన్ తో పోరాడవచ్చు. నేచురల్ స్వీట్ మరియు నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల రోజంతాహైడ్రేషన్ లో ఉంచుతుంది.

# 12 బ్రోకలీ

# 12 బ్రోకలీ

బ్రొకోలీ: గ్రీన్ బెజిటేబుల్స్ ఎప్పటీ ఎవర్ గ్రీన్ హెల్త్ బెనిఫిట్స్ ను మరియు న్యూట్రిషినల్ బెనిఫిట్స్ ను కలిగి ఉంటుంది. సమ్మర్ సీజన్ లో తీసుకోవల్సినటువంటి వాటర్ రిచ్ వెజిటేబుల్ ఇది.

# 13 కాంటాలోప్

# 13 కాంటాలోప్

కాంటలోపిన్: వాటర్ మెలోన్ తర్వాత నీటికంటెంట్ అధికంగా ఉండేది ఈ ఫ్రూట్. సమ్మర్ లో మార్కెట్లో ఎక్కడ చూసినా వాటర్ మెలోన్ తో పాటు ఇవి కూడా అందుబాటులో ఉంటాయి . దోసకాయ(కర్బూజ)లో విటమిన్ ఎ, సిలు అధికంగా ఉండి 50 శాతం కాలరీలు కలిగి ఉంటుంది.

English summary

13 Foods That Will Help You Stay Hydrated in the Summer

The days start on a tiring note, noon stretches with boredom and sleepiness, and nights end at no vigor at all. Nevertheless, you can make it as invigorating as you actually want to by staying fresh, energetic, and cool.
Story first published: Friday, May 9, 2014, 12:02 [IST]
Desktop Bottom Promotion